Chemistry | ఫొటోగ్రఫీల్లో ఉపయోగించే హైపో రసాయన నామం?
ద్రావణాలు
1. భారజలాన్ని విద్యుత్ కెటిల్‌తో వేడి చేసినప్పుడు స్కేల్లో ఏర్పడే తెల్లని పదర్థం?
1) చక్కెర
2) సాధారణ ఉప్పు
3) కాల్షియం కార్బోనేట్
4) సోడియం కార్బోనేట్
2. ఉతికే సోడ అంటే?
1) సోడియం క్లోరైడ్
2) హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ (లేదా) సోడియం బైకార్బోనేట్
3) సోడియం కార్బోనేట్
4) కాల్షియం కార్బోనేట్
3. కఠిన జలం సబ్బుతో నురగనివ్వదు ఎందుకు?
1) కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లను కలిగి ఉండటం వల్ల
2) ఇది ఎక్కువ రంగులో ఉండటం వల్ల
3) ఇది తాత్కాలిక అపరిశుద్ధత కలిగి ఉండటం వల్ల
4) ఇది సోడియం క్లోరైడ్ ఉండటం వల్ల
4. కింది వాటిలో ఏవి కరిగి ఉండటం వల్ల బండరాళ్ల నుంచి ప్రవహించే నీరు కఠినంగా మారుతుంది?
1) కాల్షియం కార్బోనేట్
2) సోడియం క్లోరైడ్
3) సోడియం కార్బోనేట్
4) సోడియం పాస్ఫేట్
5. వంట సోడాని రసాయనికంగా ఏమంటారు?
1) కాల్షియం పాస్ఫేట్
2) సోడియం బై కార్బోనేట్
3) సోడియం క్లోరైడ్
4) బేకర్స్ ఈస్ట్
6. బట్టల సబ్బు అనేది ఒక?
1) సహజ ఫ్యాటీ ఆమ్లాల సోడియం లవణాల సహజ మూలం
2) సోడియం కార్బోనేట్
3) సోడియం సల్ఫేట్
4) కృత్రిమ సల్ఫోనిక్ ఆమ్లం లవణ మిశ్రమం
7. కృత్రిమ బట్టల సబ్బులు అనేవి?
1) ఫ్యాటీ ఆమ్లాల లవణాలు
2) సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్ మిశ్రమం
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాల్షియం లవణాలు
4) అరోమాటిక్, ఎలిఫ్యాటిక్ సల్ఫోనిక్ ఆమ్లం సోడియం లవణాల మిశ్రమం
8. బట్టల సబ్బు కఠిన జలంలో నురగనిస్తుంది ఎందుకు?
1) అది కఠిన జలంతో కరుగుతుంది
2) అది వర్ణ రహిత పదార్థం
3) సల్ఫోనిక్ ఆమ్లాల కాల్షియం, మెగ్నీషియం లవణాలు నీటిలో కరుగుతాయి
4) అది కఠిన జలంతో కలిసి సోడియం కార్బోనేట్లను ఏర్పరుస్తాయి
9. సున్నపునీరు ఏం కలిగి ఉంటుంది?
1) సోడియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) సోడియం కార్బోనేట్
4) కాల్షియం క్లోరైడ్
10. వంట నూనెను కొవ్వులుగా మార్చే పద్ధతి?
1) జల విశ్లేషణం
2) క్షయకరణం
3) స్ఫటికీకరణం
4) ఆక్సీకరణం
11. రెండు ద్రావణాలు ఎప్పుడు సమతాస్థితిలో ఉంటాయి?
1) వాటికి ఒకే ద్రవాభిసరణ పీడనం కలిగి ఉన్నప్పుడు
2) వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు
3) ఒకే ద్రావితంలో కరిగి ఉన్నప్పుడు
4) ఒకే బాష్పపీడనం కలిగి ఉన్నప్పుడు
12. పరమ శూన్య ఉష్ణోగ్రత?
1) ఉష్ణోగ్రత కొలబద్దలోని ఆరంభ సూచిక
2) సిద్ధాంతరీత్య సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత
3) ద్రవాలు ఘనీభవించే ఉష్ణోగ్రత
4) పదార్థాలన్నీ వాయు స్థితిలో ఉండే ఉష్ణోగ్రత
13. ప్రభుత్వం సరఫరా చేసే నీటిని సాధారణంగా శుద్ధి చేసే పద్ధతి?
1) క్లోరినేషన్ 2) అంశికస్వేదనం
3) వడపోత 4) తేటతేర్చుట
14. భార జలం?
1) వాయువు అధికంగా కరిగి ఉంటుంది
2) ఖనిజ లవణాలను అధికంగా కరిగి ఉంటుంది
3) హైడ్రోజన్ బదులు డ్యుటీరియం కలిగి ఉంటుంది
4) కర్బన కలుషితాలను కలిగి ఉంటుంది
15. pH అనేది దేన్ని సూచిస్తుంది?
1) ద్రావణం ఉష్ణోగ్రత
2) ద్రావణం బాష్ప పీడనం
3) ద్రావణం ఆమ్లత్వం (లేదా) క్షారత్వం
4) ద్రావణం అయాన్ల సామర్థ్యం
16. హైడ్రోక్లోరిక్ ఆమ్ల జల ద్రావణం pH సుమారు?
1) 2 2) 7
3) 12 4) 9
17. pH విలువ 12 ఉన్న ద్రావణం?
1) సోడియం హైడ్రాక్సైడ్
2) అమ్మోనియం సల్ఫేట్
3) సోడియం క్లోరైడ్
4) హైడ్రోజన్ క్లోరైడ్
18. జల ద్రావణంలో ఏ వాయువు బలమైన ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది?
1) అమ్మోనియం 2) పాస్ఫేట్
3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) హైడ్రోజన్ సల్ఫేడ్
19. చల్లని నీటిలో పూర్తిగా రూపాంతరం చెందినది?
1) బెంజోయిక్ ఆమ్లం 2) చక్కెర
3) వంట సోడా 4) కాస్టిక్ సోడా
20. జలం కంటే కింది ఏ జల ద్రావణం అధిక విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది?
1) చక్కెర నీరు 2) గ్లూకోజ్
3) సాధారణ ఉప్పు 4) ఇథైల్ ఆల్కహాల్
21. సముద్ర జలంలో సమృద్ధిగా లభించే సమ్మేళనం?
1) పొటాషియం క్లోరైడ్
2) సాధారణ ఉప్పు
3) ఇసుక
4) కాల్షియం కార్బోనేట్
22. లిక్విడ్ నూనె కలిపిన కాస్టిక్ సోడా ద్రావణాన్ని వేడి చేయగా వచ్చే పదార్థం?
1) ఇంధనం 2) ఎరువులు
3) సబ్బులు 4) ప్లాస్టిక్
23. కింది వాటిలో నీటి శుద్ధస్థితి ఏది?
1) వర్షపు నీరు 2) బావి నీరు
3) కుళాయి నీరు 4) స్వేదన నీరు
24. కింది వాటిలో ఆహార నిల్వకారినిలు?
1) సోడియం బై కార్బోనేట్
2) టార్టానిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం
4) బెంజోయిక్ ఆమ్లం
25. బట్టలను వర్ణ రహితం చేసే కారకం?
1) సోడియం క్లోరైడ్
2) బ్లీచింగ్ పౌడర్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) సల్ఫర్ డై ఆక్సైడ్
26. సిల్వర్ హాలైడ్ను ఫొటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగిస్తారు. ఎందుకు?
1) గాలిలో ఆకర్షణం చెందుతుంది
2) వర్ణరహితం
3) హైపో ద్రావణంలో సులువుగా కరుగుతుంది
4) కాంతిచేత సులువుగా క్షయం అవుతుంది
27. ఫొటోగ్రఫీల్లో ఉపయోగించే హైపో రసాయన నామం?
1) సిల్వర్ బ్రోమైడ్
2) సోడియం థయో సల్ఫేట్
3) సోడియంపాస్ఫేట్
4) సిల్వర్ నైట్రేట్
28. వర్షపు నీరు కంటే నదీ జలాలు కఠిన జలం. ఎందుకంటే?
1) అది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది
2) వాతావరణంలోని కలిగి ఉంటుంది
3) అతి కాల్షియం, మెగ్నీషియం లవణాలను కలిగి ఉంటుంది
4) సోడియం క్లోరైడ్‌ని కలిగి ఉంటుంది
29. నీటిలో గల ఉతికే సోడా ద్రావణం అనేది?
1) ఆల్కలీన్ 2) న్యూట్రాల్
3) ఆమ్లత్వం 4) నిర్జలీకరణి
30. రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే శీతలీకరణ ఆమ్లం?
1) ద్రవ కార్బన్ డై ఆక్సైడ్
2) ద్రవ నైట్రోజన్
3) ద్రవ అమ్మోనియా
4) అతి శీతలనీరు
31. తాగే సోడా?
1) న్యూట్రల్
2) ఆక్సీకరణ ఏజెంట్
3) ఆమ్లత్వం
4) క్షారగుణం కలిగి ఉంటుంది
32. ఉపరితలం నుంచి మురికి, నూనె మరకల వంటి పదార్థాలను తొలగించే పదార్థాన్ని ఏమంటారు?
1) డిటర్జంట్ 2) లూబ్రికెంట్
3) నిర్జలీకరణి 4) క్షయకరణి
33. కింది ఏ నీటిలో సబ్బు తొందరగా నురగనివ్వదు?
1) సాధారణ నీరు 2) హెవీ వాటర్
3) కఠిన జలం 4) స్వచ్ఛమైన నీరు
34. అవిశె నూనె పిండి దేనికి ఉపయోగిస్తారు?
1) బట్టలు ఉతకడానికి
2) పశువుల దాణా
3) చిన్న పిల్లల ఆహారం
4) టపాసుల తయారీ
35. లీచింగ్ ముఖ్యపాత్ర?
1) నల్ల రంగును తొలగించడానికి
2) రంగు నిర్జలీకరణం చేయడానికి
3) ఆవిరికి
4) వడపోత
36. మోర్డెంట్ అనేది?
1) ఫ్యాబ్రిక్స్ పై వేసే రంగులు
2) బ్లీచింగ్ చర్య
3) రంగుల గాఢతలను పెంచడానికి
4) ఇది ఒక గాఢ ద్రావణం
37. ఏ బిందువు దగ్గర వాయు, ద్రవ, ఘన పదార్థాలు ఏకీభవిస్తాయి?
1) బాష్పీభవన స్థానం
2) ద్రవీభవన స్థానం
3) త్రిక బిందువు
4) ఘనీభవన స్థానం
38. కింది వాటిలో సరైనది గుర్తించండి. ఫొటో కెమికల్ స్మాగ్ దేని ఉత్పత్తి?
1. పెరాక్సైడ్ నైట్రేట్
2. కార్బన్ మోనాక్సైడ్
3. ఓజోన్
1) 1, 2, 3 2) 1, 2
3) 2, 3 4) 1, 3
39. కింది వాటిలో ఏది నీటి కాఠిన్యతను తొలగిస్తుంది?
1) జియోలైట్స్ 2) క్వార్ట్
3) ఆస్బెస్టాస్ 4) జిప్సం
జవాబులు
1.3 2.3 3.1 4.1
5.2 6.1 7.4 8.3
9.2 10.1 11.2 12.2
13.1 14.3 15.3 16.1
17.1 18.2 19.1 20.3
21.2 22.3 23.1 24.4
25.2 26.4 27.2 28.3
29.1 30.3 31.3 32.1
33.3 34.2 35.2 36.1
37.3 38.4 39.2
లోహ సంగ్రహణ శాస్త్రం
1. ఫొటోగ్రఫిక్ ప్లేట్లను నల్లని పేపర్‌తో కప్పి ఉంచడానికి కారణం?
1) పేపర్లో ఉన్న సెల్యూలోజ్ ఎసిటేట్ తాజాగా ఉండటానికి
2) నల్లని పేపర్ సూర్యకాంతిని సులువుగా గ్రహిస్తుంది. ఇది ఫిల్మ్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది
3) ప్లేట్‌పై ఉన్న సిల్వర్ బ్రోమైడ్ కాంతితో త్వరగా ప్రభావితం అవుతుంది. దీన్ని నల్లని కాగితం నిరోధిస్తుంది
4) సిల్వర్ బ్రోమైడ్ నుంచి సిల్వర్‌గా మారే ప్రక్రియకు ఉపయోగకరం
2. క్లోరినేషన్ అనేది?
1) క్లోరైడ్స్ నుంచి క్లోరిన్గా మార్చే ప్రక్రియ
2) కలుషిత జలానికి కొద్ది మొత్తంలో క్లోరిన్‌ని కలపడం
3) క్లోరిన్ విడుదలయ్యే రసాయన ప్రక్రియ
4) క్లోరిన్ కలిగి ఉండి, లవణం కలిగి ఉండే పదార్థం
3. ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం?
1) జింక్ 2) ఇనుము
3) వెండి 4) రాగి
4. ఇనుపధాతువు నుంచి ఇనుము ఏ ప్రక్రియ ద్వారా పొందవచ్చు?
1) క్లోరినేషన్ 2) క్షయకరణం
3) అంశిక స్వేదనం 4) విద్యుత్ విశ్లేషణం
5. హైడ్రోజన్ ఎన్ని ఐసోటోపులుగా లభిస్తుంది?
1) 1 2) 4 3) 3 4) 2
6. కింది వాటిలో ఏ వాయువు విడుదల చేయడం వల్ల రాత్రివేళలో చెట్టు కింద నిద్రించడం అనుకూలం కాదు అంటారు?
1) కార్బన్ డై ఆక్సైడ్ 2) ఆక్సిజన్
3) కార్బన్ మోనాక్సైడ్
4) సల్ఫర్ డయాక్సైడ్
7. కృత్రిమంగా ఆకుపచ్చ పండ్లను పండించుటకు ఉపయోగించే వాయువు?
1) ఇథిలిన్ 2) ఈథేన్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) ఎసిటిలిన్
8. టేప్ రికార్డ్ల టేప్‌లపై దేనితో పూత పూస్తారు?
1) జింక్ ఆక్సైడ్ 2) మెగ్నీషియం ఆక్సైడ్
3) ఐరన్ సల్ఫేడ్ 4) ఐరన్ ఆక్సైడ్
9. కింది వాటిలో సాధారణంగా ఉపయోగించే లోహ మిశ్రమం కానిది?
1) స్టీల్ 2) బ్రాస్
3) బ్రాంజ్ 4) కాపర్
10. రెండు (లేదా) అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమాలని ఏమంటారు?
1) అమాల్గమ్ 2) ఆల్కాలి మెటల్
3) నోబుల్ మెటల్ 4) లోహ మిశ్రమం
11. ఒక రేడియోధార్మిక పదార్థం అర్ధ జీవితకాలం 60 నిమిషాల 30 గంటల వ్యవధిలో క్షీణించిన అందులోని అణువుల శాతం ఎంత?
1) 12.5% 2) 25%
3) 8.5% 4) 87.5%
జవాబులు
1.3 2.2 3.4 4.2 5.3 6.1
7.1 8.4 9.4 10.4 11.4
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు