Carvey Committee study | కార్వే కమిటీ దేని గురించి అధ్యయనం చేసింది?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/03/generalstudieslogo.jpg)
1. అంతర్ రాష్ట్ర మండలికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. ఈ మండలిని భారత రాజ్యాంగం 262 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు.
బి. ఈ మండలికి రాష్ర్టాల ముఖ్యమంత్రులు రాష్ర్టాలవారీగా నాయకత్వం వహిస్తారు.
1. ఏ నిజం 2. బి. నిజం
3. ఏ, బి రెండూ నిజం 4. ఏదీ నిజం కాదు
2. ప్రధానమంత్రి కృషి సించయి యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
ఏ. నీరు అధికంగా లభించే ప్రాంతం నుంచి కొరతగా ఉన్న ప్రాంతానికి మళ్లించటం.
బి. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇన్పుట్ లిమిట్‌ను పెంచటం
సి. మృత్తిక, తేమ పరిరక్షణ
1. సి సరైనది 2. ఏ, సి సరైనవి
3. బి, సి సరైనవి 4. మూడూ సరైనవే.
3. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన వ్యాఖ్య ఏది?
ఏ. ఏక ఓటు బదిలీ విధానం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది
బి. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడాలంటే ఆ వ్యక్తి రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతలు కలిగి ఉండాలి
సి. ఉపరాష్ట్రతి ఎన్నికల్లో పార్లమెంటులో ఎన్నికైన సభ్యు లు, రాష్ర్టాల శాసనసభ సభ్యులు పాల్గొంటారు
డి. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం రాష్ట్రపతి పేరుమీదుగానే ఉంటుంది
1. ఏ, బి, సి నిజం 2. బి, సి, డి నిజం
3. ఏ, బి, డి నిజం 4. అన్నీ సరైనవే
4. బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి సరైన వాక్యం ఏది?
ఏ. దేశంలో తగ్గిపోతున్న బాలికల లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు
బి. మహిళా శిశు సంక్షేమశాఖ, నీతి ఆయోగ్ మధ్య సమన్వయం చేయటం దీని లక్ష్యం
1. ఏ నిజం 2. బి నిజం
3. ఏ, బి నిజం 4. ఏదీ నిజం కాదు
5. కన్యాశ్రీ ప్రకల్ప పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. ఎంపిక చేసినవారికి నియత నగదు బదిలీ పథకం ఇది
బి. ఈ పథకం లక్ష్యాల్లో బాల్యవివాహాల నిరోధం, నైపుణ్యాభివృద్ధి కూడా ఉన్నాయి.
సి. ఈ పథకాన్ని ఉత్తమంగా అభివృద్ధి చేసిందుకుగాను కేరళ ప్రభుత్వం ఇటీవల ఐక్యరాజ్యసమితి అవార్డు కూడా అందుకుంది.
1. ఏ నిజం 2. బి, సి నిజం
3. ఏ, బి నిజం 4. మూడూ నిజమే
6. 1955లో ఏర్పాటు చేసిన కార్వే కమిటీ దేని గురించి అధ్యయనం చేసింది
1. వ్యవసాయోత్పాదకత పెంచటం, భూసంస్కరణలు
2. కమ్యూనిటీ డెవలప్మెంట్ పథకం అమలు, ఫలితాల అధ్యయనం
3. స్థూల జాతీయోత్పత్తిలో భారీ పరిశ్రమల వాటాను పెంచటం
4. సూక్ష, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి
7. కింది వాక్యాల్లో ఏది నిజం
ఏ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు.
బి. ఎన్నికల కమిషన్ సభ్యుల పదవీకాలం, ఇతర నిబంధనల గురించి ఆర్టికల్ 324 వివరిస్తుంది.
1. ఏ నిజం 2. బి నిజం
3. ఏ, బి నిజం 4. ఏదీ నిజం కాదు8.
డీలిమిటేషన్ కమిషన్ గురించి కింది వాక్యాల్లో ఏది వాస్తవం?
ఏ. ఈ కమిషన్ నిర్ణయాలు నచ్చకపోతే సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలి
బి. ఈ మిషన్ నిర్ణయాలను లోక్‌సభకు, సంబంధిత రాష్ర్టాల శాసన సభలకూ ఆమోదానికి పంపుతారు
1. ఏ నిజం 2. బి నిజం
3. రెండూ నిజం 4. ఏదీ నిజం కాదు
9. ఆయుష్మాన్ భారత్- నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎం) పథకం గురించి కింది వాక్యాల్లో ఏది అవాస్తవం?
ఏ. వెనుకబడిన తరగతుల కుటుంబాలకు ఈ పథకం ఏటా రూ.5,00,000 ఆరోగ్య బీమా కల్పిస్తుంది
బి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన, రాష్ర్టాల స్వాస్థ్య బీమా యోజన పథకాలు కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తాయి
సి. సామాజిక, ఆర్థిక కుల గణన- 2011 (ఎస్ఈసీసీ) ఆధారంగా ఈ పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు
1. ఏ, బి నిజం 2. బి మాత్రమే నిజం
3. బి, సి నిజం 4. పైవన్నీ నిజమే
10. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ (సీఏపీఏఆర్‌టీ) కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. స్వచ్ఛంద సంస్థలకు సాధారణ గుర్తింపునివ్వటానికి సీఏపీఏఆర్టీని ఏర్పాటుచేశారు
బి. గ్రామీణ ప్రాంతాల సుస్థిరాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వానికి మధ్య ఈ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది
సి. కేంద్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధి శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది
1. ఏ, బి నిజం 2. బి, సి నిజం
3. ఏ, సి నిజం 4. అన్నీ సరైనవే
11. జిజ్ఞాస పథకం గురించి సరైన వాక్యం?
ఏ. సాంకేతిక సంస్థలు, విద్యాసంస్థల సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఎస్ఎస్ఆర్)లో భాగంగా విద్యార్థులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసేందుకు ఈ పథకం ప్రారంభించారు
బి. ఈ పథకాన్ని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌తో కలిసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థ అమలు చేస్తుంది
1. ఏ నిజం 2. బి నిజం
3. ఏ, బి నిజం 4. ఏదీ నిజం కాదు
12. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది నిజం?
ఏ. శిక్ష విధానాన్ని మార్చకుండా కాల వ్యవధిని మార్చే అధికారం
బి. వాయిదా అంటే కఠిన శిక్షను మామూలు శిక్షగా మార్చడం
సి. ఉపశమనం అంటే మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేయగల అధికారం
డి. రిమిష్శన్ అంటే శిక్ష రూపాన్ని మార్చటం
1. బి, సి నిజం 2. సి, డి నిజం
3. పైవన్నీ సరైనవే 4. ఏదీ సరికాదు
13. ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు 2017 గురించి కింది వాక్యాల్లో ఏది నిజం?
ఏ. ఈ బిల్లు విదేశాల్లోని భారతీయులకు పరోక్ష ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తుంది
బి. ఓటు వేసేందుకు ఓటరు ప్రత్యక్షంగా హాజరుకానవసరం లేదు అని ఈ బిల్లు పేర్కొంటుంది
1. ఏ నిజం 2. బి నిజం
3. ఏ, బి నిజం 4. ఏదీ నిజం కాదు
14. అమృత్ మిషన్ గురించి సరైన వాక్యమేది?
ఏ. ఈ పథకం ప్రధాన లక్ష్యం దేశంలోని ప్రతి కుటుంబానికి నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు, మురుగునీటి పారుదల వసతులు కల్పించడం
బి. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ జనాభా ప్రాతిపదికన ఈ పథకం నిధులు రాష్ర్టాలు, యూటీలకు 50:50 శాతంలో పంచబడుతాయి
1. ఏ నిజం 2. బి సత్యం
3. ఏ, బీ నిజం 4. ఏదీ నిజం కాదు
15. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఏ. ఒక పౌరుడు ఏదైనా నేరం చేసి ఉంటేనే అతడు, ఆమెను నిర్బంధంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది
బి. ఒక వ్యక్తిని ఒకే నేరానికి ఒకటికంటే ఎక్కువసార్లు శిక్షించే అవకాశం లేదు
1. ఏ నిజం 2. బి నిజం
3. రెండూ సరైనవే 4. ఏదీ సరికాదు
16. అటల్ పెన్షన్ యోజన పథకం గురించి సరైన వాక్యం ఏది?
ఏ. అసంఘటిత కార్మికుల కోసం స్వావలంబన యోజన పథకం స్థానంలో ప్రవేశపెట్టిన పథకం ఇది
బి. పెన్షన్ కోసం కార్మికుడు చెల్లించే ప్రీమియంలో రూ.1000కి మించకుండా ఏటా 50శాతం కేంద్రం చెల్లిస్తుంది
సి. ఈ పథకంలో చేరేందుకు 18-40 ఏండ్ల మధ్య వయస్కులైన భారతీయులు ఎవరైనా అర్హులే
1. ఏ, బి నిజం 2. ఏ, సి నిజం
3. బి, సి నిజం 4. ఏదీ నిజం కాదు
17. భారతీయ బయాలజికల్ డైవర్సిటీ చట్టం 2002కు సంబంధించి కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. జీవవైవిధ్య సంరక్షణపై కార్టజినా ప్రోటోకాల్‌ను సమర్థంగా అమలుచేసేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు
బి. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది
సి. జీవవైవిధ్య సంబంధ అంశాలపై ప్రభుత్వానికి జాతీయ జీవవైవిధ్య అధీకృత సంస్థ సూచనలు, సలహాలు ఇస్తుంది.
1. ఏ, సి నిజం 2. సి మాత్రమే నిజం
3. ఏ మాత్రమే నిజం 4. ఏ, బి మాత్రమే నిజం
18. ఇటీవల ప్రారంభించిన సౌని (ఎస్ఏయూఎన్ఐ) యోజన పథకం దేనికి సంబంధించినది?
1. పని ప్రదేశాల్లో మహిళల భద్రత 2. నీటిపారుదల
3. సరిహద్దుల నిర్వహణ 4. ఏవీ కావు
19. గోప్యత హక్కుకు సంబంధించి సరైన వ్యాఖ్య?
ఏ. గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు
బి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కుల్లో గోప్యత హక్కు ఒక భాగం
సి. ఇది ఒక సంపూర్ణమైన హక్కు
1. సి నిజం 2. ఏ, బి నిజం
3. ఏ నిజం 4. బి, సి నిజం
20. నీతి ఆయోగ్ గురించి కింది వాక్యాల్లో ఏది తప్పు?
ఏ. నీతి ఆయోగ్ ఇటీవలే తన మొదటి ఉపాధి సూచికను రూపొందించింది
బి. ఈ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ర్టాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు
సి. నీతి ఆయోగ్ రాజ్యాంగ సంస్థ కాదు
1. ఏ నిజం 2. ఏ, బి నిజం
3. బి, సి నిజం 4. ఏదీ నిజం కాదు
21. అంతర్జాతీయ న్యాయస్థానం గురించి ఈ కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఏ. ఐక్యరాజ్యసమితి అత్యంత ముఖ్యమైన ఆరు అంగాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఒకటి.
బి. ఇది న్యూయార్క్‌లో ఉంది.
సి. ఐక్యరాజ్యసమితికి అంతర్జాతీయ న్యాయపరమైన అంశాల్లో సలహాలు ఇవ్వటం, దేశాల మధ్య ఏర్పడే వివాదాల్లో తమ ముందుకు వచ్చిన వాటిని పరిష్కరించటం ఈ న్యాయస్థానం విధి.
1. ఏ నిజం 2. ఏ, సి నిజం
3. ఏ, బి నిజం 4. బి, సి నిజం
22. ఆధార్ కార్డుకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఏ. కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు ఇచ్చే పది అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యే ఆధార్
బి. ఈ కార్డును యూఐడిఏఐ జారీ చేస్తుంది.
సి. భారత దేశంలో ఎక్కడైనా ఈ కార్డు వ్యక్తిగత గుర్తింపు కార్డుగా, చిరునామాగా చెల్లుబాటు అవుతుంది.
1. ఏ, బి, సి నిజం 2. బి, సి నిజం
3. ఏ, బి నిజం 4. ఏ, సి నిజం
23. బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) గురించి కింది వాక్యాల్లో నిజం ఏది?
ఏ. బాలల హక్కుల ఉల్లంఘనను నిరోధించి, వాటి సార్వజనీనతకు ఈ కమిషన్ కృషి చేస్తుంది.
బి. 0 నుంచి 16 ఏండ్లలోపు బాలలందరి హక్కులను ఈ కమిషన్ కాపాడుతుంది.
1. ఏ నిజం 2. బి నిజం
3. ఏ, బి నిజం 4. ఏదీ నిజం కాదు
24. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురించి కింది వాక్యాల్లో ఏది నిజం?
ఏ. ఎన్ఐఏ చట్టబద్ధమైన సంస్థ
బి. ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు కార్యకలాపాల్లో ఉన్నత ప్రమానాలు నెలకొల్పటం దీని లక్ష్యం.
1. ఏ నిజం 2. బి నిజం
3. రెండూ నిజమే 4. ఏదీ నిజం కాదు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు