Constitutional Defense | రాజ్యాంగ రక్షణ – సుప్రీం
అప్పీళ్లు – పరిధి
-కింది విషయాలపై సుప్రీంకోర్టుకు అప్పీళ్ల పరిధి ఉంటుంది. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
I) రాజ్యాంగపరమైన వివాదాలు (132 ప్రకరణ): హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఈ ప్రకరణ సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లకు వర్తిస్తుంది.
II) సివిల్ వివాదాల్లో అప్పీళ్లు (133(1) ప్రకరణ): హైకోర్టు ఇచ్చిన సివిల్ వివాదతీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం ఇమిడి ఉందని భావించినా లేదా హైకోర్టు ఈ వివాదంలో రాజ్యాంగపరమైన అంశం ఇమిడి ఉందని ధృవీకరిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
III) క్రిమినల్ వివాదాలు (134 ప్రకరణ): హైకోర్టు కింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులను అప్పీళ్లకు స్వీకరించి, కింది కోర్టు ఇచ్చిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా తీర్పు చెప్పి, ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు, కింది కోర్టు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి, మరణశిక్షను కోర్టు రద్దుచేసిన సందర్భాల్లో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
సలహాపూర్వక విచారణ పరిధి
-143 ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అవి..
1) చట్టానికి సంబంధించిన వివాదం లేదా ప్రజాప్రాముఖ్యం కలిగిన ఒక సంఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. ఈ రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా వ్యక్తీకరించడానికి నిరాకరించవచ్చు.
2) రాజ్యాంగం ఏర్పడకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. ఈ వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా వ్యక్తీకరించాలి.
కోర్ట్ ఆఫ్ రికార్డ్
-129 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులు, ప్రక్రియలను దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాలు సాక్ష్యాలుగా, ఆధారాలుగా స్వీకరించాలి. దిగువ కోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనే ప్రామాణికంగా తీసుకొని సంబంధిత వివాదాల్లో తీర్పు చెప్పాలి. వీటినే అనుపూర్వికాలు అంటారు.
-దేశంలోని వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. లేదంటే దాన్ని కోర్టుధిక్కార నేరంగా పరిగణించి రూ. 2,000 జరిమానా, ఆరునెలల జైలుశిక్ష విధించే అధికారం ఉంది.
రిట్లు జారీచేసే అధికారం
-ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
-32 ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణకోసం హెబియస్‌కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ,కోవారెంటో రిట్లను జారీచేస్తుంది. రిట్లు జారీచేసే అధికారం సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది.
న్యాయసమీక్షాధికారం
-శాసనసభలు, ప్రభుత్వాలు జారీచేసిన ఆదేశాలు, చట్టాలు, వాటి రాజ్యాంగబద్దతను పరిశీలించి అవి రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని చెల్లుబాటు కాకుండా సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది.
న్యాయసమీక్షాధికారం
-న్యాయసమీక్ష అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
-13(2) ప్రకరణ న్యాయసమీక్షాధికారాన్ని న్యాయవ్యవస్థకు కల్పించింది.
-కేంద్ర చట్టాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు రాజ్యాంగవిరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని చట్టవిరుద్ధమైనవని తీర్పిచ్చి వాటిని కొట్టివేసే అధికారాన్ని న్యాయసమీక్షాధికారం అంటారు.
-ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, సమాఖ్య వివాదాల పరిష్కారానికి, రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించడానికి, న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి న్యాయసమీక్ష దోహదం చేస్తుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
1) హరిలాల్ జే కానియా – 1950-51
2) ఎం పతంజలి శాస్త్రి – 1951-54
3) ఎంసీ మహాజన్ – 1954-54
4) బీకే ముఖర్జి – 1954-56
5) ఎస్ఆర్ దాస్ – 1956-59
6) బీపీ సిన్హా – 1959-64
7) పీబీ గజేంద్ర గడ్కరీ – 1964-66
8) ఏకే సర్కార్ – 1966-66
9) కే సుబ్బారావు – 1966-67
10) కేఎన్ వాంఛూ – 1967-68
11) ఎం హిదయతుల్లా – 1968-70
12) జేసీ షా – 1970-71
13) ఎస్ఎం సిక్రి – 1971-73
14) ఏఎన్ రే – 1973-77
15) ఎంహెచ్ బేగ్ – 1977-78
16) వైవీ చంద్రచూడ్ – 1978-85
17) పీఎన్ భగవతి – 1985-86
18) ఆర్ఎస్ పాఠక్ – 1986-89
19) ఈఎస్ వెంకట్రామయ్య – 1989-89
20) ఎస్ ముఖర్జి – 1989-90
21) రంగనాథ్ మిశ్రా – 1990-91
22) కేఎన్ సింగ్ – 1991-91
23) ఎంహెచ్ కానియా – 1991-92
24) ఎల్ఎం శర్మ – 1992-93
25) ఎంఎన్ వెంకటాచలయ్య – 1993-94
26) ఏఎం అహ్మది – 1994-97
27) జేఎస్ వర్మ – 1997-98
28) ఎంఎం పూంఛీ – 1998-98
29) ఏఎస్ ఆనంద్ – 1998-2001
30) ఎస్పీ బరూచా – 2001-02
31) బీఎన్ కిర్పాల్ – 2002-02
32) జీబీ పట్నాయక్ – 2002-02
33) వీఎన్ ఖరే – 2002-04
34) ఎస్ రాజేంద్రబాబు – 2004-04
35) ఆర్సీ లహోటి – 2004-05
36) వైకే సబర్వాల్ – 2005-07
37) కేజీ బాలకృష్ణన్ – 2007-10
38) ఎస్‌హెచ్ కపాడియా – 2010-12
39) ఏ కబీర్ – 2012-13
40) పీ సదాశివం – 2013-14
41) ఆర్ఎం లోధా – 2014-14
42) హెచ్ఎల్ దత్తు – 2014-15
43) టీఎస్ ఠాకూర్ – 2015-17
44) జేఎస్ ఖేహర్ – 2017- 17
45) దీపక్ మిశ్రా-2017-18
46) రంజన్ గొగోయ్ 2018-19
47) అరవింద్ బోబ్డే -2019-21
48) N.V. రమణ- 2021- ప్రస్తుతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు