Economy | ప్రణాళిక సంఘం సమీక్ష.. నీతి ఆయోగ్ నిర్మాణం
నీతి ఆయోగ్
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత ప్రణాళిక బద్ధమైన ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో 1951 నుంచి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. 6 వార్షిక ప్రణాళికలను అంటే 65 సంవత్సరాల ప్రణాళికను లేదా 6 1/2 దశాబ్దాల ప్రణాళికను సుమారు రూ.200 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి నిధులతో
అమలు చేశారు.
- ఇంత దీర్ఘదర్శి ప్రణాళికను అమలు చేసినప్పటికీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశకు చేరుకోకపోవడం.
- మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక సంఘం తన పద్ధతులను కార్యాచరణను మార్చుకోకపోవడం.
- మనదేశ ప్రణాళికా ముసాయిదాలు బాగున్నా, ఆశించిన ప్రగతి సాధించలేక పోవడానికి పరిపాలనలో అసమర్థత, జవాబుదారీతనం లేకపోవడం, అవినీతి, Red Tapism మొదలైనవి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
- మార్కెట్ విధానం, ప్రపంచీకరణ అంతర్జాతీయ పోటీ దృష్ట్యా ప్రభుత్వ నియంత్రణ పద్ధతిలో సరైన సరళీకరణ తగిన ఫలితాలివ్వలేదని నిపుణుల అభిప్రాయం
- ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలే అభివృద్ధి చెందడం, ఇంకా చాలా సమస్యలు పరిష్కరించలేకపోవడం. ఉదా: నిరుద్యోగం, పేదరికం, జనాభా నియంత్రణ.
- ఈ సమస్యల సాధన కోసం ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది.
- 2014లో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రణాళికా సంఘాన్ని కొనసాగించాలా? లేదా నూతన సంస్థను ఏర్పాటు చేయాలా? అనే దానిపై 2014 ఫిబ్రవరిలో ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ కమిషన్‌ను అజయ్ చిబ్బర్ అధ్యక్షతన నియమించింది.
- ఈ కమిషన్ తన నివేదికను 2014 మే 29న ప్రభుత్వానికి సమర్పించింది.
- ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్ సమర్పించిన నివేదికలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని, ఒక విధంగా చెప్పాలంటే చైనాలో అమలవుతున్న ఎన్డీఆర్సీ (నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్) పోలి ఉన్న విధాన సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
- మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సమాఖ్య వ్యవస్థలో రాష్ర్టాలు మరింత అధికారం హక్కులను కోరుకుంటున్నాయి. అంతే కాకుండా అభివృద్ధి అనేది కింది స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట్రాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధించాలంటే కేంద్ర రాష్ర్టాలు కలిసి పనిచేయాలని ఈ కమిషన్ సూచించింది.
- ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ కమిషన్ సూచన మేరకు ఎన్డీఏ ప్రభుత్వం (బీజేపీ ప్రభుత్వం) ప్రణాళిక సంఘాన్ని 2014 ఆగస్టు 13న రద్దు చేసి దాని స్థానంలో జాతీయ సలహా మండలి ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
నీతి ఆయోగ్ అర్థం - ప్రణాళిక సంఘం స్థానంలో ఒక విధాన సంఘం (పాలసీ కమిషన్)గా నీతి ఆయోగ్‌ను 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు.
- NITI అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ)
- NITI అనే పదానికి సంస్కృతంలో మార్గదర్శకం ‘నైతికత, పరివర్తన’ అని అర్థం.
- నీతి అనే పదానికి హిందీలో విధాన రూపకల్ప సంఘం అని అర్థం
- AAYOG / ఆయోగ్ అనగా సంస్థ
- నీతి ఆయోగ్ అనేది Think Tank / మేధో కూటమిగా ప్రభుత్వ సలహా సంస్థగా పని చేస్తుంది.
- నీతి ఆయోగ్ చట్టబద్ధత లేని రాజ్యాంగేతర సంస్థ
నీతి ఆయోగ్ నిర్మాణం : - అధ్యక్షుడు : ప్రధానమంత్రి. మొదటి, ప్రస్తుత అధ్యక్షుడు నరేంద్ర మోదీ
- ఉపాధ్యక్షుడు : ప్రధానమంత్రి నియమిస్తారు. మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా
- ప్రస్తుత ఉపాధ్యక్షుడు సుమన్ కె.బెరి
- ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈవో): ప్రధాన మంత్రి నియమిస్తారు
- మొదటి సీఈవో సింధుశ్రీ ఖుల్లర్
ప్రస్తుత సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం - శాశ్వత సభ్యులు : గరిష్ఠంగా ఐదుగురు సభ్యులను నియమించుకోవచ్చు. ప్రస్తుతం నలుగురు సభ్యులున్నారు.
1) విజయ్‌కుమార్ సారస్వత్ (మాజీ డీఆర్డీవో అధ్యక్షుడు)
2) డా. వినోద్‌కుమార్‌పాల్ (ప్రజారోగ్య నిపుణుడు )
3) రమేష్ చంద్ (వ్యవసాయ నిపుణుడు)
4) అరవింద్ వీరమణి (ఆర్థిక వేత్త) - తాత్కాలిక సభ్యులు: గరిష్ఠంగా ఇద్దరు ఉంటారు. వీరిని ప్రధాని నియమిస్తారు. దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి రొటేషన్ ప్రాతిపదికపై నియమించబడతారు.
- ఎక్స్ అఫిషియో సభ్యులు: కేంద్ర మంత్రి మండలి నుంచి గరిష్ఠంగా నలుగురిని ప్రధాని నియమిస్తాడు.
ప్రస్తుతం ఎక్స్ అఫిషియో సభ్యులు
1) రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ మంత్రి)
2) అమిత్‌షా (హోంమంత్రి)
3) నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
4) నరేంద్ర సింగ్ తోమర్ (వ్యవసాయ శాఖమంత్రి) - పాలకమండలి సభ్యులు: అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు.
- ప్రాంతీయ మండలి: ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాలు, ప్రాంతాలు, తమ సమస్యల పరిష్కారానికి రూపొందించారు.
- దీనిలో ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు.
- సలహాదారులు : అఖిల భారతస్థాయి ఉద్యోగులను సహాయకులుగా నియమిస్తారు.
- ప్రత్యేక ఆహ్వానితులు : వివిధ రంగాల్లో నిపుణులు. అనుభవజ్ఞులను ప్రధాని నియమిస్తారు.
ప్రస్తుతం: 1) నితిన్ గడ్కరి (కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి)
2) పీయూష్ గోయల్ (పరిశ్రమలు & వాణిజ్యశాఖ మంత్రి)
3) వీరేంద్ర కుమార్ (కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి)
4) అశ్వని వైష్ణవ్ (రైల్వే, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి)
5) రావు ఇంద్రజిత్ సింగ్ (ఎంవోఎస్పీఐ సహాయ మంత్రి) - నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- నీతి ఆయోగ్ భవనం పేరు యోజన భవనం
- నీతి ఆయోగ్ ప్రచురించే అధికారిక పత్రిక యోజన
- నీతి ఆయోగ్ వెబ్సైట్ ( MGG) mygov group (మొదట), niti.gov.in (ప్రస్తుతం)
- నీతి ఆయోగ్ నినాదం ‘సబ్ కా సాత్. సబ్ కా వికాస్’ ‘అందరితో కలిసి అందరి వికాసం’
- నీతి అయోగ్ సాధికారత భావన ‘బలమైన రాష్ర్టాలతో, బలమైన దేశం’
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలా, అలానే కొనసాగించాలా, నూతన సంస్థను ఏర్పాటు చేయాలా అనే దానిపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
ఎ) ప్లానింగ్ కమిషన్
బి) నీతి ఆయోగ్
సి) ఎవాల్యూషన్ కమిషన్
డి) ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ కమిషన్
2. ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్ తన నివేదికను ఎప్పుడు ప్రభుత్వానికి ఇచ్చింది?
ఎ) 2014 మే 29 బి) 2015 మే 29
సి) 2014 ఫిబ్రవరి 14
డి) 2014 ఫిబ్రవరి 13
3. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారు?
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2014 ఆగస్టు 13
సి) 2014 ఆగస్టు 17
డి) 2014 ఆగస్టు 18
4. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడింది ఏది?
ఎ) విధాన సంఘం బి) నీతి ఆయోగ్
సి) ఎ, బి సి) ఒక సంస్థ
5. నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2014 జనవరి 1
బి) 2015 జనవరి 1
సి) 2016 జనవరి 1
డి) 2015 జనవరి 5
6. NITI ని విస్తరించండి?
ఎ) National Institution For Transfarming India
బి) Institution For Trade India
సి) National Information For Transfarming India
డి) Net institution for Transforming India
7. నీతి అనే పదానికి హిందీలో అర్థం ఏమిటి?
ఎ) విధాన రూపకల్పన సంఘం
బి) విధాన రూపకల్పన
సి) నైతికత డి) పరివర్తన
8. ఆయోగ్ అంటే?
ఎ) సంస్థ బి) విధానం
సి) రూపం డి) పైవన్నీ
9. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు?
ఎ) అరవింద్ పనగారియా
బి) సుమన్ కె బెరి
సి) నరేంద్ర మోదీ
డి) మన్మోహన్ సింగ్
10. నీతి ఆయోగ్ మొదటి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) ఎవరు?
ఎ) అరవింద్ పనగారియా
బి) డా. వినోద్ కుమార్ పాల్
సి) సింధుశ్రీ ఖుల్లర్
డి) బీవీఆర్ సుబ్రహ్మణ్యం
11. నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులను గరిష్ఠంగా ఎంతవరకు నియమించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
12. నీతి ఆయోగ్ తాత్కాలిక సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) ప్రధాన మంత్రి బి) రాష్ట్రపతి
సి) ఆర్థిక మంత్రి
డి) పైవారిలో ఎవరైనా
13. నీతి ఆయోగ్‌లోని పాలక మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత ఎవరు వహిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) ఉపరాష్ట్రపతి
సి) ప్రధాన మంత్రి
డి) నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
14. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ముంబై బి) న్యూఢిల్లీ
సి) కోల్‌కతా డి) హైదరాబాద్
15. నీతి ఆయోగ్ ప్రచురించే అధికారిక పత్రిక ఏది?
ఎ) సమాచార్ పత్రిక
బి) షైన్ ఇండియా
సి) యోజన డి) ఇండియా టుడే
16. సంస్కృతంలో నీతి అనే పదానికి అర్థం?
ఎ) మార్గదర్శకం బి) నైతికత
సి) పరివర్తన డి) పైవన్నీ
17. నీతి ఆయోగ్ నినాదం?
ఎ) సబ్ కా సాత్- సబ్ కా వికాస్
బి) అందరితో కలిసి అందరి వికాసం
సి) బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం
డి) ఎ, బి
18. నీతి ఆయోగ్ భవనం పేరు?
ఎ) సమాచార భవనం
బి) యోజన భవనం
సి) నీతి భవనం
డి) భారత్ భవనం
19. నీతి ఆయోగ్ అనేది?
ఎ) థింక్ ట్యాంక్ బి) మేధో కూటమి
సి) ప్రభుత్వ సలహా సంస్థ డి) పైవన్నీ
20. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో ఎవరు?
ఎ) విజయ్ కుమార్ సారస్వత్
బి) బీవీఆర్ సుబ్రహ్మణ్యం
సి) రమేష్ చంద్
డి) సింధుశ్రీఖుల్లర్
21. నీతి ఆయోగ్‌లో ప్రస్తుతం ఎంతమంది శాశ్వత సభ్యులు ఉన్నారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
సమాధానాలు
1-డి 2-ఎ 3-బి 4-సి
5-బి 6-ఎ 7-ఎ 8-ఎ
9-బి 10-సి 11-డి 12-ఎ
13-సి 14-బి 15-సి 16-డి
17-డి 18-బి 19-డి 20-బి
21-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు