సాగును మార్చిన హరిత విప్లవం

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నంత వేగంగా వనరులు పెరగవన్నది జగద్విదితం. ముఖ్యంగా జనాభా విస్ఫొటనం తర్వాత ప్రపంచంలో ఏ మూల చూసినా జనాభాకు సరిపడినన్ని ఆహార పదార్థాలు ఉత్పత్తికాకపోవటంతో అనేక దేశాల్లో కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులనే అనుసరించటంవల్ల ఉత్పత్తి పెరగలేదు. ఆ సమయంలోనే వ్యవసాయరంగంలో ఆధునిక పరిశోధనలు కొత్త విప్లవానికి దారితీశాయి. అదే హరిత విప్లవం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల, పురుగుమందులు, ఎరువులు అందుబాటులోకి రావటంతో ఉత్పత్తి అనూహ్యంగా పెరిగి కోట్ల మంది ఆకలి తీర్చటంలో హరితవిప్లవం కీలకపాత్ర పోషించింది.
దేశంలో వ్యవసాయం
-దేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు.
-ఖరీఫ్ పంట కాలం : జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగ య్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు, నూలు, సోయాబీన్, వేరుశనగ.
-రబీ పంటకాలం : అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు. గోధుమ, బార్లీ, మినుములు, పొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
-జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు. పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు మొదలైనవి.
పంటల రకాలు
-ఆహార పంటలు :వరి, గోధుమ, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పప్పుధాన్యాలు. ఇవి రెండు రకాలు.
1. ప్రధాన ధాన్యాలు : వరి, గోధుమ, మొక్కజొన్నలు.
2. తృణ ధాన్యాలు : జొన్నలు, సజ్జలు, రాగులు.
-వాణిజ్య పంటలు : పత్తి, పొగాకు, జనుము, చెరుకు, నూనె గింజలు.
-తోట పంటలు : కాఫీ, తేయాకు, కొబ్బరి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు.
-ఉద్యాన పంటలు : పండ్లు, పూలు, కూరగాయలు.
హరితవిప్లవం
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణను ప్రవేశపెట్టి, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి, సంకర జాతి వంగడాలను వినియోగించి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంద్ర వ్యవసాయం లేదా హరితవిప్లవం అంటారు. 1968లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో విలియం ఎస్ గ్లాండ్ అనే అమెరికా ఆర్థికవేత్త హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. భారత వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సంఘం చేసిన సూచనల ప్రకారం భారత ప్రభుత్వం 1960లో దేశంలోని ఏడు జిల్లాలను ఎంపిక చేసి వాటిలో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం (IADP : Intensive Agricultural District Programme) ప్రవేశపెట్టింది.
దీని లోపాలను సవరిస్తూ 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా (IAAP : Intensive Agricultural Area Programme) మారు్పు చేసి దేశంలోని 114 జిల్లాలకు విస్తరించారు. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో 1966 ఖరీఫ్ పంట కాలంలో ఒక నూతన వ్యవసాయక వ్యూహం ప్రవేశపెట్టారు. దీన్నే అధిక దిగుబడి వంగడాల (HYV) కార్యక్రమం అంటారు. హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు.
-హరితవిప్లవాన్ని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావంతో గోధుమల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది.
-నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు. 1970లో బోర్లాగ్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్లమందిని ఆకలి బాధల నుంచి, పస్తుల నుంచి రక్షించినవాడు. బోర్లాగ్ 1914 మార్చి 25న అమెరికాలోని అయోవాలో ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు.
-మన్‌కొంబు సాంబశివన్ స్వామినాథన్ (1925 ఆగష్టు 7) భారతీయ జన్యుశాస్త్రవేత్త, అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాం చిన హరిత విప్లవం నిర్వాహకుడు. ఈ కార్యక్రమం కింద గోధుమ, బియ్యం అధిక దిగుబడి కోసం వివిధ వంగడాలను పేద రైతులతో నాటింపజేశారు.
దేశంలో అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను పరిచయం చేసినందుకు, ఆయా వంగడాల అభివృద్ధిలో అతను సాధించిన విజయవంతమైన నాయకత్వానికి ప్రతిగా అతన్ని భారతదేశ హరి త విప్లవ పితామహుడిగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఆకలిని, పేదరికాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో అతను ఎంఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్‌కు ఆయనే వ్యవస్థాపకుడు, చైర్మన్.
1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌కి డైరెక్టర్ జనరల్‌గా, 1979 నుంచి 1980 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆయన అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (1982-88) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. 1988లో అంతర్జాతీయ ప్రకృ తి, సహజ వనరుల వినియోగ సంఘం అధ్యక్షుడయ్యాడు. 1999లో టైం పత్రిక 20వ శతాబ్దంలో ఆసియాలోనే అత్యంత ప్రభావవంతమైన తొలి 20 మంది జాబితాలో ఆయన్ను పేర్కొంది.
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు