ప్రజల్లోని కరెన్సీ.. బ్యాంకుల్లోని డీడీలు!
ద్రవ్య సప్లయి అనేది ఒక నిలువ భావన. భారతదేశంలో ద్రవ్యాన్ని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు
ముద్రించగా, ఆ ద్రవ్యానికి Credit Creation చేసి చలన వేగంను కలిగించేవి బ్యాంకులు.
ద్రవ్య సప్లయి- కొలమానాలు
(Measures of Money Supply)
ద్రవ్య సప్లయి- నిర్వచనాలు
– ద్రవ్య సప్లయి నిర్వచనాన్ని వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా సూచించారు.
– ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్ణీతకాలంలో చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ద్రవ్య సప్లయి అంటారు.
– ఒక దేశంలో ప్రజల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ఉన్న ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటారు.
– సంప్రదాయ నిర్వచనం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ (C), బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్ డిపాజిట్లను (DD) కలిపి ద్రవ్య సప్లయి అని నిర్వచించారు.
M= C+DD
-చికాగో ఆర్థికవేత్త, మిల్టన్ ఫ్రీఢ్మన్ నిర్వచనం: కరెన్సీ (C) + డిమాండ్ డిపాజిట్లు (DD) + టైమ్ డిపాజిట్ల (TD)ను కలిపి ద్రవ్య సప్లయిగా నిర్వచించారు.
M=C+DD+TD
– సంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్య నిర్వచనానికి సంకుచిత నిర్వచనం ఇస్తే చికాగో ఆర్థికవేత్తలు ద్రవ్య నిర్వచనానికి విస్తృత అర్థాన్ని ఇచ్చారు.
భారతదేశంలో ద్రవ్య సప్లయి
– 1967-68 వరకు ఒకే ద్రవ్య సప్లయి కొలమానాన్ని ప్రకటించేవారు. (M=c+dd)
– 1968 తరువాత సమష్టి ద్రవ్య వనరులు అనే కొలమానాన్ని RBI ప్రకటించి, దీనిలో టైమ్ డిపాజిట్లను చేర్చింది. (M=C+DD+TD)
– చలామణిలో ఉన్న ద్రవ్య సప్లయి ఎలా ఉండాలో నిర్వచించమని RBI సుఖమయి చక్రవర్తి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.
ద్రవ్య సప్లయి- భాగాలు
-ఈ కమిటీ సూచనల ఆధారంగా 1977 నుంచి నాలుగు రకాల ద్రవ్య సప్లయి కొలమానాలను ప్రచురిస్తుంది. అవి M1, M2, M3, M4
-ద్రవ్య సప్లయిలోని నాలుగు అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి కింది భాగాలు తెలుసుకోవాలి.
– ప్రజల వద్ద గల కరెన్సీ నోట్లు, నాణేలు (C).
-బ్యాంకుల్లో గల డిపాజిట్లు: డిమాండ్ డిపాజిట్లు (DD), టైమ్ డిపాజిట్లు (TD)
-పోస్టాఫీసుల్లో గల డిపాజిట్లు: పొదుపు డిపాజిట్లు (SD), మొత్తం డిపాజిట్లు (AD)
-RBI వద్ద గల ఇతర డిపాజిట్లు (OD): అఖిల భారత విత్త సంస్థల డిపాజిట్లు, విదేశీ ప్రభుత్వాలు, బ్యాంకులు, సంస్థల డిపాజిట్లు. అంతర్జాతీయ విత్త సంస్థల మిగులు మొదలైనవి.
– ద్రవ్య సప్లయి కొలమానాలను కింది విధంగా సూచించవచ్చు.
M1= C+DD+OD
M2= M1+PSD
M3= M1+BTD
M4= M3+PAD
M1 ద్రవ్యం:
M1= ప్రజల వద్ద గల కరెన్సీ + బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు+ ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు
M1= C+DD+OD
-M1 ద్రవ్యం
అధిక ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.
– సామాన్య ప్రజల దృష్టిలో ద్రవ్యం అంటే M1
-M1 ద్రవ్యంను సంకుచిత ద్రవ్యం అని కూడా అంటారు.
M2 ద్రవ్యం:
M2 = M1 ద్రవ్యం + పోస్టాఫీసుల్లోని పొదుపు డిపాజిట్లు.
M2= M1+PSD (Postal Saving Deposits )
M2= C+DD+OD+PSD
M3 ద్రవ్యం:
M3= M1+ బ్యాంకుల వద్ద గల టైమ్ డిపాజిట్లు
M3= M3+ BTD (Bank Time Deposits)
M3 ద్రవ్యంను విశాల ద్రవ్యం/విస్తృత ద్రవ్యం/ద్రవ్య కొలమానం అంటారు.
M3 ద్రవ్యంను సమష్టి ద్రవ్య వనరులు అని కూడా అంటారు.
M4 ద్రవ్యం
M4= M3 ద్రవ్యం+ పోస్టాఫీసుల్లోని మొత్తం డిపాజిట్లు.
M4= M3+PAD (Postal All Deposits )
M4= M1+ BTD+ PAD
M4 ద్రవ్యం అత్యల్ప ద్రవ్యత్వం కలిగి ఉంటుంది.
– పరిమాణంలో మాత్రం M4 అధికంగా ఉంటే M1 అల్పంగా ఉంటుంది.
-ద్రవ్యత్వం ఆరోహణ క్రమం – M4<M3< M2<M1
-ద్రవ్యత్వం అవరోణ క్రమం-
M1>M2> M3>M4
నూతన ద్రవ్యం, ద్రవ్యత్వ వనరులు
– 1997లో డాక్టర్ వై. వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన ద్రవ్య సప్లయి పరిమాణంపై ఆర్బీఐ నియమించిన వర్కింగ్ బృందం అధ్యయనం చేసి 1998లో నివేదికను సమర్పించింది.
– ఇది M4 ద్రవ్యం అర్థరహితమైనదని సూచించింది.
-ఇది మూడు రకాల ద్రవ్యత్వ వనరులను సూచించి, ప్రవేశపెట్టింది.
– M1=M3 + పోస్టాఫీసు వద్ద గల అన్ని రకాల డిపాజిట్లు.
-M3= M1 + ద్రవ్య సంస్థల టైమ్ డిపాజిట్లు + ద్రవ్య సంస్థల డిపాజిట్ల ధ్రువీకరణ పత్రాలు.
– M3= M2 + బ్యాంకేతర ద్రవ్య సంస్థల వద్ద గల ప్రజల డిపాజిట్లు.
-అధిక శక్తిగల ద్రవ్యం/రిజర్వు ద్రవ్యం/హైపర్ ద్రవ్యం
– ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ప్రచారాన్ని చూపగలిగే ద్రవ్యాన్ని అధిక శక్తిమంతమైన ద్రవ్యం అంటారు.
-రిజర్వు బ్యాంకు జారీ చేసి ప్రజల వద్ద, బ్యాంకుల వద్ద నిల్వ ఉండే ద్రవ్యాన్ని రిజర్వు ద్రవ్యం అంటారు.
-దీన్నే ప్రభుత్వద్రవ్యం అని, మూలాధార ద్రవ్యం అని, ప్రాథమిక ద్రవ్యం అని, అధిక శక్తిమంతమైన ద్రవ్యం అని కూడా అంటారు.
– అధిక శక్తిమంతమైన ద్రవ్యాన్ని M0 ద్రవ్యం అని కూడా అంటారు.
-రిజర్వు ద్రవ్యంలో కింది భాగాలు ఉంటాయి.
ద్రవ్య సప్లయి (2021 జూలై 2)
– ప్రజల వద్ద గల కరెన్సీ (C)
– RBI వద్ద గల ఇతర డిపాజిట్లు (OD)
– వాణిజ్య బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు (CR- Cash Reserves).
– రిజర్వు ద్రవ్యాన్ని /అధిక శక్తిమంతమైన ద్రవ్యాన్ని కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు.
H=C+OD+CR
-ప్రజల వద్ద గల కరెన్సీ రూ. 28,74,887 కోట్లు.
– RBI వద్ద గల ఇతర డిపాజిట్లు రూ. 48,742 కోట్లు.
-బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు రూ. 18,87,076 కోట్లు
– బ్యాంకుల వద్ద టైమ్ డిపాజిట్లు రూ. 145,01,214 కోట్లు.
-M3 ద్రవ్యం రూ. 193,11,920 కోట్లు.
ప్రాక్టీస్ బిట్స్
1. భారతదేశంలో ద్రవ్యాన్ని ముద్రించి క్రెడిట్ క్రియేషన్ చేసి చలన వేగాన్ని కల్గించేవి ఏవి?
ఎ) బ్యాంకులు బి) ప్రభుత్వం
సి) వినియోగదారులు డి) వ్యాపారులు
2. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత కాలంలో చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్య ప్రసార వేగం
బి) ద్రవ్య సప్లయి
సి) ద్రవ్య నిల్వ
డి) ద్రవ్య చలామణి
3. ‘ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు కలిపి ద్రవ్య సప్లయి’ ఇది ఏ రకమైన నిర్వచనం?
ఎ) సంప్రదాయ నిర్వచనం
బి) ఆధునిక నిర్వచనం
సి) చికాగో నిర్వచనం డి) పైవన్నీ
4. 1967 వరకు ఎన్ని రకాల ద్రవ్య సప్లయి కొలమానాలను ఉపయోగించారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
5. ద్రవ్య సప్లయి ఎలా ఉండాలి అనేదానిపై ఆర్బీఐ మొదట ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది?
ఎ) సుఖమయి చక్రవర్తి
బి) వర్కింగ్ గ్రూప్
సి) మిల్టన్ ఫ్రీడ్మన్
డి) చికాగో స్కూల్ టీమ్
6. నాలుగు రకాల ద్రవ్య సప్లయి కొలమానాలు ఏ సంవత్సరం నుంచి ప్రచురించారు?
ఎ) 1960 బి) 1977
సి) 1988 డి) 1968
7. M1 ద్రవ్యంలో అంతర్భాగాలు ఏవి?
ఎ) M1= C+DD
బి) M1= C+DD+TD
సి) M1= C+DD+OD
డి) M1= C+OD
8. సంకుచిత ద్రవ్యం (Narrow Money) అని దేన్ని అంటారు?
ఎ) M1 ద్రవ్యం
బి) M2 ద్రవ్యం
సి) M3 ద్రవ్యం డి) M4 ద్రవ్యం
9. కింది వాటిలో అధిక ద్రవ్యత్వం గల ద్రవ్యం ఏది?
ఎ) M4 ద్రవ్యం బి) M3 ద్రవ్యం
సి) M2 ద్రవ్యం డి) M1 ద్రవ్యం
10. కింది వాటిలో పోస్టాఫీసుల్లో పొదుపు డిపాజిట్లు ఎందులో భాగం?
ఎ) M1 ద్రవ్యం బి) M2 ద్రవ్యం
సి) M3 ద్రవ్యం డి) M4 ద్రవ్యం
11. M3 ద్రవ్యానికి మరో పేరు?
ఎ) విశాల ద్రవ్యం
బి) విస్తృత ద్రవ్యం
సి) విశాల ద్రవ్య కొలమానం
డి) పైవన్నీ
12. సామాన్య ప్రజల దృష్టిలో ద్రవ్యం అంటే?
ఎ) M1 ద్రవ్యం బి) M2 ద్రవ్యం
సి) M3 ద్రవ్యం డి) M4 ద్రవ్యం
13. పోస్టాఫీసుల్లోని మొత్తం డిపాజిట్లు ఏ ద్రవ్యం లో భాగం?
ఎ) M1 ద్రవ్యం బి) M2 ద్రవ్యం
సి) M3 ద్రవ్యం డి) M4 ద్రవ్యం
14. అత్యల్ప ద్రవ్యత్వం గలది ఏది?
ఎ) M1 ద్రవ్యం బి) M2 ద్రవ్యం
సి) M3 ద్రవ్యం డి) M4 ద్రవ్యం
15. M3 ద్రవ్యాన్ని ఏవిధంగా పిలుస్తారు?
ఎ) సంకుచిత ద్రవ్యం
బి) సంప్రదాయ ద్రవ్యం
సి) సమష్టి ద్రవ్య వనరులు
డి) వైయుక్తిక ద్రవ్య వనరులు
16. పరిమాణంలో అధిక ద్రవ్యత్వం, అల్ప ద్రవ్యత్వం గలవి ఏవి?
ఎ) M1, M2 బి) M3, M4
సి) M1, M4 డి) M4, M1
17. ద్రవ్య సప్లయి పరిమాణంపై ఆర్బీఐ నియమించిన వర్కింగ్ బృందానికి అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ) వై. వేణుగోపాల్‌రెడ్డి
బి) సుఖమయి చక్రవర్తి
సి) మిల్టన్ ఫ్రీడ్మన్
డి) పైవారెవరూ కాదు
18. వై. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఆర్బీఐ నియమించిన వర్కింగ్ బృందం ఎన్ని రకాల ద్రవ్య సప్లయి కొలమానాలను సూచించింది?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
19. ఆర్బీఐ జారీ చేసి ప్రజలు, బ్యాంకుల వద్ద నిల్వ ఉంచే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) సంకుచిత ద్రవ్యం బి) విశాల ద్రవ్యం
సి) రిజర్వు ద్రవ్యం డి) సమష్టి ద్రవ్యం
20. కింది వాటిలో రిజర్వు ద్రవ్యం/ అధిక శక్తిమంతమైన ద్రవ్యం ఏది?
ఎ) C+DD+OD బి) C+DD+TD
సి) C+OD+SD డి) C+OD+CR
21. రిజర్వు ద్రవ్యానికి మరోపేరు?
ఎ) ప్రభుత్వ ద్రవ్యం
బి) మూలాధార ద్రవ్యం
సి) ప్రాథమిక ద్రవ్యం
డి) పైవన్నీ
22. జూలై 2021 నాటికి ప్రజల వద్ద గల కరెన్సీ ఎంత?
ఎ) 28,74,887 కోట్లు
బి) 145,01,214 కోట్లు
సి) 193,11,920 కోట్లు
డి) 18,87,076 కోట్లు
సమాధానాలు
1. ఎ 2. బి 3. ఎ 4. ఎ 5. ఎ 6. బి 7. సి 8. ఎ 9. డి 10. బి 11. డి 12. ఎ 13. డి 14. డి 15. సి 16. డి
17. ఎ 18. సి 19. సి 20. డి 21. డి 22. ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు