శిశువికాసం – ప్రాక్టీస్ బిట్స్(TET Special)

1. ‘సమస్యా పూరిత విద్యార్థికి సంబంధించి సమగ్ర విచారణ చేసి, ఆ వ్యక్తి సమస్యను నివారించేందుకు ఉపయోగపడే పద్ధతే
వ్యక్తి చరిత్ర పద్ధతి’ అన్నది ఎవరు?
1) మెకెన్లీ, హాత్ వే
2) హిల్ గార్డ్, హంటర్
3) థర్ స్టన్ అండ్ థర్ స్టన్
4) బోని, హలపిల్ మాన్
2. సంచరిత పరిపుచ్ఛకు సంబంధించి సరికానిది ?
1) దీనిలో ప్రశ్నించవలసిన అంశాలను ముందుగానే నిర్ధారించుంటారు
2) దీనిలో ప్రయోజ్యుడితో స్వేచ్ఛా పూర్వకమైన సంభాషణ ఉండదు
3) ఇందులోని విషయ సేకరణకు పరిమితి ఉండదు
4) ఇది ముఖాముఖి జరుగుతుంది
3. పద సంసర్గ పరీక్ష ఒక
1) ప్రజ్ఞా పరీక్ష
2) అభిరుచి పరీక్ష
3) మూర్తిమత్వ పరీక్ష
4) సహజ సామర్థ్య పరీక్ష
4. తక్కువ సమయంలో ఎక్కువ మందిని విషయ సేకరణ చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించే పద్ధతి ?
1) ప్రయోగ పద్ధతి
2) పరిశీలన పద్ధతి
3) సర్వే పద్ధతి
4) క్లినికల్ పద్ధతి
5. ప్రతిస్పందన అంటే ?
1) ఉద్దీపన లేకున్నా వెలువడే ప్రతిచర్య
2) ఉద్దీపనకు జీవి చూపించే ప్రతిక్రియ ల మొత్తం
3) స్మృతి చిహ్నాల్లో మార్పు
4) ప్రవర్తనలకు మార్గదర్శకత్వం
6. ప్రయోగంలో మార్పు చెందించడానికి ఉపయోగపడేవి?
1) ప్రతిస్పందనలు 2) విచలనలు
3) చరాలు 4) స్థితులు
7. పరిశీలకుడి అదుపులో ఉండే చరం
1) నియంత్రిత చరం
2) అనియంత్రిత చరం
3) జోక్యం చేసుకొనే చరం
4) మధ్యస్థ చరం
8. పరిశీలకుడి అదుపులో ఉండే సమూహం
1) అనియంత్రిత సమూహం
2) నియంత్రిత సమూహం
3) పరిశీలన సమూహం
4) పైవేవీ అదుపులో ఉండవు
సమాధానాలు
1) 4 2) 3 3) 3 4) 3 5) 2 6) 3 7) 1 8) 1
Latest Updates
‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )