Telangana Economy | స్థూల నీటిపారుదల ప్రాంతం ఎంత శాతం పెరిగింది?
గతవారం తరువాయి..
17. కింది వాక్యాలను గమనించి సరైనవి గుర్తించండి.
ఎ. 2015-16 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో వరి ఉత్పత్తి 342 శాతం పెరిగింది
బి. 2015-16 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో పత్తి (కాటన్) ఉత్పత్తి 33 శాతం పెరిగింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
18. కింది వాటిలో సరైనది గుర్తించండి (తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-23 ప్రకారం) (2021-22 సంవత్సరానికి)
ఎ. గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం- 3వ స్థానం
బి. మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం- 5వ స్థానం
సి. పాల ఉత్పత్తిలో రాష్ట్రం- 13వ స్థానంలో ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
19. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి అభివృద్ధిపరచడానికి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, పాత నీటిపారుదల అవస్థాపనా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా 2014-15 నుంచి 2021-22 మధ్య స్థూల నీటిపారుదల ప్రాంతం ఎంత శాతం పెరిగింది?
1) 100 శాతం కంటే ఎక్కువ
2) 100 శాతం కంటే తక్కువ
3) దాదాపు 100 శాతం 4) ఏదీకాదు
20. రాష్ట్రంలోని కమత పరిమాణ తరగతి, సంబంధిత కమతం కింద గల మొత్తం సాగు విస్తీర్ణాలను జతపరచండి.
ఎ. సన్నకారు 1. 28.6 శాతం
బి. చిన్నకారు 2. 33.1 శాతం
సి. మధ్యస్థ 3. 24.6 శాతం
డి. మధ్య 4. 11.5 శాతం
ఇ. పెద్ద 5. 2.3 శాతం
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5
4) ఎ-3, బి-1, సి-2, డి-4, ఇ-5
21. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం కింది వాటిలో సరైనవి?
ఎ. 2021-22 వానాకాలం సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణంలో వరి, పత్తి పంటలు దాదాపు 76 శాతం సాగు విస్తీర్ణంలో ఉన్నాయి
బి. 2021-22 యాసంగి సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న పంటలు దాదాపు 73 శాతం సాగు విస్తీర్ణంలో ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
22. కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు పంజాబ్ రాష్ట్రం తర్వాత వరిని అందించడంలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉంది
బి. తెలంగాణలో 2015-16లో వరి ఉత్పత్తి 45 లక్షల టన్నుల నుంచి 2021-22 సంవత్సరానికి 202 లక్షల టన్నులకు పెరిగింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
23. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. 2015-16 నుంచి 2021-22 మధ్య వరి ఉత్పత్తికి సంబంధించి సమ్మిళిత వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ 18 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది
బి. 2015-16 నుంచి 2021-22 మధ్య పత్తి ఉత్పత్తికి సంబంధించి సమ్మిళిత వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ 8.8 శాతంతో 2వ స్థానంలో ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
24. ఇటీవల భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూరు కందిపప్పునకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన వాటిలో 16వది
బి. వీటిలో ప్రొటీన్ల శాతం 22.24
సి. తాండూరు ప్రాంతం వికారాబాద్ జిల్లా లో ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
25. MIDH ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది?
1) పశు పోషణ
2) నీటి పారుదల రంగం
3) ఉద్యాన వన పంటలు 4) ఏదీకాదు
26. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. తెలంగాణలో దాదాపు 25.82 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం పశు సంపద రంగంలో నిమగ్నమై ఉన్నాయి
బి. పశు సంపదకు సంబంధించి గొర్రెల సంఖ్యాపరంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
27. కింది ఏ పథకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) సంస్థ రూపొందించిన నివేదికలో సిఫారసు చేస్తూ ఇతర ప్రత్యామ్నాయ పథకాలతో పోలిస్తే అమలు చేయడంలో సులభం, ఎక్కువ పారదర్శకత గల పథకంగా పేర్కొంది?
1) రైతుబంధు 2) రైతుబీమా
3) కల్యాణలక్ష్మి 4) ఏదీకాదు
28. రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులను వారి భూ కమతాల కేటగిరీ ఆధారంగా అవరోహణా క్రమంలో అమర్చండి.
1) సన్నకారు > చిన్నకారు > మధ్యస్థ > పెద్ద
2) పెద్ద > మధ్యస్థ > సన్నకారు > చిన్నకారు
3) చిన్నకారు > సన్నకారు > పెద్ద > మధ్యస్థ
4) ఏదీకాదు
29. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. రైతు సామూహిక జీవిత బీమా పథకాన్ని (రైతుబీమా) 2018లో ప్రారంభించారు
బి. 2018-19 నుంచి 2022-23 మధ్య 95,416 రైతు మృతుల కుటుంబాలకు రూ.4,771 కోట్లు రైతుబీమా కింద చెల్లించారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
30. కింది వాటిలో సరైనవి?
ఎ. దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది
బి. దీనికి సంబంధించి తాజా పండ్ల బంచ్‌ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది
సి. దీనికి సంబంధించి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో మొదటి స్థానంలో ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
31. కింది వాటిని పరిశీలించండి (నీటి పారుదల పథకానికి సంబంధించి).
ఎ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది. వాటిలో 638 చెక్‌డ్యామ్‌లు పురోగతిలో ఉన్నాయి, మిగిలిన 562 చెక్ డ్యామ్‌ల నిర్మాణం రెండోదశలో చేపట్టాల్సి ఉంది
బి. 27,665 చెరువులు పునరుద్ధరింపబడ్డాయి. తద్వారా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు
సి. వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, లిఫ్టులు, పునరుద్ధరణ కారణంగా భారీ నీటి ట్యాంకులు, చెక్ డ్యామ్‌ల ద్వారా నీటిపారుదల వినియోగం 2021-22లో 97.57 లక్షల ఎకరాలకు పెరిగింది
పై వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
32. కింది వాటిని పరిశీలించి సరైనవి గుర్తించండి?
ఎ. పంటల వైవిధ్య సూచీ విలువ ‘0’ నుంచి ‘1’ వరకు ఉంటుంది
బి. రాష్ట్రంలో అతి తక్కువ పంటల వైవిధ్య సూచీగల జిల్లాలు- పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకావు
33. గొర్రెల పెంపక, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. దీనిలో సబ్సిడీ 80 శాతం
బి. మొదటి దశలో 21 (20+1) గొర్రెలను సరఫరా చేయడానికి యూనిట్ ధర రూ.1,25,000 నిర్ణయించారు
సి. రెండో దశలో యూనిట్ ధరను రూ.1,25,000 నుంచి రూ.2,00,000కు పెంచారు
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) బి
34. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధాన్యం సేకరణలో 5 అగ్ర రాష్ర్టాల సరసన తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది (పంజాబ్ తర్వాత). కాగా 2021-22కు తెలంగాణ రాష్ట్ర వాటా? (ధాన్యం సేకరణలో)
1) 13 శాతం 2) 13.5 శాతం
3) 15 శాతం 4) 14.5 శాతం
35. ‘ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్’ అనే పథకాన్ని మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కింది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అమలు చేయనుంది?
1) 2020-21 నుంచి 2024-25
2) 2021-22 నుంచి 2024-25
3) 2021-22 నుంచి 2025-26
4) 2020-21 నుంచి 2025-26
36. తెలంగాణ ప్రభుత్వం కింది ఏ దేశ ప్రభుత్వంతో టీ హబ్, ఎస్ఎంఈ (స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)కి సంబంధించిన విషయంలో సహకారం కోసం ఎంవోయూ మీద సంతకం చేసింది?
1) యూకే 2) స్విట్జర్లాండ్
3) థాయిలాండ్ 4) ఏదీకాదు
37. కింది వాటిలో సరైనది?
ఎ. టీఎస్-ఐ పాస్- తెలంగాణ స్టేట్-ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్
బి. టీ-ఐడీఈఏ- తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్
సి. టీ-పీఆర్ఐడీఈ- తెలంగాణ స్టేట్ ప్లాన్ ఫర్ ర్యాపిడ్ ఇంకుబేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, బి, సి
38. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఉద్యమ్ (యూడీవైఏఎం) పోర్టల్ ఆధారం చేసుకొని అత్యధిక ఎంఎస్ఎంఈ లు గల జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) మేడ్చల్-మల్కాజిగిరి 4) నల్లగొండ
39. కింది వాటిని జతపర్చండి.
1. మెడికల్ డివైజ్ పార్క్ ఎ. సుల్తాన్పూర్
2. మెగా ఫుడ్ పార్క్ బి. బుగ్గపాడు
3. అపెరల్ వీవింగ్ పార్క్ సి. సిరిసిల్ల
4. పారిశ్రామిక పార్కులు డి. చందనవెల్లి, దండు మల్కాపూర్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
40. TICHCL కి సంబంధించి (తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్) సరైనవి గుర్తించండి.
ఎ. ఇది ఒక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ
బి. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది
సి. ఖాయిలా పడిన (మూతపడిన) ఎంఎస్ఎంఈ యూనిట్ల పునరుద్ధరణకు, పునరావాసానికి ఇది తోడ్పడుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
41. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. వీ హబ్ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)ని 2017లో స్థాపించారు
బి. టీ హబ్ (టెక్నాలజీ హబ్)ని 2015లో స్థాపించారు
సి. టీ హబ్ 2.0 (సెకండ్ ఫేజ్)ని 2022లో స్థాపించారు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, సి
42. 2015-16 నుంచి 2021-22 వరకు తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న మొదటి ఐదు రకాల సరకుల్లో (కమోడిటీస్) కింది వాటిలో లేనివి గుర్తించండి.
ఎ. ఔషధాలు
బి. సేంద్రియ రసాయనాలు
సి. ఎలక్ట్రిక్ యంత్రాలు
డి. యాంత్రిక పరికరాలు
ఇ. లవణాలు, ఖనిజాలు
ఎఫ్. తృణధాన్యాలు
1) ఇ, ఎఫ్ 2) ఎఫ్
3) డి, ఇ 4) సి, డి
43. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో సరకులను దిగుమతి (శాతం పరంగా) చేసుకుంటున్న దేశాల్లో మొదటి నాలుగింటిని గుర్తించండి. (ఆధారం- తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం-2023)
1) చైనా > అమెరికా > రష్యా > యూఏఈ
2) అమెరికా > చైనా > బంగ్లాదేశ్ > రష్యా
3) చైనా > అమెరికా > రష్యా > బంగ్లాదేశ్
4) అమెరికా > చైనా > రష్యా > బంగ్లాదేశ్
44. 2021-22కు రాష్ట్రం నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల్లో కింది 5 జిల్లాలు దాదాపు 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి?
1) మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్
2) మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కరీంనగర్
3) మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్
4) మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం
45. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. నేతన్నకు చేయూత బి. చేనేత మిత్ర
సి. నేతన్న బీమా డి. చేనేత హస్తం
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
46. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఫ్లై యాష్‌ను సమర్థంగా వినియోగించినందుకు మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అవార్డు ఎప్పుడు పొందింది?
ఎ. 2020 బి. 2021 సి. 2022
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
47. ఏ పారిశ్రామిక పార్కుల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్ పరిశ్రమలు స్థాపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ. ఆదిబట్ల బి. నాదర్గుల్
సి. దండుమల్కాపూర్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు