తెలంగాణలో తయారైన తొలి రోబో?
ఆధునిక ప్రపంచంలో మానవ జీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్న, చేయనున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో రోబోటిక్ టెక్నాలజీ కీలకమైనది. పారిశ్రామిక, సైనికరంగాలతోపాటు సేవల రంగంలో కూడా రోబోల వాడకం క్రమక్రమంగా పెరుగుతున్నది. రోబోటిక్ టెక్నాలజీపై పోటీ పరీక్షల్లో తరుచుగా ప్రశ్నలు అడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోబోటిక్ టెక్నాలజీపై నిపుణ పాఠకులకు ప్రత్యేక వాసం..
-రోబోల తయారీ, వాటి అనువర్తనం, నిర్మాణాలను గుర్తించిన అధ్యయనాన్ని రోబోటిక్స్ అంటారు.
-రోబోట్ల నిర్మాణంలో పలు శాఖలు కీలకపాత్ర వహిస్థాయి. అవి..
-1. ఎలక్ట్రానిక్స్ 2. మెకానిక్స్ 3. కంప్యూటర్ సైన్స్
-రోబో అనే పదం తొలుత కారెల్ కాపెక్ అనే చెక్ దేశపు నవలా రచయితచే పరిచయమైంది. (రస్సుమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అనే నాటకంలో)
-రోబోట్ అనేది రోబోటి అనే స్లావిక్ పదం నుంచి ఆవిర్భవించింది. రోబో అంటే శ్రామికుడు అని అర్థం.
-రోబోటిక్స్ అనే పదాన్ని తొలుత పరిచయం చేసింది ఐజాక్ అనిమోవ్ తన లయర్ అనే చిన్న కథలో పరిచయం చేశాడు.
-పై శాఖలు రోబోల డిజైన్, నిర్మాణం, వినియోగించుట, నియంత్రణ, ఇవేకాక పరిశీలన, సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వంటి పలు అంశాల్లో ఉపయోగపడతాయి.
-వీటన్నిటి కలయిక వల్ల ఆటోమేటెడ్ మిషన్స్ అనబడే రోబోట్స్ తయారీ సాధ్యమైంది. ఈ రోబోలు ప్రస్తుతం మానవ ప్రమేయం కష్టసాధ్యమైన పలు విభాగాల్లో తమ సేవలు అందిస్తున్నాయి.
ఉదా : అత్యధిక వేడి వెలువరించే పారిశ్రామిక సంస్థల్లో, పారిశుద్ధ్య రంగాల్లో, మానవుడు చేరుకోలేని యుద్ధ క్షేత్రాల్లో సైనికులుగా రోబోలు సేవలందిస్తున్నాయి.
-శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ మానవుని అవసరాలను సైతం తీర్చే రోబోల తయారీ సులభతరమైంది.
-నేడు వీటిని వైద్య, గృహ రంగాల్లో, మిలిటరీ అవసరాలకు సైతం వినియోగిస్తున్నారు.
-బాంబులను నిర్వీర్యం చేయడం, విపత్కర సందర్భాల్లో క్షతగాత్రులను గుర్తించడం,ల్యాండ్‌మైన్స్‌ను కనుగొని డిఫ్యూజ్ చేయడం వంటి భయానక పరిస్థితుల్లో సైతం మానవుడికి ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించి సత్ఫలితాలు సాధిస్తున్నాము.
రోబోల పూర్వ చరిత్ర
-1942లో కాల్పనిక సైన్స్ రచయిత ఇజాక్ అసిమోవ్ రోబోల నిర్మాణంలో ఉండే సూత్రాలను అందించారు. అవి
-ప్రయోగాత్మకంగా రోబోటిక్స్‌ను ఆధారమైన సిద్ధాంతాన్ని అందించింది నార్బర్ట్ వీనర్.
-పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే రోబోల తయారీ 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో సాధ్యమైంది.
-1961లో మొదటి ప్రోగ్రామబుల్ రోబో యూనిమేట్ను డైకాస్టింగ్ యంత్రం నుంచి వేడి నుంచే లోహపు ముక్కలను తీయడానికి తయారుచేశారు.
-రోబోల వినియోగం తయారీ రంగం, అసెంబ్లింగ్ యూని ట్స్, ప్యాకింగ్, ప్యాకేజింగ్, రవాణా, శస్త్రచికిత్స, ఆయుధ, పరిశోధన, భద్రతా రంగాల్లో సైతం అధికమైంది.
రోబోల నిర్మాణం
-అధిక భాగం యాంత్రిక పరికరాలచే తయారవుతుంది.
-మానవ అస్థిపంజరం పనితీరును పోలి ఉంటుంది.
-రోబోల శరీర భాగాల్లో యాక్యురేటర్లు కండరాలుగా, జాయింట్లు కీళ్లుగా రూపొందించిన కైనమాటిక్ చైన్‌తో కూడిన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
-స్టీవార్ట్ ప్లాట్‌ఫామ్ వంటి కొన్ని రోబోలు సంవృత సమాంతర కైనమాటిక్ చైన్‌ను వినియోగిస్తాయి.
-మరికొన్ని రోబోలు కీటకాల నిర్మాణాన్ని కలిగి ఉంటా యి. ఉదా : హెక్సాపాడ్
-అయితే వినియోగం, అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు జరపబడుతూ బయోమెకానిక్స్ అనే నూతన రంగ ఆవిష్కరణలకు దోహదపడింది.
శక్తి జనకం/ శక్తి వనరు
-ప్రస్తుతం రోబోలలో లెడ్-యాసిడ్ బ్యాటరీలు, సిల్వర్ కాడ్మియం రకాల బ్యాటరీలు వాడుతున్నారు. ఇవేగాక, సంపీడన వాయువులు, సౌరశక్తి, హైడ్రాలిక్స్, కర్బన వ్యర్థాలు (అవాయు శ్వాసక్రియ ద్వారా వెలువడే శక్తిని) అణుశక్తులను కూడా శక్తి జనకాలుగా వినియోగించవచ్చు.
ఎలక్ట్రోయాక్టివ్ పాలిమర్స్
-రోబోల ముఖ భాగాలు, చేతుల తయారీలో ఎలాస్టిసిటీ అధికంగా కలిగిన ప్లాస్టిక్‌ను వాడాల్సి ఉంటుంది.
పియాజో మోటార్స్
-ప్రస్తుతం డీసీ మోటార్లకు ప్రత్యామ్నాయంగా పియాజో మోటార్లను వాడుతున్నారు. వీటినే అల్ట్రాసోనిక్ మోటార్లుగా కూడా వ్యవహరిస్తారు. వీటి సాయంతో రోబోలకు రేఖియ, భ్రమణ చలనాలను కలిగించొచ్చు. వాటికి కావాల్సిన బలాన్ని, వేగాన్ని అందించవచ్చు.
ఎలాస్టిక్ నానోట్యూబ్స్
-వీటిని కృత్రిమ కండరాలుగా పరిగణిస్తారు. వీటి సాయంతో రోబోలు భవిష్యత్‌లో పరుగెత్తగలవు, గెంతగలవు.
స్పర్శ
-స్పర్శజ్ఞానం మానవులతో పోలిస్తే రోబోలకు తక్కువ.
-మానవ చేతివేళ్లతో పోల్చితే, అంతే స్పర్శజ్ఞానం, యాంత్రిక ధర్మాలు కల్గిన టాైక్టెల్ సెన్సార్ అర్రేలను అభివృద్ధి చేశారు.
-దృఢమైన కోర్ అనే పదార్థం చుట్టూ విద్యుత్వాహకత్వం కలిగిన ద్రవాన్ని ఉంచి, వాటి చుట్టూ స్థితిస్థాపకత కలిగిన ఎలాస్టోమాటిక్ చర్మాన్ని కప్పుతారు.
-కోర్ చుట్టూ ఎలక్ట్రోడ్స్ అమర్చబడి ఉంటాయి. వీటిని కోర్ లో అమర్చిన మెజరింగ్ పరికరాలకు అనుసంధానిస్తారు.
-ఉదాహరణకు యూరోపియన్ దేశాలు, ఇజ్రాయెల్ మాన వ చేతిని పోలివుండే ఒక ప్రోస్థటిక్ హ్యాండ్ను తయారు చేశారు. దీని సహాయంతో రాయడం, పియానో వాయించడం వంటి పనులు చేయవచ్చు. వీటి సాయంతో రోగగ్రస్తులకు వారి చేతివేళ్లద్వారా ఎలాంటి స్పర్శజ్ఞానం కలుగుతుందో అలాంటి స్పర్శజ్ఞానం కలిగించవచ్చు.
ఆక్చుయేషన్
-వీటిని రోబోల కండరాలుగా పేర్కొనవచ్చు. రోబోలో నిల్వచేసిన శక్తిని కదలికల కోసం వినియోగించుకుంటాయి. అందుకు ఎలక్ట్రిక్ మోటార్స్, రేఖియ ఆక్చుయేటర్స్, రసాయన, సంపీడన వాయువులను కూడా వాడతారు.
సెన్సింగ్
-సెన్సింగ్ ద్వారా రోబోల వివిధ వస్తువులను అంచనా వేయుట, భిన్న పరిస్థితుల్లో ప్రమాద హెచ్చరికలు, భద్రతా సూచనలు చేయగలవు.
దృష్టి
-చిత్రాల ద్వారా కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) సహాయంతో రోబోలకు దృష్టిజ్ఞానం కలిగించే పరిజ్ఞానం అభివృద్ధిపర్చబడింది. దీనినే కంప్యూటర్ విజన్‌గా పరిగణిస్తారు.
-వస్తువుల నుంచి వెలువడే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ (దృశ్యకాంతి లేదా పరారుణ కాంతి) సహాయంతో పనిచేసే ఇమేజ్ సెన్సార్లను రోబోలకు దృష్టిజ్ఞానం అందించుటకు వినియోగిస్తుండగా, ఈ సెన్సార్లను ఆప్టిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా తయారుచేస్తారు.
-ఈ సెన్సార్లలో లైడార్, సోనార్, రాడార్ వంటి పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
-రోబోలు చూడటం, మాట్లాడటం, వస్తువులను ఎత్తడం, వాటి ఆకారాలను మార్చడం లేదా నాశనం చేయడం వం టి పనులు చేయగలవు. రోబోల చేతులను End Effec ts అని, భుజాలను మ్యానిఫ్యులేటర్స్గా వ్యవహరిస్తారు.
మిలిటరీ రంగంలో..
-మిలిటరీ రంగంలో పలు అటానమస్, రిమోట్ కంట్రోల్డ్ రోబోల వస్తువుల చేరవేత నుంచి శోధన, రెస్క్యూ, దాడి లాంటి ఆపరేషన్లలోనూ ఉపయోగపడుతున్నాయి.
-యూఎస్ ఆర్మీ 2005లో అటానమస్ రోటోక్రాఫ్ట్ స్నైపర్ సిస్టం కింద ఆయుధాలు వినియోగించే రోబోలను తయా రు చేస్తున్నది. ఈ విధానంలో మానవరహిత, రిమోట్ సాయంతో నడిచే హెలిక్యాప్టర్‌కు స్నైపర్ రైఫిళ్లను అమర్చి వినియోగించే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నది.
-అమెరికా ప్రస్తుతం ఐఏఐ పయోనీర్, ఆర్క్యూ-ప్రిటర్ అనే మానవరహిత విమానాలకు ఎయిడ్ టు గ్రౌండ్ మిస్సైల్స్‌ను అమర్చి యుద్ధక్షేత్రాల్లో వాడుతున్నది.
-భారత్‌లో అనుమానాస్పద పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేయడానికి డీఆర్డీవో తయారుచేసిన రిమోట్లీ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్వోవీ)-దక్ష్.
-అమెరికా నౌకాదళం వాడుతున్న రోబోటిక్ వ్యవస్థ – గ్లాడియేటర్ టాక్టికల్ అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికిల్.
-వైద్యరంగంలో కొరియర్లుగా, రిసెప్షనిస్ట్స్, పోర్టర్స్, హెల్పర్స్గానే కాక శస్త్ర చికిత్సల్లో సైతం వినియోగించగల సర్జికల్ రోబోలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
-ఆర్ధ్రోబోట్ ప్రపంచంలో మొదటి సర్జికల్ రోబో(కెనడా).
-ప్యూమా 560, ప్రోబోట్, రోబోడాక్లు సర్జికల్ రోబోలు.
-అమెరికా రూపొందించిన సర్జికల్ వ్యవస్థ – ది డావిన్సీ.
-ప్రపంచంలో మొదటి కరానరీ ఆర్టరీబైపాస్ గ్రాఫ్‌లో ZEUS సర్జికల్ రోబోలను వాడి చేశారు.
-పలు పరిశీలనల తర్వాత రోబోలు చేసే శస్త్ర చికిత్సలు వైద్యుల కంటే మెరుగ్గా ఉన్నాయని తేలింది. డాక్టర్ల గైర్హాజరీలో సైతం స్వతంత్రంగా శస్త్ర చికిత్సలు చేశాయి కూడా.
-పారిశుద్ధ్య నిర్వహణ, ప్రథమ చికిత్సలు అందించడానికి రోబోలను వినియోగిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో..
-వీటినే అగ్రిబోట్లు అంటారు. వీటిని పంట కాలంలో అధికంగా వినియోగిస్తారు.
-పండ్ల తోటల్లో పండ్లను తెంపుటకు డ్రైవర్లు లేని ట్రాక్టర్లు, స్ప్రేయర్ల వంటివి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
-మెర్లిన్ రోబోట్ మిల్కల్ , హార్వెస్ట్ ఆటోమేషన్, ఆరెంజ్ హార్వెస్టర్, లెట్యూస్బోట్, వీడర్లను వ్యవసాయ రంగం లో వినియోగిస్తున్నారు.
గృహ రంగంలో..
-క్లీనింగ్, వాషింగ్లనేగాక పిల్లలను, వృద్ధులను సంరక్షించే రోబోలు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
-డ్రెస్మ్యాన్ అనే రోబో షర్ట్స్‌ను ఇస్త్రీ చేయగలదు.
-సోమాబార్ అనేది ఇంటి పనుల్లో సహాయపడే రోబో.
-ల్యాన్ మౌవర్స్, పూల్ క్లీనర్స్ వంటి రోబోలు ఉన్నాయి.
బిట్స్
-డ్రైవర్లు లేని వాహనాల తయారీని గూగుల్ చేపట్టింది.
-ప్రపంచంలో ఆధునిక రోబోపియానిస్ట్ – రోమస్.
-రోబోల క్లౌడ్ కంప్యూటింగ్ వేదికగా ఐదు యూరోపియన్ యూనివర్సిటీలు రోబో ఎర్త్ అనే క్లౌడ్ ఇంజిన్‌ను అభివృద్ధి చేశాయి. వీటితో పలు రోబోలు అంతర్జాలంలో అనుసంధానమై తమ అనుభవాలను పంచుకుంటాయి.
-రోబో ఎర్త్‌పై ఆధారపడి ర్యాప్యుటా అనే ఓపెన్ సోర్స్ క్లౌడ్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయబడింది.
-మైరోబోట్స్, రోబోబ్రెయిన్, KnowRob వంటి ప్రాజెక్ట్‌లను వేర్వేరు వనరుల నుంచి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి అభివృద్ధిపర్చారు.
-ఇటలీలోని బయోరోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ తయారు చేయబడిన అండర్‌వాటర్ రోబో – పోసీడ్రోన్.
-ప్రపంచ మొదటి న్యూస్ రీడింగ్ రోబో- కొదొమోరాయిడ్. ఇది కొదొమొ (చైల్డ్), ఆండ్రాయిడ్ అను పదాల కలయిక. ఇదే రీతిలోని మరో రోబో – ఒటనరాయిడ్.
రోబోల విప్లవం
-రోబోల విప్లవం జపాన్‌లో కనిపిస్తుంది.
-మే 2015లో జపాన్ ప్రధాని షింజో అబే ఆ దేశ ప్రైవేట్ రంగాన్ని రోబోల తయారీ, అభివృద్ధి, పరిశోధనల్లో ప్రధాన పాత్ర పోషించుటకు కృషిచేయాలని పేర్కొన్నారు.
-హోండా, టయోటా వంటి కంపెనీలు తమదైన కృషితో అరుదైన ఘనతలను సాధిస్తున్నాయి.
-హోండా కంపెనీ తయారు చేసిన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోగా ఆసిమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
-ఇవేగాక తయగోచి, ఐబోస్ అనే పెంపుడు రోబో లు తయారుచేయబడ్డాయి.
-సోనీ కంపెనీ తయారుచేసిన ఐబోస్ అనే పెంపు డు రోబో కుక్క. తన ఓనర్ల నుంచి పలు విషయా లు నేర్చుకోవడం దాని ప్రత్యేకత.
-ఇక న్యూస్ రీడర్లుగా, శస్త్రచికిత్సలు చేసే వైద్యులుగా కూడా రోబోలు సేవలు అందిస్తున్నాయి.
-ప్రస్తుతం కృత్రిమ మేథస్సును మానవ మేథస్సు కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందించే మార్పులు జరుగుతున్నాయి.
తెలంగాణలో తయారైన తొలి రోబో
-బంగారు తెలంగాణ ఆవిష్కరణలో మానవ వనరులేగాక రోబోల వినియోగంపైనా సర్కారు దృష్టిపెట్టింది.
-తెలంగాణలో రూపుదిద్దుకున్న తొలి రోబోగా టీ-వన్ చరిత్ర సృష్టించింది.
-ఏప్రిల్ 4, 2016న రాష్ట్ర ఐటీ పాలసీ ఆవిష్కరణ వేదిక సాక్షిగా ఈ రోబో తనకందించిన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి ఆహుతులను ఆకర్షించింది.
-వేదిక చివరి నుంచి ముఖ్య అతిథి సీటు వరకు వెళ్లి ఐటీ పాలసీ పత్రాలను అందించే పని రోబోకు అప్పగించారు.
-దీని తయారీలో రోబోటిక్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ-హైదరాబాద్ ప్రముఖపాత్ర వహించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు