Economy | పేదరిక విషవలయాల గురించి వివరించినది ఎవరు?
ఎకానమీ
1. కింది వాటిని జతపరచండి?
1. వెల్త్ ఆఫ్ నేషన్స్ ఎ) జె.ఎం. కీన్స్
2) ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్ బి) రాబిన్స్
3) నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ సి) మార్షల్
4) జనరల్ థియరీ డి) ఆడంస్మిత్
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) ఏదీకాదు
2. కిందివాటిలో సరికానిది గుర్తించండి?
ఎ) పాక్షిక సమతుల్యం గురించి మార్షల్ వివరించారు
బి) సార్వత్రిక సమతుల్యం గురించి కీన్స్ వివరించారు
సి) ఆర్థిక విశ్లేషణ అంటే అర్థశాస్త్రం అధ్యయనం
డి) ఆర్థిక సూత్రాలు కచ్చితాలు
3. కిందివాటిలో ఆడంస్మిత్ భావనలకు సంబంధం లేనిది ఏది?
ఎ) అదృశ్య హస్తం
బి) పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ
సి) శ్రమ విభజన
డి) ఆర్థిక సూత్రాలు
4. కిందివాటిని జతపరచండి.
ఎ) అర్థశాస్త్ర పితామహుడు 1) మార్షల్
బి) ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు 2) జె.ఎం. కీన్స్
సి) సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు 3) ఆడంస్మిత్
డి) నూతన సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు 4) పారెటో
ఎ) ఎ-3, బి-2, సి-1, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-1, బి-3, సి-4, డి-2
5. కింది వారిలో సాంప్రదాయ ఆర్థిక వేత్త కానివారు?
ఎ) రికార్డో బి) జేబీసే
సి) మాల్థస్ డి) జేఎం కీన్స్
6. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరం నుంచి అందిస్తున్నారు?
ఎ) 1968 బి) 1969
సి) 1970 డి) 1971
7. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ఫ్రాన్స్ దేశం తొలి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దేశంగా అవతరించింది
బి) భారతదేశం 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించింది
సి) ఆడంస్మిత్ లెయిజాఫేర్ సిద్ధాంతం ప్రతిపాదించారు
డి) స్థూల అర్థశాస్త్ర పితామహుడు మార్షల్
8. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది
బి) ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినది
సి) అభివృద్ధి అర్థశాస్త్రం, బీదదేశాలకు చెందినది
డి) అన్ని సరైనవే
9. కిందివాటిలో ఆర్థిక వృద్ధి సూచికలు కానివి ఏవి?
ఎ) వాస్తవ తలసరి ఆదాయం
బి) వాస్తవ జాతీయోత్పత్తి
సి) నామమాత్రపు తలసరి ఆదాయం
డి) ఆదాయ అసమానతలు
10. కిందివాటిలో సరికానిది?
ఎ) లింగ సంబంధ అసమానతలు
బి) మానవ, అవస్థాపన సంబంధ అసమానతలు
సి) సాంఘిక, రాజకీయ సంబంధ అసమానతలు
డి) ఆర్థిక సంబంధ అసమానతలు
11. నవకల్పనలు అంటే
ఎ) నూతన ఉత్పత్తులు కనుగొనడం
బి) నూతన మార్కెట్ కనుగొనడం
సి) నూతన ముడి పదార్థాలు కనుగొనడం
డి) పైవన్నీ సరైనవే
12. పేదరిక విషవలయాల గురించి వివరించినది ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) రాగ్నర్ నర్క్స్
సి) మార్షల్ డి) డాల్టన్
13. గిని గుణకం విలువ?
ఎ) 0-1 బి) 1-0
సి) 1-10 డి) 10-1
14. WDR అంటే?
ఎ) Web Development Rate
బి) World Development Report
సి) Weekly Data Report
డి) World Department Report
15. 2020 కంటే ముందు యూఎన్వో ప్రపంచ దేశాలను ఎన్ని విధాలుగా వర్గీకరించింది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
16. కింది వాటిని జతపరచండి.
ఎ) సాంఘిక ద్వంద్వత్వం 1) బాకె
బి) సాంకేతిక ద్వంద్వత్వం 2) మింట్
సి) విత్త సరఫరా ద్వంద్వత్వం 3) జార్గన్ సన్
డి) వినిమయ ద్వంద్వత్వం 4) ఎమాన్యువల్
ఎ) ఎ-1, బి-3, సి-2, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-4, సి-2, డి-3
17. కిందివాటిలో ప్లవన దశకు సంబంధించినవి ఏవి?
ఎ) దీన్ని టేక్ ఆఫ్ స్టేజ్ అంటారు
బి) ఉత్పత్తి విలువలో పెట్టుబడులు 5-10 శాతం మధ్యలో ఉండాలి
సి) సమాజం సాంకేతిక పరిపక్వత సాధిస్తుంది డి) పైవన్నీ
18. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) స్థిర మూలధనం యంత్రాలు, యంత్రపరికరాలు
బి) చర మూలధనం వేతనాలు
సి) మిగులు విలువ అదనపు విలువ
డి) శ్రామిక దోపిడి అదనపు విలువ
19. కిందివాటిలో అభివృద్ధి చెందని మానవ వనరులు ఏవి?
ఎ) ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవారు
బి) నిరక్షరాస్యులు
సి) ఉద్యమిత్యం లేనివారు డి) పైవన్నీ
20. ఆధారిత వృద్ధి సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు?
ఎ) సింగర్, ప్రెబిష్ బి) గౌతమ్ మాథూర్
సి) వకీల్ & బ్రహ్మానందం
డి) డాల్టన్
21. కిందివాటిని జతపరచండి.
ఎ) మానవ అభివృద్ధి సూచి 1) HDI
బి) లింగ సంబంధిత అభివృద్ధి సూచి 2) GDI
సి) లింగసాధికారత కాలమాని 3) GEM
డి) మానవ పేదరిక సూచి 4) HPI
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-1, బి-4, సి-3, డి-2
22. ప్రపంచంలో అధిక అటవీ భూమి కలిగిన దేశాలు వరుస క్రమంలో?
ఎ) చైనా, రష్యా, బ్రెజిల్, యూఎస్ఏ, కెనడా
బి) రష్యా, బ్రెజిల్, కెనడా, యూఎస్ఏ, చైనా
సి) యూఎస్ఏ, కెనడా, చైనా, రష్యా, బ్రెజిల్
డి) బ్రెజిల్, రష్యా, కెనడా, యూఎస్ఏ, చైనా
23. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల 5 దేశాలు వరుసగా?
ఎ) చైనా, అమెరికా, జపాన్, భారత్, జర్మనీ
బి) అమెరికా, చైనా, భారత్, జపాన్, జర్మనీ
సి) అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్
డి) చైనా, జపాన్, అమెరికా, జర్మనీ, భారత్
24. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఒకసారి వినియోగంలో నశించేవి – నశ్వర వస్తువులు
బి) మానవుడి కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు వినియోగవస్తువులు
సి) డిమాండ్ కంటే సప్లయ్ తక్కువగా ఉండే వస్తువులు ఆర్థిక వస్తువులు
డి) సప్లయ్ కంటే డిమాండ్ ఎక్కువగా ఉండే వస్తువులు – ఉచిత వస్తువులు
25. బదిలీ చెల్లింపులకు మరొకపేరు?
ఎ) చాలక బదిలీలు
బి) ప్రభుత్వ బదిలీలు
సి) ప్రైవేట్ బదిలీలు డి) ఏదీకాదు
26. కిందివాటిలో సరైనది కానిది ఏది?
ఎ) వినియోగవ్యయం-గృహరంగం చేస్తుంది
బి) పెట్టుబడి వ్యయం -వ్యాపార సంస్థలు చేస్తాయి
సి) నికర ఎగుమతులు విదేశీ రంగంపైన చేసేది
డి) ప్రభుత్వ వ్యయం ప్రబ్లిక్/ ప్రైవేట్ రంగం చేస్తుంది
27. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) 2 రంగాలు అంటే గృహరంగం, సంస్థలు
బి) 3 రంగాలు అంటే కుటుంబం, సంస్థలు, ప్రభుత్వం
సి) 4 రంగాలు అంటే గృహరంగం, సంస్థలు, ప్రభుత్వం, విదేశీ రంగం
డి) పైవన్నీ సరైనవే
28. కిందివాటిలో వ్యవసాయరంగంలో ఉపరంగం కానిది ఏది?
ఎ) పశుసంపద బి) చేపల పెంపకం
సి) మత్స్యపరిశ్రమ డి) సమాచారం
29. ILO అంటే?
ఎ) Internal Labour Orient
బి) Internal Labour Organization
సి) International Labour Organization
డి) Intermediat low order
30. ప్రపంచ ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది?
ఎ) 1929 బి) 1939
సి) 1949 డి) 1959
31. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) కనీస వేతన చట్టం 1948
బి) కర్మాగారాల చట్టం -1948
సి) కాంట్రాక్టు కార్మికుల చట్టం 1970
డి) బాలకార్మిక నిషేధ చట్టం 1948
32. కిందివాటిని జతపరచండి?
ఎ) SITRA 1) 2005
బి) GKY 2) 1999
సి) SGSY 3) 1997
డి) భారత్ నిర్మాణ్ 4) 1992
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
33. పేదరికం అనేది?
ఎ) ఆర్థిక సమస్య
బి) సాంఘిక సమస్య
సి) సాంస్కృతిక సమస్య
డి) పైవన్నీ
34. ప్రణాళిక సంఘం ఒక…?
ఎ) కేంద్రానికి సలహా సంస్థ
బి) రాజ్యాంగేతర సంస్థ
సి) శాసనేతర సంస్థ డి) పైవన్నీ
35. కిందివాటిని జతపరచండి?
ఎ) బాంబేప్లాన్ 1) 1943
బి) గాంధీప్లాన్ 2) 1944
సి) ప్రజాప్రణాళిక 3) 1945
డి) సర్వోదయ ప్రణాళిక 4) 1950
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
36. ప్రణాళికలు సాధించిన వృద్ధి రేటులో తప్పును గుర్తించండి?
ఎ) మొదటి ప్రణాళిక – 4.6 శాతం
బి) మూడో ప్రణాళిక – 3.3 శాతం
సి) ఎనిమిదో ప్రణాళిక – 6.5 శాతం
డి) 12వ ప్రణాళిక – 8 శాతం
37. కిందివాటిలో సరికానిది?
ఎ) మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ హజారీకమిటీ సూచన
బి) మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ స్థిర మూలధనం 50 కోట్లపైన
సి) మొదటిసారి 14 బ్యాంకుల జాతీయీకరణ
డి) మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ 1980 ఏప్రిల్ 15
38. కిందివాటిని జతపరచండి?
ఎ) చైనా భారత్ యుద్ధం 1) 1971
బి) పాక్ భారత్ యుద్ధం 2) 1962
సి) నిరంతర ప్రణాళిక 3) 1991
డి) ఎల్పీజీ 4) 1978-80
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
39. కిందివాటిలో సరైనది కానిది?
ఎ) నాబార్డ్ -1982, జూలై 12
బి) ఐఆర్‌డీపీ – 1980
సి) డ్వాక్రా – 1981
డి) ఎక్సిమ్ బ్యాంక్ -1982
40. కిందివాటిలో సరికానిది?
ఎ) జాతీయ ఆరోగ్య మిషన్-2013
బి) మేక్ ఇన్ ఇండియా – 2014 సెప్టెంబర్ 25
సి) స్టార్టప్ ఆఫ్ ఇండియా 2016 జనవరి 16
డి) ఉజాలా – 2015
41. కిందివాటిలో సరైనది ఏది?
ఎ) ప్రణాళిక సంఘం రద్దు – 2014 ఆగస్టు 13
బి) నీతి ఆయోగ్ ఏర్పాటు – 2015 జనవరి 1
సి) ప్రణాళిక సంఘం ఏర్పాటు 1950 మార్చి 15
డి) పైవన్నీ సరైనవే
42. కిందివాటిని జతపరచండి?
ఎ) TRYSEM 1) 1977
బి) JRY 2) 1979
సి) RLEGP 3) 1989
డి) FFWS 4) 1983
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-2, బి-3, సి-1, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
43. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) ఏక్‌భారత్ శ్రేష్ట భారత్ – 2016 అక్టోబర్ 31
బి) రాష్ట్రీయ వయోశ్రీ యోజన 2017 ఏప్రిల్ 1
సి) ఈ-నామ్ -2015
డి) పైవన్నీ సరైనవే
44. అత్యంత విఫలమైన ప్రణాళిక ఏది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 12
45. ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది?
ఎ) 1 బి) 6 సి) 8 డి) 11
46. నీతి ఆయోగ్‌లో పదవీ రీత్య సభ్యులను ఎవరు నియమిస్తారు?
ఎ) ప్రధానమంత్రి
బి) నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
సి) రాష్ట్రపతి డి) ఆర్థిక మంత్రి
సమాధానాలు
1-ఎ 2-డి 3-డి 4-ఎ
5-డి 6-బి 7-డి 8-డి
9-డి 10-బి 11-డి 12-బి
13-ఎ 14-బి 15-సి 16-ఎ
17-డి 18-డి 19-డి 20-ఎ
21-ఎ 22-బి 23-సి 24-డి
25-ఎ 26-డి 27-డి 28-డి
29-సి 30-ఎ 31-డి 32-ఎ
33-డి 34-డి 35-ఎ 36-డి
37-డి 38-బి 39-సి 40-డి
41-డి 42-ఎ 43-డి 44-బి
45-ఎ 46-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు