Current Affairs | ఆడంబర పట్టాభిషేకం.. 40వ రాజుగా ఆగమనం
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం
- ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ పట్టాభిషిక్తుడయ్యారు. ఇతని కొత్తపేరు ఇక నుంచి కింగ్ చార్లెస్-3. 2023, మే 6న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఆడంబరంగా పట్టాభిషేకం జరిగింది. చార్లెస్-3 ప్రస్తుత వయస్సు 74 సంవత్సరాలు.
- చార్లెస్-3 బ్రిటన్‌కు 40వ రాజుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం.
- పట్టాభిషేకానికి ముందు తొలుత గౌరవ సూచకంగా సైనికులు వెంట నడవగా డైమండ్ జూబ్లీ గుర్రపు బగ్గీపై రాజు చార్లెస్-3, రాణి కెమెల్లా తమ అధికారిక నివాసం బకింగ్ హాం ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు వచ్చారు.
- 2.2 కి.మీ పొడవైన రహదారిలో వేల మంది నిల్చొని బ్రిటన్ జాతీయ జెండాలతో అభివాదం తెలిపారు.
- ఈ పట్టాభిషేకానికి సుమారు 2200 మంది అతిథులు హాజరయ్యారు.
- ఈ పట్టాభిషేకానికి భారతదేశం నుంచి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, అతని భార్య సుదేశ్ ధన్‌ఖడ్‌లు హాజరయ్యారు. బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్‌తో సహా మొత్తం 11 మంది భారత్ కు చెందిన వ్యక్తులు హాజరయ్యారు.
- పట్టాభిషేకంలో ఉన్నవారు God save King (భగవంతుడు రాజును రక్షించుగాక) అని దీవిస్తారు. పరిచయంలో భాగంగా కాల్డ్ టు సర్వ్ ను హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ మత పెద్దలతో కలిసి ‘కాంటర్ బరి ఆర్చిబిషప్’ జస్టిన్ వెల్టీ నిర్వహించారు.
- భారత సంతతికి చెందిన బ్రిటన్ తొలి ప్రధాని రిషి సునాక్ బైబిల్ వాక్యాలు చదివారు. ఆ తర్వాత రాజు, రాణిల వివాహ
కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజు రెండు ప్రమాణాలు చేశారు.
1. బ్రిటన్ ప్రజలను న్యాయం, దయతో పాలిస్తానని, అన్ని విశ్వాసాల ప్రజలు బ్రిటన్‌లో స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తానని బైబిల్ సాక్షిగా ప్రమాణం చేశారు.
2. చర్చి ఆఫ్ ఇంగ్లండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్‌గా ఉంటానని ప్రమాణం చేశారు. - ప్రమాణం పూర్తయిన తర్వాత సింహాసనాన్ని అధిష్టించారు. ఈ సింహాసనాన్ని 1300లో కింగ్ ఎడ్వర్డ్ చేయించారు. ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన రాయిని ఉంచుతారు.
- ఆ తర్వాత జెరూసలేం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనె పోస్తారు. ఇదంతా తెరచాటున జరుగుతుంది. ఈ నూనెను జెరూసలేంలోని పర్వతశ్రేణి మౌంట్ ఆఫ్ ఆలివ్స్‌లోని ఆలివ్ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలను కలిపి తయారు చేస్తారు.
- రాజు, రాణి ప్రయాణించే గుర్రపు బగ్గీని 1762లో తయారు చేశారు. కాగా దీన్ని 1831 నుంచి పట్టాభిషేకానికి వాడుతున్నారు.
- నూనె అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు తాపడంతో చేసిన మహారాజ గౌన్ ను ధరించి సింహాసనంపై కూర్చున్నారు. రాజు ధరించే గౌను ఇతర దుస్తులు 1821లో జార్జ్-4 పట్టాభిషేక సమయంలో తయారు చేయించినవి. ఇప్పటికీ అవే వాడుతున్నారు.
- ఈ పట్టాభిషేకానికి రాజు చార్లెస్-3 ధరించిన ‘బ్రూచ్’, రాణి కెమెల్లా ధరించిన గౌనును భారతదేశానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక మల్లిక్ డిజైన్ చేశారు. ఈమె పశ్చిమబెంగాల్‌కు చెందినవారు.
- రాజు సింహాసనంపై కూర్చొన్న తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజ దండాన్ని ఆర్చిబిషప్ రాజుకు అందించారు.
- తర్వాత కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేశారు. ఆ సమయంలో సభలోనివారు గాడ్ సేవ్ కింగ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు కుర్చీలోంచి లేచి రాజ ఖడ్గాన్ని పట్టుకొని ప్రత్యేక సింహాసనంపై ఆసీనులయ్యారు.
- కెమెల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. ఈ కిరీటంలో కోహినూర్ తప్ప 2200 వజ్రాలు పొదిగారు.
- ధరించిన కిరీటాన్ని సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం అంటారు. దీన్ని 1661లో తయారు చేశారు. దీని బరువు 2.23 కిలోలు. ఈ కిరీటాన్ని పట్టాభిషేకం రోజున ఒక గంటసేపు మాత్రమే ఉంచుతారు. తదుపరి రాజు పట్టాభిషేకం కోసం దాచి పెడతారు.
- పట్టాభిషేకంలో రాజు చేతికి రెండు రాజదండాలు అందిస్తారు. అందులో ఒకటి శిలువ బొమ్మ ఉన్నది. దీని అర్థం దేవుడి నుంచి రాజుకు అధికారం సంక్రమించిందనడానికి సంకేతం. రెండోది పావురం ఉన్న రాజదండం. ఇది సుపరిపాలనకు సూచిక.
- దూరంగా ఉండాలని రాణి కిరీటంలో కోహినూర్ వజ్రం తీసేశారు.
- రాణి ధరించిన కిరీటాన్ని ‘క్వీన్ మేరీ కిరీటం’ అంటారు. దీన్ని 1911లో తయారు చేశారు.
- పట్టాభిషేకంలో ఉపయోగించిన కిరీటం, ఆభరణాలు సుమారు 100 దాకా ఉంటాయి. పట్టాభిషేకం పూర్తవగానే వీటన్నింటినీ ‘టవర్ ఆఫ్ లండన్’లో దాచి ఉంచుతారు.
- వెస్ట్ మినిస్టర్ అబే 1066 నుంచి రాజుల పట్టాభిషేకానికి వేదికగా ఉంటుంది.
- అక్సెషన్ కౌన్సిల్ సమక్షంలో బాధ్యతలు అప్పగిస్తారు. ఇది రాజరికపు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుంది. బ్రిటన్‌కు 40వ మహారాజు.
- మహారాజు ధరించే కిరీటాన్ని సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం అంటారు. ఈ కిరీటాన్ని 1961లో తయారు చేశారు.
- పట్టాభిషేకం జరిగే స్థలం- వెస్ట్ మినిస్టర్ అబే
- 56 దేశాల CHOGMకు నాయకుడు, 14 దేశాలకు పూర్తి స్థాయి అధినేత.
- చార్లెస్ భార్య ‘Queen Concert Camilla’ గా వ్యవహరిస్తారు.
చార్లెస్-3 గురించి…
- అసలు పేరు చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్. 1948, నవంబర్ 14న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్
రాణి-2, ప్రిన్స్ ఫిలిప్ తల్లిదండ్రులు. - 1970లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో డిగ్రీ పొందారు. డిగ్రీ పొందిన తొలి రాజుగా నిలిచారు.
- 1971 నుంచి 1976ల మధ్య రాయల్ నేవీలో పని చేశారు. 1981లో లేడీ డయానా స్పెన్సర్‌ను వివాహమాడారు. 1996లో విడాకులు తీసుకొని 2005లో కెమెల్లా పార్కర్ బౌలెస్ను రెండో వివాహం చేసుకున్నారు.
- 1992లో ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేశారు. ఇది తర్వాత ‘BRE ట్రస్ట్’ గా మారి పట్టణ పునరుత్పత్తి, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతుంది.
- చార్లెస్-3 తన తల్లి ఎలిజబెత్-2 మరణించిన తర్వాత రాజయ్యారు.
- రాజుగా 2022, సెప్టెంబర్ 9న తొలి ప్రసంగం చేశారు. 2023, మే 6న పట్టాభిషిక్తుడయ్యాడు.
- రాజయ్యాక దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను తొలిసారి కలిశారు.
ఎలిజబెత్-2 మరణం
- బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) 2022, సెప్టెంబర్ 8న మరణించారు.
- స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్‌లో చనిపోయారు. ఈమె బ్రిటన్‌కు 70 సంవత్సరాలు మహారాణిగా వ్యవహరించారు.
- ఈమె అధికారిక నివాసం- బకింగ్‌హామ్ ప్యాలెస్. వేసవి విడిది కోసం స్కాట్లాండ్ వెళ్లారు.
- 1952, ఫిబ్రవరి 6న కింగ్ జార్జి-6 మరణంతో ఆయన కుమార్తె ఎలిజబెత్-2 1953, జూన్ 2న రాణిగా ఎన్నికయ్యారు.
- రాజు లేదా రాణి మరణిస్తే 24 గంటల్లో వారసుడిని ప్రకటిస్తారు. ఇందుకోసం సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమైన తర్వాత పార్లమెంట్‌ను సమావేశపరిచి శాసన కర్తలంతా కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరించి, అనువంశిక రాజరిక చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- ఈమె పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ
- తండ్రి- Duke of York Prince Albert, తల్లి- Lady Elizebeth Boves-Lyan
- లండన్‌లో 1926, ఏప్రిల్ 21న జన్మించారు. మరణించిన నాటికి బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణిగా రికార్డు సృష్టించారు. (70 సంవత్సరాల 7నెలల 3 రోజులు)
- క్వీన్ విక్టోరియా 63 సంవత్సరాల 7 నెలల 2 రోజుల రికార్డును ఈమె 2015లోనే అధిగమించారు.
- ఎలిజబెత్-2 హయాంలో 4 వేలకు పైగా చట్టాలు చేశారు. 112 విదేశీ అధినేతలకు ఆతిథ్యమిచ్చారు.
- హోదాలో 100కు పైగా దేశాల్లో పర్యటించగా కామన్వెల్త్ దేశాల్లో 150కి పైగా పర్యటనలు చేశారు.
- అత్యధికంగా కెనడాను 22 సార్లు సందర్శించారు. ఫ్రాన్స్‌లో 13 సార్లు పర్యటించారు.
- భారత్‌కు 1961, 1983, 1997లో మూడుసార్లు వచ్చారు.
- 2015, నవంబర్‌లో విదేశీ పర్యటనలకు ముగింపు పలికారు.
- ద టెలీగ్రాఫ్ విశ్లేషణ ప్రకారం ఈమె 42 సార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చినంత పర్యటించారు.
- ఈమె నేతృత్వంలో మొత్తం 15 మంది బ్రిటన్ ప్రధానులు పని చేశారు. మొదటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ (1952-55), చివరి ప్రధాని లిజ్‌ట్రస్.
- లిండన్ జాన్సన్ తప్ప 14 మంది అమెరికా అధ్యక్షుల్లో 13 మందిని కలిశారు. చైనాను సందర్శించిన తొలి బ్రిటిష్ మహారాణి (1986 అక్టోబర్‌లో)
- అమెరికా ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటన్ రాణి (1991). భర్త- ప్రిన్స్ ఫిలిప్
- కామన్వెల్త్ అధ్యక్షులుగా 35 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్లపై రాణి బొమ్మ ముద్రితమై ఉంది.
- రాణికి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఈమె పేరుతో 660 కోట్ల ఎకరాల భూమి ఉండేది. 16 దేశాలకు రాణిగా వ్యవహరించేవారు.
- రెండు పుట్టిన రోజులు. 1. జూన్‌లో రెండో శనివారం, 2. ఏప్రిల్ 21
- భారత్‌లో 2022, సెప్టెంబర్ 11న సంతాప దినంగా పాటించారు.
- ఈమె ఒక రహస్య లేఖను రాశారు. ఇది 2085 వరకు తెరవడానికి వీల్లేదు. దీన్ని సిడ్నీలోని క్వీన్ విక్టోరియా భవనంలో భద్రపరిచారు.
ఆపరేషన్ యూనికార్న్
- 2022, సెప్టెంబర్ 19న లండన్‌లోని విండర్స్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యక్రియలు నిర్వహించారు.
- బ్రిటన్ రాణి మరణానంతరం జరపాల్సిన కార్యక్రమాలకు పెట్టిన కోడ్ నేమ్ ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’ అని పేరు పెట్టారు. కానీ ఈమె స్కాట్లాండ్లో మరణించడంతో ‘ఆపరేషన్ యూనికార్న్’ అని మార్చారు.
- యూనికార్న్ అనేది స్కాట్లాండ్ జాతీయ జంతువు.
- వజ్రాల కిరీటం పేరు- ఇంపీరియల్ స్టేట్ క్రౌన్
- బ్రిటన్ జాతీయ గీతం- God save the king
- అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
- ఈమె వివాహానికి హైదరాబాద్ నిజాం వజ్రాల హారం పంపారు.
రాణి భారత పర్యటనలు-ముఖ్యాంశాలు - 1961లో తొలిసారి మహాత్మాగాంధీ సమాధిని చెప్పులు తీసి సందర్శించారు.
- డా.బాబూ రాజేంద్రప్రసాద్ (రాష్ట్రపతి), జవహర్లాల్ నెహ్రూ (ప్రధాని), సర్వేపల్లి రాధాకృష్ణన్ (ఉపరాష్ట్రపతి) ఢిల్లీ విమానాశ్రయంలో రాణికి స్వాగతం పలికారు.
- గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ కార్పొరేషన్ ఏనుగు దంతంతో చేసిన రెండు అడుగుల కుతుబ్ మినార్ బొమ్మను బహుమతిగా రాణికి అందించారు.
- ఎలిజబెత్-2 1961, జనవరి 27న ఢిల్లీలో ఎయిమ్స్‌కు సంబంధించిన భవనాలు ప్రారంభించారు.
- రిపబ్లిక్ డే కు ముందు ఈమె జైపూర్‌ను సందర్శించారు. తర్వాత ఆగ్రా, పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి, మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం బెంగళూరులో పర్యటించారు.
- రెండో పర్యటనలో భాగంగా 1983లో ఇందిరాగాంధీని కలిశారు. జ్ఞానీ జైల్ సింగ్ ఆహ్వానం మేరకు వచ్చారు.
- ఈ పర్యటనలో మదర్‌థెరిసా కు Honorary Order of Merit ఇచ్చారు.
- మూడో పర్యటనలో భాగంగా 1997లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం 50 ఏళ్ల సందర్భంగా వచ్చారు.
- జలియన్ వాలా బాగ్ సంఘటన ఒక దురదృష్ట సంఘటన అని చెప్పారు. క్షమాపణ కోరారు. ఆ సమయంలో కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా, ఐకే గుజ్రాల్ ప్రధానిగా ఉన్నారు.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
Indian Polity | ఆగంతుక నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
Next article
Economy | పేదరిక విషవలయాల గురించి వివరించినది ఎవరు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు