Supreme Court Chief Justices | సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
భారత రాజ్యాంగం ఐదో భాగం 4వ అధ్యాయంలోని 124 నుంచి 147 వరకు గల 24 ప్రకరణలు సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, విధుల గురించి పేర్కొన్నాయి.
-ప్రకరణ 124 సుప్రీంకోర్టు ఏర్పాటును, నిర్మాణాన్ని తెలుపుతుంది.
-రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు.
-ప్రకరణ 124(1) ప్రకారం పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు.
-(1956లో 10కు, 1960లో 13కు, 1977లో 17కు, 1985లో 25కు సుప్రీంకోర్టు సవరణ చట్టం 2008 ప్రకారం 2009 ఫిబ్రవరిలో 30కు పెంచారు.)
-ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని మొత్తం న్యాయమూర్తులు- 31
-ప్రకరణ 124(2) ప్రకారం న్యాయమూర్తుల నియామకం
-సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. (ప్రధానన్యాయమూర్తితో సహా)
-సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి మినహా ఇతర న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్త్తితోపాటు సుప్రీంకోర్టు, రాష్ర్టాల హైకోర్టుల న్యాయమూర్తులను సంప్రదించాలి.
-సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏండ్ల వరకు పదవిలో కొనసాగుతారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
పేరు కాలం
హెచ్జే కానియా 1950-51
ఎం పతంజలిశాస్త్రి 1951-54
ఎంసీ మహాజన్ 1954-54
బీకే ముఖర్జీ 1954-56
ఎస్ఆర్ దాస్ 1956-59
బీపీ సిన్హా 1959-64
పీబీ గజేంద్ర గడ్కర్ 1964-66
ఏకే సర్కార్ 1966-66
కే సుబ్బారావు 1966-67
కేఎన్ వాంఛూ 1967-68
ఎం హిదయతుల్లా 1968-70
జేసీ షా 1970-71
ఎస్ఎం సిక్రి 1971-73
ఏఎన్ రే 1973-77
ఎంహెచ్ బేగ్ 1977-78
వైవీ చంద్రచూడ్ 1978-85
పీఎన్ భగవతి 1985-86
ఆర్ఎస్ పాఠక్ 1986-89
ఈఎస్ వెంకట్రామయ్య 1989-89
ఎస్ ముఖర్జీ 1989-90
రంగనాథ్ మిశ్రా 1990-91
కేఎన్ సింగ్ 1991-91
ఎంహెచ్ కానియా 1991-92
ఎల్ఎం శర్మ 1992-93
ఎంఎన్ వెంకటాచలయ్య 1993-94
ఏఎం అహ్మదీ 1994-97
జేఎస్ వర్మ 1997-98
ఎంఎం పూంచీ 1998-98
ఏఎస్ ఆనంద్ 1998-2001
ఎస్పీ బరూచా 2001-02
బీఎన్ కిర్పాల్ 2002-02
జీబీ పట్నాయక్ 2002-02
వీఎన్ ఖరే 2002-04
ఎస్ రాజేంద్రబాబు 2004-04
ఆర్ఎస్ లహోటీ 2004-05
వైకే సబర్వాల్ 2005-07
కేజీ బాలకృష్ణన్ 2007-10
సరోష్ హోమి కపాడియా 2010-2012
ఆల్తమస్ కబీర్ 2012-13
పీ సదాశివం 2013-14
రాజేంద్రమల్ లోథా 2014-14
హెచ్ఎల్ఎన్ దత్తు 2014-15
టీఎస్ ఠాకూర్ 2015-16
జేఎస్ ఖేహర్ 2017-17
దీపక్ మిశ్రా 2017-18
రంజన్ గోగై -2018-19
శరద్ అరవింద్ బాబ్డే -2019-21
నూతలపాటి వెంకట రమణ 2021- ప్రస్తుతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు