నిజాం రాజ్యాన్ని సంస్థానం అని ఎందుకు అంటారు?

1. తెలంగాణ పదం దేనికి సంబంధించింది?
1) ప్రాంతం 2) భాష 3) జాతి 4) తెగ
2. తెలంగాణ భావన ఏ కాలం నాటిది?
1) సింధూ నాగరికత 2) ఆర్య 3) వేదకాలం 4) క్రీ.పూ 6వ శతాబ్దం
3. సింధూ ప్రాంత ద్రావిడియన్స్ను ఓడించి ఆర్యులు తమదైన శైలిలో 16 చిన్న గ్రామీణ ఆధారిత రాజ్యాలను ఏర్పర్చుకున్నారు. వాటిని షోడశ మహాజనపదాలు అంటారు. ఉత్తర భారత్‌లో 15 రాజ్యాలు నెలకొల్పగా, దక్షిణాన ఒకే ఒక్క రాజ్యాన్ని స్థాపించారు. దాని పేరు అస్మక, దీని రాజధాని ఏది?
1) పైఠాన్ 2) పూతన్ 3) ధాన్యకటకం 4) కోటిలింగాల
4. కింది వాటిలో సరికానిది ఏది?
1) తెలంగ/ తిలింగ – అమీర్‌ఖుస్రూ 2) తెలంగాణ – అబుల్‌ఫజల్
3) తెలుగు ఆణా – గుల్ బదన్ బేగం 4) త్రిలింగ – విద్యానాథుడు
5. తెలంగాణ ఆధునిక చరిత్ర శాతవాహనులతో మొదలైంది. మౌర్యులకు దీటుగా రాజ్యం ఏర్పర్చుకొని 450 ఏండ్లు, 30 మంది రాజులు అప్రతిహతంగా రాజ్యమేలారు. అనంతరం పల్లవులు (క్రీ.శ. 300), చాళుక్యులు (క్రీ.శ. 620), చోళులు (క్రీ.శ. 850) ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కానీ క్రీ.శ 1000లో స్థాపించిన కాకతీయ సామ్రాజ్య చక్రవర్తులు తెలంగాణ నిర్మాతలు. ఈ రాజ్యాన్ని అంతం చేసిందెవరు?
1) ఖిల్జీ 2) తుగ్లక్ 3) మాలిక్కాపర్ 4) జునాఖాన్
6. బహుమని రాజ్యం విచ్చిన్నమై ఏఏ రాజ్యాలు ఏర్పడ్డాయి?
1) ఔరంగబాద్, బీదర్, బీజాపూర్, గోల్కొండ
2) పర్బణి, ఉద్గీర్, ఖాందేశ్, ఉస్మానాబాద్
3) బీదర్, అహ్మద్‌నగర్, బీరార్, గోల్కొండ, బీజాపూర్
4) ఔరంగబాద్, నాందేడ్, బీరార్, బీదర్, గోల్కొండ
7. గోల్కొండ రాజ్యంలోనే తెలంగాణకు భూమి పూజ జరిగింది. హైదరాబాద్ నిర్మాణం, కోట, భాగమతి ప్రేమాయణం, చార్మినార్, మూసీనది, రామదాసు, భద్రాచల రాముడు ఇలాంటి ఎన్నో చారిత్రక ఆనవాళ్లను మిగిల్చిన ఈ రాజ్యాన్ని, రక్తపుటేరుల మధ్య బందీని చేసి వశపర్చుకున్నది ఎవరు?
1) మాలిక్ అంబర్ 2) అబ్దుల్ గవాన్
3) బైరాంఖాన్ 4) ఔరంగజేబు
8. మొగల్ సేనాని అయిన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ తెలంగాణ చరిత్రకు ఎలా పరిచయమయ్యారు?
1) మొదటి మరాఠా యుద్ధం 2) రెండో కర్ణాటక యుద్ధ్దం
3) పాల్ఖేడ్ యుద్ధ్దం 4) షఖ్ఖర్ఖేడా యుద్ధం
9. చౌత్, సర్దేశ్ముఖ్ అనే పన్నులు నిజాం-మరాఠాల మధ్య 3 యుద్ధాలకు కారణమయ్యాయి. రెండో యుద్ధంలో భారతదేశ చరిత్రను మలుపు తిప్పింది ఎలా అంటే?
1) మరాఠాల విజృంభణ 2) నిజాం విజృంభణ
3) మరాఠాల వల్ల ఢిల్లీ – నిజాం వల్ల ఆర్కాటు తగులబడ్డాయి
4) రాబర్ట్ైక్లెవ్ అనే యుద్ధ్ద మాంత్రికున్ని పరిచయం చేసింది
10. నిజాం రాజ్యాన్ని సంస్థానం అని ఎందుకు అంటారు?
1) రాజరికం 2) స్వతంత్రపాలన
3) సామంతపాలన 4) స్వతంత్ర + సామంత లక్షణాలు
11. ఫాదర్ ఆఫ్ కర్ణాటకం?
1) జుల్ఫికర్ 2) సాదతుల్లా 3) దోస్త్ అలీ 4) అన్వరుద్దీన్
12. అన్వరుద్దీన్‌ను హత్య చేసింది ఎవరు?
1) ఆంగ్లేయులు 2) ఫ్రెంచివారు
3) ఆంగ్లేయులు+ మరాఠా + తంజావూర్ రాణి
4) ఫ్రెంచి+ చందాసాహెబ్+ ముజఫర్‌జంగ్
13. సర్కారు జిల్లాలు/ ఆంధ్రను మొట్టమొదటి సారిగా బహుమతి ఇచ్చిందెవరు?
1) నాజర్ 2) ముజఫర్ 3) సలాబత్ 4) నిజాం అలీ
14. అరణి- కావేరి పాక అంటే ఏమిటి?
1) కశ్మీర్ కంబళ్లు 2) డూప్లే కట్టిన ధ్వజస్థంభాలు
3) దేవాలయాలు 4) యుద్ధాలు
15. కింది వాటిని జతపర్చండి.
1) నాజర్ a) హిమ్మత్ఖాన్
2) ముజఫర్ b) బీదర్
3) సలాబత్ c) ఔరంగబాద్
4) బసాలత్ d) లాటౌషే
5) అలీజా e) గుంటూరు
1) 1-b, 2-c, 3-e, 4-a, 5-d
2) 1-c, 2-b, 3-a, 4-d, 5-e
3) 1-d, 2-a, 3-b, 4-e, 5-c
4) 1-e, 2-d, 3-c, 4-a, 5-b
5) 1-a, 2-c, 3-b, 4-e, 5-d
16. బొబ్బిలి యుద్ధం + చందుర్తి యుద్ధాలు ఎందుకు జరిగాయి?
1) జాఫర్, మరాఠా సేనలు విజయనగరం కోసం ఆక్రమణ
2) ఫ్రెంచి, విజయనగరం సేనలు మచిలిపట్నంపై ఆధిపత్యం కోసం
3) బొబ్బిలి రంగారావును చంపినందుకు, ఆయన బావమరిది
తాండ్రపాపారాయుడు ప్రతీకారం తీర్చుకొనుట
4) ఫ్రెంచి, బ్రిటిషువారు సర్కార్ల కోసం కొట్లాట
17.నిజాం అలీ కాలంతో సంబంధం లేని అంశం?
1) సర్కార్ల అమ్ముకోవడం
2) సైన్య సహకార ఒప్పందంపై సంతకాలు, ఖర్చుల కింద రాయలసీమ ఇచ్చేయడం
3) రేమాండ్ ఫిరంగి దళం + రెసిడెన్సి
4) టిప్పు సుల్తాన్ + నానా ఫడ్నవీస్‌తో కలిసి త్రైపాక్షిక ఒప్పందం
సమాధానాలు
1-3, 2-1, 3-2, 4-3, 5-4, 6-3, 7-4, 8-4, 9-3, 10-2, 11-1, 12-4, 13-1, 14-4, 15-3, 16-4, 17-4
RELATED ARTICLES
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు