పేదలపై భారాన్ని వేసే పన్నులు?
1. స్వాతంత్య్రానంతరం భారతదేశ చరిత్రను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం?
1) హరితవిప్లవం 2) జాతీయ అత్యవసర పరిస్థితి 3) ఆర్థిక సంస్కరణలు 4) పైవన్నీ
2. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎప్పుడు తలెత్తింది?
1) 1989-90 2) 1990-91
3) 1991-92 4) 1992-93
3. దేశ ఆర్థిక సంక్షోభానికి కారణం కానిది ఏది?
1) చెల్లింపుల శేషంలో లోటు ఎక్కువగా ఉండటం
2) వినిమయ రేటు సర్దుబాటుకు అనుకూలంగా ఉండటం
3) 1989-91 వరకున్న రాజకీయ కారణాలు
4) సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవడం
4. తూర్పు ఐరోపాలో సోవియట్ రష్యాలో జరిగిన మార్పులు భారత ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేశాయి?
1) రూపాయి వాణిజ్య క్రెడిట్ ప్రవాహం తగ్గింది
2) ఎగుమతులు క్షీణించాయి
3) విదేశీ రుణం పెరిగింది 4) 1, 2
5. ఆర్థిక సంస్కరణల్లో అంతర్భాగమైన అంశం?
1) ప్రైవేటీకరణ 2) సరళీకరణ
3) ప్రపంచీకరణ 4) పైవన్నీ
6. సరళీకృత విధానంలో అంశం కానిది?
1) ప్రభుత్వ ఆంక్షలు, నియంత్రణల తొలగింపు
2) విదేశీ పెట్టుబడుల్లో ఉదారవైఖరి
3) బహుళ జాతి సంస్థలకు ద్వారాలు తెరవడం
4) గ్రామీణ కులవృత్తులను ఆదుకోవడం
7. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే కార్యకలాపాల నుంచి ప్రభుత్వం వైదొలిగి మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయడాన్ని ఏమంటారు?
1) వికేంద్రీకృత విత్త వ్యవస్థ 2) ప్రైవేటీకరణ
3) సరళీకరణ 4) ప్రపంచీకరణ
8. 1969లో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పీటర్ డ్రహల్ రచించిన ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యుటి అనే గ్రంథం ప్రధానంగా దేన్ని వివరిస్తుంది?
1) భారత ఆర్థికవ్యవస్థలో సంక్షోభాన్ని
2) రష్యా సంక్షోభాన్ని
3) అమెరికా ఆర్థిక మాంద్యాన్ని 4) ప్రైవేటీకరణ
9. ఇంగ్లండ్‌లో మార్గరెట్ థాచర్ పబ్లిక్‌రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించింది?
1) 1970 2) 1975 3) 1980 4) 1985
10. ప్రైవేటీకరణ ప్రక్రియను దేశంలో ఏమని పిలుస్తారు?
1) డిస్ఇన్వెస్టిమెంట్ 2) డీనేషనలైజేషన్
3) ప్రయారిటైజేషన్ 4) డిస్టాస్టేషన్
11. ప్రపంచీకరణతో సంబంధంలేని అంశం?
1) అంతర్జాతీయ వాణిజ్య అవరోధాలను తొలగించడం
2) సాంకేతిక విజ్ఞాన ప్రవాహానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం
3) మూలధన ప్రవాహాన్ని నియంత్రించడం
4) శ్రామిక గమనశీలతను పెంచడం
12. సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు రూపొందించిన ఏ సిద్ధాంతం ప్రపంచీకరణకు ఆధారం?
1) గతితార్కిక సిద్ధాంతం 2) తులనాత్మక సిద్ధాంతం 3) తులనాత్మక వ్యయ సిద్ధాంతం
4) వ్యయసిద్ధాంతం
13. ప్రపంచ ఆర్థిక సంస్థ?
1) ప్రపంచ బ్యాంకు 2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) ప్రపంచ వాణిజ్య సంస్థ 4) పైవన్నీ
14. ప్రపంచీకరణ అందరికీ సమానంగా లబ్ధి చేకూర్చడంలేదన్న ‘స్టిగ్లిజ్’కు నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది?
1) 2001 2) 2002 3) 2003 4) 2004
15. ఎంఆర్టీపీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 1967 2) 1968 3) 1969 4) 1970
16. 1990లో భారత ఆర్థిక వ్యవస్థలో సమస్య?
1) పారిశ్రామిక రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడటం
2) తీవ్ర ద్రవ్యోల్బణం
3) విదేశీ వర్తక, దేశీయ బడ్జెట్ లోటు అధికం
4) పైవన్నీ
17. నూతన పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 1991, జూన్ 24 2) 1991, జూలై 24
3) 1991, ఆగస్టు 24 4) 1991, సెప్టెంబర్ 24
18. ఎల్పీజీ నమూనా లక్షం కానిది?
1) సత్వర అభివృద్ధి 2) సంపూర్ణ ఉపాధి
3) పేదరిక నిరుద్యోగ నిర్మూలన
4) వ్యవసాయరంగ అభివృద్ధి
19. వాషింగ్టన్ ఒత్తిడి అనే పదంతో సంబంధం ఉన్న అంశం?
1) ప్రపంచ బ్యాంక్ 2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) అమెరికా ఆర్థిక విధానం 4) పైవన్నీ
20. దేశంలో మొదటిదశ ఆర్థిక సంస్కరణల కాలం?
1) 1991-1997 2) 1991-2000
3) 1991-2004 4) 1991-2007
21. ప్రభుత్వరంగ గుత్తాధిపత్యానికి ప్రతీకగా ఉన్న పారిశ్రామిక విధానం?
1) 1948 2) 1956 3) 1977 4) 1991
22. ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దుచేసి కాంపిటీషన్ చట్టాన్ని రూపొందించారు?
1) రంగరాజన్ 2) దీపక్ పరేఖ్
3) రాఘవన్ 4) రాజా చెల్లయ్య
23. కాంపిటీషన్ చట్టం?
1) 2001 2) 2002 3) 2003 4) 2004
24. రాజా చెల్లయ్య కమిటీతో సంబంధంలేని అంశం?
1) సేవాపన్ను 2) వ్యాట్
3) పన్నురేట్ల పెంపు 4) పన్నురేట్ల తగ్గింపు
25. ఎఫ్ఆర్బీఎం ప్రకారం ప్రతి ఏడాది రెవెన్యూలోటును ఎంత శాతం తగ్గించాలి?
1) 0.2 శాతం 2) 0.3 శాతం
3) 0.4 శాతం 4) 0.5 శాతం
26. 11వ పంచవర్ష ప్రణాళికలో స్థూల దేశీయ పొదుపు?
1) 36.1 శాతం 2) 38.2 శాతం
3) 39.4 శాతం 4) 40.2 శాతం
27. చమురు సబ్సిడీని తగ్గించడం వల్ల జరిగేది?
1) కోశలోటు పెరుగుతుంది 2) కోళలోటు తగ్గుతుంది 3) రెవెన్యూ లోటు అకస్మాత్తుగా పెరుగుతుంది
4) విత్తలోటు అకస్మాత్తుగా తగ్గుతుంది
28. 2015 హెచ్‌డీఐ ప్రకారం భారత పౌరుని సగటు జీవితకాలం?
1) 60 ఏండ్లు 2) 68 ఏండ్లు
3) 72 ఏండ్లు 4) 78 ఏండ్లు
29. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం ఎప్పుడు చేశారు?
1) 2004 2) 2005 3) 2006 4) 2007
30. పేదరికానికి సంబంధించిన ఆర్థిక కారణం కానిది?
1) నిరుద్యోగం 2) అసమాన పంపిణీ
3) కుటీర పరిశ్రమల విచ్ఛిన్నం 4) ప్రమాదాలు
31. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం స్వల్పకాలంలో అధిక వృద్ధిరేటును సాధించి పేదరికాన్ని గణనీయంగా తగ్గించుకున్న మొదటి దేశం?
1) భారత్ 2) చైనా 3) బ్రెజిల్ 4) దక్షిణాఫ్రికా
32. ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల పేదరికం రేటు?
1) గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది
2) పట్టణ ప్రాంతాల్లో పెరిగింది
3) గ్రామీణ ప్రాంతాల్లో తగ్గింది
4) మార్పు కనపడలేదు
33. విద్యకు తగ్గట్టుగా ఉద్యోగిత రేటు పెరగకపోవడం?
1) జాబ్‌లెస్ గ్రోత్ 2) ఆప్టిమల్ గ్రోత్
3) ఎక్స్ట్రీమ్ గ్రోత్ 4) పైవేవీకావు
34. సంస్కరణలకు ముందు పేదరికం తగ్గదల రేటు?
1) 0.66 శాతం 2) 0.76 శాతం
3) 0.88 శాతం 4) 0.96 శాతం
35. సంస్కరణలకు ముందు జాతీయ ఆదాయ వృద్ధి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఉపాధి వృద్ధిరేటు ఎక్కువగా ఉండటం అనేది దేనిని సూచిస్తుంది?
1) పేదరికం ఎక్కువగా ఉండటాన్ని
2) పేదరికం తక్కువగా ఉండటాన్ని
3) పేదరికం పెరగడాన్ని
4) నిరుద్యోగంలో మార్పును
36. ఆర్థికాభివృద్ధి గరిష్టస్థాయికి చేరుకున్న తరువాత ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడుతాయని చెప్పిన ఆర్థికవేత్త?
1) రంగరాజన్ 2) కారల్‌మార్క్
3) సైమన్ కుజునెట్స్ 4) జేమ్స్ ఆడమ్
37. ఆర్థిక అసమానతలకు కారణం?
1) ప్రాంతీయ అసమానతలు 2) అవినీతి
3) జాబ్పూస్ గ్రోత్ విధానాలు 4) పైవన్నీ
38. పేదలపై భారాన్ని వేసే పన్నులు?
1) ప్రత్యక్ష పన్నులు 2) పరోక్ష పన్నులు
3) వ్యక్తిగత పన్నులు 4) వ్యవసాయ పన్నులు
39. అసమానతలను కొలిచే ప్రమాణం కానిది?
1) గినీ గుణకం 2) లారెంజ్ వక్రరేఖ
3) తలసరి ఆదాయం 4) వ్యక్తిగత లక్షణాలు
40. సామాజికాభివృద్ధిలో అత్యంత క్రియాశీల సాధనం?
1) విద్య 2) కులం 3) మతం 4) జీవన విధానం
41. విద్య ద్వారా జరిగే ప్రయోజనం?
1) నిరుగ్యో నిర్మూలన 2) పేదరిక నిర్మూలన
3) కుటుంబ వికాసం 4) పైవన్నీ
42. జాతీయస్థాయి విద్యావిధానానికి సంబంధించి కొఠారీ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1962 2) 1963 3) 1964 4) 1965
43. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1994 2) 1995 3) 1996 4) 1997
44. 2009లో ప్రారంభించిన రాష్ట్రీయ మాద్యమిక శిక్షా అభియాన్ లక్షం కానిది?
1) ప్రాథమిక పాఠశాలల్లో 100 శాతం నమోదు
2) సెకండరీ పాఠశాలల్లో 90 శాతం నమోదు
3) హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో 75 శాతం నమోదు
4) 2017 నాటికి అందరికీ సెకండరీ విద్యను అందించడం
45. విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2010, జనవరి 1 2) 2010 ఫిబ్రవరి 1
3) 2010 మార్చి 1 4) 2010 ఏప్రిల్ 1
46. బేటీ బచావో బేటీ పడావో కార్యక్షికమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) కాన్పూర్ 2) పానిపట్ 3) నిజామాబాద్ 4) ఢిల్లీ
47. కొఠారీ కమిషన్ విద్యకు జీడీపీలో కనీసం ఎంత శాతం నిధులను కేటాయించాలని సూచించింది?
1) 4 శాతం 2) 5 శాతం 3) 6 శాతం 4) 7 శాతం
48. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేదపిల్లలకు ఎంత శాతం సీట్లను కేటాయించాలి?
1) 15 2) 20 3) 25 4) 30
49. ఇండియా లేబర్ రిపోర్ట్ ప్రకారం 2025 నాటికి ఎంత మంది యువత శ్రామిక శక్తి వర్గంలోకి రానున్నారు?
1) 200 మిలియన్లు 2) 250 మిలియన్లు
3) 300 మిలియన్ల 4) 350 మిలియన్లు
50. దేశ సమైక్యత దృష్టా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని సూచించిన కమిషన్?
1) కొఠారి కమిషన్ 2) స్వరణ్‌సింగ్ కమిటీ
3) రామ్మూర్తి కమిటీ 4) యశ్పాల్ కమిటీ
51. దేశంలో మొదటి ఆరోగ్య సర్వే అభివృద్ధి కమిటీ?
1) మోర్ కమిటీ 2) మొదలియార్ కమిటీ
3) చెల్లప్ప కమిటీ 4) స్టీఫెన్సన్ కమిటీ
52. 12వ ప్రణాళికలో సంతానోత్పత్తి రేటును ఎంతకు తగ్గించాలని నిర్ణయించారు?
1) 1.2 2) 1.8 3) 2.1 4) 3.1
53. జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2010 2) 2011 3) 2012 4) 2013
54. పిల్లలను వ్యాధుల నుంచి రక్షించడానికి కేంద్రం ప్రారంభించిన పథకం?
1) మిషన్ చిల్డ్రన్ 2) మిషన్ ఇంద్రధనస్సు
3) మిషన్ ఆరోగ్య 4) మిషన్ సుఖీభవ
55. సామాజిక పరివర్తనను వివరించే సిద్ధాంతం?
1) చక్రీయ సిద్ధాంతం 2) సమతుల్య సిద్ధాంతం
3) సంఘర్షణ సిద్ధాంతం 4) పైవన్నీ
56. సామాజిక పరివర్తనకు సంబంధించిన కారకం?
1) జైవిక 2) భౌగోళిక 3) ఆర్థిక 4) పైవన్నీ
57. సామాజిక పరివర్తనను ప్రభావితం చేసే అంశం?
1) ఆధునీకరణ 2) సంస్కక్షుతీకరణ
3) పాశ్చాత్యీకరణ 4) పైవన్నీ
58. హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1964 2) 1965 3) 1966 4) 1967
59. దేశంలో మొదటి భూసంస్కరణల కమిటీ?
1) వెంకవూటామయ్య కమిటీ 2) కుమారప్ప కమిటీ
3) స్వామినాథన్ కమిటీ 4) రాజ్ కమిటీ
60. సామాజిక వికాసానికి సంబంధించిన రాజ్యాంగ అంశాలు?
1) అంటరానితనం నిషేధం 2) వెట్టిచాకిరి నిషేధం
3) బాలకార్మిక వ్యవస్థ నిషేధం 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు