Telangana History | సాలార్జంగ్ సంస్కరణలు.. సాంఘిక పరిస్థితులు
తెలంగాణ చరిత్ర
మొదటి సాలార్జంగ్ సంస్కరణలు
- ఇతడి అసలు పేరు-మీర్ తురాబ్ అలీఖాన్.
- ఇతడు 1829లో కర్ణాటక రాష్ట్రంలో బీర్జాపూర్లో జన్మించాడు.
- చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.
- ఇతడు తన మేనమామ సిరాజ్- ఉల్-ముల్క్ వద్ద పెరిగాడు.
- ఇతడు ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాడు.
- ఇతడు ఇంగ్లండ్‌లో చదువుకుంటున్న సమయంలో డైటాన్ అనే అధికారితో పరిచయం ఏర్పడి పాలన సంస్కరణలను గురించి నేర్చుకున్నాడు.
- ఇతడు ఇంగ్లండ్‌లోని ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా’ అనే బిరుదును పొందాడు.
- 24 సంవత్సరాల్లో 1853 మే 31నా నాసిరుద్దౌలా వద్ద దివాన్‌గా చేరాడు.
- ఈ విధంగా 1853-1883 వరకు దాదాపు మూడు నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్ నిజాంలా దగ్గర దివాన్‌గా పనిచేశాడు.
- ఇతడు నారాయణ్ ప్రసాద్, సయ్యద్ హుస్సేన్, బిల్గ్రాంలను తన వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకున్నాడు.
- సాలార్జంగ్ అనే బిరుదును ఇచ్చింది నాసిరుద్దౌలా.
- సాలార్జంగ్ దివాన్‌గా వచ్చేనాటికి ప్రభుత్వం భారీ అప్పులతో సతమతం అవుతుంది.
- ఈ సమయంలో సాలార్జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి బాటలో నడిపించాడు.
సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలు
- సాలార్జంగ్ నిజాం రాజ్యంలో 1865లో జిలాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు
- మొదట 17 జిల్లాలు, 5 డివిజన్లు ఉండేవి, కానీ 1905 నాటికి నిజాం రాజ్యంలో 4 డివిజన్లు, 16 జిల్లాలు ఏర్పాటు చేశారు.
4 డివిజన్లు (సుబాలు)
1) ఔరంగాబాద్
2) ఉస్మానాబాద్
3) గుల్సానా బాద్
4) వరంగల్ - నిజాం రాజ్యంలోని 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణాలో, 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో
- పాలనా సంస్కరణలు
- మొదట్లో పరిపాలన కోసం 1868లో 04 శాఖలను మాత్రమే ఏర్పాటు చేశాడు
సాలార్జంగ్.
1) రెవెన్యూ శాఖ 2) న్యాయశాఖ
3) పబ్లిక్ వర్క్ 4) పోలీస్ శాఖ - 1880లో పరిపాలనను పునర్ వ్యవస్థీకరిస్తూ 14 శాఖలకు పెంచగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 20 శాఖలకు పెంచాడు.
- వీటిలో ముఖ్యమైన శాఖలు
1867 – పబ్లిక్ వర్క్స్ శాఖ
1861 – అటవీశాఖ
1875 – సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ
1864 – ఇనాంశాఖ
1869 – కస్టమ్స్ శాఖ
1869 – పోస్టల్ శాఖ
1866 – వైద్య శాఖ
1876 – ఉద్యాన శాఖ
1861 – స్టాంప్ శాఖ.
1870 – ప్రత్యేక స్టాంపు శాఖ
న్యాయవ్యవస్థ / న్యాయ సంస్కరణలు - 1862లో సాలార్జంగ్ న్యాయవ్యవస్థను పూర్తిగా మార్పు చేశాడు.
- కింది స్థాయిలో ఉన్న సివిల్ కోర్టును భుజంగ్ అనేవారు.
- జిల్లాస్థాయిలో ఉన్న సివిల్ కోర్టును దివానీ అదాలత్ అనేవారు.
- హైకోర్టును మజ్లిస్-ఇ- దివానీ
- సుప్రీంకోర్టును – మజ్లిస్ -ఎ- మురసా
- ప్రధాన న్యాయమూర్తిని – నాజిమ్ అంటారు. న్యాయమూర్తిని మీర్ ఆదిల్ అని పిలిచేవారు.
- సాలార్జంగ్ శిక్షలను సరళిస్తూ మరణ శిక్షను రద్దు చేస్తూ అంగవిచ్ఛేదనం తొలగించాడు.
ఆర్థిక, రెవెన్యూ సంస్కరణలు
- సాలార్జంగ్ ప్రవేశ పెట్టిన సంస్కరణల్లో అతి ముఖ్యమైనవి రెవెన్యూ లేదా ఆర్థిక సంస్కరణలు.
- నిజాం రాజ్యాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడం కోసం సాలార్జంగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టాడు.
- వాటిలో ముఖ్యంగా తన జీతాన్ని రూ.25 వేల నుంచి 15 వేలకు తగ్గించుకున్నాడు.
- అనవసర ఉద్యోగులను, రాజ్యానికి శత్రువుల భయం లేకపోవటం వల్ల సైనిక శక్తిని తగ్గించాడు.
- 1864లో రెవెన్యూ బోర్డులను రద్దు చేశాడు. వేలం పాట ద్వారా పన్నులను వసూలు చేసే పద్ధతిని రద్దు చేశాడు. రైతులు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే ‘రైత్వారీ పద్ధతి’ని ప్రవేశ పెట్టాడు (1875).
- ఉద్యోగులకు జాగీర్లు ఇవ్వకుండా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టాడు.
- 1857లో హోలిసిక్కా అనే నాణెం ప్రవేశ పెట్టాడు. ఇది 1858 నుంచి అమల్లోకి వచ్చింది. 1948 వరకు చెలామణి అయ్యింది.
- హోలిసిక్కా నాణెం మొగల్ నాణెం కంటే, ఆంగ్లేయుల నాణెం రూపాయి కంటే 15 శాతం తక్కువ విలువను కలిగి ఉంటుంది.
రవాణా సమాచార వ్యవస్థ
- రవాణా సమాచార వ్యవస్థలను సాలార్జంగ్ బలోపేతం చేశాడు. 1869లో ప్రత్యేక పోస్టల్ శాఖను ఏర్పాటు చేశారు.
- 1669లో పోస్టల్ స్టాంపును విడుదల చేశాడు.
- 1866లో బొల్లారంలో తొలి ఆధునిక పోస్టాఫీస్ ఏర్పాటు చేశాడు.
- 1856-57 మధ్యకాలంలో ఆంగ్లేయులు హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.
- 1866 – హైదరాబాద్, ముంబై, మద్రాస్‌లను కలుపుతూ గ్రాండ్ పెన్సూలర్ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
- 1874లో వాడి సికింద్రాబాద్‌ల మధ్య 121 మైళ్ళు దూరంలో రైలు మార్గాన్ని నిర్మించారు.
- 1874లో సికింద్రాబాద్, 1883లో నాంపల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. 1868లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు నిర్మించారు.
పోలీసు సంస్కరణలు : - 1869లో రెవెన్యూ శాఖ నుంచి పోలీస్‌శాఖ వేరు చేశారు.
- 1869లో ప్రత్యేక పోలీసు శాఖ ఏర్పడింది.
- పోలీస్ స్టేషన్లను చౌకీ అని పిలిచేవారు. పోలీస్ సూపరిడెంట్‌ను మహతమిమ్ అని పిలిచేవారు.
- ఉన్నత పోలీస్ అధికారి కొత్వాల్
నిజాం కాలేజ్: - చాదర్ఘట్ ఆంగ్లో వెర్నిక్లర్ స్కూల్‌ను మొదట సెకెండ్ గ్రాండ్ కాలేజీగా మార్చారు.
- 1884 నాటికి హైదరాబాద్ కాలేజీగా మర్చారు.
- 1885లో సెయింట్ మేరీస్ హై స్కూల్, 1887 నాటికి నిజాం కాలేజ్ ప్రారంభించారు.
అసఫ్‌జాహీల కాలంనాటి సామాజిక, ఆర్థిక, కుల పరిస్థితులు
- అసఫ్‌జాహీల కాలంలో అనేక వర్గాలు, జాతులు, అనేక ప్రాంతాల వారు, అనేక దేశాలవారు నివసించటం వల్ల వీరి రాజ్యంలో మిశ్రమ సంస్కృతి ఉండేది.
- 1881 జనాభా లెక్కల ప్రకారం 90 శాతం హిందువులు వుండగా 9.4 శాతం ముస్లింలు ఉండేవారు. వీరితోపాటు క్రైస్తవులు, జైనులు, పారశీకులు, సిక్కులు, యాదవులు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవారు.
- ఇరాన్ నుంచి వచ్చిన సున్ని, షియా, సిద్ధిఖీ వంశస్థులు వున్నారు.
- ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కాత్రి, కాయస్థులు ఉన్నత పదవుల్లో ఉండేవారు.
- అసఫ్జాహీలు కుల, మత ప్రాతాలకు అతీతంగా ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాలిచ్చారు.
- బెంగాల్ నుంచి వచ్చిన అఘోరనాథ ఛటోపాధ్యాయ లాంటి వారు కూడా నిజాం రాజ్యంలో భాగస్వాములయ్యారు.
- 7వ నిజాం టర్కీ రాజవంశానికి చెందిన దుర్రే షవర్, నీలోఫర్‌ను తన కోడళ్లుగా తెచ్చుకున్నాడు.
- హిందూ, ముస్లింలు ఒకరి సంప్రదాయాలను ఒకరు స్వీకరించి పరస్పర శాంతియుత జీవనాన్ని గంగా, యమున నదుల సంగమంగా కలిసి జీవించారు.
- 6వ నిజాం ఎల్లప్పుడు బ్రాహ్మణుల సూచనలను పాటించేవాడు.
- 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆలీఘర్ విద్యాలయానికి, తివ్రోబందర్ మదర్స్, శాంతినికేతన్‌కు కూడా నిధులిచ్చాడు.
- అసఫ్జాహీలు మదర్సాలు, మసీదులతోపాటు సిక్కులకు, క్రైస్తవులకు, హిందువులకు విరివిగా విరాళాలు ఇచ్చారు. ఈ విధంగా అసఫ్‌జాహీల కాలంలో అనేక కులాలు మతాల వారు జీవించడం వల్ల మిశ్రమ సంస్కృతి అభివృద్ధి చెందింది.
కులవ్యవస్థ
- హైదరాబాద్ సంస్థానంలో అనేక కులాలుండేవి.
- పాలకులు ముస్లింలు, పాలితులు హిందువులు అయినా కూడా పరమత సహనం కలిగి ఉండేవారు.
- బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరు యజ్ఞాలు, యాగాలు, పూజలు చేసేవారు.
- వీరి కాలంలో క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండేవారు.
- కాపులు రెడ్లు వుండేవారు. వీరి వృత్తి వ్యవసాయం.
- ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వెలమల కులం వారుండే వారు.
- కుమ్మరి వారు కుండలు, మట్టి పాత్రలు తయారు చేస్తారు.
- ఉప్పరి ఇండ్లు కట్టడం, బావులు కట్టడం
- పద్మశాలివారు నేత పని చేసేవారు.
- దేవాంగులు పత్తిపని చేసేవారు.
- తొగాట- జెర్రిపని చేసేవారు
- మంగలి- క్షవరం, పెళ్ళిల్లు దేవాలయాల్లో వాయిద్యాలు
- గొల్లలు/ యాదవులు-పశుపోషణ
- బీరలు పశుపోషణ
- చాకలి బట్టలు ఉతికేవారు
- ఈడిగవారు కల్లుపని చేసేవారు
- అసఫ్‌జాహీల కాలంనాటి అదివాసుల పేర్లు
- కొండారెడ్లు, చెంచులు, గోండ్లు, బోయలు, ఎరుకలు, లంబాడీలు
స్త్రీల పరిస్థితి: - బ్రిటిష్ ఇండియాలో 6వ పెద్ద సంస్థానం హైదరాబాద్. జనాభా 17 మిలియన్లు
- వీరికాలంలో స్త్రీల పరిస్థితి దీనంగా ఉండేది. ఎక్కడ రాజకీయ అధికారం ఉండేది కాదు.
- స్త్రీలను ఉంపుడు గత్తెలుగా, వేశ్యలుగా, జోగినీ ల్లాగా ఉపయోగించుకునేవారు. స్త్రీలకు ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు.
- స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది కాదు. సతీ సహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం ఉండేది.
- సాంఘిక దురాచారం
నిజాం రాజ్యంలో అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి. ముఖ్యంగా మహిళల పట్ల సమాజంలో చాలా ఆంక్షలు ఉండేవి.
సతీ సహగమనం - రుగ్వేదంలో సతీ సహగమనం గురించి ప్రస్తావన ఉండేది. భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా పెట్టి కాల్చడాన్ని సతి సహగమనం అంటారు.
- నిజాం కాలంలో స్త్రీని కాల్చకుండా భర్త శవంతోపాటు సజీవంగా పూడ్చేవారు.
- ఈ సతి సహగమన దురాచారాన్ని భారతదేశంలో నిషేధిస్తూ 1829లో విలియం బెంటింక్ ఒక చట్టం చేశాడు కానీ నిజాం రాజ్యంలో 1874లో రూపు మాపారు.
- దేవాదాసి వ్యవస్థ
- కాళిదాసు రాసిన మేఘదూతంలో దేవాదాసి వ్యవస్థను ప్రస్తావించారు.
- బాలికలను ఉజ్జయిని మహంకాళి మాతకు దేవదాసీలుగా అర్పించేవారు.
- తెలంగాణలో దేవదాసీలను జోగిని, మాతంగి, పార్వతి, బసివిని అంటారు. వేములవాడలో రాజరాజేశ్వరీ స్వామికి (శివుడి) దేవదాసీలతో వివాహం జరిపి వీరిని శివసత్తి / పార్వతి అని పిలిచేవారు.
- కొన్ని ప్రాంతాల్లో కృష్ణుడితో వివాహం చేసేవారు.
- ఈ దేవదాసీ వ్యవస్థను నిజాం రాజ్యంలో 1934లో నిషేధించారు.
- ఆంధ్రప్రదేశ్‌లో ఈ జోగినీ వ్యవస్థను నిర్మూలించడానికి 1931-33 మధ్య రఘునాథ కమిటీ వేశారు.
అంజి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు