ECONOMY | ఆర్థిక స్వావలంబన- నిరుద్యోగ నిర్మూలన
ఐదో పంచవర్ష ప్రణాళిక 1974-78
- ఐదో ప్రణాళిక కాలం 1974 నుంచి 1978 వరకు
- 5వప్రణాళిక రూపకర్త డి.పి.థర్ (దుర్గాప్రసాద్ థర్)
- మొదట సి. సుబ్రమణ్యం తయారు చేసిన ప్పటికీ అంతిమంగా డి.పి.థర్ రూపొందించారు.
- 5వ ప్రణాళిక నమూనా పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన
- 5వ ప్రణాళిక ప్రాధాన్యం పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన
- 5వ ప్రణాళిక అధ్యక్షులు
1. ఇందిరాగాంధీ
2. మొరార్జీ దేశాయ్
ఉపాధ్యక్షులు- పి. ఎన్. హక్కర్ - 5వ ప్రణాళిక అంచనా వ్యయం రూ. 39,426 వేల కోట్లు (ప్రైవేట్ పెట్టుబడి అంచనారూ. 16161 కోట్లు)
- అధిక వనరుల కేటాయింపు, పరిశ్రమలు, ఖనిజాలు – 24.3 శాతం
- విద్యుత్ 18.3 శాతం
- రవాణా సమాచారం 17.4 శాతం
- 5వ ప్రణాళికలో ఆశించిన వృద్ధిరేటు 4.4 శాతం, సాధించిన వృద్ధిరేటు 5.0 శాతం
- 5వ ప్రణాళిక విజయవంతం కావడానికి కారణం నిధుల సమీకరణకు అతి తక్కువ శాతం లోటు ద్రవ్య విధానాన్ని ఉపయోగించడం (8.8 శాతం అంచనా వేయగా 3.4 శాతం వాస్తవం)
5వ ప్రణాళిక ప్రత్యేకతలు
- ఒక సంవత్సరం ముందుగానే ముగించిన ప్రణాళిక 5వ ప్రణాళిక
- మధ్యంతరంగా రద్దు చేసిన ఏకైక ప్రణాళిక 5వ ప్రణాళిక
- 5వ ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగా/ మధ్యంతరంగా ముగించడానికి కారణం రాజకీయ మార్పు, రాజకీయ అనిశ్చితి పరిస్థితి వల్ల. అంటే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం దీనికి ప్రధాన కారణం.
- 5వ ప్రణాళికలో రెండు జాతీయ అత్యవసర పరిస్థితులు అమలయ్యాయి.
1. 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు (చైనాతో యుద్ధం కారణంగా)
2. 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు (పాకిస్థాన్‌తో యుద్ధం కారణంగా - పేదరికానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక 5వ ప్రణాళిక
- 5వ ప్రణాళికను పేదరికపు ప్రణాళిక అని కూడా అంటారు.
- 1974 మే 18న పోఖ్రాన్ అణు పరీక్షలు (ఇందిరాగాంధీ) మొదటిసారి జరిపారు.
- రెండవసారి 1998 వాజ్‌పాయి హయాంలో జరిపారు.
- 1975 జూలైలో 20 సూత్రాల కార్యక్రమం (మొదటిసారి) పేదరిక నిర్మూలన కోసం ప్రవేశ పెట్టారు. దీన్ని ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం, ప్రధాన మంత్రి 20 సూత్రాల కార్యక్రమం (20 Points Programmee/ Formula)
- 1975లో కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభం. దేశ వ్యాప్తంగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు
- 1975లో ఐటీడీఏ ఏర్పాటు, నిర్బంధ కుటుంబ నియంత్రణ అమలు.
- 1976లో మొదటి జాతీయ జనాభా విధానం (వివాహ వయస్సు పురుషులకు 18-21 వరకు, మహిళలకు 14-18 సంవత్సరాలు వరకు పెంచారు)
- 1976లోసామాజిక అడవుల కార్యక్రమం.
- 1977లో (డీడీపీ) ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకం, పారిశ్రామిక విధాన తీర్మానం, అసైన్డ్ భూముల చట్టం (Land ceiling Act 1973) ఆమోదం.
- ఐటీడీఏ – ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ
ఆరో పంచవర్ష ప్రణాళిక(1980-85)
- డీడీపీ – డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
- ఎఫ్ఎఫ్డబ్ల్యూపీ – ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్
- ఎన్పీపీ – నేషనల్ పాపులేషన్ పాలసీ
- ఆరో ప్రణాళిక కాలం 1980-85
- ఆరో ప్రణాళిక రూపకర్త డి.టి. లక్డావాలా
- ఆరో ప్రణాళిక నమూనా నాలుగు రంగాల నమూనా
- ఆరో ప్రణాళిక ప్రాధాన్యం నిరుద్యోగ నిర్మూలన, సాంకేతిక స్వావలంబన
- ఆరో ప్రణాళిక అధ్యక్షులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ
- ఆరో ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎన్.డి. తివారీ (1980-81), ఎస్.బి. చవాన్ (1981-84)
- ఆరో ప్రణాళిక అంచనా వ్యయం/ వాస్తవిక వ్యయం – 1,09,292
- ఆరో ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు శక్తి 28.1శాతం, పరిశ్రమలు, ఖనిజాలు 15.5 శాతం
ఆరో ప్రణాళిక ప్రత్యేకతలు
- ఆరో ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు 5.2 శాతం
- సాధించిన వృద్ధి రేటు 5.7 శాతం
- 5వ ప్రణాళికను జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేసి ఆరో ప్రణాళికను 1978 నుంచి నిరంతర ప్రణాళిక పద్ధతిలో ఒకసారి
- 1980-85 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళిక పద్ధతిలో రెండోసారి ప్రకటించింది. అంటే ఒకే ప్రణాళికను రెండుసార్లు ప్రకటించిన ప్రణాళిక ఆరో ప్రణాళిక మాత్రమే.
- ఆరో ప్రణాళిక అవస్థాపన సౌకర్యాలకు, నిరుద్యోగ నిర్మూలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది,. కాబట్టి దీన్ని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని అంటారు.
- ఆరో ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 5.2 కాగా సాధించిన వృద్ధిరేటు 5.7 శాతం. సాధించిన వృద్ధిరేటు దాదాపు 5శాతం పైగా నమోదు కావడం వల్ల ప్రొఫెసర్ రాజ్ కృష్ణ దీన్ని హిందూ వృద్ధి రేటు అని పేర్కొన్నారు.
- 6వ ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కంటే ఎక్కువగా పెరగడం, వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం నమోదు కావడం వల్ల 1983-84 సంవత్సరాన్ని 2వ హరిత విప్లవం ప్రారంభంగా పిలుస్తారు.
- 6వ ప్రణాళిక నుంచి విద్యుత్‌కు బదులు శక్తి అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు.
- 1980 అక్టోబర్ 2-ఐఆర్డీపీని దేశ వ్యాప్తంగా విస్తరించారు. (1999లో దీన్ని ఎస్జీఎస్వైలో విలీనం చేశారు.
- 1980 అక్టోబర్ 2న ఎన్ఆర్ఈపీని ప్రారంభించారు.
- 1980 ఏప్రిల్ 15న రెండో దశ బ్యాంకుల జాతీయీకరణ (6 బ్యాంకులు) జరిగింది.
- 1982 సెప్టెంబర్‌లో డ్వాక్రా గ్రూప్స్ ప్రారంభం
- 1982 జూలై 12 నాబార్డ్ ఏర్పాటు (శివరామన్ కమిటీ సిఫారసుపై)
- 1982లో ఎగ్జిమ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.
- 1983లో ఆర్ఎల్ఈజీపీ ప్రారంభం. (భూమిలేని గ్రామీణ కుటుంబాలకు ఇది వర్తిస్తుంది)
- 1983లో ఎస్ఈఈయూవై ప్రారంభం. (పట్టణ విద్యా వంతులకు స్వయం ఉపాధి కల్పనకై)
- 1983లో ఉమ్మడి ఏపీలో సబ్సిడీపై రూ. 2 కిలో బియ్యం పథకం ప్రారంభించారు
- 1984లో ఉమ్మడి ఏపీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం (1985లో కేంద్రం కూడా ప్రారంభించింది).
- 1985లో ఎస్ఐసీఏ (ఖాయిలా పడిన పరిశ్రమల కంపెనీ చట్టం) రూపొందింది. (తివారీ కమిటీ సిఫారసు)
- CRAFICARD; Committe of Review Arrangements for Institutional Credit for Agriculture Rural Development
- NABARD: : National Bank for Agriculture Rural Development
- IRDP: Intigrated Rural Develop ment Programme
- NREP: National Rural Employ ment Programme
- RLEGP: Rural landless employ ment guarantee programme
- SEEUY – Self Employment to the Educated Unemployed Youth
- SICA: Sick Industrial Companies Act
ప్రాక్టీస్ బిట్స్
1. ఐదో ప్రణాళిక కాలం?
ఎ) 1970-75 బి) 1975-80
సి) 1974-78 డి) 1980-85
2. ఐదో ప్రణాళిక ప్రాధాన్యం
ఎ) పేదరిక నిర్మూలన
బి) ఆర్థిక స్వావలంబన
సి) ఎ, బి
డి) నిరుద్యోగ నిర్మూలన
3. 5వ ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) దుర్గాప్రసాద్ థర్
బి) సి. సుబ్రమణ్యం
సి) మొదట సి. సుబ్రమణ్యం తయారు చేసినప్పటికీ అంతిమంగా డి.పి. థర్ రూపొందించారు.
డి. పైవన్నీ
4. ఒక సంవత్సరం ముందుగానే ముగించిన ప్రణాళిక ఏది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
5. 5వ ప్రణాళిక ….
ఎ) విఫలమైంది బి) విజయవంతమైంది
సి) స్థిర వృద్ధి డి) ఏదీకాదు
6. ఐదో ప్రణాళికను మధ్యంతరంగా రద్దు చేసిన ప్రభుత్వం ఏది?
ఎ) కాంగ్రెస్ ప్రభుత్వం
బి) అకాళిదళ్ ప్రభుత్వం
సి) జనాతా ప్రభుత్వం డి) ఏదీకాదు
7. 20 సుత్రాల కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
8. కనీస అవసరాల కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1970 బి) 1975
సి) 1973 డి 1978
9. మొదటి 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించినది ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) ఇందిరాగాంధీ
సి) రాజీవ్‌గాంధీ
డి) మన్మోహన్ సింగ్
10. పనికి ఆహార పథకం ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
11. ఆరో ప్రణాళిక కాలం
ఎ) 1979-84 బి) 1980-85
సి) 1981-85 డి) 1978-83
12. ఆరో ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) డి.టి. లక్డావాలా బి) డి.పి. థర్
సి) మహలనోబిస్ డి) అశోక్ రుద్ర
13. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని దేన్ని అంటారు?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
14. రెండో హరిత విప్లవం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
15. ఎగ్జిమ్ బ్యాంక్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1980 బి) 1981
సి) 1982 డి) 1983
16. మధ్యాహ్న భోజన పథకం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 6
17. 6వ ప్రణాళికలో అధిక వనరుల కేటాయించిన రంగం ఏది?
ఎ) వ్యవసాయం, నీటి పారుదల
బి) శక్తి
సి) పరిశ్రలు, ఖనిజాలు
డి) సామాజిక సేవలు
18. రెండుసార్లు ప్రకటించిన ప్రణాళిక ఏది?
ఎ) రెండో బి) మూడో
సి) ఐదో డి) ఆరో
19. ఆరో ప్రణాళిక వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటు అని పేర్కొన్నది ఎవరు?
ఎ) ప్రొ. రాజ్‌కృష్ణ బి) లక్డావాలా
సి) ఇందిరాగాంధీ డి) ఎస్.బి. చవాన్
20. డ్వాక్రా గ్రూపులు ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమయ్యాయి?
ఎ) మూడో బి) నాలుగో
సి) ఐదో డి) ఆరో
21. మొదటిసారి పోఖ్రాన్ అణుపరీక్షలు ఏ ప్రణాళిక కాలంలో జరిగాయి?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
22. అంత్యోదయ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ) 1975 బి) 1976
సి) 1977 డి) 1978
23. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1980 బి) 1981
సి) 1982 డి) 1983
24. మొదటి జాతీయ జనాభా విధానం ఏ ప్రణాళిక కాలంలో వచ్చింది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
25. ఆరో ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఎంత?
ఎ) 5 శాతం బి) 5.2 శాతం
సి) 5.7 శాతం డి) 6.1 శాతం
26. నాబార్డ్‌ను ఏ కమిటీ సిఫారసులపై ఏర్పాటు చేశారు?
ఎ) మల్హోత్రా కమిటీ
బి) నారిమన్ కమిటీ
సి) శివరామన్ కమిటీ
డి) కాల్దార్ కమిటీ
27. నిర్బంధ కుటుంబ నియంత్రణ ఏ సంవత్సరంలో అమలు చేశారు?
ఎ) 1973 బి) 1974
సి) 1975 డి) 1976
28. ఐఆర్‌డీపీ, ఎన్ఆర్ఈపీ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1980 అక్టోబర్ 2
బి) 1982 అక్టోబర్ 2
సి) 1980 ఆగస్టు 15
డి) 1982 ఆగస్టు 15
సమాధానాలు
1-సి 2-సి 3-సి 4-సి
5-బి 6-సి 7-డి 8-బి
9-బి 10-డి 11-బి 12-ఎ
13-డి 14-డి 15-సి 16-డి
17-బి 18-డి 19-ఎ 20-డి
21-సి 22-సి 23-డి 24-సి
25-సి 26-సి 27-సి 28-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు