వ్యవసాయ అనుబంధ రంగాలు-తెలంగాణ
వ్యవసాయంతో ముడిపడి ఉన్న రంగాలను వ్యవసాయ అనుబంధ రంగాలుగా పిలుస్తారు. పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల ఉత్పత్తి, అటవీ సంపదను వ్యవ సాయ అనుబంధ రంగాలుగా పిలుస్తారు.
ప్రాథమికరంగం వాటా – 17.9 శాతం అందులో..
వ్యవసాయం : 9.3 శాతం
పశుసంపద : 7.1 శాతం
అడవులు, కలప : 0.9 శాతం
చేపలు : 0.6 శాతం
రైతు సంతోషాన్ని చూడాలంటే ప్రభుత్వ ఉన్నత అధికారులతో సమాన ఆదాయాన్ని రైతు కలిగి ఉండాలి. స్వామినాథన్ ఆశ నెరవేరాలంటే అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి.
పశుసంపద
పశుసంపదలో ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు, కోళ్ళు, కుక్కలు, కుందేళ్ళు మొదలైనవి ఉంటాయి. వీటిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. దీంతో మిశ్రమ వ్యవసాయం సాధ్యమై రైతు వ్యవసాయంలో తగినంత మూలధన వృద్ధిని సాధించగలడు.
పశువులు
ఆవులు, ఎద్దులు తెలంగాణలో దాదాపు 50,34,109 గా నమోదయ్యాయి. ఇందులో ఆడ పశువులు 20,21,168 ఉన్నాయి. వీటిలో 10,09,575 పశువులతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు ఉన్నా యి. 17,913 పశువులతో హైదరాబాద్ చివరి స్థానం లో ఉంది.
ప్రపంచంలో అత్యధిక పశు జనాభా కలిగిన దేశాల్లో 31.21 శాతంతో భారత్ మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, చైనా, అమెరికా, ఈయూ, అర్జెంటీనా దేశాలు తర్వాతి స్థానాల్లో కొన సాగుతున్నాయి.
బర్రెలు
రాష్ట్రంలో బర్రెల మొత్తం సంఖ్య 41,94,319. ఇందులో నల్లగొండలో గరిష్టంగా 7,90,063తో ప్రథమ స్థానంలో నిలువగా, ఖమ్మం, వరంగల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే చివరి స్థానంలో హైదరాబాద్ ఉన్నది. ఈ జిల్లాలో 27,737 బర్రెలు ఉన్నాయి.
బర్రె పాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలిచింది.
గొర్రెలు: తెలంగాణలో నమోదైన మొత్తం గొర్రెలు 1,28,74,859. ఇందులో ప్రథమస్థానంలో మహబూబ్‌నగర్‌లో 37,30,689 ఉండగా, నల్లగొండ, వరంగల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో 13,657 గొర్రెలు ఉన్నాయి.
ప్రపంచంలో గొర్రెపాల ఉత్పత్తిలో చైనా, టర్కీ, గ్రీస్ దేశాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఉన్ని కోసం పెంచే గొర్రెల జనాభాలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మేకలు: రాష్ట్రంలో నమోదైన మొత్తం మేకలు 46,75,620. ఇందులో 6,87,066తో మహబూబ్‌నగర్ ప్రథమ స్థానంలో ఉంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 40,275 మేకలతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది.
Poor Mans Cowగా పేరొందిన మేక పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో ఇండియా మొదటి స్థానం లో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పందులు: పశుసంపదలో భాగమైన పందుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 2,51,663గా ఉంది. ఇందులో మహబూబ్‌నగర్ 55,048 కలిగి ఉండగా, తర్వాతి స్థానాల్లో వరంగల్, కరీంనగర్ ఉన్నాయి.
కోళ్ళు: రాష్ట్రంలో నమోదైన మొత్తం కోళ్ళ సంఖ్య 6,91,58,605. ఇందులో గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 1,50,44,576 ఉన్నాయి. రంగారెడ్డి తర్వాత మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. అయితే 42,941తో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
కుందేళ్ళు: రాష్ట్రంలో మొత్తం 17,166 కుందేళ్ళు నమోదయ్యాయి. ఇందులో వరంగల్‌లో గరిష్టంగా 5,849 ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు వరుసగా ఉన్నాయి. 109 కుందేళ్ళతో నిజామాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
కుక్కలు: తెలంగాణలో మొత్తం 3,47,015 కుక్కలు నమోదయ్యాయి. ఇందులో గరిష్టంగా రంగారెడ్డి జిల్లా లో 96,2014 ఉండగా, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలు రంగారెడ్డి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువగా 13,106 కుక్కలు మాత్రమే నమోదయ్యాయి.
జాలరులు/జాలర్లు
చేపలు పట్టడంలో దాదాపు 2,13,699 మంది నిమగ్నమై ఉన్నారు. ఇందులో గరిష్టంగా వరంగల్‌లో 39,879 మంది పనిచేస్తుండగా, తర్వాత స్థానాల్లో నల్లగొం డ, మెదక్ ఉన్నాయి. 1,347 మంది జాలర్లతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది.
అడవులు
రాష్ట్ర ఆదాయంలో అడవుల ఆదాయం 0.9 శాతం నమోదుకాగా రాష్ట్ర వ్యవసాయ ఆదాయంలో అటవీ ఆదాయం 5.02 శాతం. రాష్ట్రంలో మొత్తం 29,242 చ.కి.మీ. విస్తీర్ణంలో అటవీప్రాంతం ఉండగా అందులో 21,024 చ.కి.మీ. రిజర్వ్డ్ ఫారెస్టు, 7,468 చ.కి.మీ. రక్షిత అడవి ఉంది. ఇంకా 750 చ.కి.మీ. విస్తీర్ణంలో ఎటూ తేల్చని అడవి ఉంది. 2013-14లో నమోదయిన ఆదాయం రూ. 148 కోట్లు.
రాష్ట్రంలో నమోదయిన అటవీశాతం 25.46 శాతం కాగా గరిష్టంగా ఖమ్మం జిల్లాలో 52.64 శాతం, ఆదిలాబాద్‌లో 44.84 శాతం ఉండగా, హైదరాబాద్‌ను మినహాయిస్తే అతి తక్కువ శాతం అటవీ విస్తీర్ణం నల్లగొండలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 5.88 శాతం మాత్రమే అటవీ ప్రాంతం నమోదయింది. మెదక్‌లో 9.34 శాతం, రంగారెడ్డిలో 9.75 శాతంగా రికార్డయ్యింది.
ప్రపంచ అటవీ విస్తీర్ణంలో, అడవులను కలిగిన దేశాల్లో రష్యా ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండోనేషియా ఉన్నాయి.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 9 ఉన్నాయి. అవి ముఖ్యంగా రాజీవ్‌గాంధీ WLS (మహబూబ్‌నగర్, నల్లగొండ), కవ్వాల్ WLS (ఆదిలాబాద్), పాకాల (వరంగల్), ఏటూరు నాగారం WLS (వరంగల్), కిన్నెరసాని (ఖమ్మం), ప్రాణహిత (ఆదిలాబాద్), పోచారం (మెదక్, నిజామాబాద్), శివరాం (ఆదిలాబాద్, కరీంనగర్), మంజీర (మెదక్) వరుస స్థానాల్లో ఉన్నాయి.
జాతీయ పార్కులు
రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు ఉన్నాయి. అవి మహవీర్ హరిణ వనస్థలి (రంగారెడ్డి), మృగవని (రంగారెడ్డి), కాసుబ్రహ్మానందరెడ్డి (హైదరాబాద్)
టైగర్ రిజర్వులు
రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వులు ఉన్నాయి. అవి ఆదిలాబాద్‌లో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్, మహబూబ్‌నగర్-నల్లగొండలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు.
జూలాజికల్ పార్కులు
రాష్ట్రంలో రెండు పార్కులు ఉన్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్క్ – హైదరాబాద్, వన విజ్ఞాన కేంద్రం- వరంగల్. సాధారణంగా జూలాజికల్ పార్కులోని జంతువులను కేజ్ (Cage)లో ఉంచుతారు. జాతీయ పార్కులలోని జంతువులకు కొంత విస్తీర్ణం కేటాయిస్తారు. జాతీయ పార్కుల్లో జంతువులతోపాటు అడవీ ప్రాంతానికి , అందులోని చెట్లకు ప్రాధాన్యతనిస్తారు.
మొత్తం పశుసంపద (కుక్కలు మినహా)
రాష్ట్రంలో మొత్తం పశుసంపద 2,70,39,909గా నమోదయ్యింది. ఇందులో గరిష్టంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 57,13,886 నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.
పాలు
తెలంగాణలో మొత్తం పాల ఉత్పత్తి 3.9 మిలియన్ టన్నులు (39,24,14,000 టన్నులు) నమోదయ్యాయి. ఇందులో కరీంనగర్లో గరిష్టంగా 6,15,000 టన్నులు కలిగి ఉండగా తర్వాత స్థానాల్లో నల్లగొండ, ఖమ్మం వరుస స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, రెండో ప్లేస్‌లో భారతదేశం ఉంది. ఆ తర్వాత చైనా, న్యూజిలాండ్, టర్కీ దేశాలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
మొత్తంగా పాల ఉత్పత్తిలో భారత్ 17 శాతం వాటా కలిగి ఉంది. White Revolution, Co-operative Model ద్వారా గణనీయమైన ప్రగతిని సాధించింది.
White Revolution (శ్వేత విప్లవం) పితామహుడు వర్గీస్ కురియన్.
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉంది.
కోడిగుడ్లు
రాష్ట్రం మొత్తం 1,00,605 లక్షలుగా నమోదుకాగా గరిష్టంగా రంగారెడ్డి తరువాత స్థానాల్లో మెదక్, మహబూబ్‌నగర్ ఉన్నాయి. హైదరాబాద్‌ను మినహాయిస్తే చివరి స్థానంలో ఆదిలాబాద్ ఉన్నది.
మాంసం
తెలంగాణలో మొత్తం మాంసం ఉత్పత్తి 230 వేల టన్నులుగా నమోదవగా గరిష్టంగా మమబూబ్నగర్లో 54 వేల టన్నులుగా రికార్డయ్యింది. తర్వాతి స్థానాల్లో మెదక్, నల్లగొండ ఉన్నాయి. 0.50 వేల టన్నుల ఉత్పత్తితో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. కాగా ప్రపంచంలో మాంసా న్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, చైనా, భారతదేశం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చికెన్
రాష్ట్రంలో 216 వేల టన్నుల చికెన్ ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 48 వేల టన్నులతో మెదక్ మొదటి స్థానంలో ఉండగా, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చేపలు
రాష్ట్రంలో మొత్తం చేపల ఉత్పత్తి 2,49,633 టన్నులు. ఇందులో గరిష్టంగా ఖమ్మం జిల్లాలో 37,240 టన్నులతో ప్రథమస్థానంలో, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్ఏఓ-14 రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చేపలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇండోనేషియా, అమెరికా, పెరూ, రష్యా, జపాన్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం ఏడో స్థానంలో ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా 17.9 శాతం అయితే ఇందులో వ్యవసాయం 9.3 శాతం కాగా వ్యవసాయ అనుబంధ రంగాలు 8.6 శాతం కలిగి ఉండటం విశేషం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు