Economy | బ్రిటన్ కన్నా మేటి… జర్మనీతో పోటీ
1. ప్రస్తుతం ప్రపంచంలో అధిక జనాభా గల దేశం ఏది? (బి)
ఎ) చైనా బి) భారతదేశం
సి) అమెరికా డి) ఇండోనేషియా
వివరణ: ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారతదేశం అవతరించిందని యూఎన్ పాపులేషన్ అండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ -2023 నివేదికలో వెల్లడించింది. 2023 జనవరి 18 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను అధిగమించినట్లు యూఎన్ వరల్డ్ పాపులేషన్ రివ్యూ తన నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 2023 ఆగస్టు 16 నాటికి 143.03 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా జనాభా 142. 56 కోట్లతో రెండోస్థానంలో ఉంది.
2. నీతి ఆయోగ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు? (సి)
ఎ) పరమేశ్వరన్ అయ్యర్
బి) రాజేష్ఖుల్లర్
సి) బీవీఆర్ సుబ్రమణ్యం
డి) నరేంద్రమోదీ
వివరణ: నీతి ఆయోగ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ (సీఈవో)గా బి.వి. ఆర్. సుబ్రమణ్యం 2023 ఫిబ్రవరి 25న నియమితులయ్యారు.
- బి.వి. ఆర్. సుబ్రమణ్యం పూర్తిపేరు బమిడి పాటి వెంకట రామసుబ్రమణ్యం
- బి.వి. ఆర్. సుబ్రమణ్యం తెలుగు వ్యక్తికూడా
- 1987 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుబ్రమణ్యం. గత మూడు దశాబ్దాలుగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్ ప్రపంచ బ్యాంకులో కూడా పనిచేశారు. అంటే వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ ముఖ్యకార్యదర్శిగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధానమంత్రి కార్యాలయంలో పదవులను నిర్వహించడంతోపాటు ప్రపంచ బ్యాంకులో కూడా
పనిచేశారు. - ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులై పరమేశ్వర్ అయ్యర్ స్థానంలో బి.వి.ఆర్.సుబ్రమణ్యం నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
- 3. ఏ రోజు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని యూఎన్ పాపులేషన్ బ్యూరో ప్రకటించింది. (ఎ)
ఎ) 2022 నవంబర్ 15
బి) 2023 జనవరి 18
సి) 2022 డిసెంబర్ 15
డి) 2023 జనవరి 26
వివరణ: ఐక్యరాజ్యసమితి పాపులేషన్ బ్యూరో ప్రపంచ జనాభా 2022 నవంబర్ 15 నాటికి 800 కోట్లకు (8 బిలియన్లకు) చేరిందని ప్రకటించింది. అంతేకాకుండా నవంబర్ 15ను Day of Eight Billion గా ప్రకటించారు.
l ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జన్మించిన శిశువు వినీస్ మ బాన్సాగ్ను 8వ బిలియన్ వ్యక్తిగా గుర్తించారు. - 4. కింది వాటిలో నీతి ఆయోగ్ సభ్యుడు ఎవరు? (ఎ)
ఎ) రమేష్ చంద్ బి) రవి కుమార్
సి) వినోద్ పాండే డి) రాజారాం
వివరణ: ప్రొఫెసర్ రమేష్ చంద్ ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యుడిగా, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. - రమేష్ చంద్ న్యూఢిల్లీలోని (ఐఏఆర్ఐ) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వ్యవసాయ అర్థశాస్త్రంలో పీహెచ్డీ చేశారు.
- రమేష్‌చంద్ నీతి ఆయోగ్‌లో చేరడానికి ముందు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారు.
- వ్యవసాయ ఆర్థికవేత్త అయిన రమేష్ చంద్‌కు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల గౌరవ డాక్టరేట్‌ను అందించింది.
5. భారతీయ రిజర్వుబ్యాంకు ఇటీవల ఏ నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది?(సి)
ఎ) రూ. 500 బి) రూ. 1000
సి) రూ.2000 డి) రూ.200
వివరణ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 19 మే 2023న రూ. 2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇది చట్ట బద్ధమైన టెండర్‌గా పరిగణించబడుతుంది. - 2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
6. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ గరిష్ట డిపాజిట్ పరిమితి ఎంత? (డి)
ఎ) రూ. 15 లక్షలు బి) రూ.20 లక్షలు
సి) రూ.25 లక్షలు డి) రూ. 30 లక్షలు
వివరణ: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కోసం గరిష్ట పెట్టుబడి పరిమితిని 2023 బడ్జెట్లో రూ. 15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. - 2023 బడ్జెట్లో పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయం పరిమితి కూడా రూ.9 లక్షలకు పెంచారు.
7. 37వ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఎంత? (సి)
ఎ) 6 బి) 8
సి) 9 డి) 10
వివరణ: ఫోర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా మార్చి 10, 2023 నుంచి స్టాక్ ధరలు, మారకపు ధరల ఆధారంగా 2023 ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. - 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానం, ఆసియాలో మొదటి స్థానంలో నిలిచారు.
- 37వ ఫోర్బ్స్ వార్షిక బిలియనీర్ల జాబితాలో 211 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటిస్థానంలో నిలిచారు.
- 180 బిలియన్ డాలర్ల విలువతో ఎలాన్ మస్క్ రెండోస్థానంలో నిలిచారు.
8. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల భారతదేశం కంటే ముందుగల నాలుగు దేశాలు వరుసగా ఏవి?(బి)
ఎ) అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్
బి) అమెరికా, చైనా, జపాన్, జర్మనీ
సి) చైనా, అమెరికా, జపాన్, జర్మనీ
డి) చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్
వివరణ: 2023 ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ర్యాంకింగ్ జాబితా ప్రకారం భారతదేశం 2026 నాటికి యూఎస్డీ 5.0 ట్రిలియన్ నామ మాత్రపు జీడీపీలో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అవతరిస్తుంది. గతంలో 11వ స్థానంలో ఉన్న భారతదేశం బ్రిటన్ను అధిగమించి 5వ స్థానాన్ని ఆక్రమించింది. - ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (అమెరికా) యూఎస్డీ 29.3 ట్రిలియన్ల నామ మాత్రపు జీడీపీతో అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఆ తరువాత చైనా, చైనీస్ జీడీపీ, యూఎస్డీ 24.3 ట్రిలియన్లు లేదా యూఎస్ జీడీపీ లో 83 శాతంతో రెండోస్థానం, యూఎస్డీ 5.4 ట్రిలియన్లతో జపాన్ మూడోస్థానం, యూఎస్డీ 5.2 ట్రిలియన్లతోజర్మనీ నాలుగో స్థానంలో ఉన్నాయి.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం (ఈఆర్డీ) అంచనా ప్రకారం భారతదేశం 2029 నాటికి మూడోస్థానానికి చేరుతుందని పేర్కొంది.
l ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ జీడీపీ వాటా 2014లో 2.6 శాతం ఉంటే ప్రస్తుతం 3.5 శాతానికి చేరుకుంది.
9. భారతదేశ అతిపెద్ద వ్యాపార భాగస్వామి గల దేశం ఏది? (బి)
ఎ) రష్యా బి) అమెరికా
సి) యూఏఈ డి) జపాన్
వివరణ: భారతదేశం దాదాపు 192 దేశాలకు సుమారు 7500 వస్తువులను ఎగుమతి చేస్తుంది. - భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 450 బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేసింది. ఆదే విధంగా 323 బిలియన్ డాలర్ల సేవల ఎగుమతులు చేసింది.
- 714.13 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది.
- 1164.19 బిలియన్ డాలర్ల మొత్తం వాణిజ్యం జరిగింది.
- – 267.07 బిలియన్ డాలర్ల వర్తక సంతులనం జరిగింది.
- భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాణిజ్యంలో అధిక శాతం అమెరికాతో జరిగింది. అంటే భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం గల దేశం అమెరికా.
- భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో 71.39 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 46.82 బిలియన్ డాలర్ల దిగుమతులు మొత్తం వాణిజ్యం 118.21 బిలియన్ డాలర్లు. వర్తక సంతులనం 24.57 బిలియన్ డాలర్ల్ల వాణిజ్యం జరిగింది.
- భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యంలో మొదటి స్థానంలో అమెరికా కాగా రెండోస్థానంలో చైనా, మూడోస్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నాలుగోస్థానంలో సౌదీ అరేబియా, ఐదో స్థానంలో రష్యా ఉన్నాయి.
10. ప్రపంచంలోని అత్యున్నత సంపన్న నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంత?(డి)
ఎ) 5 బి) 10 సి) 35 డి) 65
వివరణ: హెన్లీ &పార్ట్నర్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అత్యున్నత సంపన్న నగరాల జాబితాలో ముంబై 21వ స్థానం, హైదరాబాద్‌కు 65వ స్థానం దక్కింది. 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం మొదటిస్థానంలో ఉంది. టోక్యో రెండోస్థానంలో ఉంది.
11. 2023 మార్చినాటికి భారత ప్రభుత్వం అప్పు ఎంత? (ఎ)
ఎ) 155.8 లక్షల కోట్లు
బి) 166.3 లక్షల కోట్లు
సి) 128.4 లక్షల కోట్లు
డి) 187.6 లక్షల కోట్లు
వివరణ: 2023 మార్చి నాటికి భారత ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 155.8 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది.
12. రూపాయి ట్రేడింగ్ కోసం ఆర్బీఐ ఆమోదం పొందిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది?(సి)
ఎ) ఎస్బీఐ
బి) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
సి) యూసీవో బ్యాంక్
డి) ఫెడరల్ బ్యాంకు
వివరణ: భారత ప్రభుత్వ రంగ రుణదాత యూసీవో బ్యాంక్ (యూకో)రూపాయి వాణిజ్యానికి ఆర్బీఐ ఆమోదం పొందిన మొదటి బ్యాంక్
- కోల్‌కతాకు చెందిన బ్యాంక్ భారతీయ రూపాయల్లో వాణిజ్య పరిష్కారం కోసం రష్యాకు చెందిన గాజ్ఫ్రాం బ్యాంక్‌తో జూలైలో ప్రత్యేక వోస్ట్రో ఖాతాను తెరిచింది. జూలైలో భారతీయ బ్యాంకులు భారతీయ కరెన్సీలో వాణిజ్యాన్ని సెటిల్ చేసుకోవడానికి అనుమతించాలని ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
- భారతదేశం, శ్రీలంక, రష్యాతో సహా ఇతర దేశాల మధ్య వాణిజ్య పరిష్కారాలను కూడా ఆర్బీఐ అనుమతించింది.
13. బియ్యం ధర సూచికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? (బి)
ఎ) నీతి ఆయోగ్ బి) ఎఫ్ఏవో
సి) ఐఎంఎఫ్
డి) యూఎస్ ఫెడరల్ రిజర్వు
వివరణ: జూలైలో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ ఏజెన్సీ బియ్యం ధర సూచిక 2.8 శాతం పెరిగి దాదాపు 12 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి చేరుకుందని నివేదించింది. - భారతదేశం విధించిన బలమైన డిమాండ్, ఎగుమతి పరిమితుల కారణంగా పెరుగుదల ఏర్పడినది. ఇది కీలక ఎగుమతి దేశాల్లో ధరలను ప్రభావితం చేసింది.
14. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖతో తన సహకారాన్ని ప్రారంభించింది? (బి)
ఎ) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
సి) ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ
డి) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వివరణ: One District One Product (ODOP) కార్యక్రమం పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(DPIIT). వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రమోషన్ విభాగం కింద ఒక చొరవ. - న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖతో తన సహకారాన్ని ప్రారంభించింది.
- డీపీఐఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్తంగా SARAS Ajeevika స్టోర్‌లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి వాల్‌ను ప్రారంభించాయి.
15. గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? (సి)
ఎ) తెలంగాణ బి) కేరళ
సి) కర్ణాటక డి) ఒడిశా
వివరణ: కర్ణాటక ప్రభుత్వం గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు, ఈ పథకం ద్వారా దాదాపు 2.14 కోట్ల్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ఈ పథకం కోసం ఇప్పటికీ 1.41 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. దీని కింద బీపీఎల్ కుటుంబాల్లోని మహిళా పెద్దలందరికీ రూ, 2000 భత్యం కూడా ఇస్తారు.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు