Wealth of Telangana abroad | విదేశాల్లో తెలంగాణ సంపద
-ప్రాచీన తెలంగాణ సంపద, సాహిత్యం (చరిత్ర), శిల్పాలు, పురావస్తు సంపద అంతా ఎక్కువగా విదేశాల్లోనే ఉంది. క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో ప్రాచీన ఝరాసంగం, అనంతగిరి ఇతర దేవస్థానాల ప్రాచీన చరిత్రంతా విదేశీయుల పరిపాలనలో, నిజాం కాలంలోనే పోయింది. లండన్ మ్యూజియం, అమెరికాలోని కాంగ్రెస్ గ్రంథాలయం, పారిస్‌లోని కింగ్స్ లైబ్రరీతో పాటు ఇలా ఇతర దేశాల్లోనే తెలంగాణ చరిత్ర ఆధారాలు ఉన్నాయి.
కాకతీయ రాజుల కాలంలోని ఆయా దేవస్థానాల స్థపతుల, శిల్పుల చరిత్ర కూడా అక్కడే ఉంది. త్రికూటాలయాలు, త్రిలింగేశ్వరాలయాలు, పంచ లింగేశ్వరాలయ కట్టడం, నమూనాలు, అక్కడ భద్రపర్చి ఉన్నాయి. నిజాం కాలంలోని ఎంతో విలువైన శిల్ప సంపద నేడు లండన్ మ్యూజియంలో ఉంది. ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాకతీయుల, కళ్యాణి చాళుక్య రాజుల సంపద ఇప్పుడు మనకు కొంత మాత్రమే లభ్యమవుతుంది.
రెండో అహవమల్ల రాజు కాలంలోని ఆనాటి విదర్భ (నేటి బీదర్) ప్రాంత, సాంఘిక-చారిత్రక సాహిత్యం యావత్తూ అక్కడే ఉంది. ఎంతో విలువైన తాళపత్ర గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలను సైతం విదేశీయులు దోచుకెళ్లారు. వాళ్లు తీసుకెళ్లిన తెలంగాణ సంపద చాలా విలువైనది. అరుదైన, విలువైన ఎన్నో గ్రంథాలు రాత ప్రతులు, చరిత్ర, సాహిత్యం, వేదం, ఆయుర్వేదం, దేవస్థానాల, స్థపతుల చరిత్ర మొదలైనవి ఎన్నో వాటిలో ఉన్నాయి. తెలంగాణ చిత్రకళలో చెప్పుకోదగ్గ మహాచిత్రకారుడు సిద్దిపేట కాపు రాజయ్య. ఆయన గీసిన కొన్ని చిత్రాలు లండన్ మ్యూజియంలో ఉన్నట్టు చరిత్ర చెపుతుంది.
లకా్ష్మగౌడ్, ఎక్కా మొదలైనవారి అపురూప వర్ణ చిత్రాలు, అంతేకాకుండా భాగ్యనగర్, మౌలాలి, చార్మినార్ చిత్రాలు కూడా విదేశీ మ్యూజియాల్లో ఉన్నాయి. శివంపేట, శాస్ర్తుల వంశీకుల పూర్వం లభించిన గ్రంథాలు సైతం నేడు విదేశీయుల పాలనలో ఉన్నాయి. నేడు మనకు పూర్తిగా లభ్యంకాని ఝరాసంగం, అనంతగిరి, వరదరాజుస్వామి దేవస్థానం, వేములవాడ ప్రాచీన దేవాలయ ప్రాంత చరిత్ర అమోఘంగా ఉంది. కానీ అవన్నీ విదేశాలకు తరలిపోయాయి. నిజాం ప్రభువు లండన్‌కు తరలించిన సంపదలో విలువైన వజ్రాలు, రాళ్లు ఉన్నాయి. వాటిలో ఎంతో విలువైన జాకబ్ డైమండ్ కూడా ఉంది. ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లోని ఆయుర్వేదాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు కూడా తస్కరించారు. వాటిలో మంథెన బ్రాహ్మణ సర్వస్వం, శ్లోకపద్య తాళపత్ర గ్రంథాలు చెప్పుకోదగ్గవి. అసలైన మాధవీయ భాష్యంను కూడా మాక్స్‌ముల్లర్ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
ప్రాచీన మెదక్ కోట వద్ద బ్రాహ్మణ వీధిలో ఒక సంస్కృత పండితుడి ఇంట్లో లభ్యమైన ప్రాచీన ఆయుర్వేద గ్రంథం (11వందల పేజీలు) ఇప్పటికీ జర్మనీ మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు సంబంధించిన ఎన్నో విలువైనవి, ప్రాచీనమైనవి ఇప్పటికీ ఉన్నాయి. చరిత్రపరంగా తెలంగాణ కు చెందిన 8000 గ్రంథాలు విదేశాల్లో ఉన్నట్టుగా చరిత్ర పరిశోధకులు చెపుతున్నారు.
ప్రాచీన ఇందూరు (నేటి నిజామాబాద్ జిల్లా), వర్ని, కౌలాస్‌లో లభ్యమైన కొంత ప్రాచీన సంపద కూడా పారిస్ కింగ్స్ లైబ్రరీలో ఉంది. డాక్టర్ ఎన్. గోపి విదేశాల్లో మన సంపద అని తన వ్యాస నవమిలో చెప్పారు. అయితే దాంట్లో తెలంగాణ ప్రాచీన సంపద, శాసన కవుల చరిత్రను తెలియజేయలేదు. నేడు అమెరికాలోని పుల్టన్ లైబ్రరీలో కూడా కొంత సమాచారం లభ్యమవుతుంది.
-చాయాసోమేశ్వరాలయ శిల్పి స్థపతి చరిత్ర కూడా విదేశాల్లో ఉందని చర్రిత చెపుతుంది. 2011లో సేకరించి పరిష్కరించిన రహస్య ఆయుర్వేదం, ప్రాచీన తాళపత్ర గ్రంథం అనుభవసారం ముద్రణ గ్రంథాన్ని కూడా తెప్పించాను. పూర్తి మూల గ్రంథం త్వరలో వెలుగులోకి రానున్నది.
విదేశాల్లోని తెలంగాణ సంపదలో కొన్ని..
-పారిస్‌లోని కింగ్స్ లైబ్రరీలో ఉన్న ఎక్కాల పుస్తకం తాళపత్ర గ్రంథం తెలంగాణదే అని చరిత్రకారుల అభిప్రాయం.
-ఆయుర్వేదం-దేవస్థానాల చరిత్ర మొదలైనవి అమెరికాలోని కాంగ్రెస్ గ్రంథాలయంలో ఉన్నాయి.
-శిల్పాలు, విలువైన సామగ్రి లండన్ మ్యూజియంలో ఉన్నాయి.
-డబ్లిన్‌లోని గ్రంథాలయంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.
ఇలా విదేశాల్లో ప్రాచీన తెలంగాణ సంపద ఉంది. ఇకనైనా బంగారు తెలంగాణ సమగ్ర చరిత్రను భద్రపర్చుకుందాం. కాపాడుకుందాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు