12వ ప్రణాళిక వ్యయం ఎంత?

11వ ప్రణాళిక లక్ష్యాలు
మహిళలు- పిల్లలు
– స్త్రీ, పురుష నిష్పత్తిని 2011-12 నాటికి 935కి, 2016-17 నాటికి 950 కి పెంచడం
– ప్రభుత్వ పథకాల్లో 33 శాతం మహిళలు, బాలికలు లబ్ధి పొందేటట్లు చూడాలి .
పర్యావరణం
– ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణం కంటే అదనంగా 5 శాతం పెంచాలి.
– 2011-12 నాటికి అన్ని నది జలాల్లో కాలుష్యాన్ని తొలగించాలి. పట్టణ ప్రాంతాల్లో వృథానీటిని సక్రమంగా వినియోగించాలి.
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన
– ఈ పథకాన్ని 2008, ఏప్రిల్ 1 న ప్రారంభించారు. 25 రాష్ర్టాల్లోని 36 మిలియన్ల మంది ఫిబ్రవరి 2014 నాటికి నమోదు చేసుకున్నారు. పేదరికరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలు ఏడాదిలో ఒకసారి, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో చేరి నగదు లేకుండానే రూ. 30,000 వైద్య సేవలను పొందవచ్చు.
ఆమ్ ఆద్మీ బీమా యోజన
-గ్రామీణ ప్రాంతంలో భూమి లేని కుటుంబాలకు సాంఘిక భద్రత కల్పించేందుకు ఆమ్ఆద్మీ బీమా యోజనను 2007, అక్టోబర్ 2న ప్రారంభించారు. కుటుంబ యజమాని ప్రతి ఏడాది రూ. 200 చెల్లిస్తే అంతే మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 59 ఏండ్ల వయస్సు ఉండాలి. సహజ మరణానికి రూ. 30,000 ప్రమాదం వలన శ్వాశత అంగ వైకల్యం సంభవించినా లేదా రెండు కళ్లు లేదా రెండు కాళ్లు కోల్పోయినా రూ. 75,000, పాక్షిక అంగవైకల్యం (ఒక చెయ్యి లేదా కన్ను) కలిగితే రూ. 37,500లు చెల్లిస్తారు.
పదకొండో ప్రణాళిక సాధించిన ఫలితాలు
– 11వ పంచవర్ష ప్రణాళికలో స్థూల జాతీయోత్పత్తి 8 శాతం సాధిస్తే 10వ ప్రణాళికలో 7.6 శాతం మాత్రమే సాధించింది.
– 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగంలో సాలుసరి వృద్ధిరేటు, 3.2 సాధించారు. 10 వ ప్రణాళికలో 2.4 శాతం మాత్రమే ఉంది.
– సామాజిక వస్తుగత సేవల వృద్దిరేటు 9.4 శాతంగా ఉంది
– పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 7.7 శాతం, గనులు, ఖనిజాల వృద్ధిరేటు 4.7 శాతం సాధించడం.
– విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటిసరఫరా వృద్ధిరేటు 6.4 శాతం నమోదైంది.
– నిర్మాణం రంగం వృద్ధ్దిరేటు 7.8 శాతం నమోదైంది. బీమా, రియల్ ఎస్టేట్, వర్తక వాణిజ్య సేవల వృద్ధిరేటు 9.4శాతంగా నిర్ణయించారు.
– 11వ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 6.8 శాతం పెరిగాయి.
12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017)
– 12వ పంచవర్ష ప్రణాళిక మరింత సత్వర, సుస్థిర, సమ్మిళిత వృద్ధి లక్ష్యాలతో ప్రారంభమైంది. ఈ ప్రణాళికలో వ్యవసాయంతోపాటు విద్య, ఆరోగ్యం, మహిళలు, పిల్లలు తదితర కీలక సామాజిక రంగాలపై దృష్టి పెట్టి సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రణాళిక లో తొలిసారిగా ఇంటర్నెట్ను వినియోగించారు.
ప్రధాని – మన్మోహన్ సింగ్
ప్రణాళిక సంఘ మాంటెక్ సింగ్
ఉపాధ్యక్షులు అహ్లువాలియా
లక్ష్యం మరింత సత్వర, సుస్థిర, సమ్మిళిత వృధ్ధ్ది
సాధించాల్సిన వృద్ధిరేటు 9 శాతం
మొత్తం పెట్టుబడి 80,54,124
12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు
– 12వ పంచవర్ష ప్రణాళిక వృద్ధిరేటు 9 శాతం సాధించాలని నిర్ణయించారు
– సామాజిక, వ్యక్తిగత సేవల వృద్ధిరేటు 8 శాతం నిర్దేశించారు
– వ్యవసాయ రంగంలో సగటున 3.2 శాతం వృద్ధిరేటు సాధించాలి. ఆహారధాన్యాల్లో 1.5 శాతం వృద్ధిరేటును సాధించాలి.
– స్థూలసాగు భూమిని 90 మిలియన్ల హెక్టార్ల నుంచి 103 మిలియన్ల హెక్టార్లకు తీసుకొని రావాలి.
– పారిశ్రామిక రంగంలో 11.12 శాతం వృద్ధిరేటును సాధించి ఏటా రెండు మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలి.
– పేదరికాన్ని 10 శాతానికి తగ్గించాలి
– 2017 నాటికి సెకండరీ విద్యను విశ్వజనీనం చేయడంతో పాటు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి శాతాన్ని 20 శాతాన్ని నమోదు చేయాలి.
– 2017 నాటికి వయోజనుల్లో 100 శాతం అక్షరాస్యతను సాధించడం.
– మూలధనం ఖాతాలో 5 శాతం మిగులు ఉండాలని నిర్దేశించారు.
– ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతమున్న 1.3 నుంచి 2 శాతానికి పెంచాలి. వీలైతే ప్రణాళికాంతానికి 2.5 శాతం పెంచాలని నిర్ణయించారు.
– మొత్తం ప్రత్యుత్పత్తి రేటును 2.9 నుంచి 2.1 కు తగ్గించాలి.
– విద్యుత్ నష్టాలను 20 శాతానికి తగ్గించాలి.
– గ్రామ టెలిసాంద్రతను 70 శాతానికి పెంచాలి.
– శక్తి రంగంలో 9 శాతం వృద్ధ్దిరేటును సాధించడానికి వాణిజ్యపరమైన ఇంధన వృద్ధ్ది రేటు సాలుసరి 7 శాతం అవసరం ఉంటుందని అంచనా వేశారు.
– నిర్మాణరంగం లో వృద్ధ్దిరేటు 10 శాతం, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, వర్తక వాణిజ్య సేవల వృద్ధిరేటు 10 శాతంగా నిర్ణయించారు.
నోట్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఎన్డీయే అధికారంలోకి రావటంతో పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి 2015, జనవరి 1 నుంచి నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. నీతి ఆయోగ్ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియా ఉన్నారు.
మాదిరి ప్రశ్నలు
1. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు-పబ్లిక్ రంగాల సహ
జీవనాన్ని ఏమని పిలుస్తారు? (4)
1) నియంత్రణ ఆర్థిక వ్యవస్థ
2) పెట్టుబడిదారీ విధానం
3) మధ్యంతర రంగం 4) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
2. మొదటిసారిగా భారతదేశానికి ఆర్థిక ప్రణాళికల అవసరాన్ని పేర్కొన్న వ్యక్తి? (1)
1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
2) శ్రీమన్నారాయణ్ అగర్వాల్
3) పీసీ అలెగ్జాండర్ 4) అబ్దుల్ కలాం
3. భారతదేశ ప్రణాళికయుత వ్యవస్థ (Planned Economy For India) గ్రంథ రచయిత? (2)
1) జవహర్లాల్ నెహ్రూ 2) ఎమ్ విశ్వేశ్వరయ్య
3) పీసీ అలెగ్జాండర్ 4) మన్మోహన్ సింగ్
4. ప్రణాళిక విరామం ఉన్న కాలం? (1)
1) 1966-1969 2) 1989-1992
3) 1956-1959 4) 1, 2, 3
5. ప్రణాళికా సంఘం దేనిద్వారా స్థాపించబడింది? (3)
1) రాజ్యాంగం 2) పార్లమెంటు చట్టం
3) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు
4) సుప్రీంకోర్టు ఉత్తర్వు
6. దేశంలో అమలైన పంచవర్ష ప్రణాళికల్లో దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక స్వావలంబన సాధించడం అనే రెండు లక్ష్యాలను కలిగి ఉన్న ప్రణాళిక ఏది? (4)
1) రెండో ప్రణాళిక 2) నాలుగో ప్రణాళిక
3) మూడో ప్రణాళిక 4) ఐదో ప్రణాళిక
7. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను చివరకు ఆమోదించేది? (3)
1) కేంద్ర మంత్రిమండలి 2) ప్రణాళికా సంఘం
3) జాతీయాభివృద్ధి మండలి
4) నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్
8. రాష్ట్ర ప్రణాళికలకు ఆమోదం పొందవలసింది? (3)
1) కేంద్ర మంత్రిమండలి 2) ప్లానింగ్ కమిషన్
3) అభివృద్ధి సమీక్షా మండలి
4) మానవ వనరుల కమిటీ
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు