ముఖాముఖి సంబంధాలు ఏ సమూహంలో ఉంటాయి?
సమాజ నిర్మితి
1. సమాజ శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసే అంశం?
1) మానవ శరీరం 2) మానవ ప్రవర్తన
3) మానవ సమగ్ర చరిత
4) వ్యక్తుల మధ్య గల సామాజిక సంబంధాలు
2. సమాజశాస్త్ర పితామడు?
1) ఆరిస్టాటిల్ 2) కారల్‌మార్క్స్
3) వెబర్ 4) ఆగస్ట్కోమ్టే
3. సామాజిక సంస్థల మనుగడ దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) పరస్పర ఆశ్రయత
2) నిరంతర శ్రమ
3) ఆర్థిక, రాజకీయ అంశాలు
4) వ్యక్తుల క్రమశిక్షణ
4. కింది వాటిలో సామాజిక వ్యవస్థ కొనసాగడానికి ఉపయోగపడని ప్రక్రియ ఏది?
1) సాంఘికీకరణ 2) సాంస్కృతికీకరణ
3) సామాజిక నియంత్రణ
4) సామాజిక సంఘర్షణ
5. తెగ అనేది దేనికి ఉదాహరణ?
1) వర్గం 2) సముదాయం
3) సామాజిక సమూహం 4) పైవన్నీ
6. కుటుంబాలను ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు?
1) సమ్నర్ 2) సి.హెచ్. కూలీ
3) కింగ్ స్లే డేవిస్ 4) మెక్ ఐవర్
7. కిందివాటిలో కుటుంబ వ్యవస్థ విధికానిది?
1) సాంఘికీకరణ 2) సంతానోత్పత్తి
3) శ్రమ విభజన 4) వ్యాపారం
8. జెండర్ వయస్సు, జాతి, కులం, మతం వంటివి దేన్ని సూచిస్తాయి?
1) సాధించిన అంతస్తు
2) జన్మతః లభించిన అంతస్తు
3) కుటుంబం అందించిన అంతస్తు
4) సమాజం అందించిన అంతస్తు
9. సామాజిక సమస్యలు విసిరే సవాళ్లను ఎదుర్కొనే అంశం?
1) సామాజిక అభివృద్ధి
2) సామాజిక సంక్షేమం
3) సాంస్కృతిక వికాసం
4) సమగ్ర సంక్షేమం
10. మహిళల సమస్యల పట్ల భారత ప్రభుత్వానికి గల నిబద్ధతకు ప్రబల నిదర్శనంగా పరిగణించే జాతీయ మహిళా సాధికారత విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2001 2) 2002
3) 2003 4) 2004
11. సమాజం అంటే?
1) చట్టం ఆచారాలు కలిగిన ప్రజలు
2) ప్రజల సమూహం
3) సామాజిక సంబంధాల కలయిక
4) ఏదీకాదు
12. సమాజం అనేది జానపదరీతులు, కట్టుబాట్లు సంస్కృతి, అలవాట్లు, ఆదర్శాల సంపూర్ణ సామాజిక వారసత్వం. ఈ నిర్వచనం ఏ దృక్పథాన్ని సూచిస్తుంది?
1) ప్రకార్య 2) నిర్మితి
3) సామాజిక 4) సాంస్కృతిక
13. సమాజం అనేది సామాజిక సంబంధాల అల్లిక లేదా సాలెగూడు అని పేర్కొన్నవారు?
1. మెక్ఐవర్ 2) పార్సన్స్
3) లీకాక్ 4) కూలీ
14. సమాజ నిర్మితి అనే భావనను మొదట అందించిన వారు?
1) రాడ్‌క్లిఫ్ బ్రౌన్ 2) మాలినోస్కి
3) 1, 2 4) డేవిడ్ సన్
15. సమాజాన్ని జీవితో పోల్చిన సామాజిక శాస్త్రవేత్త?
1) రాడ్‌క్లిఫ్ బ్రౌన్ 2) డర్క్‌హైమ్
3) డార్విన్ 4) మెకైవర్
16. ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి తన సమూహం ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొనే భావన?
1) సామాజికీకరణ 2) సమైక్యత
3) సంలీనం 4) విలీనం
17. అర్థ సమూహం అనే పదాన్ని పేర్కొన్నవారు?
1) గిన్స్‌బెర్గ్ 2) మెక్ఐవర్
3) ఓగ్బర్గ్ 4) పై అందరూ
18. ఏదైనా ఒక సమూహంలో సభ్యత్వం పొందడం అనేది?
1) స్వచ్ఛందం
2) నిర్బంధం
3) పరిమితం 4) అపరిమితం
19. సంస్కృతికీకరణం అనే భావనను మొట్టమొదటి సారిగా ప్రతిపాదించింది?
1) ఎం.ఎన్. శ్రీనివాస్
2) ఎస్. రాధాకృష్ణన్
3) మదన్, మజుందార్
4) టైలర్
20. సమూహం అనేది?
1) మానవుల కలయిక 2) నిర్మితి
3) ప్రకార్య సంబంధం
4) వ్యక్తుల కలయిక
21. సమాజం అనేది?
1) సామాజిక సంబంధాల వ్యవస్థ
2) నిర్మితి
3) పై రెండూ 4) ఏదీకాదు
22. సమూహం దేని కోసం ఏర్పడుతుంది?
1) ప్రత్యేక సమూహం కోసం
2) సాధారణ ప్రయోజనం కోసం
3) పై రెండూ
4) వ్యక్తుల అభీష్టం మేరకు
23. సమాజం దేని కోసం ఏర్పడుతుంది?
1) సాధారణ ప్రయోజనం కోసం
2) ప్రత్యేక సమూహం కోసం
3) పై రెండూ
4) వ్యక్తుల అభిష్టం మేరకు
24. సమాజం విశిష్ట లక్షణం?
1) సహకారం 2) సంఘర్షణ, స్పర్ధలు
3) సంస్కృతీకరణ 4) సహకారం, స్పర్ధలు
25. సామాజిక సమూహం అనేది
1) గతిశీలమైనది 2) జడభరితమైనది
3) నిర్బంధమైనది 4) పైవన్నీ
26. ఏ సమూహంలో ముఖాముఖి సంబంధాలుంటాయి?
1) ద్వితీయ సమూహం
2) ప్రాదేశిక సమూహం
3) ప్రాథమిక సమూహం
4) పైవన్నీ
27. సామాజికీకరణ ప్రక్రియ అనేది ఎంత కాలం కొనసాగుతుంది?
1) ఐదేళ్ల వయస్సు వరకు
2) బ్రహ్మచర్యాశ్రమం పూర్తయ్యేంతవరకు
3) వానప్రస్తాశ్రమం వచ్చేంతవరకు
4) జీవితాంతం
28. కింది వాటిలో ఏవి సమాజ నిర్మితిలో భాగంగా పనిచేస్తాయి?
1) జనాభా, ప్రక్రియ, విలువలు
2) విలువలు, ప్రమాణాలు
3) పాత్రలు, ఉప సమూహాలు
4) సమూహాలు, సంస్థలు
29. సమాజ నిర్మితిని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేవి?
1) అంతర్ వైయుక్తిక సంబంధాలు
2) సంస్థాగతమైన సంబంధాలు
3) సామాజిక సంబంధాలు
4) పైవన్నీ
30. సమాజ నిర్మితి ప్రమాణం?
1) సమితి 2) సమూహం
3) పరస్పర సహకారం 4) సంస్థ
31. తల్లిదండ్రులకు – సంతానానికి మధ్య సామాజికీకరణ అనేది?
1) తల్లిదండ్రుల నుంచి సంతానానికి మాత్రమే ఉంటుంది
2) సంతానం నుంచి తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది
3) రెండు వైపులా ఉంటుంది
4) అసలు ఉండదు
32. సమాజం విధి ఏమిటి?
1) ప్రాథమిక అవసరాల్ని గుర్తించడం
2) ఆధునిక అవసరాల్ని గుర్తించడం
3) విలాస అవసరాల్ని గుర్తించడం
4) పైవన్నీ
33. సంస్కృతీకరణ అనే భావనకు ఎం.ఎన్. శ్రీనివాస్ మొదట పెట్టిన పేరు?
1) హిందూయీకరణ 2) డీ ట్రైబలైజేషన్
3) బ్రాహ్మణీకరణ 4) విసంస్కృతీకరణ
34. ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం కొంత మంది సభ్యులు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడితే?
1) లాంఛన వ్యవస్థ
2) స్వచ్ఛంద సమితి
3) నిర్బంధ సమితి
4) వ్యక్తిగత వ్యవస్థ
35. కులం ఒక?
ఎ) రాజకీయ వ్యవస్థ బి) ఆర్థిక వ్యవస్థ
సి) మత వ్యవస్థ
1) ఎ, బి 2) బి మాత్రమే
3) బి, సి 4) ఎ, బి, సి
36. కిందివాటిలో కులం విధి కానిది?
1) వివాదాల పరిష్కారం
2) ఆర్థిక స్థిరత్వం
3) వివాహ నిబంధనలు
4) కుల చలనం
37. షెడ్యూల్డ్ తెగలను వెనుకబడిన హిందువులుగా అభివర్ణించినది?
1) జె.హెచ్ హట్టన్ 2) బి.ఎస్.గుహ
3) వెరియర్ ఎల్విన్ 4) జి.ఎస్.ర్యే
38. కొన్ని సముదాయాల్లో లేదా కొన్ని తెగల్లో ఉండే సమూహాల్ని ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించేందుకు అవకాశం కల్పించే ఆర్టికల్?
1) ఆర్టికల్ 342 2) ఆర్టికల్ 164
3) ఆర్టికల్ 248 4) ఆర్టికల్ 341
39. అంటరానితనాన్ని నేరంగా పేర్కొన్న ఆర్టికల్?
1) ఆర్టికల్ 19 2) ఆర్టికల్ 18
3) ఆర్టికల్ 17 4) ఆర్టికల్ 14
40. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వంటి వెనుక బడిన వర్గాల సంక్షేమం కోసం, వారి ఆర్థిక, విద్యాపరమైన ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు. అదే విధంగా వారిని సామాజిక అన్యాయం, దోపిడీ నుంచి రక్షించాలి అని పేర్కొనే ఆర్టికల్?
1) ఆర్టికల్ 46 2) ఆర్టికల్ 74
3) ఆర్టికల్ 44 4) పైవన్నీ
41. నంబూద్రి సమాజంలోని కుటుంబం పేరు?
1) తర్వాడ్ 2) మఛాంగ్
3) ఇల్లోమ్ 4) డెల్లింగ్సన్
42. నాయర్లలో కుటుంబం పేరు?
1) తీరవాద్ 2) గోతుల్
3) పై రెండూ 4) ఏదీకాదు
43. మాతృ వంశీయ కుటుంబ వ్యవస్థను కలిగిన సమాజం?
1) కాడార్లు 2) భిల్లులు
3) కేరళలోని నాయర్లు 4) ఏదీకాదు
44. బ భార్యత్వం లేదా బ భర్తృత్వం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిన కుటుంబం?
1) అణు కుటుంబం
2) సంయోగ కుటుంబం
3) ద్విపార్శ్వ కుటుంబం
4) విస్తృత కుటుంబం
45. ఒక వ్యక్తి వివాహమై, సంతానం పొందితే ఏర్పడే కుటుంబం పేరు?
1) పునరుత్పత్తి కుటుంబం
2) ఆవిర్భావ కుటుంబం
3) సంతాన యోగ్య కుటుంబం
4) పైవన్నీ
46. ఒక కుటుంబంలో వ్యక్తి జన్మించి, సామాజికీకరణ పొంది వివాహం అయ్యేంత వరకు నివసించే కుటుంబం?
1) కేంద్రక కుటుంబం
2) వైవాహిక కుటుంబం
3) ఆవిర్భావ కుటుంబం
4) ఏదీకాదు
47. వివాహ అనంతరం భర్త తన భార్య కుటుంబంలో నివసించడం ఏ సమాజంలో కనబడుతుంది?
1) మాతృస్వామ్య సమాజం
2) పితృ వంశీయ సమాజం
3) ఉమ్మడి కుటుంబ సమాజం
4) మాతృత్వాధికార కుటుంబ సమాజం
48. తల్లి ద్వారా వంశానుక్రమం సంక్రమిస్తే ఆ కుటంబంపేరు?
1) మాతృవంశీయ 2) మాతృ స్థానిక
3) మాతృస్వామ్య 4) ఏదీకాదు
49. తండ్రి ద్వారా వంశానుక్రమం సంక్రమిస్తే ఆ కుటుంబం పేరు?
1) పితృస్వామ్య 2) పితృవంశీయ
3) పితృస్థానిక 4) పైవన్నీ
50. పురుషులు ఆధీనులుగా ఉంటూ స్త్రీలు ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు?
1) మాతృస్థానిక కుటుంబాలు
2) మాతృస్వామ్య కుటుంబాలు
3) మాతృపితృత్వాధికార కుటుంబం
4) ఏదీకాదు
51. నాయర్ల కుటుంబం దేనికి ఉదాహరణ?
1) మాతృవంశీయ కుటుంబం
2) విస్తృత కుటుంబం
3) వివృత కుటుంబం
4) ఏదీకాదు
52. అధికారానికి విశేష ప్రాధాన్యం ఉంటూ తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం?
1) వైవాహిక కుటుంబం
2) పితృస్వామ్య కుటుంబం
3) ఏకరక్త కుటుంబం
4) విస్తృత కుటుంబం
53. తాతామనువలతో మూడు లేదా నాలుగు తరాలతో కూడిన కుటుంబం?
1) విస్తృత కుటుంబం
2) వైవాహిక కుటుంబం
3) పులియన్ కుటుంబం
4) సిండయాస్మిన్ కుటుంబం
54. కుటుంబానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1)కుటుంబంలో సంస్థాగత లైంగిక సంబంధం ఉంటుంది
2) కుటుంబం అనేది ఒక ఆర్థిక యూనిట్
3) కుటుంబ సభ్యులందరు ఉమ్మడి నివాసంలో నివసించాల్సిన అవసరం ఉండదు
4) కుటుంబంలో నిరంతరం సంఘర్షణ ఉంటుంది
55. కుటుంబ పరిణామ క్రమానికి సంబంధించి మోర్గాన్ ప్రకారం కింది వాటిలో ఏది సరైన క్రమం?
1) ఏక వివాహ కుటుంబం, ఏకరక్త కుటుంబం, పులియన్ కుటుంబం, సిండయాస్మియన్ కుటుంబం, పితృస్వామ్య కుటుంబం
2) పులియన్ కుటుంబం, సిండయాస్మియన్ కుటుంబం, ఏక రక్త కుటుంబం, పితృస్వామ్య కుటుంబం, ఏక వివాహ కుటుంబం
3) ఏక రక్త కుటుంబం, పులియన్ కుటుంబం, సిండయాస్మియన్ కుటుంబం, పితృస్వామ్య కుటుంబం, ఏక వివాహ కుటుంబం 4) ఏదీకాదు
56. ఆధునిక కుటుంబాల్లో కింది వాటిలో ఏది ఎక్కువగా కనిపిస్తుంది?
1) విస్తృత బంధుత్వ వ్యవస్థ నుంచి దూరమవడం
2) కుటుంబంపై మతపరమైన నియంత్రణ తగ్గడం
3) కుటుంబం పరిమాణం తగ్గడం
4) పైవన్నీ
57. మాతృస్వామ్య కుటుంబ లక్షణం కానిది?
1) మాతృవంశీయ వంశానుక్రమం
2) మాతృత్వ అధికారం
3) పితృస్వామ్యాధికారం
4) ఆస్తి వారసత్వం మాతృవంశీయంగా లభించడం
జవాబులు
1-4 2-4 3-1 4-4 5-2 6-2 7-4 8-2 9-2 10-1 11-3 12-2 13-1 14-1 15-1 16-1 17-1 18-1 19-1 20-1
21-1 22-1 23-1 24-4 25-1 26-3 27-4 28-4 29-4 30-4 31-3 32-1 33-3 34-2 35-4 36-4
37-4 38-1 39-3 40-1 41-3 42-1 43-3 44-2 45-1 46-3 47-1 48-1 49-2 50-2 51-1 52-3
53-1 54-4 55-3 56-4 57-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు