ప్రపంచీకరణ-ప్రభావం
– దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. ఇది 20వ శతాబ్దపు చివరలో ప్రపంచమంతటా సంభవించిన గొప్పమార్పు.
– అధిక విదేశీ పెట్టుబడులు. అధిక విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది. వేగంగా పెరుగుతున్న అనుసంధానం అంతఃసంబంధాలే ప్రపంచీకరణ.
– అంతర్జాతీయ ఆర్థిక మార్పిడితో మనం 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు అవి
1) వస్తు సేవల ప్రవాహం
2) శ్రమ ప్రవాహం -ఉపాధి కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం
3) పెట్టుబడి ప్రవాహం స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడం
– ఇవేగాక ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలున్నాయి.
-ట్యూనీషియా (పశ్చిమ ఆసియా) ఈజిప్టు (ఉత్తర ఆఫ్రికా) వంటి దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంతలను తొలగించటానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. ప్రసార మాధ్యమాలు దీనిని అరబ్ వసంతంగా పేర్కొన్నాయి.
– ఈ దేశాల్లో ప్రసార మాద్యమాలు కీలక పాత్ర పోషించాయి.
-ప్రపంచీకరణ కేవలం మార్కెట్‌కే పరిమితం కాలేదు. ఆలోచనలు భావాలు కూడా పంచుకోబడి విస్తృతమౌతున్నాయి.
– 19వ శతాబ్దంలో విదేశీ వ్యాపారం విదేశీ పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి.
-భారత్ నుంచి శ్రామికులు కరేబియన్ దీవులకు, మారిషస్, ఫిజీ, మలయా, శ్రీలంక వంటి దేశాలకు వెళ్లారు.
-చైనీయులు భారతీయ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ భారత్‌లో తమ వస్తువులను అమ్ముకోవాలని, తమ కార్మికులను అక్కడికి పంపించాలని భారతీయ భాగస్వాములతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు.
బహుళజాతి కంపెనీలు (MNC’s) – Multi National Companies
-ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు.
– కార్మికులు, ఇతర వనరులు కగా లభించే ప్రాంతాల్లో బళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పాయి.
– ఉత్పత్తి ప్రక్రియను చిన్నచిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతారు వీటన్నింటి ఫలితంగా బళజాతి సంస్థలకు ఖర్చులో 50-60 శాతం ఆదా అవుతుంది.
-ఎంఎన్‌సీలు మార్కెట్లు, కార్మికులు, ఉత్పత్తి కారకాల అందుబాటు అనువైన ప్రభుత్వ విధానాలు ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకుంటాయి.
-భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల వంటి వాటి కోసం ఎంఎన్‌సీలపై పెట్టే ఖర్చు మొత్తం ‘విదేశీ పెట్టుబడులు’ అంటారు.
-కొన్ని సందర్భాల్లో బళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేపడతాయి. వీటినే జాయింట్ వెంచర్లు అంటారు.
– ఎంఎన్‌సీలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల, అదనపు పెట్టుబడి వల్ల స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.
– చాలా సందర్భాల్లో ఎంఎన్‌సీలు స్థానిక సంస్థలను కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి.
ఉదా: కార్గిల్ ఫుడ్స్(అమెరికా) అనే ఎంఎన్సీ ‘పారఖ్పుడ్స్’ అనే చిన్న భారతీయ కంపెనీని కొనేసింది.
– ఎంఎన్‌సీలు ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తి దారులకు ఉత్పత్తి కోసం ఆర్డర్లు ఇస్తాయి. ఈ విధంగా ఉత్పత్తి అయిన వస్తువులను తమ బ్రాండ్ల పేరుతో వినియోగదారులకు అమ్ముతాయి.
ఫోర్డ్ మోటార్స్ : ఇది అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తి దారుగా ఉంది. ఫోర్డ్మోటార్స్ 1995లో భారత్‌కు వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కార్మాగారాన్ని నెలకొల్పింది. భారత్‌లో పెద్ద కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో 27000 కార్లు అమ్మింది.
-భారత్ నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు 24000 కార్లు ఎగుమతి చేస్తుంది.
-చైనా ఉత్పత్తిదారులు భారత్‌కు ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేస్తున్నారు. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో ఆదరణ పొందాయి.
– ఒక సంవత్సరం కాలంలో బొమ్మల దుకాణాల్లో 70-80 శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను అమ్ముతున్నాయి.
భారత్‌లో విదేశీ పెట్టుబడుల విధానాల సరళీకరణ
– విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి, తగ్గించడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు.
– పన్ను విధించటం, పరిమితులు విధించటం గానీ వాణిజ్య అవరోధాలుగా చెప్పవచ్చు.
– ప్రభుత్వం దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య/మోతాదుపై కూడా పరిమితి విధిస్తే దీనిని ‘కోటా’ అంటారు.
ఉదా: చైనా బొమ్మలపై అధిక పన్ను విధిస్తే వాటి దిగుమతులు తగ్గుతాయి.
– భారత్‌లో స్వాతంత్య్రానంతరం స్వదేశీ పరిశ్రమల రక్షణ కోసం విదేశీ వాణిజ్య పెట్టుబడులపై అవరోధాలు విధించింది.
– 1991 నుంచి మాత్రం దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాల్లో మార్పులు చేసారు.
-దీనిలో భాగంగా విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు చాలా వరకు అవరోధాలను తొలగించారు.
– దీనితో దేశంలోకి సరుకులు స్వేచ్ఛగా దిగుమతి, ఎగుమతి చేసుకోవచ్చు.
-విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కర్మాగారాలు స్థాపించవచ్చు.
-ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్నే ‘‘ఆర్థిక సరళీకరణ/ సరళీకృత ఆర్థిక విధానం’’ అంటారు.
-అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) పనిచేస్తుంది.
-అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అది పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 150 దేశాలు డబ్ల్యూటీవోలో సభ్యులుగా ఉన్నాయి.
భారత్‌పై ప్రపంచీకరణ ప్రభావం
-విదేశీ కంపెనీలతో కలసి పనిచేయడం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బళజాతి సంస్థలుగా ఎదిగాయి.
– ఉదా: టాటా మోటార్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (IT), రాన్‌బాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు) సుందరం ఫాస్టెనర్స్ (నట్లు, బోల్టులు) మొదలైన కంపెనీలు.
– ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి, ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
-ఇటీవల కాలంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్‌ల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉంటాయి. ఉదా: విద్యుత్, నీరు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు.
– సెజ్‌లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి 5 సంవత్సరాలపాటు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
-విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది.
ప్రపంచీకరణ ఎదుర్కొనే సవాళ్లు
– అనేక చిన్న ఉత్పత్తి దారులకు, కార్మికులకు ప్రపంచీకరణ పెను సవాళ్లు సృష్టించింది.
-విదేశీ కంపెనీలు రావడం వల్ల దేశీయంగా ఉన్న చిన్న చిన్న కంపెనీలు కొన్ని మూత పడ్డాయి.
– భారత్‌లో చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే 3 అవసరాలున్నాయి. అవి.
ఎ) మెరుగైన రోడ్లు, విద్యుత్, నీళ్ల్లు, ముడిసరుకులు, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్
బి) సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునికీకరణ
సి) తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు
– ప్రపంచీకరణ వల్ల విద్య, నైపుణ్యం, సంపద, ఉన్నవాళ్లు కొత్త అవకాశాల వల్ల లాభపడ్డారు.
-ప్రపంచీకరణ వల్ల లాభం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.
– పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్‌ను (IBRD), అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (IDA) ను కలిపి ప్రపంచ బ్యాంక్‌గా వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థల్లో 170కిపైగా సభ్యదేశాలున్నాయి.
-అమెరికా వంటి దేశాలు ఈసంస్థల పనిని నిర్దేశిస్తాయి.
– ఇందులో అమెరికా ఓటు విలువ -16 శాతం
– జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్కదానికి 3-6 శాతం ఓటు అధికారం ఉంది.
– పేద దేశాల ఓటు విలువ తక్కువగా ఉంది.
ఉత్పత్తి-ఉపాధి
-ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తుసేవల విలువలను స్థూల దేశీయోత్పత్తి తెలియజేస్తుంది.
-స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడానికి జోడించిన అదనపు విలువను గానీ లేదా అంతిమ వస్తుసేవల విలువను గానీ పరిగణనలోకి తీసుకుంటారు.
– స్థూల దేశీయోత్పత్తిలో ఉచిత సేవలను పరిగణించరు.
ఉదా: గృహిణి తల్లి సేవలు
భారత్‌లో వివిధ రంగాల ప్రాముఖ్యత
-భారత ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా విభజిస్తారు. అవి
1) ప్రాథమిక రంగం / వ్యవసాయ రంగం
2) ద్వితీయ రంగం / పారిశ్రామిక రంగం
3 తృతీయ రంగం / సేవా రంగం
-ప్రాథమిక రంగంలో వ్యవసాయం, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు, గనుల తవ్వకం మొదలగు అంశాలుంటాయి.
– ద్వితీయ రంగంలో వస్తుతయారీ, నిర్మాణాలు, నీటి పారుదల, విద్యుత్, గ్యాస్ సంబంధిత ప్రాజెక్టులు మొదలగు అంశాలుంటాయి.
– తృతీయ రంగంలో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు, బ్యాంకింగ్, బీమా, రవాణా, సమాచారం వ్యక్తిగత సామాజిక సేవలు మొదలైన అంశాలుంటాయి.
-ఒకపుడు అన్ని దేశాల్లో వ్యవసాయ రంగం ప్రధానమైనదిగా ఉండేది.
-పారిశ్రామిక విప్లవం రావటంతో కర్మాగారాలు స్థాపించబడి రంగాల ప్రాముఖ్యత మారింది.
– పారిశ్రామిక విప్లవం రావటం వల్ల పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయింది. ఉత్పత్తి, ఉపాధిల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది.
-గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుంచి సేవారంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తి, ఉపాధిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది.
సేవల్లో తిరిగి 3 రకాలున్నాయి.
ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు : ప్రభుత్వ పాలనా యంత్రాంగం దేశ రక్షణ విద్యా, వైద్యం, పశువైద్య కార్యకలాపాలు, ప్రసార మాద్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలపాలు వంటివి.
ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు : బ్యాంక్‌లు, పోస్టాఫీసు పొదుపు ఖాతాలు, బ్యాంక్‌లు కాని ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు వంటివి.
స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా
1972-73 2015-16
1)వ్యవసాయం 43 % 19%
2) పరిశ్రమలు 22% 28%
3) ప్రజా సామాజిక,వ్యక్తిగత సేవలు 12 % 12%
4) ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవలు 08 % 22%
5) వ్యాపారం, హోటళ్లు, రవాణా, ప్రసారాలు 15 % 19%
వ్యాపార, హోటళ్లు, రవాణా ప్రసారాలు
– 43 సం.ల కాలంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది.
-జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా కొంచెం పెరిగింది.
-సేవా కార్యాకలాపాల్లోని మూడింటిలో రెండు రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంది.
– 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు.
-దేశంలోని కార్మికులలో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి ఆరింట ఒక వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు.
– స్ధూల దేశీయోత్పత్తిలో 75 శాతం వాటా వున్న పారిశ్రామిక, సేవా రంగాలు మొత్తం కార్మికుల్లో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు.
– వ్యవసాయ రంగంలో ఉన్న కార్మికులు వారు ఉత్పత్తి చేయగలిగినంతగా చేయటం లేదు.
– భారత వ్యవసాయరంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది.
-వ్యవసాయం నుంచి కొంతమంది తరలి పోయినా ఉత్పత్తి ప్రభావితం కాదు. ఈ విధంగా వ్యవసాయ రంగంలో కార్మికులు అల్ప ఉపాధి కలిగి ఉన్నారు. అల్ప ఉపాధి అంటే అందరూ పనిచేస్తున్నట్లు ఉంటుంది. కానీ ఎవరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండదు
– పనిలేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది. కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరకీ కనబడదు. అందుకే దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని కూడా అంటారు.
మూడు రంగాల్లో ఉపాధి వాటా 1973-74 2017-18
1) వ్యవసాయం 74 శాతం 4 4 శాతం
2) పరిశ్రమలు 11 శాతం 25 శాతం
3) సేవలు 15 శాతం 31 శాతం
మూడు రంగాల్లో స్థూల దేశీయోత్పత్తి వాటా (జీడీపీ)
1973-74 2015-16
1) వ్యవసాయం 43 శాతం 19 శాతం
2) పరిశ్రమలు 22 శాతం 28 శాతం
3) సేవలు 35 శాతం 53 శాతం
వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి
వ్యవస్థీకృత రంగం
-ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగాలుగా పిలుస్తారు.
– ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకొని కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం వంటి చట్టాల్లో ఉన్న నియమ నిబంధనలను అనుసరిస్తాయి.
-ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది.
– వాళ్లు రోజులో నిర్దారిత గంటలు మాత్రమే పనిచేయాలి. ఎక్కువ పనిచేస్తే అదనపు వేతనం ఉంటుంది.
– జీతంతో కూడిన సెలవు, భవిష్యనిధి (పీఎఫ్), వైద్యసౌకర్యాలు, పింఛను మొదలైన ప్రయోజనాలు పొందుతారు.
– ప్రభుత్వ కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్లు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు.
అవ్యవస్థీకృత రంగం
-ఉద్యోగాల స్థాయిలో గానీ, జీతాల స్థాయిలో గానీ నియమిత పద్ధతి, నిబంధనలు లేకుండా ఉన్నదే
అవ్యవస్థీకృత రంగం
l ఈ రంగంలో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. కానీ ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నింబంధనలు ఉంటాయి. కానీ ఎవరూ పాటించరు.
-ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రతకూడా ఉండదు.
-అధిక శాతం కార్మికులు చాలా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుంటారు.
– గ్రామీణ ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కూలీలు సన్న, చిన్న రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మర, వడ్రంగి. కంసాలి వంటి చేతిపనివారు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
-పట్టణ ప్రాంతంలోని చిన్నతరహా పరిశ్రమలు భవన నిర్మాణం, వ్యాపారం, రవాణా వంటి వాటిలో రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్లు, బరువులు మోసేవాళ్ళు, చిత్తుకాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవారు వ్యవస్థీకృత కార్మికులు అవుతారు.
– షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
-2004-05లో మొత్తం కార్మికుల్లో 92 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండి మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు.
-కేవలం 8 శాతం కార్మికులు భద్రతతో కూడిన మంచిఉద్యోగం నుంచి వస్తు సేవల్లో 50 శాతం ఉత్పత్తికి దోహదం చేశారు.
వెంకట్
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు