సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందినది? (తెలంగాణ జాగ్రఫీ)
1. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత కింద తెలిపిన తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి?
1) నిజామాబాద్ 2) రంగారెడ్డి
3) మహబూబూనగర్ 4) నల్లగొండ
2. ఏప్రిల్ 2017 నాటికి తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య?
1) 33 2) 30 3) 32 4) 31
3. తెలంగాణ ఏ రైల్వే జోన్ (మండలం) పరిధిలో కి వస్తుంది?
1) నైరుతి రైల్వే 2) దక్షిణ మధ్య రైల్వే
3) ఆగ్నేయ రైల్వే 4) దక్షిణ రైల్వే
4. కింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమ పద్ధతిలో తెలపండి?
ఎ. హైదరాబాద్ ఆస్బెస్టాస్
బి. వజీర్ సుల్తాన్ టొబాకో
సి. ప్రాగా టూల్స్
డి. ఆల్విన్ మెటల్ వర్క్స్
1) బి, డి, సి, ఎ 2) డి, ఎ, సి, బి
3) బి, సి, డి, ఎ 4) ఎ, డి, సి, బి
5. శంషాబాద్, సరూర్నగర్, మహేశ్వరం మండలాల్లోని పదకొండు గ్రామాలను పాక్షికంగా లేదా సంవూర్ణంగా ప్రభావితం చేసిన అభివృద్ధి ప్రాజెక్టు ఏది?
1) ప్రత్యేక పారిశ్రామిక మండలి
2) ఐటీ కారిడార్
3) అంతర్జాతీయ విమానాశ్రయం
4) సాగునీటి పారుదల
6. టీహబ్ కేంద్రం హైదరాబాద్లో ఎక్కడ ఉంది?
1) IITH 2) IIITH
3) H.C.U 4) Raheja Mind Space
7. 2010-11 వ్యవసాయ గణాంకాల ప్రకారం, తెలంగాణలో మొత్తం వ్యవసాయ కమతాల్లో ఉపాంత, సన్నకారు కమతాల (అసలు 5 ఎకరాల వరకు) వాటా దాదాపుగా…
1) 75 % 2) 62% 3) 80% 4) 86%
8. తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం ఏది?
1) థర్మల్ 2) హైడల్
3) న్యూక్లియర్ 4) బయో-వ్యూయల్స్
9. భారతదేశంలో సాగులో ఉన్న భూ విస్తీర్ణం పరంగా పసువు పంటలో తెలంగాణ సాధించిన ర్యాంకు ఎంత?
1) మొదటి ర్యాంకు 2) రెండో ర్యాంకు
3) నాల్గో ర్యాంకు 4) ఎనిమిదో ర్యాంకు
10. హైదరాబాద్లో మొహల్ల ప్యాలెస్ను నిర్మించిన వారు ఎవరు?
1) నిజామ్-ఉల్-ముల్క్
2) సాలార్జంగ్
3) సలాబత్ జంగ్
4) అఫ్ఘల్-ఉద్-దౌలా
11. తెలంగాణలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) పోచంపల్లి 2) నిర్మల్
3) కొలనుపాక 4) పోచారం
12. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు?
ఎ. టెక్స్టైల్ పార్కు-సిరిసిల్ల-రాజన్న సిరిసిల్ల జిల్లా
బి. టెక్స్టైల్ పార్కు-పాశమైలారం-సంగారెడ్డి జిల్లా
సి. టెక్స్టైల్ పార్కు-మల్కావూర్-యాదాద్రి భువనగిరి
1) ఎ, బి, సి 2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే 4) ఎ, సి మాత్రమే
13. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంటుంది?
1) 94’’. 25’ తూర్పు రేఖాంశం నుంచి 980. 27’ తూర్పు రేఖాంశం వరకు
2) 580.16’ తూర్పు రేఖాంశం నుంచి 760 18’ తూర్పు రేఖాంశం వరకు
3) 77.15’ తూర్పు రేఖాంశం నుంచి 810 19’ తూర్పు రేఖాంశం వరకు
4) 820.70’ తూర్పు రేఖాంశం నుంచి 930. 24’ తూర్పు రేఖాంశం వరకు
14. ’తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్-2017 నివేదిక ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో అక్షరాస్యత రేటు విషయంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
1) 31వ స్థానం 2) 23వ స్థానం
3) 18వ స్థానం 4) 27వ స్థానం
15. హైదరాబాద్ నీటి సరఫరా మొట్టమొదటగా ఎక్కడ నుంచి జరిగింది?
1) ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్
2) నిజాంసాగర్
3) సింగూర్ ప్రాజెక్టు
4) నాగార్జున సాగర్
16. ఉత్తర తెలంగాణ వ్యవసాయ, శీతోష్ణ కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉంది?
1) కరీంనగర్ 2) మంచిర్యాల
3) వరంగల్ 4) జగిత్యాల
17. కింది వాటిలో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంగా యురేనియం అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి వార్తల్లో ఉన్న ప్రాంతం ?
1) బెజ్జార్ 2) సోమనపల్లి
3) అమ్రాబాద్ 4) జగిత్యాల
18. తెలంగాణలో గల స్థానిక రవాణా వ్యవస్థల వివిధ పద్ధతుల్లో ర్డో రహదారిలో వస్తువులు, ప్రయాణికుల రవాణా ఎంత శాతం భాగస్వామ్యం కలిగి ఉంది?
1) 60% 2) 66%
3) 50% 4) 33%
19. తెలంగాణలో గత 15 సంవత్సరాల్లో ప్రధాన నీటి పారుదల వనరు ఏది?
1) కాలువలు 2) బావులు
3) చెరువులు
4) ఇతర నీటి పారుదల ఆధారాలు
20. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలో 80 శాతం లేదా అంతకు మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు?
1) 8 2) 6 3) 4 4) 10
21. ’తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్-2019’ హ్యాండ్ బుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ తరగతుల్లో అక్షరాస్యతా రేటు ఎంత ఉంది?
1) 49.5% 2) 54.5%
3) 61.5% 4) 57.5%
22. 2014-15లో తెలంగాణ రాష్ట్ర మొత్తం భూ అడవుల విస్తీర్ణం ఎంత శాతంగా ఉంది?
1) 20.45% 2) 24.35%
3) 28.45% 4) 33.35%
23. కింది వాటిని జతపరచండి?
నేల పంటలు
ఎ. ఒం్ర మట్టి 1. నూనె గింజలు
బి. ఎర మట్టి 2. గోధుమ, వరి
సి. నల్లమట్టి 3. తేయాకు, పోక చెక్క/వక్క
డి. లేటరైట్ నేల 4. పత్తి
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
24. 2010-11 వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూ కమతం సగటు పరిమాణం ఎంత?
1) ఒక హెక్టారు కంటే తక్కువ
2)1.0 1.8 హెక్టార్లు
3) 1.9-2.7 హెక్టార్లు
4) 2.8 హెక్టార్లకు మించి
25. సోషియో ఎకనామిక్ ఔట్లుక్-2017 ప్రకారం వ్యవసాయంపై శ్రామికుల ఆధారం తెలంగాణలోని ఎన్ని జిల్లాలలో రాష్ట్ర సగటు కంటే అధికంగా ఉంది?
1) 18 2) 21 3) 25 4) 28
26. తెలంగాణలో 2015-16లో స్థూల సాగునీటి విస్తీర్ణం కింది వాటిలో ఎందులో అత్యల్పంగా ఉంది?
1) చెరువులు 2) కాలువలు
3) గొట్టపు బావులు 4) సాధారణ బావులు
27. కింది వాటిని జతపరచండి?
నీటి పారుదల పథకం విభజనకు వూర్వపు జిల్లా
ఎ. శ్రీరాంసాగర్ 1. కరీంనగర్
బి. ప్రియదర్శిని జూరాల 2. ఆదిలాబాద్
సి. కడెం 3. మహబూబ్నగర్
డి. శనగరం 4. నిజామాబాద్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-2
28. ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో కలిసిన విద్యుత్ ప్రాజెక్టు ఏది?
1) భద్రాద్రి 2) శబరి
3) సీలేరు 4) యాదాద్రి
29. తెలంగాణ జిల్లాల్లోని నికర నీటిపారుదల ప్రాంతం, నికర సాగుదల శాతంలో పోల్చడం లో కింది వాటిలో ఒకటి సరిగ్గా జతపర చబడలేదు.
1) భద్రాద్రి కొత్తగూడెం-రెండో అత్యధికం
2) ఆదిలాబాద్-అత్యల్పం
3) మంచిర్యాల- రాష్ట్ర సరాసరి కంటే ఎక్కువ
4) మేడ్చల్ మల్కాజిగిరి-అత్యధికం
30. కింది ఏ అవిభాజిత జిల్లాలు తెలంగాణలో ఎక్కువ గనుల ఆధారిత ఆదాయాన్ని ఇస్తున్నాయి?
1) కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్
2) మహబూబ్నగర్, నల్లగొండ
3) రంగారెడ్డి, మెదక్, నల్లగొండ
4) నిజామాబాద్, మెదక్
31. బ్రౌన్ (గోధుమ రంగు) గ్రానైట్ వెలికితీతతో కింది వాటిలో ఏ అవిభాజిత జిల్లా అధిక ఆదాయ వనరు?
1) రంగారెడ్డి 2) ఖమ్మం
3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
32. తెలంగాణ రాష్ట్ర మానవ అభివృద్ధి సూచిక 2017 ప్రకారం మానవ అభివృద్ధిలో కింది విభజన వూర్వపు జిల్లాలలో ఏ రెం మొదటి, ఏ రెం చివరి స్థానాలలో ఉన్నాయి?
1) మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్,
2) ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం
3) కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్
4) హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్
33. తెలంగాణ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత కింది వాటిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దుగల జిల్లా ఏది?
1. కుమరంభీం ఆసిఫాబాద్
2. ఆదిలాబాద్
3. వరంగల్
4. భద్రాద్రి కొత్తగూడెం
34. తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏ నేల ప్రధానంగా ఉంది?
1) ఇసుక నేలలు
2) నల్ల నేలలు
3) ఎర నేలలు
4) వరద (ఒంమ్రట్టి నేలలు)
35. తెలంగాణలో కుంతాల జలపాతం ఏ మండలంలో ఉంది?
1) నేరేడుగొండ 2) మంచిర్యాల
3) సిర్పూర్ 4) ఆదిలాబాద్
36. లింగమంతుల స్వామిని కింది ఏ జాతరలో వూజిస్తారు?
1) పెద్దగట్టు 2) మన్నెంకొండ
3) యాదాద్రి 4) కొండగట్టు
37. అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉన్నది?
1) జోగులాంబ గద్వాల జిల్లా
2) నల్లగొండ జిల్లా
3) నాగర్ కర్నూల్ జిల్లా
4) రంగారెడ్డి జిల్లా
38. కింది ఏ ప్రదేశం ద్వారా గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది ?
1) బోధన్ 2) పోచంపాడు
3) కందకుర్తి 4) కాళేశ్వరం
39. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ‘ఆసియా రుమాల్‘ తయారవుతుంది ?
1) పోచంపల్లి 2) కొత్తకోట
3) గద్వాల 4) సిరిసిల్ల
40. తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాత జిల్లా ఏది?
1) ఆదిలాబాద్ 2) వరంగల్
3) నిజామాబాద్ 4) నల్గొండ
41. ఫిబ్రవరి 2018లో తెలంగాణలో మొట్ట మొదటిసారి గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిని (మెగావాట్లలో) దాటింది?
1) 10,000 2) 9,000
3) 11,000 4) 8,000
42. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతి పెద్ద బావిని ఎక్కడ తవ్వారు?
1) సుందిళ్ల, పెద్దపల్లి
2) కాటారం గుట్టలు, జయశంకర్ భూపాలపల్లి
3) అన్నారం, జయశంకర్ భూపాలపల్లి
4) తిప్పాపురం గుట్టలు-రాజన్న సిరిసిల్ల
43. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందినది?
1) నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఆరంభమైంది
2) లింగమంతుల జాతర
3) మూసీనది కృష్ణానదిలో ప్రవేశిస్తుంది
4) బౌద్ధ క్షేత్రం
44. కింది వాటిలో ఒకటి తెలంగాణ టైబల్ ఇకో టూరిజం సర్క్యూట్లో గుర్తించబడిన గమ్యస్థానాల్లో భాగం కాదు ?
1) జోడేఘాట్ శాంగఢ్ కోట
2) కోరటికల్ వాటర్ ఫాల్స్
3) అనంతగిరి కొండలు
4) శ్యాంగఢ్ కోట
45. టీఎస్-ఐపాస్ (TS-iPASS) దేనికి సంబంధించినది?
1) తెలంగాణ సెకండరీ పాఠశాల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడం
2) తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి అనుమతులివ్వడం
3) తెలంగాణలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం
4) తెలంగాణలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రోత్సహించడం
46. తెలంగాణ రాష్ట్రం కింది ఏయే రాష్ట్రాల సముదాయాల చుట్టూ ఆవరించి ఉన్నాయి ?
1) తమిళనా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
2) ఛత్తీస్గఢ్ ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక
3) మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్
47. ఏ జిల్లా సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది?
1) రాజన్న సిరిసిల్ల 2) జగిత్యాల
3) కరీంనగర్ 4) కామారెడ్డి
48. వరంగల్ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
1) కేసముద్రం 2) మామునూరు
3) హసన్పర్తి 4) మడికొండ
49. మన్నెంకొండ జాతరను కింది వాటిలో ఏ విభజన వూర్వపు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు?
1) రంగారెడ్డి 2) నల్లగొండ
3) నిజామాబాద్ 4) మహబూబ్నగర్
50. కింది వాటిలో ఏ ఖనిజం విభజన వూర్వపు ఖమ్మం జిల్లా ప్రధాన ఖనిజం కాదు
1) బైరైటీస్ 2) గ్రానైట్
3) మాంగనీస్ 4) బొగ్గు
జవాబులు
1.4 2.4 3.2 4.2 5.3 6.2 7.4 8.1 9.1 10.3 11.2 12.1 13.3 14.1 15.1 16.4 17.3 18.1 19.2 20.3 21.1 22.2 23.4 24.2 25.3 26.2 27.3 28.3 29.1 30.1 31.3 32.4 33.4 34.3 35.1 36.1 37.3 38.3 39.1 40.1 41.1 42.4 43.4 44.3 45.2 46.4 47.1 48.2 49.4 50. 3
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు