భారత ఆర్థిక వ్యవస్థ- జాతీయాదాయం-భావనలు- అంచనాలు
ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడిన నికర వస్తు సేవల మొత్తమే జాతీయాదాయం. – అల్ఫ్రెడ్ మార్షల్
వ్యయార్హ ఆదాయం (Disposable Personal Income)
#వ్యక్తులకు వివిధ రూపాల్లో వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడానికి వీలుండదు. అందులో కొంత భాగం పన్నుల రూపంలో (ఆదాయపన్ను, ఆస్తిపన్ను, వృత్తి పన్ను) ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇలాంటి పన్నులు చెల్లించగా మిగిలిన ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు.
#వ్యయార్హ ఆదాయం= వ్యష్టి ఆదాయం-వ్యష్టి పన్నులు
DPI = PI – PT
# వ్యయార్హ ఆదాయాన్ని కొంత వినియోగ వస్తువులమీద, కొంత ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేయవచ్చు లేదా పొదువు కూడా చేయవచ్చు.
#వ్యయార్హ ఆదాయం = వినియోగం + పొదువు
DPI = C+S
తలసరి ఆదాయం(Per capita Income)
# జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ‘తలసరి ఆదాయం’
# ఒక దేశంలో, ఒక సంవత్సర కాలంలో వ్యక్తికి లభించే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు.
# జనాభాలో తలా ఒక్కింటికి వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు.
#తలసరి ఆదాయం = జాతీయాదాయం/ దేశ జనాభా
# PCI=NI/P తలసరి ఆదాయం దేశ ప్రజల సగటు జీవనప్రమాణ స్థాయిని సూచిస్తుంది.
#జనాభా ఎక్కువగా ఉంటే తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది.
# జనాభా తక్కువగా ఉంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
#జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది.
నామ మాత్రపు తలసరి ఆదాయం (Naminal Per capita Income)
#ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయాన్ని గణిస్తే నామమాత్రపు తలసరి ఆదాయం వస్తుంది.
#నామమాత్రపు తలసరి ఆదాయం = ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం / సం౹౹ మధ్య జనాభా
వాస్తవ తలసరి ఆదాయం
# స్థిర ధరల్లో తలసరి ఆదాయాన్ని గణిస్తే వాస్తవ తలసరి ఆదాయం వస్తుంది.
#వాస్తవ తలసరి ఆదాయం = స్థిర ధరల్లో తలసరి ఆదాయం / సం. మధ్య జనాభా
తలసరి ఆదాయ వృద్ధి రేటు (Growth rate of per capita Income)
# జాతీయాదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధిరేటు తీసివేస్తే తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది.
# తలసరి ఆదాయ వృద్ధిరేటు = జాతీయాదాయ వృద్ధిరేటు – జనాభా వృద్ధిరేటు
ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం (NI at Curre nt Prices)
# ఏ సంవత్సర జాతీయాదాయాన్ని ఆ సంవత్సర మార్కెట్ ధరలతో లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరల్లో జాతీయదాయం అంటారు.
ఉదా: 2020-21 జాతీయాదాయాన్ని 2020-21 మార్కెట్ ధరలతో లెక్కించడం.
#ప్రస్తుత ధరల్లో జాతీయాదాయాన్ని మార్కెట్ ధరల్లో జాతీయాదాయం అని నామ మాత్రపు జాతీయాదాయం అని కూడా పిలుస్తారు.
స్థిర ధరల్లో జాతీయాదాయం (NI at Constant Price)
# ఒక సంవత్సర జాతీయాదాయాన్ని ఆధార సంవత్సరం ధరల్లో లెక్కిస్తే దానిని స్థిర ధరల్లో జాతీయాదాయం అంటారు.
ఉదా: 2020-21 సం. జాతీయాదాయాన్ని 2011-12 సం. మార్కెట్ ధరలతో లెక్కించడం.
#స్థిర ధరల్లో జాతీయాదాయాన్ని ‘నిలకడ ధరల్లో జాతీయాదాయం’ అని ‘వాస్తవ/ నిజ ధరల్లో జాతీయాదాయం’ అని కూడా పిలుస్తారు.
#భారతదేశంలో జాతీయాదాయ అంచనాలు -స్వాతంత్య్రానికి పూర్వం
#బ్రిటిష్ పాలన కాలంలో మనదేశ జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ పరంగా పెద్దగా కృషిగా జరగలేదు.
#అయినప్పటికీ కొంతమంది ఆర్థిక వేత్తలు/ మేధావులు వ్యక్తిగత హోదాలో జాతీయాదాయాన్ని అంచనా వేశారు.
# భారతదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం జాతీయాదాయాన్ని మొట్టమొదటి సారిగా 1968 సంవత్సరంలో లెక్కించారు.
# దాదాభాయ్ నౌరోజీ జాతీయాదాయాన్ని లెక్కించినపుడు అప్పటి జనాభా 17 కోట్లు కాగా జాతీయాదాయం రూ.340 కోట్లు, తలసరి ఆదాయం రూ.20.
#దాదాభాయ్ నౌరోజీ 1876 సంవత్సరంలో “Poverty and Unbritish Rule in India”అనే గ్రంథంలో డ్రైన్థియరీ గురించి వివరించారు. అంటే ఈ గ్రంథంలో భారతదేశ సంపదను హోమ్ చార్జీల రూపంలో ఇంగ్లండ్ ప్రభుత్వం ఎలా దోచుకుందో వివరించాడు.
# 1875 లో అట్కిన్సన్ ప్రకారం జాతీయాదాయం 574 కోట్లు తలసరి ఆదాయం రూ. 31
# 1882 సంవత్సరంలో బారింగ్ & డేవిడ్ బార్బర్లు చేసిన జాతీయాదాయ అంచనాలను జాతీయాదాయం 574 కోట్లు, తలసరి ఆదాయం రూ. 27లుగా బ్రిటిష్ ప్రభుత్వం బహిర్గతం చేసింది.
# 1899లో విలియం డిగ్బి తయారు చేసిన అంచనాలు
# జాతీయాదాయం – రూ. 428 కోట్లు, తలసరి ఆదాయం = రూ. 18.9
l 1868-1899 వరకు వేసిన అంచనాల్లో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను మాత్రమే తీసుకున్నారు. సేవా రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు. జాతీయాదాయాన్ని ఒకే క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా లెక్కించిన వారు డాక్టర్. వి.కె.ఆర్.వి. రావు.
l ఈయన 1925-29లో “An Essay on Indian national Income” అనే వ్యాసం రాశాడు.
l 1931-32 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో జాతీయాదాయం నేషనల్ ఇన్‌కం ఇన్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథం వి.కె.ఆర్.వి. రావు రాశారు.
l 1931-32 వీకేఆర్‌వీ రావు ప్రకారం జాతీయాదాయం రూ.1689 కోట్లు, తలసరి ఆదాయం రూ. 62
l వీకేఆర్‌వీ రావు గారు దేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం, కార్పొరేటు రంగంగా విభజించి శాస్త్రీయ పద్ధతిలో జాతీయాదాయాన్ని లెక్కించారు.
l జాతీయాదాయాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేసినది రిచర్డ్స్టోన్. అందుకు ఆయన 1984లో నోబెల్ బమతి కూడా పొందారు.
l ఇలా ప్రతి దేశం జాతీయాదాయాన్ని లెక్కిస్తుంది. అంచనా వేస్తుంది. దీనిని సామాజిక అకౌంట్లు అని కూడా అంటారు
స్వాతంత్య్రం తరువాత జాతీయాదాయం అంచనాలు
జాతీయాదాయ అంచనాల కమిటీ (National Income Estimate Committee )
#క్రమబద్ధమైన/శాస్త్రీయమైన జాతీయాదాయ అంచనాల ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించింది. 1949 ఆగస్టు 4న జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించారు.
#దీనికి పీసీ మహలనోబిస్ అధ్యక్షతన డా.వికేఆర్వీ రావు, డా.డీఆర్ గాడ్గిల్ సభ్యులుగా, సైమన్ కుజువైట్స్, డిర్క్సన్, జేఆర్‌ఎన్ స్టోన్ సలహాదారులుగా ఉన్నారు.
# ఈ కమిటీని హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు.
# జాతీయాదాయ లెక్కింపులో ఈ కమిటీని ల్యాండ్ మార్క్ అంటారు.
# ఈ కమిటీ తొలి నివేదికను 1951లో చివరి నివేదికను 1954లో ఇచ్చింది.
# ఈ కమిటీ మొదటి ప్రాథమిక సంవత్సరం (Base year)గా 1948-49 ని పరిగణిస్తూ జాతీయాదాయం రూ. 8710 కోట్లు, తలసరి ఆదాయం రూ.225గా లెక్కించారు.
#జాతీయాదాయాన్ని ఎక్కువ సార్లు గణించింది ఫ్రెండ్లీ షెరాస్ (3సార్లు -1911, 22,31)
కేంద్ర గణాంక సంస్థ (CSO- Central Statis tical Organization)
# జాతీయాదాయాన్ని శాశ్వత ప్రాతిపదికన అంచనా వేసే ప్రత్యేక సంస్థను (సీఎస్ఓ) ఏర్పాటు చేయాలని 1951లో నిర్ణయించి 1954లో సీఎస్ఓకు అప్పగించింది.
#సీఎస్ఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
# ఈ సీఎస్ఓ గణాంకాలను వైట్ పేపర్ అంటారు.
# ఈ సీఎస్ఓను 1973లో ప్రణాళిక మంత్రిత్వ శాఖలో విలీనం చేశారు.
జాతీయ గణాంక కమిషన్ (NSC- National statistical Commission)
# 2000 జనవరి 1న రంగరాజన్ అధ్యక్షతన సీఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ లను విలీనం చేయాలని ప్రతిపాదన కానీ అమలు కాలేదు.
#2006లో సురేష్ టెండూల్కర్ అధ్యక్షులుగా నియామకం
# 2010లో ప్రొ. రాధాకృష్ణ చైర్మన్‌గా నియామకం
#2014 సం.లో ప్రణబ్‌సేన్ చైర్మన్‌గా నియామకం
# 2019 జూలై 19న భీమల్ కుమార్ రాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
జాతీయ గణాంక సంస్థ (NSO National Statistical Office)
#2019 మే 3న భారత ప్రభుత్వం ఆదేశం ద్వారా సీఎస్ఓ+ఎన్ఎస్ఎస్ఓ లను విలీనం చేసి ఎన్ఎస్ఓ గా ఏర్పాటు చేశారు.
ఆర్థిక సంవత్సరం (Financial year)
#ఒక ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు పరిగణించే కాలపరిమితిని ఆర్థిక సంవత్సరం అంటారు.
ఆధార సంవత్సరం (Base year)
#వ్యాపార కార్యకలాపాలు లేదా ఆర్థిక సూచికను లెక్కించేటప్పుడు పోలిక కోసం బేస్ ఇయర్ ఉపయోగపడుతుంది.
# ఆధార సంవత్సరం ఒక సంస్థ/ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బెంచ్ మార్క్‌గా పనిచేస్తుంది.
# భారతదేశంలోని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (సీఎస్ఓ) ప్రస్తుత ఎన్ఎస్ఓ 1948-49ని మొదటి ఆధార సంవత్సరంగా ఉపయోగించారు.
# 2015 జనవరి 1న 2011-12ను ప్రస్తుత బేస్ ఇయర్‌గా తీసుకున్నారు.
# 1948-49 సంవత్సరం నుంచి 2011-12 సంవత్సరం వరకు 7 బేస్ ఇయర్స్ అమలు చేసి ప్రస్తుతం 8వ బేస్ ఇయర్ (2011-12) కొనసాగుతుంది.
ద్రవ్య రూప విలువ (Monetary Value):
#ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు.
#ఆర్థిక వ్యవస్థలోని వివిధ రకాల అంతిమ వస్తుసేవలను వివిధ రూపాల్లో (ఉదా: కిలోగ్రామ్లు, లీటర్లు, మీటర్లు, ఎకరాలు మొదలైనవి) కొలిచినప్పటికీ వీటన్నింటిని కొలిచే ఉమ్మడి కొలమానం ద్రవ్యం మాత్రమే. అందుకే జాతీయాదాయాన్ని ద్రవ్య రూపంలో కొలుస్తారు.
ఉదా: భారతదేశ జాతీయాదాయం రూపాయల్లో, అమెరికా జాతీయాదాయం డాలర్లలో వ్యక్తపరుస్తారు.
మూలధన కల్పన
#ఒక గణన సంవత్సరంలో వినియోగాన్ని మించి ఉన్న ఉత్పత్తి మిగులు ఇది తరువాత ఉత్పత్తికి దోహద పడుతుంది.
గ్రీన్ జీడీపీ
#పర్యావరణ నష్టానికి జీడీపీని సర్దుబాటు చేస్తే దానిని గ్రీన్ జీడీపీ అంటారు.
జీడీపీ గ్యాప్
# ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి, వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడానే జీడీపీ అంతరం అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. వ్యయార్హ ఆదాయం =
ఎ) వ్యష్టి పన్నులు – వ్యష్టి ఆదాయం
బి) వ్యష్టి ఆదాయం- వ్యష్టి పన్నులు
సి) వినియోగం + పొదుపు డి) బి, సి
2. జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది
ఎ) తలసరి ఆదాయం
బి) తలసరి వినియోగం
సి) జాతీయాదాయం
డి) తలసరి పొదుపు
3. జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య
ఎ) అనులోమ సంబంధం
బి) విలోమ సంబంధం
సి) అనులోమ మధ్య సంబంధం
డి) పైవన్నీ
4. స్థిర ధరల్లో తలసరి ఆదాయాన్ని గణిస్తే
ఎ) వాస్తవ తలసరి ఆదాయం
బి) నామ మాత్రపు తలసరి ఆదాయం
సి) మార్కెట్ ధరల్లో జాతీయాదాయం
డి) స్థిర ధరల్లో జాతీయాదాయం
5. తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే?
ఎ) జనాభా వృద్ధిరేటు నుంచి జాతీయాదాయ వృద్ధి రేటును తీసివేయడం
బి) జాతీయాదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేయడం
సి) జాతీయాదాయ వృద్ధిరేటులో జనాభా వృద్ధి రేటును కలపడం
డి) జాతీయాదాయ వృద్ధిరేటును జనాభా వృద్ధిరేటుచే గణించడం
6. ఏ సంవత్సరం జాతీయాదాయాన్ని ఆ సంవత్సరం మార్కెట్ ధరలతో లెక్కిస్తే దానిని?
ఎ) ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
బి) స్థిర ధరల్లో జాతీయాదాయం
సి) వాస్తవ తలసరి ఆదాయం
డి) నామ మాత్రపు తలసరి ఆదాయం
7. స్థిరధరల్లో జాతీయాదాయానికి మరొక పేరు?
ఎ) ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
బి) నిలకడ ధరల్లో జాతీయాదాయం
సి) వాస్తవ ధరల్లో జాతీయాదాయం
డి) బి, సి
8. భారతదేశంలో మొట్టమొదటిసారి జాతీయాదాయాన్ని లెక్కించిన వారు ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) ఆల్ఫ్రెడ్ మార్షల్
సి) దాదాభాయ్ నౌరోజీ
డి) వీకేఆర్‌వీ రావు
9. Poverty and Unbritish Rule in India గ్రంథ రచయిత ఎవరు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ
బి) డా. వీకేఆర్‌వీ రావు
సి) మార్షల్ డి) డిగ్బి
10. 1868 నుంచి 1899 వరకు జాతీయాదాయ అంచనాల్లో ఏ రంగాన్ని పరిగణనలోకి తీసుకోలేదు?
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) బి, సి
11. జాతీయాదాయ అంచనాలను ఏమంటారు?
ఎ) ఆర్థిక అకౌంట్లు
బి) సామాజిక అకౌంట్లు
సి) తలసరి అకౌంట్లు డి) పైవన్నీ
సమాధానాలు
1-డి 2-ఎ 3-బి 4-ఎ
5-బి 6-ఎ 7-డి 8-సి
9-ఎ 10-సి 11-బి
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు