General Science Chemistry | సల్ఫర్ డై ఆక్సైడ్ సంకలన చర్యలోని ఉత్ప్రేరకం ఏది?
సల్ఫర్ – దాని సమ్మేళనాలు
1. భూగర్భంలో సల్ఫర్ విస్తృతంగా లభ్యం కాని దేశం?
1) రష్యా 2) అమెరికా
3) జపాన్ 4) సిసిలీ
2. కింది వాటిలో నీటిలో కరగనివి?
1) H2, O2 2) N2, H2
3) S8, H2 4) N2, S8
3. CS2 ద్రావణిలో కరిగేవి?
1) రాంబిక్, మోనోక్లినిక్ సల్ఫర్లు
2) రాంబిక్, ప్లాస్టిక్ సల్ఫర్లు
3) ప్లాస్టిక్, మోనోక్లినిక్ సల్ఫర్
4) రాంబిక్, మోనోక్లినిక్, ప్లాస్టిక్
4. ఏ మూలక రూపాంతరాల భౌతిక ధర్మాలు ఒకేవిధంగా, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి?
1) N2 2) P4
3) S8 4) పైవేవీ కావు
5. చారిత్రక కట్టడాలు రూపుకోల్పోవడానికి ప్రధాన కారకం?
1) CO2 2) SO2
3) P2O5 4) Cl2
6. ఎక్కువ సాపేక్ష సాంద్రత గల సల్ఫర్ రూపాంతరం?
1) రాంబిక్ 2) మోనోక్లినిక్
3) ప్లాస్టిక్
4) ప్రిజ్మాటిక్ సల్ఫర్
7. రాంబిక్ సల్ఫర్ ఏ ఉష్ణోగ్రత వద్ద మోనోక్లినిక్ సల్ఫర్‌గా మారుతుంది?
1) 960C 2) 119 0C
3) 1600C 4) 2300C
8. ఫ్రాష్ట్ పద్ధతిలో అల్ప సాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) సల్ఫర్ ద్రవం + నీరు
2) వేడిగాలి + నీరు
3) సల్ఫర్ ద్రవం + వేడిగాలి
4) సల్ఫర్ ద్రవం + వేడిగాలి + నీరు
9. S8 గొలుసు గల సల్ఫర్ రూపాంతరం?
1) రాంబిక్ 2) మోనోక్లినిక్
3) ప్లాస్టిక్ 4) 1, 2
10. కింది వాటిలో దేని తయారీకి Kipp పరికరాన్ని ఉపయోగిస్తారు?
1) H2S 2) CS2
3) H2SO4 4) H2S2O7
11. కింది వాటిలో గాలి కంటే బరువైనది?
1) N2 2) O2
3) H2S 4) 2,3
12. అన్నింటి కంటే స్థిరమైనది?
1) రాంబిక్, మోనోక్లినిక్
2) మోనోక్లినిక్, ప్లాస్టిక్
3) ప్లాస్టిక్, రాంబిక్
4) రాంబిక్
13. ఓలియం ఫార్ములా?
1) H2S2O2 2) H2S8O7
3) HSO7 4) H2S2O7
14. అమెరికాలోని లూసియానాలో ఎన్ని అడుగుల లోతులో సల్ఫర్ మూలకస్థితిలో లభ్యమవుతుంది?
1) 500 2) 800
3) 1400 4) 1500
15. ఫ్రాష్ పద్ధతి ద్వారా లభ్యమైన సల్ఫర్ ఎంత స్వచ్ఛమైనది?
1) 90 శాతం 2) 89.9 శాతం
3) 99.5 శాతం 4) 89 శాతం
16. సల్ఫర్ ద్రవీభవన స్థానం?
1) 112.80C 2) 1190C
3) 119.20C 4) 960C
17. సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత?
1) 1190C 2) 4440C
3) 960C 4) 112.80C
18. సల్ఫర్ దేనిలో కరుగుతుంది?
1) కాల్షియం సల్ఫైడ్
2) జింక్ సల్ఫైడ్
3) కార్బన్ డై సల్ఫైడ్
4) మెటర్నిక్ సల్ఫైడ్
19. లోహ సల్ఫైడ్లు ఆక్సిజన్‌తో మండి కింది వాటిలో వేటిని ఏర్పరుస్తాయి?
1) సల్ఫర్మోనాక్సైడ్
2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ ట్రై ఆక్సైడ్
4) సల్ఫ్యూరిక్ ఆమ్లం
20. సల్ఫర్ డై ఆక్సైడ్ సంకలన చర్యలోని ఉత్ప్రేరకం ఏది?
1) ప్లాటినం 2) నికెల్
3) మాంగనీస్ డైఆక్సైడ్
4) మాలిబ్డినం
21. ఫౌంటెన్ ప్రయోగంలో నీలి లిట్మస్ ద్రావణాన్ని ఫౌంటెన్‌గా ప్రవేశించడానికి కారణం?
1) ఇంక్ పిల్లర్
2) సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు
3) నీరు
4) నీటిలో సల్ఫర్ డై ఆక్సైడ్ కరిగి కుప్పెలో శూన్యం ఏర్పడటం
22. తేమ సమక్షంలో సల్ఫర్ డై ఆక్సైడ్ చర్య?
1) శాశ్వతం 2) విరంజన చర్య
3) భౌతిక చర్య 4) తటస్థం
23. సల్ఫర్ డై ఆక్సైడ్ విరంజన చర్య?
1) శాశ్వతం 2) తాత్కాలికం
3) తటస్థం 4) ఆక్సీకరణం
24. H2SO4ను మరిగించినప్పుడు ఏర్పడే తెల్లటి దట్టమైన పొగలు ?
1) SO3 2) SO2
3) H2SO4 4) O2
25. H2SO4 దేనితో చర్యజరిపి లవణం, నీరు ఏర్పరుస్తుంది?
1) క్షారాలు 2) ఆమ్లాలు
3) నీరు 4) కాపర్
26. H2SO4 ఏ లోహంతో చర్య జరుపదు?
1) బంగారం 2) కాపర్
3) జింక్ 4) సోడియం
27. H2SO4లో నీరు పోయకూడదు. కారణం ఆమ్లాల విలీన చర్య అనేది ?
1) ఉష్ణగ్రాహక చర్య
2) ఉష్ణమోచక చర్య
3) తటస్థ చర్య
4) ద్విగత చర్య
28. H2SO4 ఆక్సీకరణ చర్యలో పాల్గొనడానికి కారణం?
1) H2O 2) SO2
3) [H] 4) [O]
29. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఫార్ములా?
1) CuSO4
2) CuSO4.2H2O
3) C12H22O11
4) CuSO4.5H2O
30. రసాయనాల రాజు అని దేన్ని అంటారు?
1) గాఢ H2SO4
2) C5H10O5
3) C12H22O11
4) CuSO4.5H2O
31. H2S వాయువు గాలి కంటే?
1) తేలిక 2) బరువు
3) సమానం 4) పైవేవీ కావు
32. H2S వాయువు అధిక ఆక్సిజన్‌తో చర్యనొంది ఏమి ఏర్పరుస్తుంది?
1) సల్ఫర్ 2) సల్ఫర్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ ట్రై ఆక్సైడ్ 4) నీరు
33. H2Sను సల్ఫర్‌గా మార్చే చర్య?
1) క్షయకరణ చర్య
2) ఆక్సీకరణ చర్య
3) తటస్థీకరణ చర్య
4) విరంజన చర్య
జవాబులు
1.1 2.3 3.1 4.4
5.2 6.1 7.1 8.4
9.3 10.1 11.4 12.4
13.4 14.1 15.3 16.3
17.3 18.3 19.2 20.1
21.4 22.2 23.2 24.2
25.1 26.1 27.2 28.2
29.4 30.1 31.2 32.2
33.2
రసాయన సంయోగ నియమాలు
1. కింది వాటిలో రసాయన సంయోగం కానిది గుర్తించండి.
1) 2HgO 2Hg+O2
2) CuCO3 CuO+CO2
3) AgNO3+NaCl AgCl+NaNO3
4) పైవన్నీ
2. కింది ఏ చర్యలో కొత్త పదార్థం ఏర్పడదు?
1) రసాయన ద్వంద్వ వియోగం
2) రసాయన స్థానభ్రంశం
3) రసాయన ఉభయ వియోగం
4) పైవేవీ కావు
3. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) రసాయనచర్యలో క్రియాజనకాల భారం క్రియా జన్యాల భారంలో ఎక్కువగానీ, తక్కువగానీ ఉండవచ్చు. అది చర్య స్వభావంపై ఆధారపడుతుంది
2) క్రియాజనకాల భారం క్రియాజన్యాల భారం సమానం (స్థిరానుపాత నియమం అనుసరించి)
3) CaCO3లో Ca, C, Oల నిష్పత్తి పదార్థ తయారీపై ఆధారపడదు
4) పైవేవీ కావు
4. KClO3 వేడి చేస్తే KCl, O2 లభిస్తాయి. 2.45 KClO3 వేడి చేస్తే 1.49 గ్రా. KCl ఏర్పడింది. వెలువడిన ఆక్సిజన్ భారం గ్రాముల్లో..?
1) 0.96 2) 0.096
3) 0.9 4) 96
5. N2O, NO, NO2 ఏర్పడటంలో 28 గ్రాములు N2తో చర్యనొందే ఆక్సిజన్ భారాలు వరుసగా?
1) 32, 32, 32 2) 32, 64, 32
3) 16, 32, 64 4) 64, 32, 32
6. క్యూప్రస్, క్యూప్రిక్ ఆక్సైడ్లు బహ్యానుపాతం పాటిస్తాయి. స్థిర భారం ఉన్న ఆక్సిజన్‌తో చర్యనొందే కాపర్ భారాల నిష్పత్తి వరుసగా?
1) 2:1 2) 1:2
3) 1:3 4) 3:1
7. 2.3 గ్రా. Na, 3.55 గ్రా. క్లోరిన్‌తో చర్యనొంది ఏర్పడే NaCl భారం గ్రాముల్లో?
1) 5.85 2) 9.85
3) 10.8 4) 15.85
8. రెండు పదార్థాలు తమలోని మూలకాలు (లేదా) ప్రాతిపదికలను పరస్పరం మార్చుకొనే చర్యను ఏమంటారు?
1) రసాయన సంయోగం
2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం
4) రసాయన ద్వంద్వవియోగం
9. కాల్షియం కార్బోనేట్‌ను వేడిచేస్తే ఏర్పడే పదార్థాలు?
1) Ca, C, O2 2) Ca, C2, O2
3) CaO, CO2 4) Ca, CO3
10. ఏ సమ్మేళనం నైట్రోజన్, హైడ్రోజన్ వాయువులనిస్తుంది?
1) NH3 2) Pb(NO3)2
3) KNO3 4) NH4NO3
11. KClO3ని వేడిచేస్తే KCl, ఆక్సిజన్లు లభిస్తాయి. 4.90 గ్రాముల KClO3ని వేడిచేస్తే 2.98 గ్రాముల KCl ఏర్పడింది. వెలువడిన ఆక్సిజన్ వాయువు భారం ఎంత?
1) 2.98 2) 1.92
3) 0.96 4) 1.96
12. 4.6 గ్రాముల సోడియం 7.1 గ్రాముల క్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే సోడియం క్లోరైడ్ భారం?
1) 5.58 గ్రాములు 2) 2.3 గ్రాములు
3) 2.5 గ్రాములు 4) 11.7 గ్రాములు
13. కార్బన్, ఆక్సిజన్లు 3:8 నిష్పత్తిలో చర్యనొంది కార్బన్ డై ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది. అయితే 6 గ్రాముల కార్బన్‌ను మండించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ భారం?
1) 8 గ్రాములు 2) 16 గ్రాములు
3) 4 గ్రాములు 4) 12 గ్రాములు
14. స్థిరానుపాత నియమాన్ని ప్రవేశపెట్టింది?
1) డాల్టన్ 2) లెవోయిజర్
3) ప్రీస్ట్లీ 4) జోసఫ్ ఫ్రాస్ట్
15. క్రియాజనకాల భారాల మొత్తం క్రియాజన్యముల భారాల మొత్తానికి సమానం అని తెలిపే నియమం?
1) ద్రవ్యనిత్యత్వ 2) స్థిరానుపాత
3) అననుపాత 4) బహ్యానుపాత
16. నైట్రోజన్, ఆక్సిజన్‌తో చర్యనొంది N2O, N2O2, N2O3, N2O4, N2O5 ఏర్పరుస్తుంది. స్థిరభారం ఉన్న 7 గ్రాముల N2తో చర్యనొందే ఆక్సిజన్ వాయువుల భారాలు వరుసగా?
1) 16, 32, 48, 64, 80
2) 8, 16, 24, 32, 40
3) 4, 8, 12, 16, 20
4) 2, 4, 6, 8, 10
17. సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొంది సోడియం క్లోరైడ్, నీటిని ఏర్పరిచే చర్య?
1) రసాయన సంయోగం
2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం
4) రసాయన ద్వంద్వ వియోగం
18. సల్ఫర్ డై ఆక్సైడ్‌లో సల్ఫర్, ఆక్సిజన్లు 1:1 భార నిష్పత్తిలో ఉన్నాయి. అయితే 32 గ్రాముల సల్ఫర్ డై ఆక్సైడ్‌లో ఉండే సల్ఫర్, ఆక్సిజన్ల భారాలు వరుసగా?
1) 8, 8 2) 8, 16
3) 16, 16 4) 16, 32
19. సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో SO3 వాయువును నీటిలో కరిగిస్తారు. ఈ రసాయనిక మార్పు?
1) రసాయన సంయోగం
2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం
4) ద్వంద్వ వియోగం
20. NaOH, HClతో చర్యనొంది NaCl, నీటిని ఏర్పరుస్తుంది. ఈ రసాయన చర్య?
1) రసాయన సంయోగం
2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం
4) ద్వంద్వ వియోగం
21. కింది వాటిలో బహ్యానుపాత నియమానికి ఉదాహరణ?
1) Na2O, K2O 2) CaO, MgO
3) Al2O3, Cr2O7
4) CO, CO2
22. 2KClO3ని వేడిచేస్తే ఏర్పడేవి?
1) 2KCl, 2O2 2) KCl, O2
3) 2KCl, 3O2 4) K, ClO2
23. SO2లో S, O2 భార నిష్పత్తి?
1) 1:2 2) 2:1
3) 1:1 4) పైవేవీ కావు
24. Na2SO4+BaCl2 + 2NaCl ఈ చర్య ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
1) స్థిరానుపాత 2) ద్రవ్యనిత్యత్వ
3) బహ్యానుపాత 4) పైవేవీ కావు
జవాబులు
1.4 2.4 3.3 4.1
5.3 6.1 7.1 8.4
9.3 10.1 11.2 12.4
13.2 14.4 15.1 16.3
17.4 18.3 19.1 20.4
21.4 22.3 23.3 24.2
ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు