క్యాన్సర్ చికిత్సకు రేడియోథెరపీలో వాడే కణాలు?
1. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి కారణం?
1) అభికేంద్ర బలం
2) అపకేంద్ర బలం
3) వాండలర్స్ బలం
4) అధిశోషణ బలాలు
2. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ. ఎలక్ట్రాన్లు బి. ప్రోటాన్లు
సి. న్యూట్రాన్లు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. ఆక్సిజన్‌ను కనుగొన్నది?
1) జె. ప్రిస్ట్‌లీ 2) రూథర్‌ఫర్డ్
3) హాబర్ 4) చాడ్విక్
4. ఐసోటోపులని వేటిని అంటారు?
1) ఒకే ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య ఉన్నవి
2) పరమాణు సంఖ్య ఒకటే ఉండి, ద్రవ్యరాశి సంఖ్య వేరుగా ఉన్నవి
3) ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండి, పరమాణు సంఖ్య వేరుగా ఉన్నవి
4) పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉండి, న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నవి
5. పరమాణు సంఖ్య కనుగొన్నది?
1) థామ్సన్ 2) రూథర్‌ఫర్డ్
3) డాల్టన్ 4) మోస్లే
6. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ. ఎలక్ట్రాన్లు బి. ప్రొటాన్లు
సి. న్యూట్రాన్లు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
7. ప్రాథమిక కణాలు ఏవి?
1)ఎలక్ట్రాన్లు 2) ప్రోటాన్లు
3) న్యూట్రాన్లు 4) పై వన్నీ
8. ఒక ధనవిద్యుదాత్మక (ఎలక్ట్రోపాజిటివ్) పరమాణువు కాటయాన్‌గా మారినప్పుడు?
1) ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది
2) ఎలక్ట్రాన్లను కోల్పోతుంది
3) ప్రోటాన్లను కోల్పోతుంది
4) పరమాణు సంఖ్య తగ్గుతుంది
9. వాయుస్థితిలో ఒక ఒంటరి తటస్థ పరమాణువు బాహ్యాకక్ష్య నుంచి ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటారు?
1) అయనీకరణ శక్తి
2) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
3) రుణ విద్యుదాత్మకత
4) ఏదీకాదు
10. మూలకం ప్రధాన లక్షణం?
1) పరమాణు బరువు
2) పరమాణు సంఖ్య
3) పరమాణు సాంద్రత
4) మాలిక్యులర్ బరువు
11. ఎలక్ట్రాన్‌ను కనుగొన్నది?
1) జేజే థామ్సన్ 2) జె చాడ్విక్
3) రూథర్‌ఫర్డ్ 4) మోస్లే
12. ప్లాంక్ స్థిరాంకానికి ప్రమాణాలు?
1) బల x కాలం 2) శక్తి x దూరం
3) శక్తి x కాలం 4) శక్తి / కాలం
13. ఆకుపచ్చని కాంతి పౌనఃపున్యం 610 14 హెర్జ్. దాని తరంగ దైర్ఘ్యం?
1) 0.5x 10-6 మీటర్లు
2) 0.2x 107 మీటర్లు
3) 5x 106 మీటర్లు
4) 2x 106 మీటర్లు
14. జతపరచండి?
ఎ. పుచ్చకాయ నమూనా 1. నీల్స్‌బోర్
బి. గ్రహ మండల నమూనా 2. థాంప్సన్
సి. వృత్తాకార కక్ష్యలు 3. రూథర్‌ఫర్డ్
డి. కృష్ణ వస్తు వికిరణం 4. కాంప్టన్
5. ప్లాంక్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-5
4) ఎ-5, బి-1, సి-3, డి-4
15. పరమాణు సంఖ్యకు ఆధారం?
1) ఎలక్ట్రాన్లు 2) ప్రోటాన్లు
3) న్యూట్రాన్లు
4) ప్రోటాన్లు + న్యూట్రాన్లు
16. ద్రవ్యరాశి సంఖ్యను నిర్ణయించేది?
1) ఎలక్ట్రాన్లు 2) ప్రోటాన్లు
3) న్యూట్రాన్లు
4) ప్రోటాన్లు+న్యూట్రాన్లు
17. పరమాణు ప్రధాన రేణువులు?
1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్
3) న్యూట్రాన్ 4) పైవన్నీ
18. అయోడిన్‌ను కనుగొన్నది?
1) బి. కూర్టోయిస్ 2) బెర్జిలియోస్
3) ఫ్రెడరిక్ వాల్టన్ 4) జె. ప్రిస్టలీ
19. కింది మూలకాల్లో ఏది హాలోజన్?
ఎ. ఫ్లోరిన్ బి. బ్రోమిన్
సి. క్లోరిన్ డి. అయోడిన్
ఇ. హైడ్రోజన్
1) ఇ 2) ఎ 3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
20. కేంద్రక చర్యల్లో పాల్గొనని కణాలు?
1) ఎలక్ట్రాన్లు 2) ప్రోటాన్లు
3) న్యూట్రాన్లు 4) 2, 3
21. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించి ఆనయాన్‌గా మారినప్పుడు దాని పరిమాణం?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) మార్పు ఉండదు
4) పరమాణువుపై ఆధారపడుతుంది
22. ‘విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు” అని ప్రతిపాదించినది?
1) రూథర్‌ఫర్డ్ 2) స్టోని
3) గోల్డ్ స్టీన్
4) జాన్ డాల్టన్
23. పరమాణువును ‘పుచ్చ పండు’ తో పోల్చినవారు?
1) డాల్టన్ 2) రూథర్‌ఫర్డ్
3) జేజే థామ్సన్ 4) చాడ్విక్
24. కేంద్రక పరిమాణాన్ని సూచించే ఒక ఫెర్మి అంటే?
1) 10-10cm 2) 10-10 m
3) 10-13 m 4) 10-13 cm
25. కింది వాటిలో కేంద్రక కణాలు ఏవి?
1) ప్రోటాన్ 2) న్యూట్రాన్
3) ఎలక్ట్రాన్ 4) 1, 2
26. కింది వాటిలో బోర్ పరమాణు నమూనా వివరించలేనివి?
1) H 2) Be 3) He+ 4) Li 2+
27. ఎలక్ట్రాన్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది కానిది?
1) రుణావేశ ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ ధనావేశ కేంద్రకం చేత స్థిర విద్యుదాకర్షక బలాల ద్వారా ఆకర్షితమవుతాయి
2) కేంద్రానికి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ కేంద్రకంతో బలంగా ఆకర్షణ పొందడం చేత దానికి అతి తక్కువ స్థితి శక్తి ఉంటుంది
3) కేంద్రకానికి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్‌కు అధిక స్థితిశక్తి ఉంటుంది
4) ఒక పరమాణువును వేడి చేసినప్పుడు అందులో ఉన్న ఎలక్ట్రానులన్ని బయటకు విడుదలవుతాయి
28. రేడియోధార్మికత గల కేంద్రకాలు స్వచ్ఛందంగా విడుదల చేసే కణాలు ఏవి?
1) ఆల్ఫా 2) బీటా
3) గామా 4) పైవన్నీ
29. ఒక రుణ విద్యుదాత్మక (ఎలక్ట్రోనెగెటివ్) పరమాణువు రుణ అయాన్ (ఆనయాన్) గా మారినప్పుడు?
1) ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గుతుంది
2) ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది
3) పరమాణు సంఖ్య తగ్గుతుంది
4) పరమాణు సంఖ్య పెరుగుతుంది
30. జతపరచండి?
ఎ. ఫొటో విద్యుత్ ఫలితం 1. ఐన్‌స్టీన్
బి. ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావం 2. డీబ్రోగ్లీ
సి. అనిశ్చితత్వ సూత్రం 3. హైసెన్బర్గ్
డి. కేంద్రకం 4. రూథర్‌ఫర్డ్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-2, సి-3, డి-1
31. అత్యంత శక్తిమంతమైన విద్యుదయస్కాంత వికిరణ కణాలు ఏవి?
1) ఆల్ఫా 2) బీటా
3) గామా 4) రేడియో
32. రేడియో ధార్మికతను కనుగొన్నది?
1) ఫెర్మి 2) మేరీ క్యూరీ
3) హెన్రీ బెకరల్ 4) రూథర్‌ఫర్డ్
33. ‘సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించినది?
1) రూథర్‌ఫర్డ్ 2) చాడ్విక్
3) న్యూటన్ 4) డాల్టన్
34. పరారుణ (ఇన్ ఫ్రారెడ్ లేదా IR) కిరణాలకు సంబంధించి సరైన వాక్యాలు?
ఎ. చీకటిలో వస్తువులను చూడగలిగిన
కళ్లద్దాల్లో (నైట్ విజన్ గ్లాసెస్)
ఉపయోగిస్తారు
బి. టీవీ రిమోట్‌తో టీవీను నియంత్రించడానికి ఉపయోగపడతాయి
సి. ఇవి ఉష్ణకాంతి కిరణాలు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవన్నీ
35. ఆల్ఫాకణాలు ఏ కేంద్రకాన్ని సూచిస్తాయి?
1) హైడ్రోజన్ 2) రేడియం
3) హీలియం 4) యురేనియం
36. కింది వాటిలో తప్పుగా ఉన్న క్వాంటం సంఖ్యల సమితి?
1) 3, 1, 0,-1/2 2) 3, 2, 1, +1/2
3) 3, 1, 2, -1/2 4) 3, 2, 0, +1/2
37. ఒక పరమాణువు ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్లను నింపే సరైన క్రమం?
1) 3d, 4p, 4s, 4d, 5s
2) 3d, 4s, 4p, 4d, 5s
3) 4s, 3d, 4p, 5s, 4d
4) 5s, 4p, 3d, 4d, 4s
38. నైట్రోజన్‌ను కనుగొన్నది?
1) డేనియల్ రూథర్‌ఫర్డ్
2) ఎఫ్. హేబర్
3) జె. వాల్టర్
4) బ్రకడ్
39. క్యాన్సర్ చికిత్సకు రేడియోథెరపీలో వాడే కణాలు?
1) ఆల్ఫా 2) బీటా
3) గామా 4) రేడియో
40. రేడియోధార్మికత నుంచి రక్షించడానికి వాడే కవచాలను ఏ లోహంతో తయారుచేస్తారు?
1) బంగారం 2) సీసం (లెడ్)
3) స్టీల్ 4) వెండి
41. జతపరచండి?
ఎ. ఎక్స్ కిరణాలు 1. హెన్రి బెక్వరల్
బి. రేడియో ధార్మికత 2. రాంట్జెన్
సి. పరమాణు నమూనా 3. ఐన్‌స్టీన్
డి. కాంతి విద్యుత్ఫలితం 4. నీల్స్‌బోర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1
42. అత్యంత తేలికైన మూలకం ఏది?
1) హైడ్రోజన్ 2) కార్బన్
3) హీలియం 4) యురేనియం
43. అణు సిద్ధాంతాన్ని కనుగొన్నది?
1) బెంజిమిన్ ఫ్రాంక్లిన్
2) జాన్ డాల్టన్
3) మేడమ్ క్యూరీ 4) ఐన్‌స్టీన్
44. న్యూట్రాన్‌ను కనుగొన్నది?
1) జేజే థాంప్సన్ 2) జే చాడ్విక్
3) రూథర్‌ఫర్డ్ 4) మోస్లే 7
45. పరమాణువులోని కేంద్రక వ్యాసం?
1) 10-10 సెం.మీ 2) 10- 8 సెం. మీ
3) 10- 13 సెం.మీ 4) 10-15 సెం.మీ
46. ఒక ఎలక్ట్రాన్ అయస్కాంత క్వాంటం సంఖ్య-1, స్పిన్ క్వాంటం సంఖ్య 1/2 అయితే ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్‌లో ఉండదు?
1) s 2) p 3) d 4) f
47. గరిష్ఠంగా 18 ఎలక్ట్రానులను నింపగలిగే కక్ష్య ప్రధాన క్వాంటం సంఖ్య?
1) 1 2) 2 3) 3 4) 4
48. డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పదార్థపు అతి చిన్న కణం ఏది?
1) పరమాణువు 2) అణువు
3) ప్రోటాన్ 4) న్యూట్రాన్
49. ఒక మోల్ను సూచించే అవగాడ్రో సంఖ్య?
1) 6.023×10-23 2) 6.023×10 23
3) 6.023×10-14 4) 6.023×10 14
50. కృష్ణవస్తువు అంటే?
1) ఇనుముతో చేసిన వస్తువు
2) తెల్లని వస్తువు
3) తనపై పడిన కాంతిని పూర్తిగా శోషించుకునే వస్తువు 4) ఎర్రని వస్తువు
51. రసాయనిక సమీకరణం కింది అంశాన్ని సంకేతపరంగా సూచిస్తుంది?
1) కేవలం క్రియాజనకాలను మాత్రమే
2) కేవలం క్రియాజన్యాలను మాత్రమే
3) క్రియాజనకాలను, క్రియాజన్యాలను రెండింటిని సూచిస్తుంది
4) పైవన్నీ
52. కింది వాటిలో సరైన ప్రవచనం?
1) రసాయన మార్పులు జరిగినప్పుడు శక్తి మార్పులు సంభవిస్తాయి
2) ఒక రసాయన మార్పు జరిగినప్పుడు పరమాణువుల పునరమరిక జరుగుతుంది
3) అవక్షేప చర్యల్లో కరగని లవణాలు ఉత్పత్తి అవుతాయి
4) పైవన్నీ
53. ఒక రసాయన చర్యను సంకేతాలతో చూపటం?
1) తుల్య రసాయన చర్య
2) తుల్యం కాని రసాయన చర్య
3) అవక్షేప రసాయన చర్య
4) రసాయన సమీకరణం
54. జింక్ పూత వేయడం ద్వారా ఇనుము తుప్పుపట్టకుండా నిరోధించే పద్ధతి?
1) గాల్వనైజేషన్ 2) తుప్పుపట్టుట
3) కార్బోనైజేషన్ 4) పల్వనైజేషన్
55. ఉష్ణమోచక చర్యలో..?
1) ఉష్ణం గ్రహించబడుతుంది
2) ఉష్ణం విడుదలవుతుంది
3) శక్తి విడుదలవుతుంది
4) ఏదీకాదు
సమాధానాలు
1-1, 2-4, 3-1, 4-2, 5-2, 6-2, 7-4, 8-2, 9-1, 10-2, 11-1, 12-3, 13-1, 14-3, 15-2, 16-4, 17-4, 18-1, 19-4, 20-1, 21-2, 22-4, 23-3, 24-4, 25-4, 26-2, 27-4, 28-4, 29-2, 30-3, 31-3, 32-3, 33-1, 34-4, 35-3, 36-3, 37-3, 38-2, 39-3, 40-2, 41-3, 42-1, 43-2, 44-2, 45-3, 46-1, 47-3, 48-1, 49-2, 50-3 51-3, 52-4, 53-4, 54-1, 55-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు