Society QNS & ANSWERS | ఎస్సీ జాతీయ కమిషన్ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు?
1. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : c
1. ‘వైకల్యం’ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందకు వస్తుంది.
2. ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా, ఇతర రూపాల్లో బలవంతపు పని, యాచనను నిషేధించవచ్చు.
సరైన జవాబును గుర్తించండి
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చర్చిస్తుంది. దీని ప్రకారం రాజ్యాంగం జీవనం, వ్యక్తి స్వేచ్ఛల రక్షణకు భరోసా ఇస్తుంది. ఇది ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా, ఇతర రూపాల్లోని బలవంతపు పని, యాచన మొదలైన అంశాలను చర్చిస్తుంది.
2. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : c
1. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఒక వ్యూహంగా 1974 -1975 లో గిరిజన ఉప ప్రణాళిక ఉనికి లోకి వచ్చింది.
2. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన ఉప ప్రణాళికను పర్యవేక్షిస్తుంది.
పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏది/ఏవి?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఒక వ్యూహంగా 1974 – 1975 లో గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్సీ) ఉనికిలోకి వచ్చింది. ప్రణాళిక, ప్రణాళికేతర విలీనం అనంతరం గిరిజన ఉప ప్రణాళిక పేరును ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
3. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : a
1. ‘కోయ’ తెగ తెలంగాణలో అతిపెద్ద ఆదివాసీ తెగ
2. తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కోయ తెగ విస్తరించి ఉంది.
3. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వారు విస్తరించి ఉన్నారు. సరైన జవాబును గుర్తించండి?
a. 1, 2, 3 b. 1, 2
c. 1, 3 d. 2, 3
వివరణ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో కనిపించే భారతీయ గిరిజన సమూహం ‘కోయ’. తమ మాండలికంలో కోయలు తమకు తాము ‘కోయిటుర్’ అని పిలుచుకుంటారు. ఇది గోండికి సంబంధించిన ద్రావిడ భాష. కోయ తెగ తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ. తెలుగు రాష్ర్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోయ తెగ ప్రజలు విస్తరించి ఉన్నారు. తెలంగాణ ఖమ్మంజిల్లలో వారి విస్తృతి ఎక్కువగా వుంది.
4. కింది వ్యాఖ్యలను పరిశీలించండి ? జవాబు : b
1. రాజ్యాంగం ‘అస్పృశ్యత’ అనే పదాన్ని నిర్వచింది.
2. భారగ రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిషేధించింది.
3. అంటరానితనాన్ని పాటించడం పౌర చట్ట ప్రకారం నేరం.
పై అంశాల్లో సరైనవి ఏవి/ఏది?
a. 1, 2, 3 b. 2
c. 1, 3 d. 2, 3
వివరణ – రాజ్యంగం ‘అస్పృశ్యత’ పదాన్ని లేదా చట్టాన్ని నిర్వచించలేదు. ఆర్టికల్ 17 అస్పృశ్యతను పూర్తిగా నిషేధించింది.
‘అస్పృశ్యతను పాటించడం క్రిమినల్ చట్టం ప్రకారం నేరం.
5. కింది వ్యాఖ్యలను పరిశీలించండి ? జవాబు : d
1.‘కల్యాణలక్ష్మి’ ఎస్సీ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను మాత్రమే తొలగిస్తుంది.
2. తెలంగాణ ప్రభుత్వం పెళ్లి సమయంలో వధువుకు రూ. 1,00,116 ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
3. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షలకు మించకూడదు.
సరైన జవాబును గుర్తించండి?
a. 1, 2, 3 b. 1, 2
c. 1, 3 d. 2, 3
వివరణ : ఎస్సీ/ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి తెలంగాణ రాష్ట్రంలో నివసించే వధువులకు వివాహ సమయంలో రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని ఏక మొత్తంలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా – పెళ్లి నాటికి 18 ఏళ్లు నిండిన బాలికల తల్లి దండ్రుల ఆదాయం ఏడాదికి రూ. 2 లక్షలకు మించని వారికి 2014 అక్టోబర్ 2 నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు.
6. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : a
1. వృద్ధుల కోసం సమీకృత పథకం వారి జీవన నాణ్యతను మెరుగురుస్తుంది.
2. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీ.
3. రాష్ట్రీయ వయోశ్రీ యోజననను కూడా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1, 2, 3 b. 1, 2
c. 2, 3 d. 1, 3
వివరణ : వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ‘వృద్ధుల కోసం సమీకృత కార్యక్రమం’ పేరుతో ఒక ప్రధాన కార్యక్రమంతో ముందుకు వచ్చింది. రాష్ట్రీయ వయోశ్రీ యోజనను కూడా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.
7. కింది వాఖ్యలను పరిశీలించండి? జవాబు : c 1.ఆర్టికల్ 243 డి పంచాయతీల్లో షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్లను అందిస్తుంది.
2. ఆర్టికల్ 330 లోక్సభలో షెడ్యూల్డ్ తెలగకు సీట్ల రిజర్వేషన్లను అందిస్తుంది.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీకాదు
వివరణ : రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా ఆధారంగా సకారాత్మక వివక్ష (పాజిటివ్ డిస్క్రిమినేషన్) భావన కింద రిజర్వేషన్లు కల్పించింది, కాబట్టి ఆర్టికల్ 243 డి పంచాయతీల్లో షెడ్యూల్డ్ తెగలకు సీట్ల రిజర్వేషన్లను అందిస్తుంది. అదే విధంగా ఆర్టికల్ 330 లోక్సభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను అందిస్తుంది.
8. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : c
1.పోచంపల్లి చీరలు తెలంగాణలోని నల్ల గొండ జిల్లాలో ఆవిర్భవించాయి.
2. కాకతీయ రాజవంశం సమయంలో పెంబర్తి లోహ కళ విలసిల్లింది.
సరైన జవాబును గుర్తించండి
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీకాదు
వివరణ : తెలంగాణలోని నల్ల గొండ జిల్లాకు చెందిన చీర పోచంపల్లి. భూదాన్ పోచంపల్లి పేరు మీద దానికి పోచంపల్లి చీర అనే పేరొచ్చింది. ఇక్కత్ నైపుణ్యాలు ఈ చీర విశిష్టత. సంక్లిష్టమైన జ్యామితీయ నమూనాలను ఈ పనిలో కళాకారులు ప్రదర్శిస్తారు. పెంబర్తి లోహ కళ కాకతీయుల పాలన కాలంలో వర్ధిల్లింది.
9. కింది వ్యాఖ్యలన పరిశీలించండి? జవాబు : d
1. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు 5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించడం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లక్ష్యం.
2. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్టు 10న నిర్వహించారు.
సరైన జవాబును గుర్తించండి?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదపడేలా గుణాత్మక మార్పుదిశగా ప్రతిష్ఠాత్మక ఎజెండా ‘ఉజ్వల యోజన’. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు 5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయడం దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్టు 10న నిర్వహించారు.
10. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : c
1. మైనారిటీల కోసం జాతీయ కమిషన్ చట్టం, 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ మైనారిటీ కమిషన్ను ఏర్పాటు చేసింది.
2. ఐదు మత సమూహాలు – ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లను భారతదేశంలో మైనారిటీలుగా ప్రకటించారు.
సరైన జవాబును గుర్తించండి?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : రాజ్యాంగంలో ‘మైనారిటీ’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. మైనారిటీల జాతీయ కమిషన్ చట్టం – 1992 మైనారిటీ అనే పదాన్ని నిర్వచించింది. ఐదు మత సమూహాలు – ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లను భారత్లో మైనారిటీ సమూహాలుగా ప్రకటించారు.
11. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?జవాబు : c
1. భారత గిరిజన మార్కెటింగ్ ఫెడరేషన్ (ట్రైఫెడ్) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాలన నియంత్రణలో పని చేస్తుంది.
2. ట్రైఫెడ్ గిరిజనులు తమ ఉత్పత్తులు విక్రయించుకోవడానికి దోహదకారిగా వ్యవహరిస్తుంది.
సరైన జవాబును గుర్తించండి?
a. 1. b. 2. c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య 1987లో మనుగడలోకి వచ్చింది. ఇది జాతీయ స్థాయి అత్యున్నత సంస్థ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది. ట్రైఫెడ్ తుది లక్ష్యం గిరిజన సమూహాల సామాజిక – ఆర్థికాభివృద్ధి. మార్కెటింగ్ అభివృద్ధి ద్వారా గిరిజన సమూహాలకు ఇది తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. జ్ఞానం, వివిధ సాధనాలు, విస్తృతమైన సమాచారాన్ని అందించడం ద్వారా గిరిజన ప్రజలను ఇది సాధికారం చేస్తుంది.
12. కింది వ్యాఖ్యలన పరిశీలించండి? జవాబు :d
1. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి త్వశాఖ షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పర్యవేక్షించే నోడల్ మంత్రిత్వ శాఖ.
2. షెడ్యూల్డు కులాల అభివృద్ధి విభాగం మంత్రిత్వశాఖలో ఒక భాగం. విద్య, ఆర్థిక, సామాజిక సాధికారత ద్వారా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఇది షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పర్యవేక్షించే నోడల్ మంత్రిత్వ శాఖ, మంత్రిత్వ శాఖలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి బ్యూరో ఒక భాగం. విద్య, ఆర్థిక, సామాజిక సాధికారత ద్వారా
ప్రోత్సహిచడం దీని లక్ష్యం.
13. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : b
1. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ 2003 లో 88వ సవరణ చట్టం ద్వారా స్థాపించబడిన రాజ్యాంగబద్ధ సంస్థ.
2. ఆర్టికల్ 338-ఎ ప్రకారం షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు.
సరైన జవాబును గుర్తించండి
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 338-ఎ ప్రకారం షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేశారు.
14. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి ఫెడరేషన్ కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 కింద నమోదైంది.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు :
వివరణ : జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ 1989లో కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని భారత కంపెనీగా ఏర్పటైంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కింద దీనిని స్థాపించారు.
15. కింది వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : a
1. మారుమూల ప్రాంతాల్లోని ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారు.
2. రెసిడెన్షియల్ సౌకర్యంతో పాఠశాల విద్య ను పొందేందుకు ఏకలవ్య మోడల్ డే బోర్డింగ్ పాఠశాలలను కూడా స్థాపించారు.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏకలవ్య ఆదర్శ (మోడల్) పాఠశాలలను రూపొందించింది. హాస్టల్ సౌకర్యంతో పాఠశాల విద్యను అందించేందుకు ఏకలవ్య మోడల్ డే బోర్డింగ్ పాఠశాలలను కూడా స్థాపించారు.
16. కింద వ్యాఖ్యలను పరిశీలించండి? జవాబు : c
1. పిల్లల కోసం జాతీయ కార్యాచరణ విధానాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. పిల్లల కోసం జాతీయ విధానాన్ని భారత ప్రభుత్వం 2013లో ఆమోదించింది.
సరైన జవాబును గుర్తించండి
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాలల ప్రయోజనాలను కాపాడేందుకు పిల్ల ల కోసం ఒక జాతీయ విధానాన్ని ప్రారంభించింది. దీనిని ప్రభత్వం 2013లో ఆమోదించింది.
17. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
జవాబు : c
1. 2015లో ట్రాన్స్ జెండర్ విధానాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
2. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ 2020లో లింగమార్పిడి వ్యక్తుల (ట్రాన్స్ జెండర్ల) నిబంధనలను రూపొందించింది.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : పుట్టుక ద్వారా తనకు సంక్రమించిన లింగంతో సరిపోలని వ్యక్తులు ట్రాన్స్ జెండర్స్. 2015లో ట్రాన్స్జెండర్ విధానాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020లో లింగమార్పిడి వ్యక్తుల (ట్రాన్స్ జెండర్ల) నిబంధనలను రూపొందించింది.
18. కింది వాఖ్యలను పరిశీలించండి? జవాబు : a
1. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అంబేద్కర్ సామాజిక ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ మిషన్ను ప్రారంభించింది.
2. ఎస్సీల కోసం అంబేద్కర్ ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ మిషన్ను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రారంభించారు.
సరైన జవాబును గుర్తించండి ?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
వివరణ : అంబేద్కర్ సామాజిక ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ మిషన్ (ఏఎస్ఐఐఎం)ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తుల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు దీనిఇన ప్రారంభించారు.
ఎం. క్రాంతి కుమార్ రెడ్డి
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు