మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య? పోటీ పరీక్షల ప్రత్యేకం
గత తరువాయి…
67. 8వ తరగతిలో ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ఉపాధ్యాయుని ప్రశంసకు గురయిన ప్రభాస్ అనే విద్యార్థి అన్ని అంశాలు బాగా నేర్చుకుంటే అతనిలో కనిపించే థారన్డైక్ ప్రధాన నియమాల్లో ఒకటి?
1) సింసిద్ధాతా నియమం
2) అభ్యాస నియమం
3) ఫలిత నియమం
4) బళ ప్రతిస్పందన నియమం
68. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు?
1) అనుకరణ ద్వారా నేర్చుకుంటారు
2) పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు
3) అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు
4) పెద్దలు, సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకొంటారు
69. కింది వాటిలో సరికాని ప్రవచనం?
1) పావ్లోవ్ ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు
2) శాస్త్రీయ, నిబంధను ‘S’ రకం నిబంధన అని కూడా అంటారు
3) కార్యసాధక నిబంధనలో కావాల్సిన ప్రవర్తనకు మాత్రమే పునర్బలనం కలిగిస్తారు
4) కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం
70. ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవపడుతుంటాడు. పాఠశాల నియమాలను సరిగా పాటించడు. ఆ విద్యార్థికి ఏ రంగంలో సహాయం అవసరం?
1) సంజ్ఞానాత్మక రంగం
2) మానసిక చలనాత్మక రంగం
3) భావావేశ రంగం
4) ఉన్నత క్రమ ఆలోచనా నైపుణ్యాలు
71. ప్రేరణను పెంచే కృత్యం కానిది?
1) చర్చలు, సెమినార్లు నిర్వహించడం
2) సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సం బంధాలను ప్రోత్సహించడం
3) ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం
4) బమతులు, దండనను న్యాయబద్ధంగా ఉపయోగించడం
72. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో అని నిన్ననే ఆలోచించుకొని ఉండటమే’ అనే మెకైవర్ మాటలు దేనికి ఉదాహరణ?
1) బాహ్య ప్రేరణ 2) సాధన ప్రేరణ
3) అంతర్గత ప్రేరణ 4) స్వీయ ప్రేరణ
73. ఒక విద్యార్థి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడి ప్రేరణ రకం?
1) అంతర్గత ప్రేరణ 2) బహిర్గత ప్రేరణ
3) అనుకూల ప్రేరణ 4) ప్రతికూల ప్రేరణ
74. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకొనేందుకు ప్రయత్నించే అవసరం?
1) గుర్తింపు, గౌరవ అవసరం
2) రక్షణ అవసరం
3) ఆత్మ ప్రస్తావన అవసరం
4) ప్రేమ సంబంధిత అవసరం
75. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఎలా పిలుస్తారు?
1) జైగార్నిక్ ప్రభావం 2) హాలో ప్రభావం
3) డెజావూ 4) గెస్టాల్ట్ ప్రభావం
76. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నరసేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమని అంటే ఈ సారి అతను 72 నిమిషాల్లో నేర్చుకున్నాడు. అయిన అతని పొదుపు గణన?
1) 20 శాతం 2) 30 శాతం
3) 50 శాతం 4) 75 శాతం
77. పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ‘ఫ్రెంచ్’ తర్వాత ‘జర్మన్’ నేర్చుకుంది. జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది కానీ, జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం?
1) పురోగమన అవరోధం
2) తిరోగమన అవరోధం
3) డెజావూ 4) దమనం
78. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం, రెండో పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయ అవగాహనకు అవరోధం కలిగిస్తే, అది?
1) పురోగమన అవరోధం
2) తిరోగమన అవరోధం
3) దమనం
4) అవరోధం లేదు
79. పురోగమన అవరోధం లేదా తిరోగమనం అవరోధం వల్ల పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు ఏ విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు?
1) ప్రస్తుత పాఠానికి, ఇంతకు ముందు పాఠానికి గల పోలికలు, భేదాలు హైలైట్ చేయడం ద్వారా
2) విద్యార్థులు మానసిక హింసకు గురిచేయకుండా ఉండటం ద్వారా
3) పునరావృతానికి అవకాశం కల్పించడం ద్వారా
4) తిరిగి జ్ఞాపకం చేసుకొనేందుకు ఉపయోగించే సంజ్ఞలను బోధించడం ద్వారా
80. ఎబ్బింగ్హౌస్ స్మృతిపై చేసిన ప్రయోగాలను ఎవరి మీద నిర్వహించాడు?
1) విద్యార్థులపై
2) మగపిల్లలపై
3) తనపై తానే
4) విధ్యార్దినీలపై
81. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు నేర్చుకున్న విద్యార్థి దాన్ని వాడుకలో ఉపయోగించకపోవడం వల్ల కొంత కాలానికి భాషా సామర్థ్యం కోల్పోవడం?
1) స్మృతి నాశం 2) దమనం
3) అనుపయోగం వల్ల స్మృతి క్షయం
4) అవరోధం
82. రవి పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది. కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం?
1) దమనం
2) పురోగమన దమనం
3) తిరోగమన అవరోధం
4) మానసిక అఘాతం
83. కింది వాటిలో తిరోగమన అవరోధం అంటే?
1) చెడు ప్రవర్తనకు ఆకర్షితులు కావడం
2) కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు అవరోధం కలిగించడం
3) గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను ఆటంకపర్చడం
4) ఆలోచనలు తిరోగమనంగా ఉండటం
84. కింది వాటిలో విస్మృతికి కారణం కానిది?
1) ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవడం
2) అవగాహన చేసుకొని చదవడం
3) మార్కుల కోసం చదవడం
4) అర్థమైనా కాకపోయినా నేర్చుకోవడం
85. ‘విదేశీ భాషను సరిగా ఉచ్ఛరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని’ అభ్యసన బదలాయింపు దృష్ట్యా ఏ రకంగా చెప్పవచ్చు?
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింపు
3) విద్యాపార బదలాయింపు
4) శూన్య బదలాయింపు
86. Would అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి Could అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం?
1) అనుకూల 2) ప్రతికూల
3) శూన్య 4) ద్విపార్శ
87. ఎడ్లబండి నడపటంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవటంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం?
1) అనుకూల 2) ప్రతికూల
3) శూన్య 4) ద్విపార్శ
88. ‘భాషణ- భాషా సంబంధ’ ‘పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు’ వరుసగా ఎలా పిలుస్తారు?
1) డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా
2) డిస్గ్రాసియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా
3) డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేరియా
4) డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా
89. ఒక బాలిక ‘ద డాగ్స్ రన్నడే అవే’ అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషా దోషం?
1) స్థాయికి మించిన సాధారణీకరణ దోషం
2) పొడిపొడిగా మాట్లాడే దోషం
3) సాధారణీకరణానికి దిగువస్థాయి దోషం
4) వాక్యనిర్మాణ దోషం
90. ‘క్రమేణ అస్తిత్వం అంటే?
1) విద్యార్థి ప్రగతి ఆధారంగా సహాయం తగ్గించడం
2) ప్రగతితో సంబంధం లేకుండా నిరంతరం సహాయపడటం
3) పిల్లవాని ప్రజ్ఞ పెంపొందించడం
4) ప్రగతి ఆధారంగా పునర్బలనం అందజేయడం
91. అభ్యసన వైకల్యానికి కారణాలు?
1) ఉపాధ్యాయుల్లో జ్ఞానలేమి
2) ఆంగిక, పరిసర కారణాలు
3) అల్పబోధన, బోధనోపకరణాలు
4) తక్కువ మానసిక సామర్థ్యం
92. విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, అన్వేషణాభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం?
1) బందూరా పరిశీలనాభ్యసనం
2) యత్నదోష అభ్యసనం
3) అంతర్దృష్టి అభ్యసనం
4) బ్రూనర్ బోధనా సిద్ధాంతం
93. బోధనలో ఉపాధ్యాయుడు నిర్వహించే కృత్యాలను ఆధారంగా చేసుకొని 3 దశలుగా విభజించిన విద్యావేత్త?
1) హెర్బర్ట్ 2) కిల్పాట్రిక్
3) ఫిలిప్ జాక్సన్ 4) జాన్డ్యూయి
94. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య?
1) మంత్రణార్థి నుంచి సమాచార సేకరణ
2) మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం
3) మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం
4) మంత్రణార్థి సమస్యకు పరిష్కారం సూచించడం
95. సహభాగి నాయకత్వానికి సబంధించి సరికానిది?
1) అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకుంటారు
2) నిర్ణయాలు త్వరితంగా తీసుకుంటారు
3) విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి దోహదపడుతుంది
4) భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది
96. భవాని తన విద్యార్థులను క్షేత్రపర్యటనకు తీసుకువెళ్లింది. వచ్చిన తర్వాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ విధమైన పరిగణన పద్ధతితో సరిపోతుంది?
1) పరిగణనం కోసం అభ్యసనం
2) పరిగణనం కోసం అభ్యసనం
3) అభ్యసనం పరిగణనం
4) అభ్యసనం కోసం పరిగణనం
97. జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 దృష్ట్యా ‘జ్ఞానానికి’ సంబంధించి సరైన ప్రవచనం?
1) స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు
2) అనుభవాత్మక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి
3) సమాజ జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు
4) పుస్తక జ్జానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి
98. RTE-2009 ప్రకారం సరికాని ప్రవచనం?
1) పిల్లల వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి
2) పిల్లలను శారీరకంగా, మానసికంగా హిం సించకూడదు
3) పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించ లేకపోతే మళ్లీ అదే తరగతిలో కొనసాగాలి
4) పిల్లల మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి
99. ఒక ప్రాథమిక పాఠశాల్లో 245 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఆ పాఠశాల్లో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?
1) ఆరుగురు ఉపాధ్యాయులు+ 1 ప్రధానోపాధ్యాయుడు
2) అయిదుగురు ఉపాధ్యాయులు + 1 ప్రధానోపాధ్యాయుడు
3) ఏడుగురు ఉపాధ్యాయులు+ 1 ప్రధానోపాధ్యాయుడు
4) ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే
100. హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం?
ఎ. సన్నాహం బి. సమర్పణ
సి. సంసర్గం డి. సాధారణీకరణం
ఇ. అన్వయం ఎఫ్. పునర్విమర్శ
1) ఎ, బి, సి, డి,ఇ, ఎఫ్
2) బి, ఎ, సి, డి, ఇ, ఎఫ్
3) బి, ఎ, డి, ఇ, సి, ఎఫ్
4) ఎ, బి, డి, సి, ఇ, ఎఫ్
సమాధానాలు
67-3 68-4 69-1 70-3 71-3 72-2 73-1 74-2 75-3, 76-1, 77-1, 78-1, 79-1, 80-3, 81-3, 82-2, 83-2, 84-2, 85-2, 86-1, 87-3, 88-1, 89-1, 90-1, 91-2, 92-4, 93-3, 94-2, 95-2, 96-3, 97-4, 98-3, 99-1, 100-1
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?