ఉభయ చరాలు
-Amphi అంటే dual (ఉభయ) అని, bios అంటే life (జీవం) అని అర్థం.
-ఇవి రెండు రకాల ఆవాసాల్లో నివసించగలుగుతాయి. అంటే నీటిలోను, భూమి మీద.
-ఉభయచరాల గురించిన అధ్యయనాన్ని ఆంఫిబియాలజి అంటారు.
-ఇవి నీటి నుంచి వెలుపలికి వచ్చి నేలపై నడిచిన మొదటి సకశేరుకాలు. ఇవి డివోనియన్ కాలంలో ఉద్భవించాయి.
-వీటి స్వర్ణయుగం- కార్బోనిఫెరస్ కాలం
-వీటిలో చాలావరకు రెండు జతల అంగాలు (Limbs) ఉంటాయి.
-వీటి దేహం తల, మొండెం అనే భాగాలగా విభజితమై ఉంటుంది. కొన్నింటిలో తోక ఉంటుంది. దేహం పొలుసులు లేకుండా తేమగా ఉంటుంది.
-వీటిలో నేత్రాలు కనురెప్పలు (Eyelids) కలిగి ఉంటాయి. చెవిలో కర్ణబేరి (Tympanum) ఉంటుంది. ఆహార నాళం, ప్రత్యుత్పత్తి మార్గాలు, క్లోకా అనే ఒకే గదిలోకి తెరుచుకుంటాయి. ఇది పరాంతంలో తెరుచుకుంటుంది.
-శ్వాసక్రియ మొప్పలు, ఊపిరితిత్తులు, చర్మం ద్వారా జరుగుతుంది. హృదయంలో మూడు గదులు ఉంటాయి (2 కర్ణికలు, 1 జఠరిక).
-ఇవి శీతల రక్త జంతువులు. వీటి కేంద్ర నాడీ వ్యవస్థను ఆవరించి పరాశిక, మృద్వి అనే రెండు పొరలు ఉంటాయి.
-ఇవి ఏకలింగ జీవులు (Sexes are separate). వీటిలో బాహ్య ఫలదీకరణం (External firtilisation) జరుగుతుంది.
-ఇవి అండోత్పాదకాలు. వీటిలో పిండాభివృద్ధి ప్రత్యక్షంగా గాని/ పరోక్షంగా గానీ జరుగుతుంది.
-జీవించి ఉన్న ఉభయ చరాలను కింది విధంగా విభజించారు..
1. ఎన్యురా/సేలియెన్షియన్స్ (Anurans/Salientians)
2. యురోడిలా/కాడేటాలు (Urodeles/Caudates)
3. ఎపోడా/సిసీలియన్స్ (Apodans/Caecilian)
ఎన్యురా/సేలియెన్షియన్స్
-వీటిలో కప్పలను, గోదురు కప్పలను చేర్చారు.
-కప్పల అధ్యయనాన్ని బాట్రకాలజి అంటారు.
-వీటిలో పూర్వాంగాలు (ముందుకాళ్లు) చిన్నగా, చరమాంగాలు (వెనుక కాళ్లు) పెద్దగా ఉంటాయి.
-కప్పల అండాల సమూహాన్ని స్పాన్ అని, శుక్రకణాల సముదాయాన్ని మిల్ట్ అంటారు.
-కప్ప లార్వా (డింబకం)- టాడ్‌పోల్
-సంపర్క సమయంలో ఆడకప్పలను పట్టుకోవడానికి మగ కప్పల పూర్వాంగాలపై ఆంప్లెక్సరీ మెత్తలు (క్లాస్పర్స్) ఉంటాయి.
ఉదా: రానా (కప్ప), బ్యుఫో (గోదురు కప్ప- Toad), హైలా (చెట్ల కప్ప), రాకోఫోరస్ (ఎగిరే కప్ప), అలైటిస్ (మంత్రసాని కప్ప)
-అతిపెద్ద కప్ప- రానా గోలియత్
-అతిచిన్న కప్ప- మైక్రోహైలా
యురోడిలా/కాడేటాలు
-వీటిలో సాలమాండర్లను చేర్చారు.
-వీటిలో ముందుకాళ్లు, వెనక కాళ్లు సమానంగా ఉంటాయి.
-వీటి డింబకం (లార్వా)- ఆక్సోలోటల్
-ఇవి నియోటని/పీడోజెనెసిస్ను ప్రదర్శిస్తాయి. అంటే పిండాభివృద్ధిలో ప్రౌఢజీవి లక్షణాలను సంతరించుకుంటాయి. (లైంగిక పరిపక్వత).
ఉదా: టైగర్ సాలమాండర్ (అంబ్లిస్టోమా)
-ఉత్తర అమెరికాను సాలమండర్ల రాజధాని అంటారు.
ఉదా:
-ఆంఫియూమా- ఇది అతిపెద్ద ఎర్రరక్త కణాలు కలిగిన జీవి.
-ట్రైలటో ట్రైటాన్- ఇది ఇండియన్ సాలమాండర్ (అరుణాచల్‌ప్రదేశ్)
ఎపొడా/సిసీలియన్స్
-ఇవి బొరియల్లో నివసిస్తాయి.
-వీటికి చలనాంగాలు ఉండవు.
-వీటిని గుడ్డి పాములు అంటారు.
ఉదా:
-ఇక్తియోఫిస్- ఇది పొలుసులు, సంపర్క అవయవాన్ని కలిగి ఉంటుంది, సంతాన పాలనను చూపుతుంది.
-గెగనోఫిస్
ఉభయ చరాల మేనమామలు
-డిప్నాయ్ చేపలు ఊపిరి తిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. దీంతో వీటిని ఉభయచరాలకు మేనమామలు అంటారు.
-ఉభయచరాల వైవిద్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం- పశ్చిమ కనుమలు
సరీసృపాలు
-లాటిన్లో Repere/reptum అంటే Creep/Crawl (పాకటం) అని అర్థం.
-పాకే జంతువులను సరీసృపాలు అంటారు.
-వీటి గురించిన అధ్యయనాన్ని హెర్పటాలజి అంటారు.
-సరీసృపాలు ఉద్భవించిన కాలం- కార్బోనిఫెరస్ కాలం
-సరీసృపాల స్వర్ణయుగం- మీసోజాయిక్ యుగం
-ఇవి దాదాపు భూచర జీవులు. ఇవి మొదటి సంపూర్ణ భూచర జీవులు.
-వీటి చర్మం గరుకుగా, పొడిగా కెరాటిన్ సహితంగా ఉంటుంది.
-వీటిలో బాహ్యాస్థి పంజరం కొమ్ము సంబంధిత పొలుసులు, ఫలకాలు, నఖాలుగా ఉంటుంది.
-నఖాలు మొదట ఏర్పడిన జీవులు- సరీసృపాలు.
-వీటిలో బాహ్యచెవి ఉండదు. కానీ కర్ణబేరి ఉంటుంది.
-వీటిలో రెండు జతల అంగాలు ఉంటాయి.
-వీటిలో మూడు గదుల హృదయం ఉంటుంది (అసంపూర్ణంగా విభజితమైన నాలుగు గదులు హృదయం). కానీ మొసలిలో మాత్రం 4 గదుల హృదయం ఉంటుంది (సంపూర్ణంగా విభజన చెందిన 4 గదుల హృదయం).
-ఇవి శీతల రక్త జంతువులు.
-ఇవి ఏకలింగ జీవులు (Sexes are separate)
-వీటిలో అంతర ఫలదీకరణం జరుగుతుంది.
-ఇవి అండోత్పాదకాలు. వీటిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది.
-వీటిలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. కానీ పాముల్లో మాత్రం 10 జతల కపాల నాడులు ఉంటాయి.
-పాములు, బల్లుల్లో జాకబ్సన్ అవయవాలు అనే ప్రత్యేక ఘ్రాణనిర్మాణాలు ఉంటాయి.
-సరీసృపాలను 4 క్రమాలుగా విభజించవచ్చు. అవి…
1. కీలోనియా
2. రింకొసెఫాలియా
3. క్రొకడీలియా
4. స్క్వామేట
కీలోనియా
-ఇందులో తాబేళ్లను చేర్చారు.
-తాబేళ్ల పృష్టభాగంలో ఉన్న ఫలకాన్ని కారాపేస్ అని, ఉదర భాగంలో ఉన్న ఫలకాన్ని ప్లాస్ట్రాన్ అని అంటారు.
-సముద్రంలో నివసించే తాబేళ్లను టర్టిల్స్ అని, మంచినీటిలో నివసించే తాబేళ్లను టెర్రాఫిన్ అంటారు.
-నేలపై నివసించే తాబేళ్లను టార్టాయిస్ అంటారు.
ఉదా:
-కీలోన్ (సముద్ర తాబేలు)- టర్టిల్
-టెస్టుడో (భౌమ తాబేలు)- టార్టాయిస్ (అతిపెద్ద తాబేలు)
-ట్రయోనిక్స్ (మంచినీటి తాబేలు)- టెర్రాఫిన్
రింకోసెఫాలియా
-ఇందులో స్పీనోడాన్ను చేర్చారు.
-స్పీనోడాన్ను హట్టేరియా బల్లి అంటారు.
-ఇది న్యూజిలాండ్‌లో మాత్రమే నివసించే సజీవ శిలాజం (Living fossil) అంటే వేల ఏండ్ల నుంచి ఏ మార్పుకి లోనుకాకుండా ఉన్న జీవి.
-ఇది న్యూజిలాండ్‌లోని బే ఆఫ్ ప్లెంటీ దీవిలో కన్పిస్తుంది.
క్రొకడీలియా-ఇందులో మొసళ్లను చేర్చారు.
-బతికి ఉన్న సరిసృపాల్లో అతిపెద్ద జీవి మొసలి.
-వీటిలో 4 గదుల హృదయం ఉంటుంది.
ఉదా :
-క్రొకడైలస్ పాలుస్ట్రిస్ (భారతదేశ మొసలి/మగర్)
-అలిగేటర్- ఇది అమెరికా, చైనాలో ఎక్కువగా కనబడుతుంది.
-గేవియాలిస్- గంగానది కాలుష్యాన్ని తట్టుకోలేక అంతరించిపోయే దశలో ఉన్న మొసలి
-గాజిటికస్ (భారతదేశ గేవియాల్/ఘరియాల్)
స్క్వామేటా
-దీన్ని మళ్లీ రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి…
1. బల్లులు, తొండలు
2. పాములు (సర్పాలు)
బల్లులు, తొండలు
-బల్లుల గురించిన అధ్యయనాన్ని సారాలజీ అంటారు.
-బల్లులు ఆధారాన్ని అంటిపెట్టుకుని పాకడానికి అంటు మెత్తలను కలిగి ఉంటాయి.
ఉదా:
-హెమీడాైక్టెలస్ (గోడబల్లి)
-కెమిలియాన్ (ఊసరవెల్లి)- ఇది ఆత్మరక్షణ కోసం రంగులు మార్చుతుంది. ఇది ఒక కన్నుతో ముందుకు మరొక కన్నుతో వెనుకకు చూస్తుంది. దీన్నే మోనాక్యులార్ దృష్టి అంటారు.
-డ్రాకో (ఎగిరే బల్లి)- ఇది ఎగరడానికి పెటాజియం తోడ్పడుతుంది.
-కెలాటిస్ (తొండ)
-కామిడో డ్రాగన్- ఇది ప్రపంచంలో అతిపెద్ద బల్లి
-వెరానస్ (ఉడుము)- ఇది దేశంలో అతిపెద్ద బల్లి
డిప్నాయ్ చేపలు
-ప్రొటాప్టెరస్, నియోసెరటోడస్, లెపిడో సైరన్లను డిప్నాయ్ చేపలు అంటారు. వీటినే ఊపిరితిత్తి చేపలు అనికూడా పిలుస్తారు. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. వీటిలో శ్వాసక్రియకు ఊపిరితిత్తులు తోడ్పడుతాయి.
-సీలకాంత్ చేప (లాటిమేరియా): దీన్ని సజీవ శిలాజం (Living fossil) అంటారు. ఇది దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనబడుతుంది.
-ఎనడ్రోమస్ వలస: చేపలు సముద్ర నీటి నుంచి మంచి నీటికి వలస రావడాన్ని ఎనడ్రోమస్ వలస అంటారు.
ఉదా: హిల్సా (ఇండియన్ షేడ్), సాల్మన్ చేప,పెట్రోమైజాన్
-కెటడ్రోమస్ వలస: చేపలు మంచి నీటి నుంచి సముద్రపు నీటిలోకి వలస రావడాన్ని కెటడ్రోమస్ వలస అంటారు.
ఉదా: ఆంగ్విల్లా (ఈల్ చేప)
-చేపలు ఆహారం కోసం, ప్రత్యుత్పత్తి కోసం వలస చూపుతాయి.
-ఫిషింగ్ క్రాఫ్ట్: చేపలను పట్టడానికి వాడే పడవలను ఫిషింగ్ క్రాఫ్ట్‌లు అంటారు.
-ఫిషింగ్ గేర్లు: చేపలను పట్టడానికి వాడే వలలను ఫిషింగ్ గేర్లు అంటారు.
-అతిపెద్ద అక్వేరియం- తారాపూర్ (ముంబై)
-గుడ్లుపెట్టే పెద్దచేపలను బ్రీడర్స్ అంటారు.
-4 కాళ్లను కలిగిన చేప- ఏంజిలాప్స్
-కప్పలు శీతాకాలంలో నిద్రించడాన్ని శీతాకాల సుప్తావస్థ అని, వేసవిలో నిద్రించడాన్ని గ్రీష్మాకాల సుప్తావస్థ అని అంటారు.
-కప్పలు లేని దేశాలు- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా