ఉత్పత్తి,ఉద్యోగితల్లో ముందడుగు…
చాప్టర్ 2
స్థూల అర్థశాస్త్ర భావనలు, వృద్ధి సూచికలు
-నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ మాటలతో అభివృద్ధికి నిర్వచనం వివరిస్తూ (ప్రజల సంతోషించేటట్టు అసలైన స్వేచ్ఛను పెంచడమే అభివృద్ధి అని అమర్త్యసేన్ అన్నారు) తెలంగాణ ఆర్థిక వృద్ధిని ఆవిష్కరించింది సర్వే.
తెలంగాణ వివరాలు
-విస్తీర్ణం : 1,12,077 చ.కి.మీ
-జనాభా : 3.5 కోట్లు (2011)
-భారతదేశంలో 12వ స్థానం
-గ్రామాల్లో : 61.12 శాతం నివసిస్తున్నారు. 38. 88 శాతం పట్టణాల్లో
-లింగ నిష్పత్తి : 988/1000 పురుషులు
-38.12 శాతం పట్టణ జనాభా పెరిగింది. 30 శాతం మంది హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి
-వృద్ధి గురించి సర్వే : పేదరిక నిర్మూలనకు ముఖ్య సాధనం
-వృద్ధి వల్ల ఉపాధి పెరిగి తద్వారా కొనుగోలు శక్తి పెరిగి, పేదరికాన్ని తగ్గించి, విద్య, ఆరోగ్యం పొందడానికి దోహదం చేస్తుందన్న నీతిఅయోగ్ వైస్‌చైర్మన్ మాటలను సర్వేలో ఉటంకించారు.
-వృద్ధి.. మానవ, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
జిల్లాలవారీగా తలసరి ఆదాయ వివరాలు
-1.29 లక్షలతో రాష్ట్ర తలసరి ఆదాయం ఉంటే హైదరాబాద్ 2.94 లక్షలు, రంగారెడ్డి 1.82 లక్షలతో లక్షకుపైగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. ఇక రూ. 76,921లతో ఆదిలాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ఉద్యోగిత
-కేంద్ర లేబర్ బ్యూరో ప్రకారం 2013-14 లెక్కల ప్రకారం ప్రాథమిక రంగంలో 55.6 శాతం ఆధారపడ్డారని, 17.8 శాతం మంది ద్వితీయరంగంలో, 26.6 శాతం మంది తృతీయరంగంపై ఆధారపడ్డారని పేర్కొంది.
-నిరుద్యోగిత : నగరాల్లో అత్యధికం
-15-59 వయస్సు మధ్యలో వారిని తీసుకుంటే తెలంగాణలో 2.7 శాతం నిరుద్యోగిత ఉందని, అది గ్రామీణంలో 1.1 శాతంగా, పట్టణప్రాంతంలో 6.6 శాతం, యువ (15-29) నిరుద్యోగిత 7.7 శాతమని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా నిరుద్యోగిత ఉందని సర్వే తెలిపింది.
ద్రవ్యోల్బణం
-ద్రవ్యోల్బణాన్ని CPI (IW), WPIలో కొలుస్తారు. తెలంగాణలో 2011-12లో 5.2 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది జాతీయస్థాయిలో ఉన్న 8.4 శాతం కంటే తక్కువ. ఇక 2012-13లో 10.2 శాతం (జాతీయస్థాయిలో 10.4 శాతం), 2013-14లో 9.7 శాతం (జాతీయస్థాయిలో 10.2 శాతం), 2014-15లో 6.3 శాతం (జాతీయస్థాయిలో 6.4 శాతం) నమోదు చేస్తూ 2015-16లో 4.3 శాతాన్ని నమోదు చేసింది.
14వ ఆర్థిక సంఘం – తెలంగాణ
-వైవీ రెడ్డి నేతృత్వంలో రాజ్యాంగంలోని అధికరణ 280 ప్రకారం ఏర్పడిన 14వ ఆర్థిక సంఘం సూచనలు 2015 నుంచి 2020 వరకు అమల్లో ఉంటాయి.
-13వ ఆర్థిక సంఘం ఇచ్చిన 32 శాతం వాటా నుంచి 42 శాతానికి పెంచుతూ 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంతో మొత్తం పన్నుల వాటాలో తెలంగాణ 2.44 శాతం వాటాను పొంది 16వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా కేంద్రప్రభుత్వ పథకాలను వీలైనంతమేర కుదించాలని బీకే చతుర్వేది కమిటీ సూచనలను పాలనలోకి తీసుకురావాలని వాటన్నింటిని 30కి కుదించాలని సర్వే తెలిపింది.
గుర్తుంచుకోవాల్సినవి
1) తెలంగాణ జనాభా, భౌగోళిక, విస్తీర్ణం, లింగ సంబంధ విషయాలు
2) GSDP గణాంకాలు, వివిధ రంగాల నుంచి GSDP లో ఉన్న వాటా
3) జిల్లాలవారి తలసరి ఆదాయం
4) నిరుద్యోగిత, ద్రవ్యోల్బణ వివరాలు
5) 14వ ఆర్థిక సంఘం – తెలంగాణ వివరాలు
-వృద్ధి వివరాలు : వృద్ధిని స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద కూడా లెక్కిస్తారు.
-స్థిర ధరల వద్ద వృద్ధి అంటే ఆధార సంవత్సరం వద్ద వృద్ధి.
-ప్రస్తుతం ఆధార సంవత్సరం – (2011-12)
-2004-05 నుంచి పోయిన ఏడాది మార్చారు.
ప్రస్తుత ధరల వద్ద వృద్ధి అంటే
-నికర జాతీయ ఉత్పత్తి (మార్కెట్ ధరల వద్ద) = GDP+పరోక్ష పన్నులు – సబ్సిడీలు at Factor cost
-2014 వరకు వృద్ధిని ఉత్పత్తి కారకాల వద్ద లెక్కించేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ ధరల వద్ద లెక్కిస్తున్నారు.
-తెలంగాణ వృద్ధి : 2015-16
-2015-16 – 11.7 శాతం (ప్రస్తుత ధరల వద్ద) – 9.2 శాతం (స్థిర ధరల వద్ద)
-మొత్తం GSDPని 5.83 లక్షల కోట్లు (ప్రస్తుత ధరల వద్ద)
-4.69 లక్షల కోట్లు (స్థిర ధరల వద్ద) అని చెబుతూ
-మొత్తం భారతదేశంలో తెలంగాణ వాటా 4.1శాతంగా పేర్కొంది.
-దీనిలో 11 శాతం వృద్ధి సేవల రంగంలో
-8.6 శాతం వృద్ధి పారిశ్రామిక రంగంలో
-1.9 శాతం వృద్ధి వ్యసాయ రంగంలో తెలంగాణ సాధించిందని పేర్కొంది.
-తెలంగాణ GSDPలో వివిధ రంగాల వాటా
-తెలంగాణ మొత్తం GSDPలో వ్యవసాయం రంగం నుంచి – 17 శాతం
-పరిశ్రమల నుంచి – 22.5 శాతం
-తృతీయరంగం నుంచి – 60.5 శాతం
రెండవ భాగం
చాప్టర్-III
వ్యవసాయం అనుబంధ రంగాలు
-శాంతి కావాలంటే న్యాయాన్ని పెంపొందించాలని, న్యాయం కావాలంటే ఎక్కువ ఆహార ఉత్పత్తి కోసం పొలాలను పెంచాలని హరిత విప్లవ పిత నార్మన్ బోర్లాగ్ అన్న మాటలివి.
-2014-15లో 26.13 లక్షల హెక్టార్లలో ఉన్న వ్యవసాయాన్ని 2015-16కు వచ్చేసరికి 20.46 లక్షల హెక్టార్లకు కుదించాలని పేర్కొంది.
వ్యవసాయం – ఉత్పత్తి, విస్తీర్ణం
-నెట్ క్రాప్డ్ ఏరియా (NCA) 43.8 లక్షల ఎకరాలు
-గ్రాస్ క్రాప్డ్ ఏరియా (GCA) 53.2 లక్షల ఎకరాలు
-58 శాతం ఆహార పంటలు, 42 శాతం ఆహారేతర పంటలు పండిస్తున్నారు. మొత్తం ఆహారేతర పంటల్లో పత్తి (32 శాతం) అత్యధికంగా పండిస్తున్నారని పేర్కొంది.
జిల్లాలవారీగా
-GCAలో 9.78 లక్షల హెక్టార్లలో మహబూబ్‌నగర్ ఎక్కువ భూమిని సాగు చేస్తుందని, 7.3 లక్షల హెక్టార్లతో నల్లగొండ, 7 లక్షల హెక్టార్లతో కరీంనగర్‌లు ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి.
-1980లో 1/3 వంతు ఆహార పంటలను పండించిన తెలంగాణలో 2015 నాటికి మెజారిటీ ప్రాంతాల్లో ఆహారేతర పంటలను పండిస్తున్నారని సర్వే పేర్కొంది.
భూ వినియోగ వివరాలు
-మొత్తం 112.08 లక్షల హెక్టార్లలో 39 శాతం వ్యవసాయానికి, 23 శాతం అడవులకు, 8 శాతం వ్యవసాయేతర రంగాలకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
వ్యవసాయ వాతావరణ ప్రాంతాలు
-తెలంగాణను 4 వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు. అవి
1) ఉత్తర తెలంగాణ
-ప్రాంతాలు : ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
-విస్తీర్ణం : 35.5 చదరపు కిలోమీటర్లు.
-వర్షపాతం : 900 మి.మీ. – 1150 మి.మీ.
2) మధ్య తెలంగాణ
-ప్రాంతాలు : మెదక్, వరంగల్, ఖమ్మం.
-విస్తీర్ణం : 30.6 చదరపు కి.మీ.
-వర్షపాతం : 800 మి.మీ.-1150 మి.మీ.
3) దక్షిణ తెలంగాణ
-ప్రాంతాలు : రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ
-విస్తీర్ణం : 39.3 చదరపు కి.మీ.
-వర్షపాతం : 600 మి.మీ. – 780 మి.మీ. (అతి తక్కువ వర్షపాతం)
గిరిజన ప్రాంతాలు
-ప్రాంతాలు : ఆదిలాబాద్, ఖమ్మం, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు.
-విస్తీర్ణం : 4.66 చదరపు కి.మీ.
-ఎక్కువగా గిరిజనులు కనిపిస్తారు.
వర్షపాతం
-తెలంగాణలో సాధారణ వర్షపాతం 905 మి.మీ. (జాతీయస్థాయిలో 1083 మి.మీ.)గా ఉందని పేర్కొంటు, 80 శాతం వర్షపాతం కేవలం దక్షిణ-తూర్పు రుతుపవనాల నుంచి వస్తుందని పేర్కొంది.
-2014-15లో SW మాన్సూన్ల నుంచి కేవలం 494.7 మి.మీ. (Actualగా 713.6 మి.మీ.) వర్షపాతం అంటే 31 శాతం తగ్గుదల నమోదయ్యిందని తెలిపింది.
-ఒక్క మహబూబ్‌నగర్‌లో తప్ప అన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు ఉందని పేర్కొంది.
-2015-16లో కూడా కేవలం 611.2.మి.మీ. వర్షపాతమే అంటే 14 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది.
-తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల వల్ల కేంద్రం దాదాపు 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని సర్వే పేర్కొంది.
భూ వివరాలు
-మొత్తం తెలంగాణలో సగటుగా 1.12 (2.8) హెక్టార్లు అని ఇది జాతీయస్థాయి సగటు (1.16 హెక్టార్లు) కంటే తక్కువని పేర్కొంది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లలో ఇది ఒక హెక్టారు కంటే తక్కువని పేర్కొంది.
-24 శాతం మంది చిన్న, 14 శాతం మధ్య, 62 శాతం మార్జినల్ రైతులు భూమిని కలిగి ఉన్నారని తెలిపింది.
-30 శాతం చిన్న, 25 శాతం మార్జినల్, 41 శాతం మధ్య, 4 శాతం పెద్ద రైతులు భూమిని ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
విత్తన భాండాగారంగా తెలంగాణ
-వరి, హైబ్రిడ్ వరి, మొక్కజొన్న, పత్తి, బెంగాల్ గ్రామ్‌తో కలిపి దాదాపు 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది.
-ప్రస్తుతం 90-95 శాతం హైబ్రిడ్ విత్తనాలను దేశం మొత్తంలో వరంగల్, కరీంనగర్ నుంచే సేకరిస్తున్నారని పేర్కొంది.
-దేశంలో 100 శాతం జొన్న, సజ్జ హైబ్రిడ్ విత్తనాలు నిజామాబాద్ నుంచే సరఫరా అవుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు