ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుసంస్కరణలు
ఆర్థిక వ్యవస్థ అంటే వస్తు సేవలు. ఈ వస్తు సేవలను ప్రజలు అధికంగా ఉపయోగిస్తే ప్రజల జీవన ప్రమాణం, జీవిత కాలం పెరుగుతుంది.
-కనిపిస్తూ సంతృప్తినిస్తే దాన్ని వస్తువని, కనిపించకుండా సంతృప్తినిస్తే సేవ అని పేర్కొంటారు.
-వస్తువులకు ఉదాహరణ కుర్చి, బెంచి, పెన్సిల్, పెన్ను, కారు మొదలైనవి.
-సేవలకు ఉదాహరణ డాక్టర్, టీచర్, కంప్యూటర్, రైలు సేవలు మొదలైనవిగా పేర్కొంటారు.
-1947 నుంచి 1991 వరకు ఆర్థిక వ్యవస్థలో సరైన మార్పులు లేకపోవడంతో పెరిగే జనాభాను తట్టుకోలేక ధరలు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
-జనాభాను డిమాండ్‌గా, ఆర్థిక వ్యవస్థను సప్లయ్గా పరిగణిస్తే జనాభా ఆర్థిక వ్యవస్థకు మించి 4 శాతం లోపు ఉండాల్సిన ద్రవ్యోల్భణం 1991లో 16.07 శాతానికి ఎగబాకింది.
-1947 నుంచి 1991 వరకు ఆర్థిక వ్యవస్థలో సరైన మార్పులు రాకపోవడంతో ఎగుమతులకంటే దిగుమతులు అధికమవడంతో చెల్లింపు సమస్యకు దారితీసింది. ఈ సమస్యను ఎదుర్కొనే విదేశీ మారక నిల్వల కోసం ఆర్థిక వ్యవస్థలో నాలుగు సార్లు మూల్యహీనీకరణ చేశారు.
-ముఖ్యంగా మూల్యహీనీకరణ 1949, 1966, 1991లో జూలై 1, 23న ప్రకటించారు.
-1947 నుంచి 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తిని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు నిర్వహించాలని ఆశించినప్పటికీ, ప్రభుత్వ విధానాల వల్ల ప్రైవేటు రంగం నియంత్రణకు గురై ప్రైవేటు రంగంలో ఉత్పత్తి క్షీణించి చివరికి సప్లయి కొరత ఏర్పడటం, మరొక వైపు జనం పెరిగితే అంటే డిమాండ్ పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమైంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో సామ్యవాద ధోరణి పెరిగి డిమాండ్ సప్లయ్ మధ్య అసంతులనం పెరిగి చివరికి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది.
-1947 నుంచి 1991 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగాన్ని ఇబ్బందుల పాలు చేసే కొన్ని చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
-ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని 1951లో పెద్ద పారిశ్రామిక వేత్తలను లైసెన్సులకు గురిచేసే ఏకస్వామ్యాల పరిశీలన నియంత్రణ చట్టాన్ని 1970లో ప్రవేశపెట్టారు.
-అంతేకాకుండా 1973లో విదేశీ మారక నిల్వల నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
-పై చర్యలతో దేశంలో 1947-1991 మధ్యకాలంలో సప్లయ్‌కి కొరత ఏర్పడటం, 1951-1981 మధ్యలో జనాభా విస్ఫోటనానికి గురికావడంతో పరిస్థితి పూర్తిగా విషమించి ద్రవ్యోల్బణానికి దారితీసింది.
-1947-1991 మధ్యకాలంలో దిగుమతి ప్రత్యామ్నాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఎగుమతులను పట్టించుకోకపోవడంతో చివరికి దిగుమతులు ఎగుమతులను మించి చెల్లింపు సమస్యకు దారితీశాయి.
-చివరికి ఆర్థిక వ్యవస్థ నాలుగుసార్లు మూల్యహీనీకరణకు దారితీసింది.
-నియంత్రిత ఆర్థిక ధోరణితో జాతీయ ఆదాయం కూడా ఆశించిన రీతిలో సాధించబడటం లేదు.
రావ్- మన్మోహన్ నమూనా
-7వ ప్రణాళిక అనంతరం ప్రతికూల చెల్లింపుల శేషం ఏర్పడటం, విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడం ఇది చెల్లింపుల సమస్యకు దారితీసింది.
-ఇలాంటి సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసే ప్రయత్నం జరిగింది.
-దీనికోసం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను ప్రవేశపెట్టారు.
Peter Drucker ప్రభావం
-భారత ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్ నుంచి పొందిన సూచనాత్మక ప్రణాళికలతో పాటు నిర్వహణ సిద్ధాంత పితామహుడైన Peter Drucker రాసిన The Practice Management(1954), The Effective Excutive (1966) గ్రంథాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో పడింది.
-ఉత్పత్తి ప్రక్రియలో ప్రైవేటు రంగాల పాత్ర తప్పకుండా అవసరమని, అదే విధంగా వస్తువులను ఉత్పత్తి చేయడమే గొప్ప కాదని, వస్తువుల్లో నాణ్యత అవసరమని అలాంటప్పుడే వస్తువుల ఎగుమతితో విదేశీ మారక నిల్వలు ఆర్జించవచ్చని Peter Drucker పేర్కొన్నారు.
-అందుకే భారత ఆర్థిక వ్యవస్థలో 1991 నుంచి ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 1947-1991 మధ్యకాలంలో ప్రభుత్వ ప్రాధాన్యత, 1991-2015 మధ్యలో ప్రైవేటు ప్రాధాన్యత, అంటే చివరికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిస్సయింది.
-దాని ఫలితమే నిరుద్యోగం 5.6 శాతం. బీదరికం 21.9 శాతం, అసమానతలు (గిని 33.06) మొదలైన అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.
ఐఎంఎఫ్ నిబంధనలు
-ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి కొన్ని ఆర్థిక ఆంక్షలను విధించింది.
-ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడానికి కస్టమ్స్ సుంకాలను తగ్గించడం, లైసెన్స్ రాజ్యాన్ని తగ్గించడం, నియంత్రణ ధోరణిని విడనాడటం మొదలైనవాటిని భారతదేశం ఒప్పుకుంది.
ఆర్థిక సంస్కరణలు – కరెంట్ అకౌంట్ లోటు
-అంతర్జాతీయ వ్యాపారంలో దృశ్యఖాతా, అదృశ్యఖాతాల కలయికను చాలకఖాతా లేదా కరెంట్ అకౌంట్‌గా పిలుస్తారు.
-కరెంట్ అకౌంట్ లోటుకు గురైతే దిగుమతులు అధికంగా ఉన్నాయని గమనించాలి.
-ఒక వేళ లోటు ఉంటే దాన్ని CAD (Current Account Deficit) అని అంటారు. ఇది జీడీపీలో అంటే స్థూలదేశీయోత్పత్తిలో 2.5 శాతం దాటకూడదు. కానీ 1990-1991లో 3.09 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంస్కరణ వల్ల ప్రస్తుతం కరెంట్ అకౌంట్‌లోటు 2015-16 సంవత్సరానికి 1.2 శాతం ఉంటుందని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.
-అంటే భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించినట్టు గమనించాలి.
ఆర్థిక సంస్కరణలు – కోశలోటు
-కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరంలో చేసిన అప్పును కోశలోటు అంటారు.
-ఇది స్థూలదేశీయోత్పత్తిలో 3 శాతం దాటకూడదు. కానీ 1990-91లో గరిష్టంగా 8.4 శాతంగా నమోదయింది.
-ఆర్థిక సంస్కరణ వల్ల ఈ లోటు తగ్గింది.
-ముఖ్యంగా FRBMS (Fiscal Responsibility Budget Management System) పాటించడంతో కోశలోటు 2015-16 సంవత్సరానికి జీడీపీలో 3.09 శాతం ఉంటుందని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ జయంత్‌సిన్హా ప్రకటించారు. అంటే దాదాపు లక్ష్యానికి దగ్గరలో ఉన్నట్లు గమనించాలి.
-అంటే వారం రోజుల దిగుమతులకే పరిమితమైన FER ఈ రోజు వరుసగా ఆరు నెలల దిగుమతికి సరిపోను ఉన్నాయి.
-దీనికి కరెంట్ అకౌంట్ లోటులో తగ్గుదల ఏర్పడటం, మూలధన ఖాతాలో పెట్టుబడులు అధికంగా రావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
ఆర్థిక సంస్కరణలు – విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
-భారతదేశం పాటించిన నియంత్రిత ఆర్థిక దోరణులతో దేశంలో ప్రత్యక్ష పెట్టుబడుల రాక తక్కువగా ఉండేది.
-ముఖ్యంగా FERA (1973)ను FEMA (1999) గా మార్చడంతో ఎఫ్‌డీఐల వరద పెరిగిపోయింది.
-1991లో 2 USB $ ఉన్న FDI 2004లో 39 USB $ పెరగడం గొప్ప విజయంగా పేర్కొనవచ్చు.
-2015లో 44 USB$గా నమోదయింది.
-ఎఫ్‌డీఐ స్వదేశీ ఉత్పత్తిని ఎంతగానో ప్రేరేపిస్తుంది. గరిష్టంగా 2012లో 46.05 USB$గా నమోదు అయింది.
-ఈ పెట్టుబడి ఆటోమేటిక్ రూట్ అయితే ఆర్బీఐ ద్వారా, ప్రభుత్వం రూట్ అయితే ఎఫ్ఐబీ ద్వారా ప్రవేశించింది.
-రూ. 5000 కోట్లు దాటితే FIPB (Foreign Investment Promotion Board) తో పాటు CCFI (Cabinet Committee on Foreign Investment) అనుమతి అవసరం.
-దేశంలో ఎఫ్‌డీఐ అధికంగా సేవల్లోకి 17 శాతం, నిర్మాణ రంగంలోకి 10 శాతం, టెలికాం రంగంలోకి 7.23 శాతం, సాఫ్ట్వేర్ 5.76 శాతం, ఔషధ రంగం 5.47శాతం, ఆటోమొబైల్ పరిశ్రమ 4.04 శాతం.
ఆర్థిక సంస్కరణలు – ద్రవ్యోల్బణం
-జనాభా ఎక్కువగా ఉండి వస్తుసేవలు (ఆర్థికవ్యవస్థ) తక్కువగా ఉంటే ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణానికి దారీతీస్తుంది.
-ఈ పెరుగుదల 4 శాతం వరకు ఉంటే దాన్ని సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణంగా భావిస్తారు. అయితే ఈ ద్రవ్యోల్బణం 1990-91లో దాదాపు 16.07 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గి వినియోగం కూడా తగ్గి బీదరికానికి దారితీస్తుంది.
-ఆర్థిక సంస్కరణలతో 1991 నుంచి ద్రవ్యోల్బణంలో తగ్గుదల నమోదయింది.
-కానీ వినియోగవస్తువుల ధరల సూచిలో ఆశించిన మార్పులు రావాలి. గణాంకాల ప్రకారం 2015 జూలైలో WPI- 4.05 శాతం నమోదు కావడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. కానీ 2015 నవంబర్‌లో వినియోగధరల సూచి 5.04 శాతంగా నమోదయింది. కాబట్టి ఆర్థిక సంస్కరణల సీపీఐని కట్టడి చేయాలి.
ఆర్థిక సంస్కరణలు – విదేశీ మారక నిల్వలు
-చెల్లింపు శేషం అనుకూలంగా ఉంటే దేశంలోకి విదేశీ మారక నిల్వలు వస్తాయి.
-అలా కాకుండా చెల్లింపుల శేషం ప్రతికూలంగా ఉంటే దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు దేశం విడిచి వెళ్తాయి.
-1990 -91లో దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు 1.2 USB$ మాత్రమే ఉన్నాయి.
-కానీ ఆర్థిక సంస్కరణలతో ప్రస్తుతం 358 USB$ నమోదయింది. రసాయన పరిశ్రమలు 4.40 శాతంగా 2000-2014లో రికార్డయ్యింది.
-2000-2014లో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలను గమనిస్తే మారిషస్ (35.88 శాతం), సింగపూర్ (11.88 శాతం), యూకే (9.16 శాతం), జపాన్ (7.49 శాతం), నెదర్లాండ్ (5.57 శాతం), యూఎస్ఏ (5.38 శాతం), సైప్రస్ (3.38 శాతం), జర్మనీ (2.49 శాతం) కలిగి ఉన్నాయి.
-2014 సంవత్సరాన్ని గమనిస్తే గరిష్టంగా ఎఫ్‌డీఐలను ఆకర్షించిన దేశాలు USB$లలో చైనా (129), హాంకాంగ్ (103), అమెరికా (92), బ్రిటన్ (72)లు వరుస స్థానాల్లో ఉన్నాయి.
-ఇంకా మనం ఎఫ్‌డీఐల ఆకర్షణ పెంచాలి.
ఆర్థిక సంస్కరణలు – విదేశీ వాణిజ్యం
-ఆర్థిక సంస్కరణల వల్ల ఎగుమతి, దిగుమతి సుంకాలు పూర్తిగా తగ్గించడం వల్ల, స్వేచ్ఛా ఆర్థిక విధానాన్ని పాటించడం వల్ల ఎగుమతులు, దిగుమతులు రెండు పెరిగాయి.
-దిగుమతి సుంకాలు 300 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.
-1981-90 సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచ ఎగుమతుల్లో భారత ఎగుమతులు 0.5 శాతం మాత్రమే ఉండేవి.
-2009లో 1.40 శాతం ప్రపంచ ఎగుమతులను కలిగి ఉంది.
-కానీ 2009లో చైనా ప్రపంచ ఎగుమతుల్లో 10.03 శాతం కలిగి ఉంది.
-2014లో ప్రపంచ ఎగుమతుల్లో భారత ఎగుమతులు 1.7 శాతానికి చేరుకున్నాయి.
-అయితే చైనా మాత్రం 2014లో ప్రపంచ ఎగుమతుల్లో 12.04 శాతం కలిగి ప్రపంచ నాయకుడిగా ఉన్నది.
-ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా 8.6 శాతంతో రెండో స్థానంలో, జర్మనీ 8.0 శాతంతో మూడో స్థానంలో, భారతదేశం 1.7 శాతంతో 19వ స్థానంలో ఉన్నాయి.
-2014లో భారత ఎగుమతులు రూ. 19,31,074 కోట్లు, దిగుమతులు రూ. 28,15,918 కోట్లుగా ఉన్నాయి.
-ఆర్థిక సంస్కరణలు వాణిజ్య సామర్థ్యాన్ని పెంచాయి.
-1991లో ఎగుమతులు రూ. 32,553 కోట్లు కాగా, 2014-15లో రూ. 19,31,074 కోట్లకు పెరిగాయి.
ఏకస్వామ్య పరిశీలన నియంత్రణ చట్టం (MRTPA)
-పీసీ మహలనోబిస్ అధ్యక్షతన పెద్ద పారిశ్రామిక కుటుంబాలను ముఖ్యంగా 50 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన కుటుంబాలను నియంత్రణ చేశారు.
-ఈ పరిధిని రాజీవ్‌గాంధీ రూ.100 కోట్లకు పెంచారు.
-ఆర్థిక సంస్కరణల్లో భాగంగా దీన్ని రద్దు చేసి పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలకు స్వేచ్ఛనిచ్చారు.
-అయితే ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండటానికి 2002లో ఎంఆర్టీపీఏ స్థానంలో Competition Commission Of India (CCI)ని ప్రారంభించారు.
-సీసీఐని 2007, 2009లో సవరణ చేశారు.
ఆర్థిక సంస్కరణలు – లైసెన్స్ భారం
-ఆర్థిక సంస్కరణలకు పూర్వం (1991) 18 పరిశ్రమలకు లైసెన్సు అవసరం ఉండేది.
-కానీ సంస్కరణలతో Alcohol, Chemicals, Defence, Explosives, Pharmaceuticals, Cigars లకు మాత్రమే లైసెన్సు అవసరం. మిగిలిన వాటికి అనుమతి పత్రం మాత్రమే అవసరం.
-దీని వల్ల ప్రైవేటు రంగ ప్రాధాన్యత పెరిగిపోయి, వస్తు ఉత్పత్తి పెరిగిపోయి టోకు ధరల సూచి తగ్గింది.
-దేశ జాతీయ ఆదాయం పెరిగి ప్రస్తుతం ప్రపంచంలో 7వ పెద్ద జాతీయ ఆదాయ ఆర్థిక వ్యవస్థగా ఉంది. భవిష్యత్తులో 3వ స్థానం, 2వ స్థానం కూడా పొందుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషణ చేస్తున్నారు.
ఆర్థిక సంస్కరణలు-ప్రభుత్వ రిజర్వు సంస్థలు
-ఆర్థిక సంస్కరణలకు పూర్వం 17 పరిశ్రమలు పూర్తిగా ప్రభుత్వం అజమాయిషీలో ఉండేవి. అయితే సంస్కరణల్లో భాగంగా Dereservation పాటించి రక్షణ, అణుశక్తి, రైల్వేలు, అణుశక్తికి సంబంధించిన ఖనిజ సంపదలో ప్రభుత్వం ఉంటే మిగిలిన రంగాల్లో ప్రైవేటుకు అవకాశం కల్పించారు.
-అందువల్ల ప్రైవేటు రంగ ఉత్పత్తి పెరిగిపోయి జీడీపీ పెరిగింది.
చిన్న తరహా పరిశ్రమల రిజర్వేషన్
-1967లో ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తి చేయగలిగిన కొన్ని వస్తువులను పేర్కొన్నది. దీంతో చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద పరిశ్రమల నుంచి రక్షణ కల్పించారు.
-అయితే 1991 అనంతరం ఆ సంస్థల రిజర్వేషన్‌ను తొలగించారు. చివరికి 2015, ఏప్రిల్ 13న రిజర్వేషన్ పూర్తిగా తొలగించడంతో MSME (Micro Small Medium Enterprises)లు పెద్ద పరిశ్రమల నుంచి పోటీకి తట్టుకోలేకపోతున్నాయి.
-అంటే ఆర్థిక సంస్కరణలు MSME (Micro Small Medium Enterprises)లను రక్షించడం లేదు.
ఆర్థిక సంస్కరణలు – పెట్టుబడుల ఉపసంహరణ
-ప్రభుత్వరంగం సంస్థలను ప్రైవేటు రంగానికి పాక్షికంగా విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.
-1992లో డా. సీ రంగరాజన్ అధ్యక్షతన కమిటీ వేశారు. కమిటీ సూచనల మేరకు Disinvest Commission ఏర్పాటు చేసి కమిషన్-Iను 1996లో జీవీ రామకృష్ణ అధ్యక్షతన, కమిషన్-IIను 2001లో ఆర్‌హెచ్ పాటిల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
-అదే విధంగా 2005లో NIF (National Investment Fund)ను ఏర్పాటు చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ మొత్తాన్ని ఎన్ఐఎఫ్‌కు కలుపుతారు.
-2014-15లో మొత్తం రూ. 1,79,625 కోట్లను ఉపసంహరించారు.
-చివరి, మొదటి ఉపసంహరణశాఖ మంత్రి అరుణ్‌శౌరి. ఎన్ఐఎఫ్ నిధులను 75 శాతం సాంఘిక అంశాలకు, 25 శాతం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునఃనిర్మాణం కోసం ఖర్చు చేస్తారు.
-2014-15లో రూ. 24,338 కోట్లు ఉపసంహరించారు. అంటే లక్ష్యంలో రూ. 41.6 శాతం మాత్రమే సాధ్యమైంది.
-అయితే 1991-1992 సంవత్సరం లక్ష్యం రూ. 2,500 కోట్లు కాగా, రూ. 3,308 కోట్లు అంటే 121 శాతంగా సాధించింది.
-1991-2015 లక్ష్యం రూ. 3,50,000 కోట్లు కాగా, సాధించింది మాత్రం రూ. 1,79,000 కోట్లు.
ఆర్థిక సంస్కరణలు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
-సమాజ, పర్యావరణ అభివృద్ధి కోసం కంపెనీలు గత 3 ఏండ్లుగా లాభాల్లో 2 శాతం ఖర్చు చేయాలని Companies Act-2013లో పేర్కొన్నారు. ఈ చట్టం 2013, ఆగస్టు 29న అమల్లోకి వచ్చింది.
-దీంతో సమాజం ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. సీఎస్ఆర్ పాటించాల్సిన కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 1000 కోట్లు ఉండాలి. రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగి ఉండటంతో పాటు రూ.5 కోట్ల నికరలాభం కూడా ఉంటే సీఎస్ఆర్ కంపెనీ హోదా లభిస్తుంది.
-ఇలాంటి కంపెనీలు 2 శాతం గత 3 ఏండ్లలో సగటు లాభాన్ని ఖర్చు చేయాలి.
ఆర్థిక సంస్కరణలు – ఆర్థికవృద్ధి
-1950-80 మధ్య కాలంలో Hindu Growth Rate నుంచి భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణల అనంతరం NHGR (New Hindu Growth Rate)ను సాధించింది.
-1950-80 మధ్య కాలంలో 3.5 శాతం జాతీయాభివృద్ధి నమోదు కాగా, సంస్కరణ అనంతరం అంటే 8వ ప్రణాళికలో 6.8 శాతం. 9వ ప్రణాళికలో 5.4 శాతం, 10వ ప్రణాళికలో 7.8 శాతం నమోదు కాగా, 11వ ప్రణాళికలో 8.0 శాతం వృద్ధి నమోదైంది.
-12వ ప్రణాళికలో కనిష్ట ఆశించిన వృద్ధి 6 శాతం కాగా గరిష్ట ఆశించిన వృద్ధి 9 శాతం. సగటు ఆశించిన వృద్ధి 8 శాతంగా పేర్కొన్నారు.
photo
ఆర్థిక సంస్కరణలు – బ్యాంకింగ్
-దేశంలో రెండు రంగాలను అంటే పొదుపు, పెట్టుబడులను కలుపుతూ మూలధన కల్పన, ఉత్పత్తికి దోహదపడేవే బ్యాంకులు.
-సంస్కరణలకు పూర్వం ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ, బ్యాంకులకు స్వేచ్ఛలేకపోవడం మొదలైన కారణాలతో బ్యాంకింగ్ రంగం పూర్తిగా బలహీనంగా ఉండి, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది.
-నర్సింహం కమిటీ(1991) సూచనల మేరకు నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం, చట్టబద్ధ ద్రవ్యత్వపు నిష్పత్తిని తగ్గించడంతో బ్యాంకుల వద్ద నిల్వలు పెరిగి రుణ పరిమితి మరింత పెరిగిపోయింది.
-నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)పై 3 నుంచి 15 శాతం పరిమితిని ఎత్తివేశారు.
-అదే విధంగా చట్టబద్ధ ద్రవ్యత్వనిష్పత్తి (ఎస్ఎల్ఆర్) పరిమితి 25 నుంచి 40 శాతం కూడా ఎత్తి వేశారు.
-అదే విధంగా బ్యాంకుల నిధుల కొరతను తీర్చేందుకు 1992లో Repo Rate, బ్యాంకుల అదనపు వనరుల సమస్యను తీర్చేందుకు 1996లో Reverse Repo Rate (RRR)ను ప్రవేశ పెట్టారు.
-దీంతో బ్యాంకుల స్థిరత్వం సాధ్యమైంది.
-అత్యవసర సమయంలో డబ్బును ఆర్బీఐ నుంచి పొందేందుకు Marginal Standing Facilityని ప్రవేశ పెట్టారు.
-ప్రభుత్వ రంగ బ్యాంకుల పునఃనిర్మాణం కోసం ఇంద్రధనుష్ పథకాన్ని 2015 నుంచి అమలు చేస్తున్నారు.
-అదేవిధంగా సంస్కరణల్లో భాగంగా చెల్లింపు బ్యాంకులు, చిన్న బ్యాంకులకు అవకావం ఇచ్చారు. ఒకే పూచీపై బహుళ రుణాలను నిరోధించేందుకు 2000లో Credit Information Buero Of India Limited (CIBIC)లోను ప్రారంభించారు.
-సచికేత్ మెహ్రా కమిటీ సూచనల మేరకు 2014లో పీఎం జన్‌ధన్ యోజనను ప్రారంభించారు.
-2011, ఫిబ్రవరి 10న స్వాభిమాన్ను కూడా ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణం ఇచ్చేందుకు 2015లో MUDRA BANK పథకాన్ని ప్రారంభించారు.
-విత్త సమ్మిళితిని పెంచేందుకు పీఎం సురక్షబీమా యోజన (పీఎంఎస్బీవై) రూ. 2,00,000. అటల్‌పెన్షన్ యోజన (ఏపీవై) రూ. 1000-5000 పెన్షన్. పీఎం జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) రూ. 2,00,000 బీమా ప్రారంభించారు.
-బ్యాంకుల స్వేచ్ఛను పెంచడానికి బ్యాంకుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గాలని పీజే నాయక్ సూచనలు చేశారు. దీని అమలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకుల నైపుణ్యాన్ని పెంచాలని పేర్కొన్న గోపాల్ కృష్ణ కమిటీ సూచనల అమలుకు ప్రయత్నిస్తున్నారు.
-మొండి బాకీలను (ఎన్పీఏ) ఎదుర్కోవడానికి సీఆర్ఏఆర్ (క్యాపిటల్ టూ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో)ను అమలు చేస్తున్నారు.
-ఇంకా బ్యాంకులకు స్వేచ్ఛను పెంచాలి.
-ప్రైవేటు బ్యాంకులకు అనుమతి ఇవ్వడంలో ఆలస్యం అవుతుంది.
-విత్త సమ్మిళితిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యతపరంగా రుణాన్ని ఇవ్వడం(పీఎస్సీ) తగ్గించాలి.
-రుణమాఫీ భారాన్ని బ్యాంకులపై వేయరాదు. బ్యాంకుల పుష్టి పెంచాలి.
-గణాంకాల ప్రకారం 1951-52లో గ్రామ పరపతిలో వడ్డీ వ్యాపారం 90.09 శాతం ఉండగా, 2002-03లో 41 శాతానికి తగ్గడం సంఘటిత విత్తం సామర్థ్యాన్ని తెలుపుతుంది.
-అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల గ్రామ పరపతి 1951-52లో 0.9 శాతం ఉండగా, 2002-03లో 27 శాతానికి పెరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు