ఎకానమీలో మార్కులు సాధించడమెలా?
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సబ్జెక్టుల్లో అర్థశాస్త్రం కొంత క్లిష్టమైన సబ్జెక్టు. అదే సమయంలో స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. హిస్టరీ, సివిక్స్, కామర్స్ సబ్జెక్టులతో పోలిస్తే నూటికి నూరు శాతం మార్కులు పొందే అవకాశం ఉన్న శాస్త్రం అర్థశాస్త్రం. కాకపోతే దీనిలో ఉన్న కీలక భావనలు అర్థం చేసుకుంటే మార్కులు పొందడం ఎంతో ఈజీ..!
-ప్రస్తుత కాలంలో సీఏ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అర్థశాస్త్ర పాఠ్యాంశ విషయ అవగాహనకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
-అర్థశాస్త్రంలో వందకు 100 మార్కులు సాధించాలంటే ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ చాలా అవసరం.
ప్రథమ సంవత్సర పాఠ్యాంశ విశ్లేషణ
మొదటి సంవత్సరం అర్థశాస్త్రంలో 2014-15 అకడమిక్ ఇయర్ నుంచి స్వల్ప మార్పులు జరిగాయి. దీనిలోఉన్న 10 పాఠ్యాంశాలకు సంబంధించి మార్కుల వెయిటేజీ కింది విధంగా ఉంది.
పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే
-ఒకటో యూనిట్ పరిచయంలో ప్రధానంగా మూడు అంశాల ప్రస్థావన ఉంటుంది. ఒకటి అర్థశాస్త్ర పరిచయం, నిర్వచనాలు, రెండు అర్థశాస్త్ర భావనలు, మూడు అర్థశాస్త్ర విషయాలను అంచనావేసే పద్ధతులు మొదలైనవి. దీనిలో 5, 2 మార్కులకు సంబం ధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వృద్ధి నిర్వచనం, జాకబ్ వైనర్ నిర్వచనం, సూక్ష్మ, స్థూల అర్థశాస్ర్తాల మధ్య భేదాలు, ఆగమన, నిగమన పద్ధతులపై ప్రశ్నలు వస్తాయి.
-రెండో యూనిట్ వినియోగ సిద్ధాంతంలో ప్రధానంగా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి వినియోగ సిద్ధాంతాలు, రెండు ఉదాసీనత వక్రరేఖలు. ఈ రెండు అంశాల్లో 10 మార్కులకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రాలపై ప్రశ్న లు వస్తాయి.
-మూడో యూనిట్ డిమాండ్ సిద్ధాంతం ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి డిమాండ్ సూ త్రం దాని అనుబంధ అంశాలు. రెండు డిమాండ్ వ్యాకోచత్వం. డిమాండ్ సూత్ర పటం పట్టిక, డిమాండ్ సూత్రానికి మినహాయింపులు, డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు కారణాలు. డిమాండ్ వ్యాకోచత్వంలో ధర డి మాండ్ వ్యాకోచత్వ రకాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-నాల్గో యూనిట్ ఉత్పత్తి సిద్ధాంతంలో ప్రధానంగా మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఉత్పత్తి సిద్ధాంతాలు ఉత్పత్తి వ్యయ, రాబడి చివరగా సప్లయ్ సూత్రం మొదలైనవి. చరానుపాతాల సూత్రం, తరహాననుసరించి ప్రతిఫలాల సూత్రం ప్రధానమైనవి. మార్కులకు సప్లయ్ పట్టిక, సగటు, ఉపాంత వ్యయ రాబడులు ముఖ్యంగా చదవాలి.
-ఐదో యూనిట్లో విలువ సిద్ధాంతం. దీనిలో ప్రధానంగా మార్కెట్ వర్గీకరణ, పోటీని బట్టి మార్కెట్ ప్రధానమైనవి. సంపూర్ణ పోటీ మార్కెట్ నిర్వచనం దానిలో వస్తువు ధర నిర్ణయం, ఏకస్వామ్యం దానిలో ధర నిర్ణయం, మార్కెట్ల వర్గీకరణ, ధర విచక్షణ పద్ధతులు ప్రధానమైనవి.
-ఆరో యూనిట్ పంపిణీ సిద్ధాంతాలు. దీనిలో ప్రధానంగా ఉత్పత్తి కారకాలు, వాటి ధర నిర్ణయానికి సంబంధించిన సిద్ధాంతం పొందుపరిచారు. ఉపాంత ఉత్పాదక సిద్ధాంతం, రికార్డో భాటక సిద్ధాంతం, వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు మొదలైన వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి.
-ఏడో యూనిట్ జాతీయాదాయం. ఈ యూనిట్లో ఒక దేశ ఆదాయానికి సంబంధించిన నిర్వచనాలు దాని భావనలు, దాన్ని కొలిచే పద్ధతులు ప్రధానమైనవి.
-8వ యూనిట్ స్థూల ఆర్థిక అంశాలు. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం, జేఎం కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ముఖ్యమైనవి. ప్రభుత్వ రాబడి మూలా లు, ప్రభుత్వ వ్యయం, రుణ విమోచన మార్గాల నుంచి పదిమార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-9 యూనిట్ ద్రవ్యం- బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం పాఠ్యాంశం నుంచి 5 మార్కులు, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వస్తుమార్పిడి పద్ధతిలో లోపాలు, ద్రవ్య విధులు, ద్రవ్య సప్లయ్, ద్రవ్యోల్బణం రకాలు దానికి గల కారణాలు ముఖ్యంగా చదవాలి.
-10వ యూనిట్ ఆర్థిక గణాంకశాస్త్రం. ఇది 2014 -15 నుంచి ప్రవేశపెట్టారు. ఇది వార్షిక పరీక్షలకు చాలా ప్రధానమైనది. దీనిలో 5 మార్కుల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అంకమధ్యమం, మధ్యగతం, బా హుళకం ముఖ్యమైనవి.
-ఎక్కువ మార్కులు సాధించడానికి: వినియోగ సిద్ధాంతాలు, ఉత్పత్తి సిద్ధాంతాలు, విలువ సిద్ధాంతాలు, జాతీయాదాయం, స్థూల ఆర్థిక అంశాలు చాలా ముఖ్యమైనవి.
సెకండ్ ఇయర్ ఎకనామిక్స్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో మొత్తం 10 పాఠ్యాంశాలు ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థల లక్షణాలను అవగాహన చేసుకోవాలి. ఈ రెండు అంశాలు అర్థమైతే పది పాఠ్యాంశాల నుంచి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయవచ్చు. దీంతో వందకు 100 మార్కులు సాధించవచ్చు.
పాఠ్యాంశాల వారీగా విశ్లేషణ
-యూనిట్ 1: ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి. దీనిలో ముఖ్యంగా తలసరి ఆదాయాన్ని ఆధారం చేసుకొని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల లక్షణాలను వివరిస్తూ ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధికి మధ్య బేధాలు ఉంటాయి. వీటిలో పదిమార్కులకు అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు అనే అంశాన్ని కచ్చితంగా అడుగుతారు.
-యూనిట్ 2: నూతన ఆర్థిక సంస్కరణలు. దీనిలో అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ప్రధానంగా పొందుపరిచారు.10 మార్కులకు ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్రను, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలను అడిగే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ ప్రయోజనాలు, లోపాలు, డబ్ల్యూటీవో అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-యూనిట్ 3 జనాభా, మానవవనరుల అభివృద్ధి: దేశంలో జనాభా దాని పరిణామాలు, పర్యవసనా లు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి వైద్య, విద్య మొదలైనవి. దేశంలో అధిక జనాభాకు గల కారణాలు, నివారణ చర్యలు, జాతీయ జనాభా విధానం-2000లోని ముఖ్యాంశాలు. జనాభా పరిణామ సిద్ధాంతం, ఆర్థికాభివృద్ధిలో విద్య, వైద్యం పాత్ర, మానవాభివృద్ధిని లెక్కించి వివిధ సూచికలు ముఖ్యమైనవి.
-యూనిట్ 4 జాతీయాదాయం. దీనిలో ముఖ్యంగా జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా, ఆదాయ అసమానతలు, పేదరికం మొదలైన అంశాలు ప్రధానమైనవి. దేశంలో ఆదాయ సంపద పంపిణీలో అసమానతలకు గల కారణాలు, నివారణ చర్యలు. పేదరికానికి గల కారణాలు, నివారణ చర్యలు ప్రధానంగా అడిగే ప్రశ్నలు.
-యూనిట్ 5: వ్యవసాయ రంగం. ఇందులో వ్యవసాయరంగ ప్రాధాన్యత, దాని ఉత్పాదకత, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ, ప్రధాన అంశాలు. వ్యవసాయరంగ ప్రాధాన్యత, ఉత్పాదకత తక్కువకు గల కారణాలు, ఉత్పాదకతను పెంచడానికి తీసుకోవలసిన చర్యలు. నాబార్డు పాత్ర, హరిత విప్లవం, దాని ప్రభావం, గ్రామీణ రుణగ్రస్థతకు గల కారణాలు, నివారణ చర్యలు, భూసంస్కరణల వైఫల్యాలు మొదలైనవి ముఖ్యమైనవి.
-యూనిట్ 6: పారిశ్రామికరంగం. దీనిలో ముఖ్యంగా భారతదేశ పారిశ్రామికరంగ ప్రాధాన్యత, 1991 పారిశ్రామిక విధాన తీర్మానం, చిన్నతరహా పరిశ్రమల పాత్ర, అవి ఎదుర్కొనే సమస్యలు మొదలైనవి. పారిశ్రామిక రంగం వెనుకబడి ఉండటానికి గల కారణాలు, పారిశ్రామిక క్షేత్రాలు, ప్రయోజనాలు, లోపాలు. 1948, 1956 పారిశ్రామిక తీర్మానాలు ముఖ్యమైనవి.
-యూనిట్ 7: దీనిలో ముఖ్యంగా భారతదేశంలో సేవలరంగం ప్రాధాన్యత, పర్యాటకరంగం, రవాణా వ్యవస్థ, బ్యాంకింగ్, బీమా మొదలైనవి ముఖ్యమైన విషయాలు.
-యూనిట్ 8: ప్రణాళికలు. దేశంలో పంచవర్ష ప్రణాళికలు, వాటి అమలు, జయాలు, అపజయా లు, దేశంలో ప్రాంతీయ అసమానతలు, దానికి గల కారణాలు ప్రధానమైనవి. పదవ పంచవర్ష ప్రణాళిక, వాటిలక్ష్యాలు, 11వ పంచవర్ష ప్రణాళిక, లక్ష్యాలు, ప్రాంతీయ అసమానతలు, వాటికి గల కారణాలు ముఖ్యమైనవి.
-యూనిట్ 9: పర్యావరణం,ఆర్థికాభివృద్ధి, పర్యావరణంలోని భాగాలు. పర్యావరణ అనుఘటకాలు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం,సహజ వనరులు, అడవుల వినాశనానికి గల కారణాలు మొదలైనవి చదవాలి.
-యూనిట్ 10: దీనిలో ఏపీ ఆర్థికవ్యవస్థ ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దీనిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు మొదలైనవి ప్రధానాంశాలు.
-ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో అర్థశాస్త్రం మొత్తం మూడు కోర్సులో కామన్ అంశంగా ఉంటుంది. ప్రశ్న పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది.
భాగం -ఏ
దీనిలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఈ భాగంలో మొత్తం ఐదు ప్రశ్నలు. వీటిలో విద్యార్థి మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 40 పంక్తులకు మించకుండా సమాధానం రాయాలి. మూడు ప్రశ్నలకు 30 మార్కులు (10X3 =30).
భాగం – బీ
-దీనిలో స్వల్ప సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ఈ భాగంలో మొత్తం 12 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 8 ప్రశ్నలకు 20 పంక్తులకు మించకుండా సమాధానం రాయాలి. 8 X 5 =40 మార్కులు.
భాగం – సీ
-ఇందులో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 20ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు 5 పంక్తులు దాటకుండా సమాధానం రాయాలి.
15 X 2 = 30 మార్కు లు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు