UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
యూసీడ్, సీడ్-2024
ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏ గ్రూప్ అయితేనేమి డిజైనింగ్‌లో ఆసక్తి ఉంటే చాలు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్సీల్లో చదవవచ్చు. డిజైనింగ్ రంగంలో నిష్ణాతులు కావచ్చు. దీనికోసం దేశవ్యాప్తంగా నిర్వహించే యూసీడ్, సీడ్-2024 ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ సాధిస్తే చాలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
యూసీడ్
- అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (యూసీడ్). దీన్ని ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌తో పాటు పలు ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎవరు అర్హులు?
- ఇంటర్లో (ఆర్ట్స్, మ్యాథ్స్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్) 2023లో ఉత్తీర్ణులు. 2024 మార్చిలో పరీక్ష రాయనున్నవారు కూడా అర్హులే.
నోట్: ఆయా ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్ గ్రూప్‌లకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. వివరాలు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో చూడవచ్చు.
వయస్సు: 1999, అక్టోబర్ 1 తర్వాత జన్మించిన జనరల్/ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 1994, అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉండాలి.
పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు
- ఈ పరీక్షను గరిష్ఠంగా రెండుసార్లు రాయవచ్చు. ఏ సంవత్సరం స్కోర్ ఆ ఏడాదికి మాత్రమే పరిమితం. యూసీడ్-2024 స్కోర్ 2024-25 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
సీట్ల వివరాలు: మొత్తం సీట్లు -199 - వీటిలో ఐఐటీ బాంబే- 37, ఐఐటీ గువాహటి- 56, ఐఐటీ ఢిల్లీ-20, ఐఐటీ హైదరాబాద్-20, ఐఐఐటీడీఎం జబల్పూర్- 66 సీట్లు ఉన్నాయి.
నోట్: యూసీడ్లో అర్హత సాధించివారికి పై సంస్థల్లో కామన్ అప్లికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. - యూసీడ్ స్కోర్‌ను అనంత నేషనల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఈపీటీ యూనివర్సిటీ, డీవై పాటిల్ యూనివర్సిటీ, డీటీయూ, జైన్ స్కూల్, జేకేఎల్యూ, ఎల్పీయూ, ఎంఐటీ-డబ్ల్యూపీయూ, నిర్మా, సృష్టి మణిపాల్, సింబయాసిస్, యూపిడ్, యూపీఈఎస్, విఐటీ, విశ్వనికేతన్, గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్లు ఉపయోగించుకుని ప్రవేశాలు కల్పిస్తాయి.
- పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. 300 మార్కులు. మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో న్యూమరికల్ ఆన్సర్ టైప్. మల్టి సెలక్ట్ క్వశ్చన్స్, ఎంసీక్యూలు ఇస్తారు. పార్ట్ బీ స్కెచింగ్పై ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 31
పరీక్షతేదీ: 2024, జనవరి 21 (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు)
ఫలితాల వెల్లడి: 2024, మార్చి 8
వెబ్సైట్: https://www.uceed.iitb.ac.in/2024
సీడ్-2024 (ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు)
మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డిజైన్), పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దీన్ని ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది.
- ఈ కోర్సును బెంగళూరులోని ఐఐఎస్సీ, ఐఐఐటీడీఎం జబల్పూర్, ఐఐటీ- బాంబే, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, జోధ్‌పూర్, కాన్పూర్, రూర్కీ ఆఫర్ చేస్తున్నాయి. దీంతోపాటు పలు ఐఐటీల్లోని డిజైన్ స్కూల్స్‌లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు. సీడ్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించే ఇతర సంస్థలు: హర్యానాలోని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్. డెహ్రాడూన్‌లోని యూపీఈఎస్, శివ నాడార్ యూనివర్సిటీ, జైపూర్‌లోని జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, వీఐటీ, డీటీయూ, సృష్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ, డీజే అకాడమీ ఆఫ్ డిజైన్, ఎల్పీయూ, సీఐటీ తదితరాలు.
ఐఐటీల్లో కోర్సుల వివరాలు
- ఐఐఎస్సీలో ఎం.డిజైన్ (ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ బాంబేలో ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికిల్ డిజైన్), పీహెచ్డీ (డిజైన్),
- ఐఐటీ ఢిల్లీలో ఎం డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్), పీహెచ్డీ (డిజైన్).
- ఐఐటీ గువాహటిలో ఎం.డిజైన్ (డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ హైదరాబాద్‌లో ఎం.డిజైన్ (విజువల్ డిజైన్), పీహెచ్డీ డిజైన్
- ఐఐటీ కాన్పూర్‌లో ఎం.డిజైన్ (డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ రూర్కీలో ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్)
- ఐఐటీడీఎం జబల్పూర్లో కూడా ఈ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు పలు ఇతర సంస్థలు ప్రవేశాలను కల్పిస్తాయి.
అర్హతలు: నాలుగేండ్లు లేదా 3+2 ఇయర్స్ (10+2 తర్వాత)లో డిగ్రీ/ డిప్లొమా లేదా
పీజీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. - ఈ పరీక్ష రాయడానికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
- సీడ్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 31
పరీక్షతేదీ: 2024, జనవరి 21
వెబ్సైట్: http://www.ceed.iitb.ac.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు