Alliances-Meetings | కూటములు-సమావేశాలు
సార్క్
-దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతికి దోహద పడడానికి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి దక్షిణాసియా ప్రాంతీయ కూటమి (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్) 1985, డిసెంబర్ 8న ఏర్పాటైంది.
-ఇందులో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్ (2007లో సభ్యత్వం తీసుకుంది). మొత్తం 8 దేశాలు.
-దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఉంది.
-సార్క్ జనరల్ సెక్రెటరీగా పాకిస్థాన్‌కు చెందిన అమ్జద్ హుస్సేన్ బి సియాల్ 2017, మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ పదవిలో అర్జున్ బహదూర్ థాపా (నేపాల్) 2014-17 వరకు కొనసాగారు.
సమావేశాలు
-మొదటి సమావేశానికి బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. 1985, డిసెంబర్ 7, 8 తేదీల్లో ఢాకాలో జరిగిన ఈ సదస్సులో ఉగ్రవాదం, మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రధానంగా చర్చించాయి.
-1986, నవంబర్ 16, 17 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది.
-18వ సమావేశం 2014లో నేపాల్‌లోని కఠ్మాండులో నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది.
-19వ సమావేశం 2016, నవంబర్ 15, 16 తేదీల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉండగా రద్దయ్యింది.
-2016లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరగడంతో ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో మిగిలిన సభ్యదేశాలు కూడా హాజరుకాబోమని ప్రకటించడంతో 19వ సదస్సు రద్దయ్యింది. దీంతో 2018లో జరగాల్సిన 20వ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేయలేదు.
-సార్క్ ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అంశాన్ని నిర్ణయిస్తుంది… 1989ని మాదక ద్రవ్యాల నిరోధక ఏడాదిగా, 1990ని బాలికా సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది.
-2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా ప్రకటిచింది.
-2010-20 దశాబ్దాన్ని ప్రాంతీయ అంతర్గత అనుసంధాన దశాబ్దంగా ప్రకటించింది.
భారత్‌లో సార్క్ సమావేశాలు..
-సార్క్ సమావేశాలు భారత్‌లో ఇప్పటిరకు మూడుసార్లు జరిగాయి.
-మొదటి సారి 1986, నవంబర్ 16, 17 తేదీల్లో బెంగళూరులో (రెండో సమావేశం), రెండోసారి న్యూఢిల్లీలో 1995, మే 2-4 వరకు (8వ సమావేశం), మూడోసారి 2007, ఏప్రిల్ 3, 4 తేదీల్లో న్యూఢిల్లీలో (14వ సమావేశం) జరిగాయి.
ఆసియాన్ కూటమి
-వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ (ఒకే దృష్టి, ఒకే ఏకత్వం, ఒకే సమాజం) నినాదంతో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్ (ఆసియాన్) 1967, ఆగస్టు 8న ఏర్పడింది.
-ఇందులో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం (మొత్తం 10 దేశాలు)లు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో చివరగా సభ్యత్వం తీసుకున్న దేశం కాంబోడియా (1999, ఏప్రిల్ 30న)
-ఈ కూటమి ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. దీని సెక్రటరీ జనరల్ లీ మిన్హ్ (Le Luo-g Mi-h) వియత్నాం, చైర్మన్- రోడ్రిగో (ఫిలిప్పైన్స్)
-ఆసియాన్ మొదటి సమావేశం 1976, ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఇండోనేషియాలోని బాలీలో, రెండో సమావేశం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 1977, ఆగస్ట్ 4, 5 తేదీల్లో జరిగింది.
-28, 29వ సమావేశాలు 2016, సెప్టెంబర్ 6-8 వరకు లావోస్‌లోని వియాన్టియాన్లో జరిగాయి.
-30వ సమావేశాలు 2017, ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఫిలిప్పైన్స్‌లోని మెట్రో మనీలాలో జరుగనున్నాయి.
-ఈ కూటమి 31వ సమావేశాలు కూడా ఇదే ఏడాది జరగనున్నాయి. నవంబర్ 13, 14 తేదీల్లో ఫిలిప్పైన్స్‌లోని క్లార్క్ ఫ్రీపోర్ట్ జోన్లో నిర్వహించనున్నారు.
-ఆసియాన్ కూటమి ఏర్పాటై 50 ఏండ్లు పూర్తవుతుండటంతో ఆసియాన్ @50 పేరుతో ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు.
ఈస్ట్ ఆసియా సమ్మిట్ (ఈఏఎస్)
-దీనిని 1991లో మలేషియా ప్రధాని మహతిర్ మహమ్మద్ ఏర్పాటు చేశారు.
-ఆస్ట్రేలియా, బ్రూనై, కాంబోడియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, మయన్మార్, న్యూజీలాండ్, ఫిలిప్పైన్స్, రష్యా, సింగపూర్, దక్షిణకొరియా, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలు ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
-ఈ కూటమి ప్రతి ఏడాది సమావేశమవుతుంది. ఆసియన్ శిఖరాగ్ర సదస్సు పూర్తయిన తర్వాత ఇవి జరుగుతాయి.
-మొదటి సమావేశం 2005, డిసెంబర్ 14న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి రష్యా ముఖ్య అతిథిగా హాజరయ్యింది.
-రెండో సదస్సు ఫిలిప్పైన్స్‌లో సిబుసిటీలో 2007, జనవరి 15న జరిగింది.
-11వ ఈఏఎస్ సదస్సు 2016, సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు లావోస్‌లోని వియాన్టియాన్లో జరిగింది.
-12వ సమావేశాన్ని 2017, నవంబర్ 13న ఫిలిప్పైన్స్‌లో నిర్వహించనున్నారు.
ఇబ్సా (ఐబీఎస్ఏ)
-అంతర్జాతీయంగా పరస్పర సహకారం కోసం మూడు ఖండాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలు కలిగిన మూడు దేశాలు.. భారత్ (ఐ), బ్రెజిల్ (బి), దక్షిణాఫ్రికా (ఎస్ఏ)లు కలిసి ఇబ్సాగా ఏర్పడ్డాయి. 2003, జూన్ 6న బ్రెజిల్ డిక్లరేషన్‌ను ఆమోదించడం ద్వారా ఈ కూటమి ఏర్పడింది. ఇందులోని సభ్యదేశాల మధ్య దక్షిణ-దక్షిణ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకుంటాయి.
-ఇబ్సా తొలి సమావేశం 2006, సెప్టెంబర్ 13న బ్రెజిల్‌లోని బ్రెజిలియాలో జరిగింది.
-రెండో సదస్సు 2007, అక్టోబర్ 17న దక్షిణాఫ్రికాలోని ష్వానేలో, మూడో సమావేశం 2008, అక్టోబర్ 15న న్యూఢిల్లీలో, 4వ సమావేశం 2010, ఏప్రిల్ 15న బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో, 5వది దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 2011, అక్టోబర్ 18న జరిగింది.
-6వ సమావేశం 2013లో, 7వ సమావేశం 2015లో న్యూఢిల్లీలో జరిగింది.
-ఈ కూటమి సమావేశాలు భారత్‌లో ఇప్పటివరకు రెండు సార్లు (2008, 2015లో) జరిగాయి.
అపెక్
-ఆసియా-పసిఫిక్ తీర ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందడానికి 1989, నవంబర్ 7న ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్ (అపెక్) కూటమి ఏర్పడింది. ఇందులో సభ్యులుగా ఉన్న దేశాల్లోని మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 40 శాతం.
-ఈ కూటమిలో మొత్తం సభ్యదేశాలు 21. అవి.. ఆస్ట్రేలియా, కెనడా, బ్రూనై దారుస్సలాం, చిలీ, చైనా, తైవాన్, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ,
ఫిలిప్పైన్స్, రష్యా, సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాం.
-ఇందులో 1998, నవంబర్ 14, 15 తేదీల్లో పెరూ, రష్యా, వియత్నాం దేశాలు చివరగా సభ్యత్వం తీసుకున్నాయి.
-దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది.
-ఈ కూటమి ప్రతి ఏడాది సమావేశమవుతుంది. తొలి నాలుగు సమావేశాలు మంత్రుల స్థాయిలో జరుగగా, 1993 నుంచి అపెక్ ఎకనామిక్ లీడర్స్ పేరుతో ప్రభుత్వాధినేతల నేతృత్వలో సమావేశాలు జరుగుతున్నాయి.
-అపెక్ మొదటి సమావేశం 1989, నవంబర్ 6, 7 తేదీల్లో ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో, రెండో సమావేశం 1990, జూలై 29 నుంచి 31 వరకు సింగపూర్‌లో జరిగాయి.
-27వ సమావేశం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో 2015, నవంబర్ 18, 19 తేదీల్లో, 28వ సమావేశం 2016, నవంబర్ 19, 20 తేదీల్లో పెరూలోని లీమాలో జరిగింది.
-2017, నవంబర్ 11, 12 తేదీల్లో వియత్నాంలో 29వ సమావేశం జరుగనుంది.
-అపెక్ సమావేశాలకు 2011లో భారత్ తొలిసారిగా పరిశీలక హోదాలో పాల్గొన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు