రెక్కల నీడ కనిపించని పక్షి ఏది?
పక్షులు
-పక్షులను లాటిన్లో avis అంటారు. దీనికి అర్థం పక్షి.
-ఈకలు కలిగిన ద్విపాదులను పక్షులు అంటారు.
-చాలా వరకు పక్షులు ఈకలను కలిగి ఉండి ఎగురుతాయి. అయితే ఆస్ట్రిచ్ లాంటి కొన్ని ఎగరలేని పక్షులు కూడా ఉన్నాయి.
-పక్షుల గురించిన అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు.
-పక్షుల వలసలను గురించిన అధ్యయనాన్ని ఫినాలజీ అని, పక్షుల గూళ్ల అధ్యయనాన్ని నిడాలజీ అని, పక్షుల గుడ్ల అధ్యయనాన్ని ఉవాలజీ అని, పక్షుల ఈకల అధ్యయనాన్ని టెరాలజీ అని అంటారు.
-భారతదేశ పక్షిశాస్త్ర పితామహుడు- డా. సలీం అలీ (ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇతనికి వన్యప్రాణి సంరక్షణకు ఇచ్చే పాల్గెట్టి బహుమతి లభించింది.
-దేశంలో అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం- Keoladeo Ghana National park (భరత్పూర్ బర్డ్ సాంక్షువరీ-రాజస్థాన్)
-దక్షిణ అమెరికాను పక్షిఖండం అంటారు.
-పక్షులు ముక్కు (Beak)ను కలిగి ఉంటాయి.
-పక్షుల్లో పూర్వాంగాలు రెక్కలుగా మార్పు చెందాయి. చరమాంగాలు పొలుసులను కలిగి ఉండి నడవడానికి, పరుగెత్తడానికి, ఈదడానికి, కొమ్మలను పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
-వీటిలో చర్మం పొడిగా, గ్రంథిరహితంగా ఉంటుంది. అయితే తోక ఆధారంతో ఒకే ఒక నూనె గ్రంథి/పీన్గ్రంథి/యూరో పైజియల్ గ్రంథి ఉంటుంది.
-పక్షుల్లో అంతరాస్థిపంజరం పూర్తిగా అస్తీకరణం చెంది ఉంటుంది. పొడవు ఎముకలు బోలు (Hallow)గా ఉండి గాలి కుహరాలను (వాతిలాస్థిత్వం Pneumaticity) కలిగి ఉంటాయి.
-జీర్ణనాళంలో అదనంగా రెండు గదులు ఉంటాయి. అని గ్రంథిల జఠరిక, కండరయుత అంతరజఠరం.
-వీటిలో 4 గదుల హృదయం ఉంటుంది.
-ఇవి ఉష్ణరక్త జంతువులు (Warm blooded, Homoiothermous).
-శ్వాస క్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. వీటిలో వాయుకోశాలు (Air sacs) ఉండి ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాయు కోశాలు నిరంతరం రక్తానికి ఆక్సిజన్‌ను అందిస్తాయి.
-పక్షుల ధ్వని ఉత్పాదక కేంద్రం- శబ్దిని (Syrinx).
-ఇవి ఏకలింగ జీవులు. వీటిలో అంతర ఫలదీకరణం జరుగుతుంది.
-ఇవి అండోత్పాదకాలు (Oviparous). వీటిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది.
-పక్షులను ఎగిరేలక్షణం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. ఎగరలేని పక్షులు (రాటిటే)
2. ఎగిరే పక్షులు
ఎగరలేని పక్షులు
-ఇవి పరిగెత్తే ఎగరలేని పక్షులు. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి.
ఉదా : ఆస్ట్రిచ్ (నిప్పుకోడి), కివీ (ఎప్టెరిక్స్), ఈము (డోమియస్), పెంగ్విన్ (యుడైటిస్), డోడో (Passenger bird), హంస, బాతు, టీనామస్, కసోవరి, రియా (అమెరికా ఆస్ట్రిచ్).
ఆస్ట్రిచ్
-దీని శాస్త్రీయనామం స్ట్రుతియోకామెలస్. ఇది అతిపెద్ద, అతి వేగంగా పరిగెత్తే పక్షి.
-దీని గుడ్డు (అండం) జంతురాజ్యంలో అతిపెద్దది.
-ఇది ఒంటె పక్షి, బహుభార్యత్వాన్ని కలిగి ఉంటుంది.
ఈము
-దీన్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ పక్షి గుడ్డు ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది.
పెంగ్విన్
-ఇది ధృవ ప్రాంతాల్లో (దక్షిణ ధృవం/ అంటార్కిటికా) ఉంటుంది.
-ఇది నిలబడి గుడ్లు పెడుతుంది.
డోడో
-ఇది మారిషస్ దేశపు జాతీయ పక్షి
కివీ
-ఇది న్యూజిలాండ్ దేశపు జాతీయ పక్షి. దీంతో ఆ దేశపు పౌరులను కివీస్ అని పిలుస్తున్నారు.
-ఇది ఘ్రాణ లంబికలను కలిగి ఉండి వాసనను గుర్తించే ఏకైక పక్షి.
-ఇది అతిచిన్న ఎగరలేని పక్షి.
-ఇది నిశాచర పక్షి.
బాతు
-ఇది రెండో పెద్ద పక్షి.
హంస
-ఇది నీటిని పాలను వేరు చేస్తుంది.
ఎగిరే పక్షులు
-కొలంబా (పావురం), కార్వస్ (కాకి), సిట్టాక్యులా (రామచిలుక), పావోక్రిస్టేటస్ (నెమలి), కోయిల (యుడినామస్), పసర్ (పిచ్చుక), బ్యుబో (గుడ్లగూబ), ఆల్బట్రోస్, ఆర్కిటిక్ టెర్న్, గాడ్విట్, ఉడ్‌కాక్, స్విఫ్ట్, బట్టమేకతల పిట్ట, జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి), హుద్‌హుద్, హమ్మింగ్ బర్డ్, సైబీరియన్ కొంగ, పాలపిట్ట (కొరాషియస్ బెంగాలెన్సిస్).
కోయిల
-ఇది గుడ్లను పొదగని ఏకైక పక్షి.
-రాగాలు తీసే ఈ పక్షి కాకి గూటిలో గుడ్లను పెడుతుంది.
పావురం
-ఇది పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని తన పిల్లలకు అందిస్తుంది. దీన్నే పావురక్షీరం అంటారు.
హమ్మింగ్ బర్డ్ (తేనెపిట్ట)
-ఇది అతిచిన్న పక్షి. అతిచిన్న గుడ్డును పెడుతుంది.
-క్యూబా దేశ పక్షి అయిన ఇది ముందుకు వెనకకు ఎగురగలుగుతుంది.
-రెక్కల నీడ కనిపించని పక్షి.
ఆల్ బట్రోస్
-ఇది అతిపొడవైన రెక్కలు కలిగిన అతిపెద్ద సముద్ర పక్షి.
సిట్టాక్యులా
-పై దవడను కదిలించే ఏకైక పక్షి రామచిలుక (సిట్టాక్యులా).
బట్టమేకతల పిట్ట
-ఇది దేశంలో అతిపెద్ద పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్)
-ఇది రాజస్థాన్ రాష్ట్ర పక్షి.
-ప్రస్తుతం అంతరించే దశలో ఉన్న ఈ పక్షిని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా రోళ్లపాడు పక్షి సంరక్షణాలయంలో సంరక్షిస్తున్నారు.
స్విఫ్ట్
-ఇది అతివేగంగా ఎగిరే పక్షి.
-జపాన్‌లో ఉన్నది.
ఆర్కిటిక్ టెర్న్
-ఇది అత్యంత దూరం ప్రయాణించే పక్షి.
గాడ్విట్
-ఆగకుండా అధిక దూరం ప్రయాణించే పక్షి.
ఉడ్‌కాక్
-భారత్‌లో హిమాలయాల నుంచి నీలగిరి పర్వతాల వరకు అలిపిరి తీసుకోకుండా అధిక దూరం ప్రయాణించే పక్షి.
కార్వస్ (కాకి)
-ఇది అతి తెలివైన పక్షి, సర్వభక్షకి (అమ్నివోర్).
-కాకులను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
-ఇవి తమిళనాడులోని కొడైకెనాల్, కర్ణాటకలోని చిత్రకూటమి తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి.
హుద్ హుద్
-ఇది ఇజ్రాయెల్ దేశపు జాతీయ పక్షి.
జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి)
-దీన్ని రెడ్ డాటా బుక్‌లో నమోదు చేశారు.
బ్యుబో (గుడ్ల గూబ)
-ఇది బైనాక్యులర్ దృష్టి కలిగిన పక్షి.
సైబీరియన్ కొంగ
-ఇతి ప్రత్యుత్పత్తి కోసం రష్యా నుంచి భరత్‌పూర్‌కు వలస వస్తుంది.
పాలపిట్ట
-దీని శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్.
-ఇది తెలంగాణ రాష్ట్ర పక్షి.
నెమలి (పావోక్రిస్టెటస్)
-ఇది మన జాతీయ పక్షి.
-బహుభార్యత్వాన్ని ప్రదర్శించే జంతువులు :సీల్, నాల్స్,్ర జింక
-ఏక భార్యత్వాన్ని (Monogamous) ప్రదర్శించే జంతువులు : పులి, తోడేలు, పావురం, మానవుడు
సరీసృపాలు
పాములు
-పాముల గురించిన అధ్యయనాన్ని ఒఫియాలజి/సర్పెంటాలజి అంటారు.
-ఇవి పొలుసులు, పక్కటెముకల ద్వారా చలిస్తాయి.
-వీటికి చెవులు ఉండవు. అందువల్ల గాలి ద్వారా వచ్చే శబ్దాలను గ్రహించలేవు. కానీ నేలద్వారా వచ్చే శబ్దాలను గ్రహిస్తాయి. ఈ కారణంగానే ఇవి భూకంపాలు, సునామీలను ముందుగా గుర్తిస్తాయి.
-ఇవి అండోత్పాదకాలు, కానీ రక్తపింజర శిశోత్పాదకం.
-పాముల పార్కు గిండి నేషనల్ పార్క్. ఇది చెన్నైలో ఉంది.
-పాము కాటువేసినప్పుడు ఒకటి లేదా రెండు మచ్చలు ఉంటే విషసహితంగా, అనేక మచ్చలు/కాట్లు U ఆ కారంలో ఉంటే విషరహిత పాముగా గుర్తిస్తారు.
-పాము విషాన్ని వీనమ్, దానికి ఇచ్చే విరుగుడు మందును యాంటీ వీనమ్ అంటారు.
-యాంటీ వీనమ్‌ను తయారు చేసే సంస్థలు.. హాఫ్కిన్స్ ఇన్స్టిట్యూట్ (ముంబై), సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (కసౌలీ-హిమాచల్‌ప్రదేశ్)
విషసర్పాలు
-నాజా నాజా (నాగుపాము)- ఇది ఎలుకల సంఖ్యను నియంత్రిస్తుంది.
-ఒఫియోఫాగస్ హన్న (రాచనాగు)- విష సహిత సర్పాల్లో అతిపెద్దది, ఇది పాములను తినే పాము, గూడు కట్టుకుంటుంది.
-బంగారస్ (కట్లపాము/క్రెయిట్)
-డబోయ/వైపరారసెల్లి (గొలుసు రక్తపింజర)
-క్రొటాలస్ (రాటిల్ స్నేక్)- దీని విషానికి విరుగుడు లేదు.
-రస్సెల్స్ వైపర్ (రక్తపెంజర)
-హైడ్రోఫిస్ (సముద్ర పాము)
-ప్రవాళసర్పం
విషరహిత సర్పాలు
-ట్యాస్ (రాట్స్నేక్/జెర్రిగొడ్డు)
-ట్రిపిడోనోటస్ (నీటిపాము/నీరు కట్టె)
-డ్రయోఫిస్ (చెట్టుపాము, పసరికపాము)
-అనకొండ- ఇది అతిపొడవైన పాము, అమెజాన్ అడవిలో ఉంటుంది.
డైనోసార్స్
-వీటిని రాక్షస బల్లులు అంటారు.
-ఇవి విలుప్తం/అంతరించిన అతిపెద్ద సరీసృపాలు
-ఇవి ప్రస్తుతం శిలాజాల రూపంలో లభ్యమవుతున్నాయి.
-అతిపెద్ద డైనోసార్- బ్రాంటోసారస్
-ఎగిరే డైనోసార్- టెరోసారస్
-డైనోసార్లు ఉద్భవించిన కాలం- ట్రయాసిక్ కాలం
-డైనోసార్లు స్వర్ణయుగం- జురాసిక్ కాలం
-డైనోసార్ అంతరించిన కాలం- క్రిటేషియస్ కాలం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు