సమానత్వం కోసమే ప్రత్యేక రక్షణలు
దేశంలో అనాదిగా వెనుకబాటుతనానికి, అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ప్రజలు ఇతరులతో సమానంగా ప్రగతి సాధించేందుకు భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రక్షణలు పొందుపర్చారు. వెనుబడి వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెంది, స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి ఈ ఏర్పాట్లు చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు, రాజ్యాంగపరంగా వారికున్న రక్షణలపై పోటీ పరీక్షల్లో తరుచూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
షెడ్యూల్డ్ కులాలు, సంక్షేమం
– అంతులేని చారిత్రక లోతుల్లోంచి ఆవిర్భవించిన భారతీయ సమాజం తన గతాన్ని పరిగణనలోకి తీసుకోలేకపోయినట్లయితే వర్తమానాన్ని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోలేదు. తరతరాల చారిత్రాక శక్తుల నేతృత్వంలో వివిధ అంతర్గత, బాహ్య సామాజిక అంశాల్లో జరిగే పరస్పర చర్యల ద్వారా నే వర్తమానం ఏర్పడుతుంది. సామాజిక అసమానతలు, వివక్షతలు, కులతత్వపు గులాంగిరీ, అంటరానితనం నుంచి అస్పృశ్యతలకు విముక్తి కల్పించడం కోసం శతాబ్దాల పాటు జరిగిన పోరాటాలు, ప్రాచీన కాలం నాటి భారతీయ సంప్రదాయక సంకుచిత సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మలివేద కాలంలోని ఋగ్వేదంలో గల పదో మండలంలోని పురుషసూక్తంలో పేర్కొన్న చాతుర్వర్ణ వ్యవస్థ అనంతర కాలంలో కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాలు అనేక కులాలు ఉపకులాలుగా ఆవిర్భవించడం ఒక ఎత్తయితే అస్పృశ్యత లేదా అంటరాని వర్ణం అనే పంచమ వర్ణాన్ని సమాజం సృష్టించడం మరో ఎత్తు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు భారతీయ సమాజంలో దళితుల పట్ల సామాజిక వివక్షత, సామాజిక దోపిడీ అసమానతలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలన కాలంలో అం బేద్కర్ కృషి వల్ల దళితులకు రక్షణ ఏర్పడింది. ఈ రక్షణను శాశ్వతంగా అందించేందుకుగాను అంబేద్కర్ రాజ్యాంగం లో దళితుల కోసం అనేక అధికరణలను రూపొందించడం గొప్ప పరిణామం.
రాజ్యాంగ రక్షణలు
-స్పష్టంగా పేర్కొంది. పాలకుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని స్థాయిల్లో కృషి చేయాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా లు ఆదేశిస్తున్నాయి. అందువల్ల స్వతంత్ర భారతావనిలో గత 70 ఏండ్లలో ఈ వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది.(జరుగుతున్నది)
-నిబంధన 15 (4) : బలహీన వర్గాలకు సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలను కల్పించాలి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారు షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతి కో సం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో సహ అన్ని విద్యా సంస్థల్లోను వారి ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించవచ్చు.
-నిబంధన 16 (4) : ఉద్యోగాల్లో, సర్వీసుల్లో షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
-నిబంధన 17 : అంటరానితనం నిషేధించింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటరానితనం నిషేధానికి సం బంధించి ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. అవి..
1. అంటరానితనం నిషేధ చట్టం – 1956
2. పౌరహక్కుల రక్షణ చట్టం – 1976
3. షెడ్యూల్డ్ కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టం – 1989
-నిబంధన 23 : మానవుల క్రయ విక్రయాలు, వెట్టిచాకిరి, కట్టుబానిసత్వం (భగేలా)ను నిషేధించింది.
-నిబంధన 24 : బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది.
-నిబంధన 46 : షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్య లు చేపట్టాలి.
-నిబంధన 330 : షెడ్యూల్డ్ కులాలు, తెగలకు లోక్‌సభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు.
-నిబంధన 332 : షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రాష్ట్ర శాసనసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు.
-నిబంధన 338 : రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధిపై సమీక్ష కోసంఒక ప్రత్యేక అధికారిని నియమించవచ్చు.
-నిబంధన 341 : అస్పృశ్యత, సాంఘిక, రుగ్మత సమస్యల్లో ని కులాలను షెడ్యూల్డ్ కులాలుగా రాష్ట్రపతి గుర్తించవచ్చు.
నోట్ :
2007 మే 11న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ కులా ల జాబితాలో చేర్చే కులాల విషయంలో రాష్ట్రపతి నిబంధన 341 ప్రకారం గుర్తించిన అంశాన్ని ఏ న్యాయస్థానం కూడా న్యాయ సమీక్ష చేయరాదని స్పష్టంగా పేర్కొంది.
-నిబంధన 366 (25) : షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన నిర్వచనాలను, వారికి కల్పించిన రాజ్యాంగ రక్షణలను వా టి అమలుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇస్తుంది.
-నిబంధన 243 (డి) నిబంధన : పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు.
-నిబంధన 243 (టి) : పట్టణ, నగరపాలక సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు.
-నిబంధన 275 (1) : షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమానికి గాను కేంద్ర ప్రభుత్వం తన సంఘటిత నిధి నుంచి గ్రాం ట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులు విడుదల చేస్తుంది.
పాలనా యంత్రాంగం
-షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధికిగాను కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పటిష్టమైన పాలనా యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది.
కేంద్రస్థాయిలో
-సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
-జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
-షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ
రాష్ట్రస్థాయిలో
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ
-రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్
-రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
-సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పడటానికి ముందు అనేక శాఖలు, కార్యాలయాలు షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశాయి. దీని కో సం మొదట కేంద్రస్థాయి కేబినెట్ సచివాలయంలో ఒక కార్యదర్శి పదవిని ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో 1985 వరకు షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధికి కేం ద్ర హోంశాఖలో ఒక విభాగం పాటుపడేది. 1985లో కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది. ఈ శాఖ షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మహిళల సంక్షేమానికి సంబంధించిన చర్యలను చేపట్టేది. ఈ మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి సంబంధించిన వివిధ పథకాల విధాన రూపకల్పన ప్రణాళికీకరణ సమన్వయ బాధ్యత కలిగి ఉంటుంది.
జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ – 1989
-ప్రభుత్వ కంపెనీల చట్టం-1956లోని సెక్షన్ 25 ప్రకారం కేంద్రప్రభుత్వం 1989 ఫిబ్రవరిలో జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల, ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థను 2001 ఏప్రిల్ 10న భారత ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థగానూ, జాతీయ షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థగా విభజించింది. ఈ సంస్థ షెడ్యూల్డ్ కులాలకు అన్ని రకాల ఆర్థిక సహాయ సహకారాలను అందించడంతో పాటు వివిధ పథకాలను కూడా రూపొందిస్తుంది.
స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్
-షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు చెందిన వ్యవసాయ కూలీలు, సాగుదారులు, చిన్న సన్నకారు రైతులకు సహాయపడేందుకుగాను 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రత్యేక కేంద్ర సహాయం షెడ్యూల్డ్ కులాలకు అందుతుంది. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్ కులా ల కుటుంబాల ఆదాయాన్ని పెంచి వారి సాంఘిక విద్యాభివృద్ధికి కృషి చేయడం, అవసరమైన అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు