Telangana Economy | టాస్క్..ఏ కేటగిరీకి సంబంధించిన సేవలు అందిస్తుంది?
మార్చి 8వ తేదీ తరువాయి..
48. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. ప్రస్తుత ధరల ప్రకారం (2022-23) స్థూల రాష్ట్ర విలువ జోడింపులో (జీఎస్వీఏ) 62.81 శాతం వాటాతో తెలంగాణలో సేవల రంగం తన వాటా కలిగి ఉంది
బి. 2014-15 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య ప్రస్తుత ధరల ప్రకారం (2022-23) సేవారంగం నుంచి అదనపు స్థూల విలువ (జీవీఏ) సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.81 శాతం
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి సరికావు
49. సేవల రంగానికి సంబంధించి కింది ఏ ఉపరంగం దాదాపు మూడో వంతు జీవీఏ ని ప్రస్తుత ధరల ప్రకారం సేవల రంగం మొత్తం జీవీఏ లో వాటా కలిగి ఉంది?
1) వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు
2) రవాణా, నిల్వ, సమాచార, ప్రసార సాధనాలు
3) ఆర్థిక సేవలు
4) స్థిరాస్తి రంగం (రియల్ ఎస్టేట్), గృహ నిర్మాణం, వృత్తి నిపుణుల సేవలు
50. సేవల రంగానికి సంబంధించి కింది ఏ ఉపరంగం 2014-15 నుంచి 2022-23 మధ్య అత్యధిక సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును కనబరిచింది?
1) వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు
2) రవాణా, నిల్వ, సమాచార, ప్రసార సాధనాలు
3) ఆర్థిక సేవలు
4) స్థిరాస్తి రంగం (రియల్ ఎస్టేట్), గృహ నిర్మాణం, వృత్తి నిపుణుల సేవలు
51. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగ వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రెండో ఐసీటీ పాలసీని కింది ఏ సంవత్సరాలకు ప్రవేశపెట్టింది?
1) 2020-25 2) 2021-26
3) 2022-27 4) 2019-24
52. కింది వాక్యాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి?
ఎ. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2020-21 ప్రకారం తెలంగాణలోని మొత్తం కార్మికుల్లో మూడింట ఒక వంతు మంది (1/3) సేవల రంగంలో పని చేస్తున్నారు
బి. రాష్ట్రంలోని సేవల రంగానికి సంబంధించిన మొత్తం కార్మికుల్లో 39.75 శాతం (> 1/3వ వంతు) మంది వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు ఉపరంగంలో పనిచేస్తున్నారు
1) ఎ 2) బి 3) ఎ, బి సరైనవి
4) ఎ, బి సరికావు
53. 2022, సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం నాలుగు జాతీయ పర్యాటక అవార్డు (నేషనల్ టూరిజం అవార్డ్స్)లను పర్యాటక విభాగంలో కింది ఏ కేటగిరీలకు తెలంగాణకు అందజేసింది?
ఎ. ఉత్తమ రాష్ట్రం
బి. బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ గోల్ఫ్ కోర్స్
సి. బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్
డి. బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
54. ఎ. 2023, జనవరిలో ప్రదానం చేసిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022లో ఉత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ఎంపికయ్యింది
బి. స్టార్టప్ ఇండియా, డీపీఐఐటీ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ అవార్డును అందజేశాయి
పై వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి సరికావు
55. కింది వాక్యాలను పరిశీలించండి?
ఎ. 2021-22లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ సేవల రంగం వార్షిక వృద్ధి రేటు > భారత సేవల రంగం వార్షిక వృద్ధి రేటు
బి. 2022-23లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ సేవల రంగం వార్షిక వృద్ధి రేటు < భారత సేవల రంగం వార్షిక వృద్ధి రేటు
పై వాక్యాల్లో సరైనవి?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
56. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం 2022 జూలై నాటికి గల సెజ్‌లకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. 35 సెజ్‌లు పనిచేస్తున్నాయి
బి. 57 సెజ్‌లు నోటిఫై అయ్యాయి
సి. 64 సెజ్‌లు ఫార్మల్లీ అప్రూవ్డ్ సెజ్‌లు ఉన్నాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
57. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 2014-15 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి
బి. ఈ కాలం మధ్య ఐటీ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 15.67 శాతం
1) ఎ, బి 2) ఎ 3) బి 4) ఏదీ సరికాదు
58. ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం 2022లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ‘ఏఐ ఫర్ ఆల్’ ఏ విభాగానికి చెందిన లక్ష మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది?
1) నిరుద్యోగులకు
2) హై స్కూల్ విద్యార్థులకు
3) గ్రామీణ విద్యార్థులకు
4) పై ఎవరికీ కాదు
59. కింది వాటిలో సరైనవి?
ఎ. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ధరణి వెబ్ పోర్టల్‌ను 2020, నవంబర్ 29న ప్రారంభించింది
బి. కొత్త భవనాల నిర్మాణ అనుమతి కోసం పరిపాలనాపరమైన భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో టీఎస్ బీ పాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)ని ప్రవేశపెట్టింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
60. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రధానంగా కింది ఏ కేటగిరీకి సంబంధించిన సేవలు అందిస్తుంది?
ఎ. స్కిల్ డెవలప్మెంట్
బి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
సి. కెపాసిటీ బిల్డింగ్ ఫర్ గవర్నమెంట్ మిషనరీ
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
61. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. రాష్ట్ర ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)ని తెలంగాణలో ఇన్నోవేషన్ కల్చర్‌ను ప్రమోట్ చేయడానికి 2017లో ప్రారంభించారు
బి. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికతత్వాన్ని ప్రోత్సహించాలనే ప్రాథమిక లక్ష్యం తో ప్రారంభించిన వీ హబ్ 2023, మార్చి నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
62. ‘Indias booming gig and platform economy’ అనే నివేదికను విడుదల చేసిన సంస్థను గుర్తించండి?
1) నీతి ఆయోగ్ 2) వరల్డ్ బ్యాంక్
3) జాతీయ గణాంక సంస్థ 4) ఏదీకాదు
63. గిగ్ ఎకానమీకి సంబంధించి గిగ్ అనే పదానికి అర్థం?
1) ఒక సంవత్సరంలో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య
2) ఒక సంవత్సరంలో ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగుల సంఖ్య
3) నిర్ణీత కాల వ్యవధికి సంబంధించిన ఉద్యోగం
4) ఏదీకాదు
64. గిగ్ వర్కర్స్కు సంబంధించిన వారిలో కానివారు ఎవరు?
ఎ. పర్మినెంట్ ఉద్యోగులు
బి. స్వయం ఉపాధి కలవారు
సి. తాత్కాలిక ఉద్యోగులు
డి. ప్రాజెక్ట్ ఆధారిత కార్మికులు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి
65. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. 2021-22 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల శాతం 89.84 శాతం
బి. 2021-22 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల శాతం 1056.01 శాతం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
66. రాష్ట్రంలోని వివిధ పర్యాటక సర్క్యూట్లు వాటికి సంబంధించిన ప్రాంతాలను సరిగా జతపర్చండి.
ఎ. గిరిజన సర్క్యూట్ 1. సోమశిల రిజర్వాయర్
బి. హెరిటేజ్ సర్క్యూట్ 2. రేమండ్ సమాధి
సి. ఎకో టూరిజం సర్క్యూట్ 3. దామరవాయి
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-1, సి-3
67. 2022, నవంబర్‌లో యునెస్కో ప్రదానం చేసిన ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్-2022కి సంబంధించి సరైనవి?
ఎ. గోల్కొండ కోటలోని మెట్ల బావికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కింద అవార్డు వచ్చింది
బి. కామారెడ్డి జిల్లా దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ కింద అవార్డు గెలుచుకుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
68. అంకుర సంస్థలకు సంస్థాగత మద్దతును అందించడానికి తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన వాటిలో లేనివి గుర్తించండి.
ఎ. టీ హబ్ బి. వై హబ్ సి. వీ హబ్
డి. టీఎస్ఐసీ ఇ. షీ హబ్
1) డి 2) ఇ 3) డి, ఇ 4) ఏదీకాదు
69. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణలో మొత్తం రహదారుల పొడవు 1,09,260 కి.మీ.
బి. దీనిలో 61 శాతం గ్రామీణ రహదారులు, 4.56 శాత జాతీయ రహదారులు ఉన్నాయి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
70. సీఆర్ఎంపీ ప్రోగ్రాం దేనికి సంబంధించింది?
1) పరిశ్రమల స్థాపనకు
2) రహదారుల నిర్వహణకు
3) రవాణా సేవలకు 4) ఏదీకాదు
71. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకున్న అవార్డుల్లో కింది వాటిని గుర్తించండి?
ఎ. నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు
బి. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డు (బెస్ ఎయిర్పోర్ట్ స్టాఫ్)
సి. ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) అన్నీ
72. తెలంగాణ ప్రభుత్వం కింది ఏయే ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేసింది/చేస్తుంది?
ఎ. మంగళ్‌పల్లి బి. బాటసింగారం
సి. సుల్తాన్పూర్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
73. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు థర్మల్ పవర్ ప్లాంటులు, వాటి కెపాసిటీలను జతపర్చండి.
ఎ. కొత్తగూడెం టీపీఎస్ స్టేజ్-7 1. 800 మె.వా.
బి. భద్రాద్రి టీపీఎస్ 2. 1080 మె.వా.
సి. యాదాద్రి టీపీఎస్ 3. 4000 మె.వా.
4. 1000 మె.వా.
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-4
3) ఎ-1, బి-3, సి-4
4) ఎ-4, బి-3, సి-2
74. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. 2021-22 నాటికి తెలంగాణలో స్థాపిత ఇంధన సామర్థ్యం 18,069 మె.వా.
బి. దీనిలో థర్మల్ ఎనర్జీ వాటా 10,481 మె.వా.
1) ఎ 2) బి 3) ఎ, బి సరైనవి
4) ఎ, బి సరికావు
75. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ లభ్యత 1,152 kwh
బి. 2021-22 నాటికి తెలంగాణలో తలసరి విద్యుత్ లభ్యత 2005 kwh
1) ఎ 2) బి
3) ఎ, బి సరైనవి
4) ఎ, బి సరికావు
76. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో 2021-22 నాటికి 174.03 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి
బి. వీటిలో గృహ కనెక్షన్లు 72 శాతం,
వ్యవసాయ కనెక్షన్లు 15.5 శాతం
పారిశ్రామిక కనెక్షన్లు 12.36 శాతం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
77. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం కింది వాటిలో సరైనవి.
ఎ. మొత్తం విద్యుత్ కనెక్షన్లలో గృహ కనెక్షన్ల శాతం అధికంగా గల జిల్లా మేడ్చల్, పారిశ్రామిక కనెక్షన్ల శాతం అధికంగా గల జిల్లా హైదరాబాద్
బి. అత్యధిక సంఖ్యలో గృహ కనెక్షన్లు గల జిల్లా హైదరాబాద్
సి. అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు (అన్ని రకాలు కలిపి) గల జిల్లా మంచిర్యాల
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
78. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ ఏ సంవత్సరాల మధ్య కాలవ్యవధికి సంబంధించింది?
1) 2015-20 2) 2020-25
3) 2020-30 4) 2022-30
79. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణ రాష్ట్ర మొత్తం స్థాపిత ఇంధన సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన వాటా 41 శాతం
బి. 2020-21, 2021-22 మధ్య తెలంగాణలో పునరుత్పాదక స్థాపిత సామర్థ్యం 1.95 రెట్లు పెరిగింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
80. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు
బి. 2022, నవంబర్ నాటికి మొబైల్ టెలిడెన్సిటీలో తెలంగాణ దేశంలో 9వ స్థానంలో ఉంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
సమాధానాలు
48-1, 49-4, 50-1, 51-2, 52-3, 53-3, 54-3, 55-1, 56-3, 57-1, 58-2, 59-4, 60-4, 61-3, 62-1, 63-3, 64-1, 65-3, 66-2, 67-3, 68-2, 69-3, 70-2, 71-4, 72-1, 73-1, 74-3, 75-3, 76-3, 77-3, 78-3, 79-3, 80-3.
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు