పర్యావరణ ఆర్థిక అకౌంటింగ్‌ను సూచించేది ఏది?
1. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చిన సంఘటన?
1) డర్బన్ సదస్సు 2) టోక్యో సదస్సు
3) స్టాక్ హోమ్ సదస్సు 4) బ్రంట్‌లాండ్ కమిషన్
2. పర్యావరణం, అభివృద్ధికి సంబంధించిన ప్రపంచ కమిషన్ ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1980 2) 1981 3) 1982 4) 1987
3. పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్న అంశం?
1) కాలుష్యం 2) మానవ జీవన విధానం
3) ఆర్థిక విధానాలు 4) పైవన్నీ
4. సుస్థిరాభివృద్ధి అంటే?
ఎ. ప్రస్తుతం వనరులను తక్కువగా ఉపయోగించుకోవడం
బి. సహజ వనరుల వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం
సి. పర్యావరణ అనుకూల ఆర్థిక సామాజిక విధానాలను అవలంబించడం
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి 4) ఎ, బి, సి
5. ఎన్వినార్ అనే పదం ఏ భాషకు చెందింది?
1) లాటిన్ 2) గ్రీకు 3) ఫ్రెంచ్ 4) రోమన్
6. మానవ నిర్మిత పర్యావరణంలో భాగం కానిది?
1) సాంస్కక్షుతిక పర్యావరణం 2) ఆర్థిక పర్యావరణం 3) జీవ పర్యావరణం 4) సాంఘిక పర్యావరణం
7. భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో ఉన్న వాయు ఆచ్చాదనను వాతావరణం అంటారు?
1) 200 కిలోమీటర్లు 2) 300 కిలోమీటర్లు
3) 400 కిలోమీటర్లు 4) 500 కిలోమీటర్లు
8. తలసరి ఆదాయ వృద్ధిరేటు, పర్యావరణ నాణ్యత మధ్య గల సంబంధాన్ని సూచించేది?
1) కుజ్నెట్స్ వక్రరేఖ 2) మాల్ధాస్ వక్రరేఖ
3) కారల్‌మార్క్ సిద్ధాంతం
4) బ్రంట్‌లాండ్ సిద్ధాంతం
9. సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి సదస్సు ఎప్పుడు జరిగింది?
1) 1992 2) 1993 3) 1994 4) 1995
10. సుస్థిరత్వానికి సూచిక కానిది?
1) పేదరికం 2) జనాభా
3) వాతావరణం 4) మానసిక సమస్యలు
11. నిశ్శబ్ద లోయ సంరక్షణ ఉద్యమంతో సంబంధం ఉన్న నది?
1) గంగా 2) గౌముతి 3) కుంతిపూజ 4) తిలక్నంద
12. ప్రపంచ పర్యావరణ దినోత్సవం?
1) జూన్ 3 2) జూన్ 5 3) జూలై 3 4) జూలై 5
13. మొదటి ప్రపంచ ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది?
1) డర్బన్ 2) జొహెన్నెస్‌బర్గ్ 3) రియో 4) టోక్యో
14. సహవూసాబ్ది లక్షాలను ఎప్పటిలోగా సాధించాలని నిర్ణయించారు?
1) 2010 2) 2015 3) 2020 4) 2025
15. సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి రూపొందించిన ఎజెండా 2030ను ఎక్కడ ఆమోదించారు?
1) న్యూయార్క్ 2) న్యూఢిల్లీ
3) న్యూగినియా 4) న్యూజిలాండ్
16. సుస్థిరాభివృద్ధి లక్ష సాధనలో భాగంగా జాతీయ పర్యావరణ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2005 2) 2006 3) 2007 4) 2008
17. సబ్-సహరా, ఆఫ్రికా దేశాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసించే మురికి వాడల జనాభా శాతం?
1) 35 శాతం 2) 50 శాతం
3) 70 శాతం 4) 90 శాతం
18. వాణిజ్యేతర ఇంధన వనరు కానిది?
1) పశు వ్యర్థాలు 2) కూరగాయలు
3) ఖనిజాలు 4) వంట చెరుకు
19. గత ఐదేండ్లలో ప్రపంచ జనాభా 3.5 బిలియన్లు పెరిగింది. ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా?
1) 75 శాతం 2) 80 శాతం
3) 85 శాతం 4) 90 శాతం
20. 2012లో దోహలో జరిగిన సమావేశంలో క్యోటో ప్రోటోకాల్ ఒప్పందాన్ని ఎప్పటివరకు పొడగించారు?
1) 2015 2) 2025 3) 2030 4) 2035
21. 1990 తర్వాత అత్యధిక మానవాభివృద్ధి గల దేశాల అటవీ విస్తీర్ణంలో 1 శాతం పెరుగుదల సంభవించగా, అల్ప మానవాభివృద్ధి గల దేశాల్లో ఎంత శాతం మేర అడవుల తరుగుదల కనిపించింది?
1) 9 శాతం 2) 11 శాతం
3) 13 శాతం 4) 15 శాతం
22. స్మార్ట్ సిటీల సుస్థిరాభివృద్ధికి దోహదపడే అంశం?
1) ప్రజా రవాణా వ్యవస్థ 2) గ్రీన్ స్పెసెస్
3) వ్యర్థ నీటి రీసైక్లింగ్ 4) పైవన్నీ
23. 2015 జూలై 31 నాటికి భారతదేశంలో విద్యుత్ సామర్థం 2,72,432 మెగావాట్లు కాగా, ఇందులో థర్మల్ విద్యుత్ వాటా మెగావాట్లలో?
1) 1, 40, 000 2) 1, 55, 000
3) 1, 65, 000 4) 1, 75, 000
24. పర్యావరణ ఆర్థిక అకౌంటింగ్‌ను సూచించేది?
1) గ్రీన్ డీజీడీపీ 2) గ్రీన్ జీఎన్‌పీ
3) గ్రీన్ జీఎస్డీపీ 4) గ్రీన్ ఎకానమీ
25. సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అడిస్ అబాబా ఎజెండా 2030ని రూపొందించింది?
1) సార్క్ 2) ఏషియన్ 3) జీ-20 4) బ్రిక్స్
26. సహవూసాబ్ది లక్షాల్లోని 22 లక్షాల్లో ఎన్నింటిని భారత్ అందుకోగలిగింది?
1) 5 2) 8 3) 11 4) 14
27. ఒక దేశం లేదా ప్రాంతం వనరుల ఉపయోగిత రేటును తెలిపే భావన?
1) గ్రీన్ జీడీపీ 2) నికర సంక్షేమ సూచీ
3) పర్యావరణ పాద ముద్ర 4) పైవేమీకావు
28. సుస్థిరాభివృద్ధి లక్షాలను రూపొందించిన సంస్థ?
1) ఐక్యరాజ్య సమితి
2) అంతర్జాతీయ పర్యావరణ సంస్థ
3) యూఎన్డీపీ 4) అంతర్జాతీయ కార్మిక సంస్థ
29. సుస్థిరాభివృద్ధి లక్షాలను సాధించాలంటే వెనుకబడిన దేశాలు కనీసం సాధించాల్సిన వృద్ధిరేటు?
1) 5 శాతం 2) 7 శాతం 3) 8 శాతం 4) 9 శాతం
30. పారిస్ డిక్లరేషన్ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు 2020 నుంచి వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం కనీసం ఎంత మొత్తం కేటాయించాలని నిర్ణయించారు?
1) 50 బిలియన్ డాలర్లు 2) 100 బిలియన్ డాలర్లు 3) 150 బిలియన్ డాలర్లు 4) 200 బిలియన్ డాలర్లు
31. కుజ్నెట్స్ సిద్ధాంతం ప్రకారం పర్యావరణ నాణ్యతను లెక్కించడానికి దోహదపడేది?
1) జీవ వైవిధ్యం 2) అడవుల తరుగుదల
3) ఖనిజాల తరుగుదల 4) కాలుష్యం
32. పర్యావరణ క్షీణతకు సంబంధం ఉన్న అంశం?
1) పేదరికం 2) పారిక్షిశామికీకరణ
3) అధిక జనాభా 4) పైవన్నీ
33. ఓజోన్ పొర క్షీణతను తగ్గించే మాంట్రియల్ ప్రొటోకాల్‌ను ఎప్పుడు రూపొందించారు?
1) 1985 2) 1986 3) 1987 4) 1988
34. నిర్మల్ భారత్ అభియాన్ ప్రస్తుతం ఏవిధంగా అమలు చేస్తున్నారు?
1) స్వచ్ఛ భారత్ అభియాన్
2) రాజీవ్ ఆవాస్ యోజన
3) ఇందిరా ఆవాస్ యోజన
4) గ్రామీణ ఆరోగ్య యోజన
35. వరల్డ్ జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్ – 2015లో 142 దేశాల్లో భారత్ స్థానం?
1) 125 2) 126 3) 127 4) 128
36. వరల్డ్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ – 2015లోని 145 దేశాల్లో భారత్ స్థానం?
1) 106 2) 107 3) 108 4) 109
37. భారత ప్రభుత్వం రూపొందించిన వాతావరణ గణాంకాల మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సగటున అమెరికా 20.01 టన్నుల కార్బన్ కాలుష్యాన్ని విడుదల చేస్తుండగా భారత్ విడుదల చేసే స్థాయి?
1) 3.60 టన్నులు 2) 2.02 టన్నులు
3) 1.02 టన్నులు 4) 0.82 టన్నులు
38. యునైటెడ్ నేషన్స్ కాప్ – 11 ఎక్కడ జరిగింది.
1) న్యూయార్క్ 2) బహమాస్
3) హైదరాబాద్ 4) టొరంటో
39. వాతావరణ మార్పులపై జాతీయ కార్యచరణ ప్రణాళికను ఎవరి అధ్యక్షతన ఎప్పుడు ప్రారంభించారు?
1) రాష్ట్రపతి 2009 2) ప్రధానమంత్రి 2008
3) హోంమంత్రి 2007 4) పర్యావరణమంత్రి 2006
40. దేశంలో హానికర వ్యర్థాల (నిర్వహణ, నియంవూతణ) నిబంధనలను ఎప్పుడు రూపొందించారు?
1) 1989 2) 1990 3) 1991 4) 1992
41. జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ను ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1994 2) 1995 3) 1996 4) 1997
42. నిలకడ గల ఆర్థికాభివృద్ధి ఏ రకమైన భావనకు దోహదపడుతుంది?
1) వనరుల వాడకంలో సమానత్వం, న్యాయం
2) వనరుల పంపిణీలో సమానత్వం, న్యాయం
3) భవిష్యత్ సామాజిక వికాసానికి ప్రాధాన్యత
4) పైవన్నీ
43. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థకు సంబంధించిన అంశం?
1) భవిష్యత్‌లో పర్యావరణంపై పడే ప్రభావాన్ని కంప్యూటర్ ఆధారిత గణాంకాల ఆధారంగా అంచనా వేశారు
2) పరిమిత పర్యావరణంపై అపరిమిత విస్తరణ
3) పెట్టుబడికి, పర్యావరణానికి మధ్య ఘర్షణ అనివార్యం
4) పైవన్నీ
44. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళికను ఎప్పుడు రూపొందించారు?
1) 1995 2) 1996
3) 1997 4) 1998
45. జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వహక్కులనిచ్చిన మొదటి దేశం?
1) అమెరికా
2) బ్రిటన్
3) స్విట్జర్లాండ్ 4) భారత్
46. భారత రాజ్యాంగంలో పర్యావరణ మెరుగుదలకు చట్టబద్ధత కల్పించిన రాజ్యాంగ నిబంధన?
1) 48 2) 48ఎ 3) 51ఎ (జీ) 4) 2, 3
47. గ్రీన్‌పీస్ వ్యవస్థల ద్వారా ఆధునిక పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచినది?
1) ధరిత్రి మిత్రుల సమాఖ్య
2) ఓజోన్ మిత్రుల సమాఖ్య
3) జలమివూతుల సమాఖ్య
4) అటవీ మిత్రుల సమాఖ్య
48. గంగా కార్యాచరణ ప్రణాళికను ఎప్పుడు ప్రకటించారు?
1) 1986 2) 1987 3) 1988 4) 1989
49. పర్యావరణంపై సాధారణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించని అంశం?
1) ఈ సమావేశం 1997లో జరిగింది
2) ఈ సమావేశాన్ని ధరిత్రి శిఖరాగ్ర సమావేశం+5 అంటారు
3) ఈ సమావేశం క్యోటోలో జరిగింది
4) ఈ సమావేశంలో అజెండా 21పై సమీక్ష జరిగింది.
50. క్యోటో ప్రొటోకాల్ ఉద్దేశం కానిది?
1) ఇది 1997లో రూపొందించబడింది
2) వాతావరణ మార్పులను తగ్గించడం
3) అభివృద్ధి చెందుతున్న దేశాలు బాధ్యత వహించాలి 4) సాంకేతిక పద్ధతులతో, పర్యావరణాన్ని రక్షించాలి
51. మేము కోరే భవిష్యత్ (The Future we want) పత్రాన్ని రూపొందించింది?
1) రియో సదస్సు 2) రియో+20 సదస్సు
3) క్యోటో సదస్సు 4) కాప్ 5 సదస్సు
52. కాప్ 21 సదస్సు ఎక్కడ జరిగింది?
1) పారిస్ 2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్ 4) న్యూయార్క్
53. పారిస్ ఒప్పందం 2015 ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోక్షిగతల పెరుగుదలను ఎంత తక్కువ స్థాయికి తగ్గించాలి?
1) 10C 2) 20C 3) 30C 4) 40C
54. అడవులపై అంతర ప్రభుత్వ తాత్కాలిక సంఘాన్ని ఐక్యరాజ్య సమతి వేదికను ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 2000 2) 2001 3) 2002 4) 2003
55. వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల సంఘానికి సంబంధం లేని అంశం?
1) దీన్ని 1988లో ఏర్పాటుచేశారు
2) ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్షికమం, ప్రపంచ వాతావరణ సంస్థ సంయుక్తంగా దీన్ని ఏర్పాటుచేశాయి
3) 1990, 1995, 2001, 2007, 2013లలో ఈ సంఘం పర్యావరణ సమీక్షలు జరిపింది
4) ఈ సంఘానికి భారత్ నేతృత్వం వహిస్తున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు