బహుపార్శ్య సూచీని అభివృద్ధి చేసినది? ( ఎకనామిక్స్ )

టెట్, కానిస్టేబుల్ పరీక్షల ప్రత్యేకం
పేదరికం (Poverty)
# సమాజంలో ఎవరైనా తమ జీవితానికి కనీస ప్రాథమిక అవసరాలైన ఆహారం, గృహవసతి, వస్త్రం పొందలేని స్థితిని ‘పేదరికం’ అంటారు. కనీస వినియోగస్థాయిని/ కనీస జీవన ప్రమాణ స్థాయిని పొందలేకపోవడమే ‘పేదరికం’.
నిరపేక్ష పేదరికం (Absolute Poverty)
# దేశంలోని ప్రజలు కనీస అవసరాలు(తిండి, దుస్తులు, వసతి, పాలు, పప్పులు) కూడా తీర్చుకోలేని స్థితిని లేదా కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని ‘నిరపేక్ష పేదరికం’ అంటారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోఎక్కువగా ఉంటుంది.
సాపేక్ష పేదరికం (Relative Poverty)
# కనీస అవసరాలు తీర్చుకున్నప్పటికీ కొందరికి అధిక ఆదాయం మరికొందరికి తక్కువ ఆదాయం ఉంటుంది. ఇలా తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను ‘సాపేక్ష పేదరికం’ అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది.
పేదరికం గీత/ దారిద్య్ర రేఖ (Poverty Line)
# ప్రణాళిక సంఘం ప్రకారం తలసరి వ్యయం ఆధారంగా గ్రామాల్లో ప్రతి వ్యక్తి తలసరి నెలసరి వ్యయం రూ.1059.48, నగరాల్లో 1286 (2011-12సం. ధరలు) పొందలేని వారిని దారిద్య్రరేఖకు దిగువన జీవించే వారుగా నిర్వహించారు.
# తలసరి వినియోగ వ్యయం ఆధారంగా గ్రామాల్లో ప్రతివ్యక్తి రోజుకు 2400 కేలరీలు, నగరాల్లో 2100 కేలరీలు ఆహారం పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన జీవించేవారుగా నిర్వచించారు.
పేదరికం వ్యత్యాసం (Poverty Gap)
# పేదరిక గీత – పేదవాడి సగటు వినియోగ వ్యయం / పేదరిక గీత లేదా G=Z_Y/Z
# పేదరిక వ్యత్యాసాన్ని, జాతీయ స్థాయిలో పేదరిక గీతలో వివిధ రాష్ట్రాల పేద ప్రజల సగటు వినియోగ వ్యయం ఆధారంగా లెక్కిస్తారు. అంతేకాక పేదరిక వ్యత్యాసం పేదరిక లోటును, వ్యాప్తిని ప్రభావితం చేస్తుంది.
ఒక విధమైన గుర్తింపు కాలం (UPR- Uniform Recall Period)
# దేశంలోని పేదరికాన్ని అంచనా వేయడానికి 30 రోజుల్లో ఆహారేతర వస్తువులను మినహాయించి, అన్నిరకాల వస్తువులపై చేసిన వినియోగ వ్యయాన్ని లెక్కిస్తారు.
మిశ్రమ గుర్తింపు కాలం (MRP-Mixed Recall Period)
# ఆహారేతర 5 రకాల వస్తువులైన వసా్త్రలు, పాదరక్షలు, మన్నికగల వస్తువులు, విద్య, వైద్యం వీటిపై 365 రోజుల్లో (1 సంవత్స రంలో) చేసే వినియోగ వ్యయాన్ని, 30 రోజుల్లో (ఒక నెలలో) ఇతర వస్తువులపైన చేసే ఖర్చును అంచనా వేసి ఎంఆర్పీని లెక్కిస్తారు.
గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ (Glass Curtain Economy) ధనవంతులు అనుభవించే విలాస వస్తువులను, అధిక జీవన ప్రమాణాన్ని పేదవారు అనుభవించే శక్తి లేక చూడగలుగుతున్నారు కానీ అనుభవించలేకపోతున్నారు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ అంటారు.
ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం (Tricle down effect theory)
# దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుంటే ఆ అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు చేరి పేదరికం నిరుద్యోగం తగ్గిపోతుందని భావించడాన్ని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటారు.
తలల లెక్కింపు నిష్పత్తి (HCR- Head count Ratio)
# హెచ్‌సీఆర్ పద్ధతిని దండేకర్ & రథ్ రూపొందించారు. పేదరికాన్ని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ఈ పద్ధతి ద్వారానే లెక్కిస్తారు. పేదరికాన్ని లెక్కించే పద్ధతుల్లో హెచ్ఆర్సీ పద్ధతి ఉత్తమమైనది. ఈ పద్ధతి ద్వారానే నిరపేక్ష పేదరికాన్ని లెక్కిస్తారు.
# హెచ్‌సీఆర్ = పేదవారి సంఖ్య / మొత్తం జనాభా x 100
# P-ఇండెక్స్ (Poverty Index)/ సేన్ ఇండెక్స్ (Sen index)
# P – ఇండెక్స్ పద్ధతిని అమర్త్యసేన్ రూపొందించారు. పేదవారి ఆదాయంలో ఉండే అంతరాల ఆధారంగా పేదరిక సాంద్రతలను లెక్కించడానికి P- ఇండెక్స్‌ను ఉపయోగిస్తారు. దీనిని అమర్త్యసేన్ రూపొందించారు కాబట్టి దీనిని సేన్ పేదరికపు సూచి అనికూడా అంటారు.
పేదరికపు అంతర సూచీ (PGI- Poverty gap index)
# పీజీఐ పద్ధతిని గౌరవ్దత్ &రావెల్లిన్ రూపొందించారు. పేదరిక తీవ్రతను/ సాంద్రతను, పేదరికంలో గల అంతరాలను తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు.
# పేదరిక అంతరం = దారిద్య్రరేఖ – బీపీఎల్ ప్రజల సగటు ఆదాయం / దారిద్య్ర రేఖ
# Poverty gap ను ఆదాయంతో సూచిస్తే పీజీఐ వస్తుంది.
గిని ఇండెక్స్ (Gini Index)
# గిని సూచీని ‘గిని’ రూపొందించారు. అభివృద్ధి చేసినది లారెంజ్. ఆదాయ అసమానతలను లేదా సాపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి గిని సూచీని ఉపయోగిస్తారు.
# గిని ఇండెక్స్ విలువ 0-1 మధ్య ఉంటుంది. స్కేల్ విలువ 0 ఉండే ఆదాయ సమానత్వాన్ని 1 ఉండే అధిక అదాయ అసమానతను సూచిస్తుంది.
బహుపార్శ్య పేదరిక సూచీ (Multi Dimen sional Poverty Index)
# ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం & యూఎన్డీపీ వారు దీనిని అభివృద్ధి చేశారు. ఆయుర్దాయం, అక్షరాస్యత, జీవన ప్రమాణం ఆధారంగా దీనిని రూపొందించారు.
పేదరికానికి కారణాలు
జనాభా పెరుగుదల
వ్యవసాయంపై అధిక భారం
అల్ప ఉత్పాదకత
అల్ప వేతనాలు
నిరుద్యోగం
అసమానతలు
రాజకీయ, సాంఘిక అసమానతలు
# భారతదేశ ప్రజల పేదరికం తీవ్రతను దాదాభాయ్నౌరోజీ 1900 సంవత్సరంలో తన పుస్తకం ‘Poverty and Un British Rule in India’ (పేదరికం-భారత దేశంలో చెడు బ్రిటిష్ పాలన)లో తెలియ జేశారు.
# దండేకర్, నీలకంఠరాత్ అనే ఆర్థిక వేత్తలు పేదరికంపై వీరు రచించిన గ్రంథం ‘Poverty in india’ (భారతదేశంలో పేదరికం)
# భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికం గురించి క్రమబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేశారు. అంతే కాకుండా దారిద్య్రాన్ని కొలవడానికి కేలరీల భావనను మొదటగా ఉపయోగించారు. పేదరికాన్ని లెక్కించడానికి హెచ్ఆర్సీ పద్ధతిని రూపొందించారు.
పేదరిక నివారణ చర్యలు
జనాభా నియంత్రణ
భూసంస్కరణలు
ఉపాధి పథకాల విస్తరణ
ఆర్థిక వికేంద్రీకరణ
అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
నిరక్షరాస్యత నిర్మూలన
ప్రాక్టీస్ బిట్స్
1. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశ పేదరికం/ ఆర్థిక పరిస్థితిపై దాదాభాయి నౌరోజీ రాసిన పుస్తకం?
1) Poverty in india
2) Planning and the poor
3) Poverty and un british rule in india
4)Indian Economy in British india
2. భారతదేశంలో తొలిసారిగా పేదరికం గురించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసినది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) దండేకర్ & రథ్
3) మిన్హస్ 4) ఆమర్త్య సేన్
3. కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని ఏమంటారు?
1) నిరపేక్ష పేదరికం
2) సాపేక్ష పేదరికం
3) దారిద్య్రరేఖ 4) పైవన్నీ
4. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే పేదరికం?
1) నిరపేక్ష పేదరికం
2) సాపేక్ష పేదరికం
3) దారిద్య్రరేఖ 4) పైవన్నీ
5. కింది వాటిలో సరికానిది ఏది?
1) తలల లెక్కింపు నిష్పత్తి – దండేకర్ & రథ్
2) P- ఇండెక్స్ – ఆమర్త్య సేన్
3) పేదరిక అంతర సూచీ – గౌరవ్ దత్ & రావెల్లిన్ 4) గిని ఇండెక్స్ దాదాభాయి నౌరోజీ
6. దారిద్య్ర రేఖను తొలిసారిగా కేలరీల్లో లెక్కించినది ఎవరు?
1) ఆమర్త్యసేన్
2) దాదాభాయి నౌరోజీ
3) దండేకర్ & రథ్
4) గౌరవ్దత్ & రావెల్ల్లిన్
7. బహుపార్శ్య సూచీని అభివృద్ధి చేసినది?
1) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
2) యూఎన్డీపీ 3) 1, 2
4) దాదాభాయ్ నౌరోజీ
8. పేదరికానికి కారణం కానిది?
1) జనాభా పెరుగుదల
2) జనాభా తగ్గుదల
3) నిరుద్యోగం 4) అసమానతలు
9. అభివృద్ధి జరుగుతుంటే పేదరికం, నిరుద్యోగం తగ్గుతుందనేది?
1) గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ
2) ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం
3) 1, 2
4) పై ఏదీ సరైనది కాదు
10. ధనవంతులు అనుభవించే వస్తువులను పేదవారు అనుభవించని వ్యవస్థ?
1) గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ
2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
3) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
11. పేదరికం నివారణ చర్యలు
1) జనాభా నియంత్రణ
2) భూ సంస్కరణలు
3) ఆర్థిక వికేంద్రీకరణ
4) పైవన్నీ
12. గిని ఇండెక్స్‌ను అభివృద్ధి చేసినది ఎవరు?
1) గిని 2) లారెంజ్
3) అమర్త్యసేన్ 4) దండేకర్ & రథ్
సమాధానాలు
1-3 2-2 3-2 4-2 5-4 6-3 7-3 8-2
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు