తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి ప్రజల నైపుణ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అనేక భారీ ప్రభుత్వరంగ సంస్థలను, కేంద్ర పారిశ్రామిక శిక్షణ సంస్థలను, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన పరిశోధనా సంస్థలను CSIR ఆధ్వర్యంలో నెలకొల్పాయి. వాటితోపాటు అనేక మౌలికరంగ పరిశ్రమలను కూడా జాతీయ సైన్స్ టెక్నాలజీ విభాగం అభివృద్ధి కోసం స్థాపించాయి. దక్షిణ భారతదేశంలో అనువైన భౌగోళిక పరిస్థితులు, నాణ్యమైన మానవ వనరులు, విస్తృతమైన సహజవనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకొని దేశంలోనే అధికంగా సుమారు 60 వరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పారు. వాటిని గురించి సమగ్రంగా చూద్దాం..
ECIL
– అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో 1967, ఏప్రిల్ 11న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఏర్పాటయింది. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన, అభివృద్ధిలో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధనలో కీలకపాత్ర పోషిస్తున్నది.
ఇది..
– దేశంలో మొదటి డిజిటల్ కంప్యూటర్
– దేశంలో మొదటి సాలిడ్ స్టేట్ టీవీ
– దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్
– మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియంత్రణ పరికర వ్యవస్థలను రూపొందించింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
BEL మొదటి యూనిట్‌ను బెంగళూరులో 1954లో స్థాపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని 9వ యూనిట్‌ను 1986లో హైద్రాబాద్‌లో స్థాపించారు. ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాల తయారీ హైద్రాబాద్ యూనిట్లో జరుగుతుంది. రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ అవసరాలకు సాంకేతిక సహాయాన్ని BEL అందిస్తుంది. ఇది నవరత్న హోదాను పొందింది.
ప్రాగా టూల్స్
– ఇండియాకు సంబంధించిన యంత్రాల విడి భాగాల తయారీకి చెందిన ప్రముఖ సంస్థ PRAGA. దీన్ని 1943లో హైదరాబాద్‌లో స్థాపించారు. ఇది యం త్రాల విడి పరికరాలను రూపొందిస్తుంది. కట్టర్లు, టూల్ గ్రైండర్లు, త్రెడ్ రోలింగ్ మిషన్స్ మొదలైనవాటిని తయారు చేసింది. దేశంలో మిషిన్ టూల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నది.
IDPL
– కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద ఫార్మా రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (IDPL). ఇది 1961లో ప్రారంభమైంది. దీని యూనిట్లు రిషీకేష్, గుర్గావ్, హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇది అత్యవసర, జీవనాధార మందుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడానికి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది.
– ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలు అందించేందుకు జాతీయ ఆరోగ్య పథకాల అమలులో దీనికి భాగస్వామ్యం ఉంటుంది.
– నాణ్యత గల మందులను నిరంతరం సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)
– దీనిని 1964లో స్థాపించారు. దేశంలోని అతిపెద్ద ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఇది ఒకటి. సమగ్ర విద్యుత్ ప్లాంట్ల, ప్లాంట్ పరికరాల డిజైన్, తయారీ టెస్టింగ్ తయారీకి మూలాధారం. విద్యుత్, రవాణ, చమురు, గ్యాస్ వంటి కోర్ సెక్టార్ల అభివృద్ధి పరిశోధనకు బీహెచ్ఈఎల్ కీలకం. ఇది థర్మల్ పవర్‌ప్లాంట్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మహారత్న హోదా కలిగిన కంపెని.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)
– HAL ఏవియేషన్ ఎలక్ట్రానిక్స్, ఏవియోనిక్స్ డివిజన్‌ను 1965లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీనికి నవరత్న హోదా ఉంది.
– ఆటోమెటిక్ డైరక్షన్ ఫైండర్.
– రేడియో అల్టీమీటర్ తయారీలో HAL-Hyd డివిజన్ కీలకపాత్ర పోషించింది. MIG ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని పొందుపర్చారు. కమ్యూనికేషన్, నావిగేషన్లలో రక్షణ శాఖకు సాంకేతికతను అందిస్తుంది.
HMT
– హిందుస్థాన్ మిషన్ టూల్స్ లిమిటెడ్ (HMT)ను 1953లో ప్రారంభించారు. గడియారాలు, ముద్రణా యంత్రాలు, బేరింగ్స్ తయారుచేస్తుంది. హైదరాబాద్‌లోని HMT డివిజన్ ట్రాక్టర్లను HMT పేరుమీద తయారుచేసింది.
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (REC)
– దీనిని 1969లో ప్రారంభించారు. REC దక్షిణప్రాంత మండలం ప్రధాన కార్యాలయం హైద్రాబాద్‌లో ఉంది.
– భారతదేశంలో గ్రామీణ విద్యుదీకరణకు ప్రోత్సాహం ఆర్థిక సహాయం చేస్తుంది.
– ఇది నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)
– ఇది భారత ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీన్ని 1970లో ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్, మెదక్ జిల్లాలోని భానూరుల్లో దీని తయారీ కేంద్రాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 2 యూనిట్లు స్థాపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
– Anti Tank Guided Missile రూపకల్పనలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది.
హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్
– భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (HCL) 1952లో హైదరాబాద్‌లో, అలహాబాద్ (ఉత్తరప్రదేశ్), రూప్నారాయణ్ పూర్ (వెస్ట్‌బెంగాల్) కేంద్రాలుగా స్థాపించారు. వేగవంతగా విస్తరిస్తున్న ఐటీ అభివృద్ధిలో HCL కీలకపాత్ర పోషిస్తున్నది. టెలికాం కేబుల్స్ తయారీలో వివిధ రకాల టెలికాం అవసరాలకు కేబుల్స్‌ను తయారుచేస్తుంది.
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (MIDANI)
– దీనిని 1973లో ప్రారంభించారు. పారిశ్రామికీకరణ అభివృద్ధికి ప్రత్యేక లక్షణాలు గల లోహాలు, వివిధ రకాల మిశ్రమ లోహాల తయారీలో (టైటానియం, మిశ్రమ లోహాలు) MIDANI కీలకపాత్ర పోషిస్తున్నది. ఏరోస్పేస్, రక్షణ, అణుశక్తి, అంతరిక్ష రంగాల్లో ఈ లోహాల అనువర్తనాలు కీలకం. Metallurgyలో పరిశోధనలు జరుపుతుంది.
రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శిక్షణా సంస్థలు
– నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)
దీనిని 1998లో హైదరాబాద్‌లో స్థాపించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటాడు. భవన నిర్మాణ రంగంలో ఉపాధి కల్పన, భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. నిర్మాణ రంగంలో నూతన సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం, ఇంజినీర్లకు వృత్తిపరమైన శిక్షణ నిస్తుంది. కరీంనగర్లో కూడా దీని క్యాంపస్ ఉంది.
ASCI
– అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ASCI)ను 1956 లో ఖైరతాబాద్‌లో GOI ఏర్పాటుచేసింది. కార్పొరేట్ , అన్ని ప్రభుత్వరంగాల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్టిఫికెట్స్ ఇస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీ క్యాప్డ్
– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీ క్యాప్డ్ (NIMH) కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనిని 1984లో సికింద్రాబాద్‌లో ఏర్పాటుచేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగులు, ఆటిజంతో బాధపడే చిన్నారులకు చికిత్స, ప్రత్యేకమైన విద్యావసతులు శిక్షణ నిస్తారు.
DRDL
– డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ లాబోరేటరీ (DRDL)ని హైదరాబాద్‌లో 1962లో ఏర్పాటుచేశారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్ట పరచడంలో ఈ కంపెనీది కీలకపాత్ర. క్షిపణి వ్యవస్థ రూపకల్పన, క్షిపణుల తయారీ వాటి ప్రయోగాల్లో DRDL కృషి చేస్తుంది. ఈ సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆకాశ్, నాగ్, పృథ్వీ, అగ్ని వంటి క్షిపణులు భారత సైన్యాన్ని యుద్ధరంగంలో పటిష్ట పరిచాయి.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)
– అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో మౌలాలీ (హైదరాబాద్)లో 1971లో దీన్ని ఏర్పాటు చేశారు. న్యూక్లియర్ ఇంధన బం డిల్స్, రియాక్టర్ కోర్ పదార్థాలను ఇది తయారుచేస్తుంది. దీనిలో భారత అణుశక్తి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతోంది. యురేనియం ఇంధనం, జిర్కోనియం మిశ్రమం లోహ క్లాడింగ్‌ను రూపొందించింది.
Ordnance Factory
– హైదరాబాద్ శివార్లలోని ఎద్దుమైలారం (మెదక్ జిల్లా) ఉన్న ఆర్డ్‌నెన్స్ ఫ్యాకరీ దేశంలో ఉన్న 40 ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల్లో ఒకటి. Sarath BMP-II సైన్యానికి చెందిన ఆయుధాలతో కూడిన అత్యాధునిక వాహనాన్ని రూపొందించింది. దీనిని 1987లో ఏర్పాటు చేశారు.
ICRISAT
– రాష్ట్రంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ICRISAT. దీనిని 1972లో పటాన్చెరువు (మెదక్ జిల్లా)లో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, టెక్నాలజీ-సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు (ICRISAT) సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తాయి. ఆసియా, ఆఫ్రికా దేశాలలో అర్థశుష్క వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరగగల వంగడాల రూపకల్పన, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, మెట్ట ప్రాంత వ్యవసాయ సాగుపై పరిశోధనలు చేపడుతుంది.
జాతీయ విద్యాసంస్థలు EFLU
– ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ (EFLU) 1958లో స్థాపించబడింది. ఇది 1973లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి భాషల్లో కోర్సులను నిర్వహిస్తుంది.
MANUU
– మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటి (MANUU) గచ్చిబౌలిలో ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ అయిన దీనిని 1998లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటుచేశారు. ఇది అనేక UG, P.G. Ph.D కోర్సులను అందిస్తున్నది. దూర విద్యా కోర్సులను కూడా నిర్వహిస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU)
– 1973నాటి 6 సూత్రాల పథకం అమలులో భాగంగా దీనిని గబ్చిబౌలీలో 1974లో ఏర్పాటుచేశారు. ఇది జనవరి 2015లో బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా గా రాష్ట్రపతిచే ప్రకటించబడింది.
BITS-Pilani
– దీనిని శామీర్‌పేట్‌లో 2008లో స్థాపించారు. ఇంజినీరింగ్ విద్యలో అత్యున్నత ప్రమాణాలతో కోర్సులను అందిస్తున్నది.
IIIT గచ్చిబౌలి
– ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 1998లో స్థాపించారు. N-PPP కింద ఇండియాలో స్థాపించబడిన మొదటి స్వతంత్ర సంస్థ. IT, Computer Science, Electronics and communicationsల్లో కోర్సులను అందిస్తుంది.
(మిగతా వచ్చేవారం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు