పచ్చబొట్లు వేయడంలో నిష్ణాతులైన గిరిజన తెగ?
1. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో వనదుర్గాదేవికి ప్రతి ఏడాది శివరాత్రి రోజున నిర్వహించే జాతర పేరేమిటి?
1) ఏడుపాయల జాతర 2) నాగోబా జాతర
3) వేలాల జాతర 4) ఇంద్ర జాతర
2. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్ర మండలం ఉట్నూరు గ్రామ సమీపాన కేస్లాపూర్లో జరిగే జాతర?
1) ఏడుపాయల జాతర 2) నాగోబా జాతర
3) వేలాల జాతర 4) కొరివి జాతర
3. గిరిజన తెగ అయిన ‘గోండుల’ ఆరాధ్య దైవం?
1) రాముడు 2) మైసమ్మ 3) ఎల్లమ్మ 4) నాగోబా
4. ఏ జిల్లాలో చెన్నూరులోని మహాశివరాత్రి రోజున ‘వేలాల జాతర’ జరుగుతుంది?
1) నల్లగొండ 2) వరంగల్
3) ఆదిలాబాద్ 4) ఖమ్మం
5. శివున్ని ‘సిద్ధలింగేశ్వరస్వామి’గా కొలుస్తూ పూజలు చేసే ‘సిద్దుల గుట్ట జాతర’ ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్ 2) ఆదిలాబాద్
3) మెదక్ 4) ఖమ్మం
6. వరంగల్ జిల్లాలో తాడ్వాయి మండలం ‘మేడారం’ అనే ప్రాంతంలో సమ్మక్క-సారలక్క జాతర ఎన్నేండ్లకోసారి జరుగుతుంది?
1) మూడేండ్లు 2) రెండేండ్లు
3) నాలుగేండ్లు 4) ఏడాది
7. వరంగల్ జిల్లాలో ఐనవోలులో ఏ దేవుడికి ప్రతి ఏడాది ఉత్సవాలు జరుగుతాయి?
1) సమ్మక్క-సారలక్క 2) మైలార్దేవుడు
3) వీరభవూదస్వామి 4) తుల్జాభవానీదేవి
8. ప్రతి ఏడాది వరంగల్‌లో శివరాత్రి రోజున వీరభవూదస్వామికి పూజలు చేసే జాతరను ఏమంటారు?
1) ఐనవోలు జాతర 2) కురవి జాతర
3) వేలాల జాతర 4) నాగోబా జాతర
9. ప్రతి ఏడాది పౌర్ణమి రోజున నల్లగొండ నరసింహస్వామి పేరు మీదుగా జాతర జరిగే జిల్లా?
1) వరంగల్ 2) కరీంనగర్
3) నిజామాబాద్ 4) మెదక్
10. ప్రతి ఏడాది మల్లన్న దేవుడి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) వరంగల్ 2) కరీంనగర్
3) నిజామాబాద్ 4) మెదక్
11. నల్లగొండ జిల్లా పెద్దమునగాల గ్రామంలో దసరా ఉత్సవాల సమయంలో తొమ్మిది రోజులు జరిగే జాతర?
1) వేలాల జాతర 2) తుల్జాభవాని జాతర
3) కురవి జాతర 4) నాగోబా జాతర
12. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ. మహబూబ్‌నగర్ జిల్లాలో ‘కురుమర్తి’ జాతర జరుగుతుంది.
బి. గద్వాల్ పట్టణంలో వైష్ణవ క్షేత్రమైన చెన్నకేశవ ఆలయంలో జాతర జరుగుతుంది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి
13. ‘మన్నెంకొండ జాతర’ ఏ జిల్లాలో జరుగుతుంది?
1) నల్లగొండ 2) మెదక్
3) కరీంనగర్ 4) మహబూబ్‌నగర్
14. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ. చేవెళ్లలో ప్రతి ఏడాది లక్ష్మీవేంక ఉత్సవాలు జరుగుతాయి.
బి. చేవెళ్ల ఉత్సవాలు వారం రోజులపాటు జరుగుతాయి.
సి. జోగినాథుని జాతర మెదక్ జిల్లాలో ప్రతి ఏడాది మార్చిలో జరుగుతుంది.
1) ఎ 2) బి 3) ఎ, సి 4) పైవన్నీ సరైనవి
15. ప్రతి ఏడాది ‘మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి’ వరకు కేతకి సంగమేశ్వరస్వామి’ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
1) మెదక్ 2) నిజామాబాద్
3) వరంగల్ 4) కరీంనగర్
16. ఏ తెగలో భర్త మరణిస్తే భర్త సోదరుడిని వివాహం చేసుకొనే ఆచారం కలదు?
1) తోటీలు 2) కోలామ్
3) నాయక్‌పోడ్ 4) అంద్లు
17. ఏ తెగకు చెందిన మహిళలు పచ్చబొట్లు వేయడంలో అందెవేసినవారు?
1) తోటీలు 2) కోలామ్
3) నాయక్‌పోడ్ 4) అంద్లు
18. మతపరంగా హిందువులై గోండు దేవుళ్లను పూజించే తెగ?
1) తోటీలు 2) కోలామ్
3) నాయక్‌పోడ్ 4) అంద్లు
19. కింది వాటిలో ‘ఏడుపాయల జాతర’కు సంబంధంలేని అంశం ఏది?
ఎ. ఈ జాతర ప్రతి ఏడాది శివరాత్రి రోజున జరుగుతుంది
బి. మంజీరా నది ఏడు పాయలుగా చీలిన చోట ఈ ఆలయం ఉంది
సి. గంగాదేవి కాలి అందె ఇచ్చిన కారణంగా ఆ నదికి ‘మంజీర’ అని పేరు వచ్చింది
డి. ఈ జాతర కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది
20. రెండో సింగమనాయకునికి గల బిరుదు?
1) సర్వజ్ఞ చక్రవర్తి 2) సర్వజ్ఞ చూడామణి
3) ప్రతిదండ భైరవ 4) పైవన్నీ
21. ‘బొడ్డెమ్మ పూజలు’ ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
1) ఏడు రోజులు 2) తొమ్మిది రోజులు
3) ఐదు రోజులు 4) మూడు రోజులు
22. కింది వాటిలో పిల్లలు నిర్వహించే పండుగ?
1) బొడ్డెమ్మ 2) బోనాలు
3) పీర్ల పండుగ 4) హరితాళిక
23. బోనాల పండుగలో బోనం అంటే?
1) బొడ్రాయి 2) గ్రామ దేవత
3) భోజనం 4) ఊరడి
24. కింది వాటిని జతపర్చండి.
ఎ. అలయ్ బలయ్ 1. దీపావళి
బి. నరకాసుర వధ 2. దసరా
సి. మహిష పండుగ 3. బతుకమ్మ
డి. తంగేడు పువ్వులు 4. సదర్
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
25. కింది వాటిలో వినాయక చవితి ముందు రోజు శివపార్వతులను పూజించే పండుగ?
1) కార్తీక పౌర్ణమి 2) హరితాళిక
3) పొలాల అమావాస్య 4) దీపావళి
26. తెలంగాణలో ముస్లింలు జరుపుకొనే పండుగ?
1) పీర్ల పండుగ 2) మిలాద్ నబీ
3) బక్రీద్ 4) పైవేమీకావు
27. కింది వాటిలో సరైనది?
1) బతుకమ్మ పండుగ శరన్నవరాత్రి రోజుల్లో జరుగుతుంది
2) స్త్రీలు బతుకమ్మను పేర్చి పూజిస్తారు
3) బతుకమ్మ పండుగలో గౌరీదేవిని పూజిస్తారు
4. పైవన్నీ సరైనవి
28. ‘బతుకమ్మ’ తొమ్మిదో రోజును ఏమంటారు?
1) ఎంగిలిపూల బతుకమ్మ 2) అట్ల బతుకమ్మ
3) సద్దుల బతుకమ్మ 4) పైవేమీకావు
29. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఎంగిలిపూల బతుకమ్మ 1. మూడో రోజు
బి. ముద్దపప్పు బతుకమ్మ 2. మొదటి రోజు
సి. అలిగిన బతుకమ్మ 3. ఎనిమిదో రోజు
డి. వెన్నెముద్దల బతుకమ్మ 4. ఆరో రోజు
1) ఎ-2, బి-1, సి-1, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-4, సి-3, డి-2
30. యాదవుల కులదైవమైన లింగమంతుల జాతర నల్లగొండ జిల్లాలో ఏ ప్రాంతంలో జరుగుతుంది?
1) దురాజ్‌పల్లి 2) దూపాడు
3) అన్నారం 4) చీదేళ్ల
31. ‘సాలార్జంగ్ హైదరాబాద్ ప్రధానిగా నియమితులయ్యే నాటికి రాజ్యం అన్ని రంగాల్లో ఇబ్బందుల్లో’ ఉంది అని ఎవరన్నారు?
1) సర్ అక్బర్ హైదరీ 2) కిర్క్ ప్యాట్రిక్
3) చందూలాల్ 4) ఎవరుకాదు
32. కిందివాటిలో తురాబ్ అలీఖాన్ అనే పేరు ఎవరికి ఉంది?
1) చందూలాల్ 2) కిర్క్ ప్యావూటిక్
3) నిజాం ఉల్‌ముల్క్ 4) సాలార్జంగ్
33. బ్రిటిష్ సైన్యానికి దక్షిణ భారతదేశంలో, హైదరాబాద్ రాజ్యంలో ఉన్న కేంద్రం ఏది?
1) నాంపల్లి (హైదరాబాద్)
2) బొల్లారం (సికింవూదాబాద్)
3) తిరుమలగిరి (రంగాడ్డి) 4) ఏవీకాదు
34. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1910 2) 1915 3) 1907 4) 1920
35. కాచిగూడ రైల్వే స్టేషన్‌ను ఎపుడు స్థాపించారు?
1) 1920 2) 1916 3 1911 4) 1907
36. ఉర్దూ భాషలో నామ్ అంటే?
1) తడితడిగా 2) పొడిపొడిగా
3) పైరెండూ 4) ఏవీకాదు
37. హైదరాబాద్ మొదటి తపాలాశాఖాధికారి ఎవరు?
1) షానవాజ్ జంగ్ 2) అలియావర్జంగ్
3) నవాబ్యార్జంగ్ 4) ఏవీకాదు
38. సాలార్జంగ్ నియమించిన నలుగురు మంత్రుల్లో న్యాయశాఖామంత్రి ఎవరు?
1) బషీర్ ఉద్దౌలా 2) ముఖరం ఉద్దౌలా
3) షంషేర్జంగ్ 4) సాహెబ్జంగ్
39. నిజాం కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
1) 1880
2) 1887
3) 1830
4) 1918
40. 1941లో ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన బ్యాంకు?
1) ఎస్బీహెచ్ 2) ఎస్బీఐ
3) హెచ్ఎస్బీ 4) ఏవీకాదు
41. జిలాబంది పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1855 2) 1866 3) 1865 4) 1870
42. కింది వాటిని జతపర్చండి.
ఎ. సింగరేణి కాలరీస్ 1. 1930
బి. వీఎస్టీ 2. 1921
సి. ప్రాగాటూల్స్ 3. 1934
డి. అజమ్జాహీమిల్స్ 4. 1943
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3
43. సాలార్జంగ్ ఏర్పాటు చేసిన మహాకామ-ఇ-కొత్వాలి అనేది దేనికి సంబంధించిన శాఖ?
1) విద్యాశాఖ 2) రెవెన్యూశాఖ
3) పోలీసుశాఖ 4) రైల్వేశాఖ
44. సింగభూపాలం రిజర్వాయర్ ఏ ప్రాంతంలో నిర్మించారు?
1) ఇల్లెందు 2) వైరా
3) గండిపేట 4) మహబూబాబాద్
45. మీర్ఆలం ట్యాంక్‌ను ఎప్పుడు నిర్మించారు?
1) 1815 2) 1810 3) 1933 4) 1927
46. రుద్రమదేవి కాలంలో చెలరేగిన తిరుగుబాటులను అణిచివేసి కాకతీయులచే కాకతీయరాయ రాజ్యస్థాపనాచార్య, రాయపితాంమహాంకా బిరుదులు పొందినవారు?
1) దామానాయుడు 2) ప్రసాదిత్యనాయుడు
3) సింగమ నాయకుడు 4) రుద్రమనాయకుడు
47. ఓరుగల్లును జయించి ‘ఆంధ్ర దేశాధీశ్వర’ బిరుదును పొందిన వారు?
1) దామానాయుడు 2) సింగమ నాయకుడు
3) అనపోతా నాయకుడు 4) రుద్రమనాయకుడు
48. రాచకొండ సమీపంలో ‘నాగసముద్రం’ అనే చెరువును నిర్మించిన మాదానాయకుని భార్య పేరు?
1) నాగాంబిక 2) మాయావతి
3) మల్లమ్మ 4) నాగిని
49. చమత్కార చంద్రికను రచించినదెవరు?
1) విశ్వేశ్వర కవి 2) ప్రోలయ కవి
3) కుమార సింగమనీడు 4) అప్పయామాత్యుడు
50. బమ్మెర పోతన ఎవరి కాలంలో నివసించారు?
1) సింగమనాయకుడు
2) మొదటి అనపోతానాయకుడు
3) సర్వజ్ఞ సింగమనాయకుడు
4) రెండో అనపోతనాయకుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు