ప్రణాళికా వ్యయాన్ని వేటి ఆధారంగా నిర్ణయిస్తారు?
1. 2004-05 స్థిర ధరల వద్ద 2015లో దేశ జీడీపీ 5.2 శాతం ఉండగా, జీఎస్డీపీలో రాష్ట్ర వార్షిక సగటు వృద్ధిరేటు ఎంత?
1) 7.4 శాతం 2) 8.8 శాతం
3) 10.5 శాతం 4) 5.4 శాతం
2. 2015లో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వార్షిక సగటు వృద్ధి రేటు 7.4 శాతం ఉండగా, దేశ వార్షిక సగటు వృద్ధి రేటు ఎంత?
1) 2.7 శాతం 2) 5.5 శాతం
3) 8.6 శాతం 4) 5.2 శాతం
3. ఒక కాలంలో ఆదాయం రెండింతలై, జనాభా కూడా అంతే మొత్తంలో పెరిగితే సగటు ఆదాయ వృద్ధి శూన్యం. కాబట్టి ఒక రాష్ట్ర ఫురోగతి కోసం స్థూల ఆదాయం కాకుండా తలసరి ఆదాయాన్ని గణించాలి. తలసరి ఆదాయాన్ని ఏవిధంగా లెక్కిస్తారు?
1) వ్యష్టి ఆదాయంలో నుంచి చెల్లించాల్సిన పన్నులను
తీసివేయాలి
2) జాతీయాదాయం నుంచి ప్రభుత్వ రుణంపై చెల్లించే
వడ్డీ, బదిలీ చెల్లింపులను తీసివేయాలి
3) మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగించాలి
4) ప్రైవేట్ ఆదాయాన్ని, వ్యష్టి ఆదాయాన్ని గణించాలి
4. 2010 – 15 వరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తెలంగాణలో వ్యవసాయ, పరిశ్రమల వాటాలు క్రమంగా తగ్గాయి. అయితే సేవారంగం వాటా మాత్రం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ జీఎస్డీపీలో సేవారంగం వాటా ఎంత ?
1) 62.9 శాతం 2) 60.2 శాతం
3) 59 శాతం 4) 59.7 శాతం
5. రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 15 శాతం. కానీ దాని వల్ల ఉపాధి పొందుతున్నవారి సంఖ్య అధికం. ఇప్పటికే 5.6 శాతం శ్రామికులు ప్రత్యక్షంగా వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి వాటా దాదాపు 18 శాతం కాగా, దాని ఆదాయం వాటా ఎంత?
1) 16.2 2) 14.6 3) 18 4) 15.5
6. జనాభాలో శాతంగా శ్రామికులను కలిపితే దానిని శ్రమశక్తి భాగస్వామ్య రేటు అంటారు. మరి పనిచేసే వారిని జనాభాలో శాతంగా తెలిపితే దానిని ఏమంటారు?
1) శ్రామికుల మొత్తం భాగస్వామ్య రేటు
2) జనాభా భాగస్వామ్య రేటు
3) ఉద్యోగ భాగస్వామ్యరేటు 4) పనిభాగస్వామ్య రేటు
7. ఉద్యోగ, శ్రామిక నిరుద్యోగిత రేట్లను వారి సంఖ్యలను లెక్కించడానికి జాతీయ శాంపిల్ సర్వే నాలుగు దృక్కోణాలను సూచించింది. వాటిని సరైన క్రమంలో అమర్చండి.
ఎ. యూఎస్ లేదా యూపీఎస్ 1. ప్రస్తుత దైనందిన హోదా
బి. ఎస్ఎస్ 2. సాధారణ/ప్రధాన హోదా
సి. సీడబ్ల్యూఎస్ 3. ఉప/అనుబంధ హోదా
డి. సీడీఎస్ 4. ప్రస్తుత వారపరమైన హోదా
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-2, బి-3, సి-1, డి-4
8. 2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో పట్టణ నిరుద్యోగితలో 9.8 శాతంతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, 1.0 శాతంతో మహబూబ్నగర్ చివరి స్థానంలో నిలిచింది. లింగ పరంగా కూడా హైదరాబాద్లో స్త్రీల నిరుద్యోగిత 2.2 శాతం, మహబూబ్నగర్లో 0.6 శాతం ఉంది. అయితే రాష్ట్రంలో సగటు నిరుద్యోగిత రేటు ఎంత?
1) 4.0 శాతం 2) 6.9 శాతం
3) 2.9 శాతం 4) 5.3 శాతం
9. 1965లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆదాయంలో వ్యవసాయ, పరిశ్రమలు, సేవల రంగాల వాటా ఎంత (శాతాల్లో)?
1) 39, 24, 37 2) 37, 24, 39
3) 24, 37, 39 4) 37, 39, 24
10. 1956-57లో తెలంగాణలో సాగు కింద ఉన్న స్థూల భూమి 123.8 లక్షల ఎకరాలు కాగా, 1967-68లో ఎంత?
1) 130.5 లక్షల ఎకరాలు 2) 129.2 లక్షల ఎకరాలు
3) 127.12 లక్షల ఎకరాలు 4) 124.2 లక్షల ఎకరాలు
11. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత జాగీర్దారీ రద్దు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1949 2) 1950 3) 1948 4) 1951
12. హైదరాబాద్ కౌలుదారు చట్టం ప్రకారం రైతులకు కౌలుకింద యాజమాన్య హక్కులు ఖరారయ్యాయి. దీంతో సాగులోకి వచ్చిన భూమి పెరిగింది. అయితే హైదరాబాద్ కౌలుదారు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1949 2) 1948 3) 1950 4) 1951
13. 1956-57లో సాగుకింద ఉన్న మొత్తం భూమి 123.8 లక్షల ఎకరాలు. 1967-68 నాటికి 124.2 లక్షల ఎకరాలకు పెరిగిం ది. నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణం 1956-57లో 23 లక్షల ఎకరాలు కాగా, 1967-68లో ఎంత?
1) 26.47 లక్షల ఎకరాలు 2) 25.6 లక్షల ఎకరాలు
3) 30 లక్షల ఎకరాలు 4) 33.27 లక్షల ఎకరాలు
14. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికా వ్యయం రూ. 188.7 లక్షల కోట్లు (100 శాతం). అయితే రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ వాటా 45 శాతం. తెలంగాణ ప్రణాళికా వ్యయం ఎంత?
1) 42.6 శాతం 2) 37.2 శాతం
3) 34.2 శాతం 4) 43.5 శాతం
15. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా వ్యయంలో ఆంధ్రకు రూ. 205.8 లక్షల కోట్లు ఖర్చుపెట్టగా, తెలంగాణకు ఎంత వెచ్చించారు?
1) 34.2 శాతం 2) 37. 2 శాతం 3) 43.7 శాతం 4) 45 శాతం
16. ప్రణాళికా వ్యయాన్ని వేటి ఆధారంగా నిర్ణయిస్తారు?
1) భూమి, జనాభా, ఉద్యోగిత
2) జనాభా, అక్షరాస్యత, లింగనిష్పత్తి
3) వెనుకబాటు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగిత
4) జనాభా, భూభాగం, వెనుకబాటు
17. రెండో ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో నీటిపారుదల సామర్థ్యం ఆంధ్ర-తెలంగాణ మధ్య ఎంత నిష్పత్తిలో ఉంది ?
1) 2:1 2) 3: 2 3) 3.6:1 4) 3.3:1
18. కృష్ణానది జలాల అంతర్రాష్ట్ర పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ఇద్దరు సభ్యులతో కమిటీని ఎప్పుడు నియమించింది?
1) 1969 2) 1965 3) 1956 4) 1968
19. 1982-83లో తెలంగాణలో సాగవుతున్న నికర భూమి
విస్తీర్ణంలో చెరువుల కింద 3.75 లక్షల హెక్టార్లు ఉండగా, 2011-12లో ఎంత విస్తీర్ణం ఉంది?
1) 2.59 లక్షల హెక్టార్లు 2) 4.84 లక్షల హెక్టార్లు
3) 1.05 లక్షల హెక్టార్లు 4) 1.59 లక్షల హెక్టార్లు
20. 2012-13లో 70వ జాతీయ శాంపిల్ సర్వే సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణ రైతుల రుణగ్రస్తతలో ఉన్న వ్యవసాయ కుటుంబాల శాతం ఎంత?
1) 70 శాతం 2) 89 శాతం 3) 90 శాతం 4) 84 శాతం
జవాబులు
1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-4, 7-1, 8-3, 9-2, 10-4, 11-1,12-13,13-1,14-3,15-2,16-4, 17-3, 18-1,19-4,20-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు