భారత ఆర్థిక వ్యవస్థ- నిరుద్యోగం రకాలు
నిరుద్యోగం (Un employment)
– పనిచేయగల శక్తి , ఆసక్తి, అర్హత ఉండి పని లభించని స్థితిని ‘నిరుద్యోగం’ అంటారు.
-ప్రస్తుతం మార్కెట్లో/ఆర్థిక వ్యవస్థలో అమల్లో ఉన్న వేతనం దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పని లభించని స్థితిని ‘నిరుద్యోగం’ అంటారు.
నిరుద్యోగం-రకాలు
(Types of Un employment)
– పనిచేయగల శక్తి , ఆసక్తి, అర్హత ఉండి పని లభించని స్థితిని ‘నిరుద్యోగం’ అంటారు.
– ప్రస్తుతం మార్కెట్లో/ఆర్థిక వ్యవస్థలో అమల్లో ఉన్న వేతనం దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పని లభించని స్థితిని ‘నిరుద్యోగం’ అంటారు.
– నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగిత వేర్వేరుగా ఉంటుంది.
– అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగిత-
వ్యవస్థాపుర్వక నిరుద్యోగిత
(Institutional Un employment)
– పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకక పోవడం వల్ల/ పెరుగుతున్న జనాభాకి ఉపాధి కల్పించకపోవడం వల్ల/ శ్రామిక జనాభాలో గమనశీలత లేకపోవడం వల్ల/ శ్రామిక సప్లె, శ్రామిక డిమాండ్ కన్నా ఎక్కువగా ఉండటం వల్ల/ ఉత్పత్తికి తగిన మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం లేనందున/ ఆర్థికాభివృద్ధి రేటు మందకొడిగా ఉండటం వల్ల ఏర్పడే నిరుద్యోగితను ‘వ్యవస్థిపూరక నిరుద్యోగిత’ అంటారు.
-భారతదేశంలోని నిరుద్యోగిత దీనికి సంబంధించింది
-వ్యవస్థాపూర్వక నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగిత
(Open Un employment )
– పరిమాణాత్మక నిరుద్యోగిత
(Quantitative Un employment )
-మౌలిక నిరుద్యోగిత
(Infrastructure Un employment )
-దీర్ఘకాలిక నిరుద్యోగిత
(Choronic Un employment)
-శాశ్వత నిరుద్యోగిత
(Eternal Un employment )
– ప్రత్యక్ష నిరుద్యోగిత
( Direct Un employment)
– సాధారణ స్థితి నిరుద్యోగిత
(Usual Un employment )
-నిర్మితి/నిర్మాణాత్మక నిరుద్యోగిత
(Structural Un employment) అని అంటారు.
-జోన్ రాబిన్ సన్ ‘మార్కపియన్ నిరుద్యోగిత’ అని పేర్కొన్నారు.
అల్ప ఉద్యోగిత (Under Employment )
– అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులను గరిష్టంగా ఉపయోగించుకోలేని స్థితిని/కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వేతనం గల పని కలిగి ఉండటాన్ని/ తమ శక్తి సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోలేని స్థితిని/ ఒక వ్యక్తి అర్హత కంటే తగ్గిన తక్కువ ఉపాధి లభించడాన్ని ‘అల్ప ఉద్యోగిత’ అంటారు.
-అల్ప ఉద్యోగితను అంతర్గత నిరుద్యోగిత ( Internal Unemployment), ‘అగంతుక నిరుద్యోగిత’ అంటారు. కనపడని నిరుద్యోగిత అని, ‘మరుగున పడిన నిరుద్యోగిత’ అని గుప్త నిరుద్యోగిత అని కూడా పిలుస్తారు.-
ప్రచ్ఛన్న నిరుద్యోగిత ( Disguised Employment)
-ఏదైనా ఉత్పత్తి ప్రక్రియలో వాస్తవంగా కావాల్సిన శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ‘ప్రచ్ఛన్న నిరుద్యోగిత’ అంటారు.
-ఈ అదనపు శ్రామికులను కొనసాగిస్తే ఉత్పత్తి పెరుగదు. తొలగిస్తే ఉత్పత్తి తగ్గదు. వీరి ఉపాంత ఉత్పాదకత శూన్యం (0) అని రాగ్నార్ నర్క్, రుణాత్మకం అని జోన్ రాబిన్సన్ పేర్కొన్నారు.
– ఈ ప్రచ్చన్న నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది.
-ప్రచ్చన్న నిరుద్యోగితను ‘దాగి ఉన్న నిరుద్యోగిత’ ( Concealed Unemployment) అని రాగ్నార్ నర్క్ పేర్కొన్నాడు.
– భారతదేశంలో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగితను శకుంతల మెహ్రా, అమర్ధ్థ్యసేన్ అంచనా వేశారు.
-ప్రచ్ఛన్న నిరుద్యోగులు అనే పదాన్ని మొదటగా ‘ఆర్థర్ లూయిస్’, జోన్ రాబిన్సన్ ఉపయోగించారు.
-ప్రచ్ఛన్న నిరుద్యోగిత భావనను ప్రచారం చేసింది టీఎన్ శ్రీనివాసన్, పీకే బర్ధన్.
ప్రత్యక్ష నిరుద్యోగం (Direct Unemployment)
-శ్రామికులు పని చేయాలనుకున్నప్పటికీ పని దొరకని వారిని ‘ప్రత్యక్ష నిరుద్యోగులు’ అంటారు.
-విద్యావంతులైన నిరుద్యోగులు, నైపుణ్యం లేని శ్రామికులు, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లేవారు ఈ నిరుద్యోగానికి నిదర్శనం.
-విద్యాంవంతుల్లోని నిరుద్యోగిత (Educ ated Un employment)
– చదువుకున్న వ్యక్తి/ శిక్షణ పొందిన వ్యక్తి/ ఏదో ఒక రంగంలో నైపుణ్యంగల వ్యక్తులకు పని లభించకపోతే వారిని ‘నిరుద్యోగ విద్యావంతులు’ అంటారు.
-భారతదేశంలో ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో నిరుద్యోగ విద్యావంతులు అధికం.
రుతు సంబంధ/ కాలిక నిరుద్యోగిత
(Seasonal Un employment
– సాధారణంగా వ్యవసాయ రంగంలో పంట సాగు సమయంలో, పంటకోత సమయంలో మాత్రమే శ్రామికులకు పని ఉంటుంది. మిగతా సమయంలో ఏ పని ఉండదు. అంటే సంవత్సరంలో 7, 8 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన నెలలు పని ఉండదు. దీన్ని రుతుసంబంధ నిరుద్యోగిత, కాలిక నిరుద్యోగిత అంటారు.
– సంవత్సరంలో కొంత కాలం పని ఉండి, మరికొంత కాలం పనిలేకపోవడం కొన్ని రుతువుల్లో పని ఉండి, మరికొన్ని రుతువుల్లో ఏ పని లేకపోవడాన్ని ‘కాలిక నిరుద్యోగిత’ రుతు సంబంధ నిరుద్యోగిత అంటారు.
సాంకేతిక నిరుద్యోగిత
(Technical Un employment)
-ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడిన నిరుద్యోగితను ‘సాంకేతిక నిరుద్యోగిత’ అంటారు.
– సాంకేతిక విద్యను అభ్యసించనప్పటికీ ఉద్యోగం లభించని స్థితిని ‘సాంకేతిక నిరుద్యోగిత’ అంటారు.
ఉదా: ఇంజినీర్లు
అనుద్యోగిత (Non-Employment)
-అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంప్రదాయ/అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామికులను ‘అనుద్యోగిత’ అంటారు.
– అమల్లో ఉన్న వేతనం వద్ద పని దొరికినప్పటికి అధిక వేతనాన్ని ఆశించి పనికి వెళ్లని వారిని ‘స్వచ్ఛంద నిరుద్యోగిత’ అంటారు.
– ఆశించిన వేతనం కంటే తక్కువ వేతనం అభించినప్పుడు వెళ్లకుండా నిరుద్యోగిగా ఉండటం.
-తన సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యం గల పని లభించినప్పుడు వదిలేసి నిరుద్యోగిగా ఉండటం.
-స్వచ్ఛంద నిరుద్యోగితను ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత (Optional Un employment)
స్వతంత్ర నిరుద్యోగిత (Independent Un employment) అని కూడా అంటారు.
– సంపూర్ణోద్యోగిత స్థితి వద్ద కూడా ఈ ఐచ్ఛిక/ ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత ఉంటుంది.
-అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగిత
-అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే తక్కువగా ఉంటుంది.
నిస్వచ్ఛంద నిరుద్యోగం
(In voluntary Un employment)
-ఒక ఆర్థిక వ్యవస్థలో లేదా ఒక వస్తువు ఉత్పత్తి సంస్థలో సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని నిస్వచ్ఛంద నిరుద్యోగిత అంటారు.
– స్వచ్ఛంద నిరుద్యోగాన్ని అస్వతంత్ర నిరుద్యోగి (In Independent Unemploy ment) అని, అనైచ్ఛిక/ అనిచ్ఛాపూరక నిరుద్యోగిత (InVoluantary Unemploy ement) అని కూడా పిలుస్తారు.
చక్రీయ నిరుద్యోగిత
(Cyclical Unemployment)
-అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాల వల్ల/సమష్టి డిమాండ్ కొరత వల్ల/ ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడం వల్ల/ ఆర్థిక మాంద్యం కాలంలో ఏర్పడే నిరుద్యోగితను ‘చక్రీయ నిరుద్యోగిత’ అంటారు.
-చక్రీయ నిరుద్యోగిత తాత్కాలికమైనది.
సంఘృష్ఠి నిరుద్యోగిత
(Frictional Un employment)
-శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తిలోకి, ఒక రంగం నుంచి మరొక రంగంలోకి, ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమలోకి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మార్పు చెందినప్పుడు ఏర్పడే నిరుద్యోగాన్ని ‘సంఘృష్ఠి నిరుద్యోగిత’ అంటారు.
-ఈ సంఘృష్ఠి నిరుద్యోగితను ఒరిపిడి/ ఘర్షణ నిరుద్యోగిత అని కూడా పిలుస్తారు.
-ఇది తాత్కాలిక స్వభావం కలదు.
సంపూర్ణ ఉద్యోగిత (Full Employment)
– మార్కెట్లో అమల్లో ఉన్న వేతనం వద్ద పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న వారందరికి పని లభించడాన్ని ‘సంపూర్ణ ఉద్యోగిత’ అంటారు.- కీన్స్, లెర్నర్
ఉపశమన ఉద్యోగిత ( Relief Employment)
-ఉత్పత్తిని తగినంత పెంచేందుకు వీలుపడని..కేవలం ఉపాధి అవకాశాలను, ఆదాయాలను సమకూర్చేందుకు వీలైన ఉద్యోగితను ‘ఉపశమన ఉద్యోగిత’ అంటారు.
మాదిరి ప్రశ్నలు
1. నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న , చెందిన దేశాల్లో ఎలా ఉంటుంది?
ఎ) ఒకే విధంగా ఉంటుంది
బి) వేర్వేరుగా ఉంటుంది
సి) ఎక్కువగా ఉంటుంది
డి) తక్కువగా ఉంటుంది
2. భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందినది?
ఎ) వ్యవస్థాపక నిరుద్యోగిత
బి) అల్ప ఉద్యోగిత
సి) సాంకేతిక నిరుద్యోగిత
డి) రుతుసంబంధ నిరుద్యోగిత
3. శ్రామిక సప్లయ్, శ్రామిక డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటే ఏర్పడే నిరుద్యోగిత?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) కాలిక నిరుద్యోగిత
సి) వ్యవస్థాపరమైన నిరుద్యోగిత
డి) సాంకేతిక నిరుద్యోగిత
4. అందుబాటులో ఉత్పాదక వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోలేని స్థితిని ఏమంటారు?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) అనుద్యోగిత
సి) ప్రత్యక్ష నిరుద్యోగిత
డి) అల్ప ఉద్యోగిత
5. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో అధికంగా ఉంటుంది?
ఎ) ప్రాథమిక రంగం
బి) ద్వితీయ రంగం
సి) తృతీయ రంగం డి) పైవన్నీ
6. ‘ప్రచ్ఛన్న నిరుద్యోగిత’ భావనను మొదట ఉపయోగించినది ఎవరు?
ఎ) ఆర్థర్ లూయిస్
బి) జోన్ రాబిన్సన్
సి) ఎ, బి
డి) టీఎన్ శ్రీనివాసన్, పీకే బర్ధన్
7. ఒక సంవత్సరంలో కేవలం 7, 8 నెలలు మాత్రమే పని ఉండేది ఏ రకమైన నిరుద్యోగిత?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) రుతుసంబంధ నిరుద్యోగిత
సి) కాలిక నిరుద్యోగిత
డి) బి, సి
8. ప్రత్యక్ష నిరుద్యోగీత (OpenUn employment )?
ఎ) ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని దొరకని స్థితి
బి) ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉండని స్థితి
సి) ప్రస్తుత పనిని వదిలి, మెరుగైన ఉపాధికి కోసం చూడటం
డి) పైవన్నీ
9. ఇంజినీర్లకు ఉపాధి లభించకపోవడం?
ఎ) అనుద్యోగిత
బి) సాంకేతిక నిరుద్యోగిత
సి) ప్రత్యక్ష నిరుద్యోగిత
డి) చక్రీయ నిరుద్యోగిత
సమాధానాలు
1-బి, 2-ఎ, 3-సి, 4-డి, 5-ఎ, 6-సి, 7-డి, 8-ఎ, 9-బి,
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
- Tags
- economy
- India
- un employment
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు