బి. జనాభా పతనం ఉండటం
సి. భారతీయులనూ యూరోపియన్లనూ విడిగా లెక్కించడం
డి. ప్రప్రథమంగా జనాభాపరమైన దత్తాంశాల్లో అక్షరాస్యతను, స్త్రీ, పురుష నిష్పత్తిని చేర్చడం
1) ఎ 2) ఎ, బి 3) బి 4) ఎ, బి, సి, డి
2. 1990లో మానవాభివృద్ధి సూచీని నిర్వచిస్తూ ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతోపాటు ప్రజాశ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి అని నిర్వచనం చెప్పిన ఆర్థికవేత్త?
1) మహబూబ్ ఉల్ హక్ 2) పాల్ శామ్యూల్స్
3) హెగెన్ 4) జెమ్ టోబిన్
3. యూఎన్డీపీ రూపొందించిన మానవాభివృద్ధికి చెందిన వివిధ సూచీలకు సంబంధించి సరైనది…
1) మానవాభివృద్ధి సూచీ-1990
2) లింగ సాధికారత కొలమానం-1995
3) బహుపార్శ పేదరిక సూచీ-2010 4) పైవన్నీ
4. సమీకృత అభివృద్ధి సూచీని నిర్మించిన ఆర్థికవేత్త?
1) మహబూబ్ ఉల్ హక్ 2) ఎవరెట్ హెగెన్
3) జేమ్స్ టోబిన్ 4) మోరిన్
5. కింది ఏ కాలంలో భారత్‌లో ఉపాధి కల్పన నాటకీయంగా మందగించింది?
1) 1985-90 2) 1993-2000
3) 1987-90 4) 1988-92
6. శారీరక శ్రమ చేస్తూ గంటల ప్రాతిపదికపై వేతనాలు పొందే పనివారిని ఏమంటారు?
1) బ్లూ కాలర్ పనివారు 2) వైట్ కాలర్ పనివారు
3) గోల్డ్ కాలర్ పనివారు 4) గ్రీన్ కాలర్ పనివారు
7. కింది ఏ ప్రణాళిక కాలంలో ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేసింది?
1) 10వ ప్రణాళిక 2) 11వ ప్రణాళిక
3) 12వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక
8. కింది పథకాల్లో గ్రామీణ యువకులకు ఉపాధి ఆధారిత నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్‌లో భాగంగా ప్రారంభించిన పథకం?
1) అంత్యోదయ అన్న యోజన
2) జన్‌ధన్ యోజన
3) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
4) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన
9. కింది వాటిలో సరైనది.
1) నైపుణ్యంగల సాంకేతిక పనివారు- గ్రే కాలర్ పనివారు
2) వృత్తిరీత్యా చాలా నైపుణ్యంగలవారు- గోల్డ్ కాలర్ పనివారు
3) షాపుల్లో పనిచేసే మహిళలు- స్కార్లెట్ కాలర్
4) పైవన్నీ
10. మనదేశంలో శ్రామికులుగా కింది ఏ సంవత్సరాల మధ్యగల వయస్సువారిని పరిగణిస్తారు?
1) 14-50 2) 15-55
3) 15-60 4) 18-60
11. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టాలవారీగా అక్షరాస్యత రేటుకు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
1. కేరళ ఎ. 94 శాతం
2. మిజోరం బి. 91.3 శాతం
3. త్రిపుర సి. 87.2 శాతం
4. గోవా డి. 88.7 శాతం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
12. 1951లో తృతీయ రంగంపై ఆధారపడిన శ్రామికులు 17.2 శాతం ఉండగా, 2011 నాటికి వారి సంఖ్య ఎంత శాతానికి పెరిగింది?
1) 18.6 2) 20.8 3) 24.9 4) 26.8
13. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు?
1) 5.7 మిలియన్లు 2) 4.7 మిలియన్లు
3) 3.7 మిలియన్లు 4) 2.7 మిలియన్లు
14. ఒక దేశం తమ పౌరుల సామాజిక, పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను కొలిచేది?
1) సామాజిక ప్రగతి సూచీ 2) విద్యాస్థాయి సూచీ
3) బహు పార్శ పేదరిక సూచీ 4) ప్రపంచ బ్యాంకు
15. 1970లో ఐక్యరాజ్యసమితి పరిశోధన సంస్థ సమీకృత సామాజిక అభివృద్ధి సూచీ నిర్మాణంలో ఎన్ని ఆర్థిక, సామాజిక సూచీలు తీసుకోలేదు?
1) 9 సామాజిక, 7 ఆర్థిక సూచీలు
2) 11 సామాజిక, 9 ఆర్థిక సూచీలు
3) 11 ఆర్థిక, 9 సామాజిక సూచీలు
4) 9 ఆర్థిక, 7 సామాజిక సూచీలు
16. మానవాభివృద్ధి సూచీ కొలిచే అతిముఖ్యమైన సాధనాలు?
1) ఆయుఃప్రమాణం 2) అక్షరాస్యత
3) తలసరి ఆదాయం 4) పైవన్నీ
17. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం ఎస్సీ జనాభా?
1) 201.4 మిలియన్లు 2) 166.6 మిలియన్లు
3) 198.2 మిలియన్లు 4) 185.5 మిలియన్లు
18. కేరళ ….
ఎ. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం
బి. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం
సి. అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ 4) బి, సి
19. అత్యధిక సంఖ్యలో అక్షరాస్యులుగల రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) గోవా 3) ఒడిశా 4) అసోం
20. దేశంలో పట్టణీకరణ శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి కారణం
1) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడం 2) సినిమా ఇంకా ఇతర ప్రసార సాధనాల ప్రభావం
3) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడం
4) జమీందారీ వ్యవస్థ రద్దు కావడం
21. జాతీయ మానవాభివృద్ధి నివేదికలో అన్ని విషయాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) పంజాబ్
3) కేరళ 4) గుజరాత్
22. మనదేశంలో తలసరి విద్యా వ్యయం ఏ రాష్ట్రంలో అత్యల్పంగా ఉంది?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) ఒడిశా 4) బీహార్….
23. మనదేశంలో తలసరి విద్యా వ్యయం అత్యధికంగా ఉన్నది ఎక్కడ?
1) అండమాన్ 2) లక్షదీవులు
3) పుదుచ్చేరి 4) డామన్, డయ్యూ
24. మనదేశానికి, రాష్ర్టాలకు సంబంధించిన జాతీయ మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారత ప్రణాళికా సంఘం తొలిసారి ఎప్పుడు ప్రకటించింది?
1) 2000 2) 2002 3) 2003 4) 2001
25. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అని ఎవరు పేర్కొన్నారు?
1) ఎడ్విన్ కానన్ 2) మాల్థస్
3) మహలనోబిస్ 4) రగ్నార్ నర్క్స్
26. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించే వాడవుతాడు అని అన్నవారు?
1) రోడాన్ 2) మాల్థస్
3) రోస్లావ్ 4) రగ్నార్ నర్క్స్
27. ఏ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరుల వికాసానికి తప్పనిసరిగా కీలకమైన స్థానం ఇవ్వాలని పేర్కొన్నది?
1) 5 2) 6 3) 7 4) 8
28. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా గల కేంద్రపాలిత ప్రాతం? (1)
1) డామన్, డయ్యూ 2) లక్షదీవులు
3) చండీగర్ 4) పుదుచ్చేరి
29. 2011లో మనదేశంలో వయోజన అక్షరాస్యత రేటు పురుషుల్లో ఎంత శాతం ఉంది?
1) 80.9 2) 50.1 3) 70.5 4) 65
30. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పిల్లల జనాభా శాతం?
1) 13.5 2) 13.6 3) 13.8 4) 13.7
31. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? 1) 5 2) 4 3) 6 4) 3
32. జాతీయ సగటు కంటే తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ర్టాలు?
ఎ. రాజస్థాన్ బి. కర్ణాటక
సి. ఒడిశా డి. గోవా
1) ఎ, సి 2) ఎ, బి, సి 3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
33. మొదటి అధికారిక కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అనుసరించిన దేశం?
1) అమెరికా 2) భారతదేశం 3) స్వీడన్ 4) చైనా
34. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుంది?
1) 9.2 బిలియన్లు 2) 8.2 బిలియన్లు
3) 11 బిలియన్లు 4) 10.5 బిలియన్లు
35. కుటుంబ నియంత్రణ పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
1) 1952 2) 1953 3) 1962 4) 1965
36. భారత ప్రభుత్వం మొదటిసారిగా తన జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
1) 1974 2) 1975 3) 1976 4) 1978
37. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు కంటే అధికంగా ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) మేఘాలయ
3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా
38. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్షిక జనాభా పెరుగుదల రేటు ఎంత శాతం?
1) 1.95 2) 1.80 3) 2.55 4) 1.84
39. ది పాపులేషన్ బాంబ్ అనే పుస్తకాన్ని రాసింది?
1) టీఆర్ మాల్థస్ 2) ఆడం స్మిత్
3) పాల్ ఎల్రిచ్ 4) అమర్త్యసేన్
40. పుట్టే ప్రతి బిడ్డ శ్రామికుడే అని అన్నది?
1) టీఆర్ మాల్థస్ 2) కార్ల్‌మార్క్స్
3) కానన్ 4) పిగో
41. ప్రపంచంలో జనాభా అత్యంత వేగంగా తగ్గుతున్న దేశం?
1) ఫిలిప్పీన్స్ 2) భారతదేశం
3) అమెరికా 4) జపాన్
42. ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగాగల దేశాలు ఏ ఖండంలో ఉన్నాయి?
1) ఆస్ట్రేలియా 2) ఆఫ్రికా
3) ఆసియా 4) దక్షిణ అమెరికా
43. ప్రపంచ జనాభా ప్రస్తుతం దాదాపు 700 కోట్లు, ఇందులో 80 శాతం జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తుంది?
1) 20 శాతం 2) 30 శాతం
3) 25 శాతం 4) 35 శాతం
44. ప్రపంచంలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉన్న దేశం?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫిలిప్పీన్స్ 4) పాకిస్థాన్
45. భారతదేశ జనాభా ….
1) అమెరికా జనాభా కంటే 3.6 రెట్లు ఎక్కువ
2) బ్రెజిల్ జనాభా కంటే 6 రెట్లు ఎక్కువ
3) కెనడా జనాభా కంటే 33 రెట్లు ఎక్కువ
4) పైవన్నీ సరైనవే
46. ప్రపంచంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ 1841లో ఇంగ్లండ్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత జనాభా లెక్కల సేకరణ ప్రవేశపెట్టిన రెండో దేశం?
1) ఫ్రాన్స్ 2) ఇటలీ 3) కెనడా 4) న్యూజిలాండ్
47. ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు అధికంగాగల దేశం?
1) పాకిస్థాన్ 2) నైజీరియా
3) బంగ్లాదేశ్ 4) భారతదేశం
48. అత్యధిక జనసాంద్రత గల దేశం?
1) జపాన్ 2) ఇటలీ
3) శ్రీలంక 4) బంగ్లాదేశ్
49. భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల రేటు ఏ దేశ జనాభా కంటే ఎక్కువగా ఉంది?
1) మాల్దీవులు 2) ఆస్ట్రేలియా
3) కొలంబియా 4) మెక్సికో
50. ఎస్టీ జనాభా అధికంగాగల కేంద్రపాలిత ప్రాంతం?
1) ఢిల్లీ 2) పుదుచ్చేరి 2) చండీగర్ 4) ఏదీకాదు