చాళుక్యయుగంలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు?
1. ఏ శతాబ్దాల నుంచి దక్కన్లో దక్షిణ భారతంలో దేవాలయాలు వ్యవస్థలుగా రూపొందడం వల్ల బ్రహ్మధేయాలు క్షీణించినట్లు అంచనా?
ఎ) క్రీ.శ. 10, 11
బి) క్రీ.శ. 9, 10
సి) క్రీ.శ. 11, 12
డి) క్రీ.శ. 12, 13
2. క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన ఏ సాహిత్య గ్రంథం వెట్టి చాకిరీని నిరసించింది?
ఎ) పార్శాభ్యుదయం
బి) నీతి కావ్యం
సి) యశస్థిలక డి) రత్నమాలిక
3. క్రీ.శ. 11వ శతాబ్దంలో ఆంధ్రదేశం, తమిళనాడులో అవతరించిన ‘పంచాణం’, ‘ఇడంగై’ ఏ వర్గం వారు?
ఎ) వర్తక వాణిజ్య వర్గం
బి) వృత్తి విద్యల వర్గం
సి) వ్యవసాయ సాగు వర్గం
డి) కవి కవయిత్రుల వర్గం
4. ఎక్కడ ఉన్న సెలోర్గిలోని త్రయిపురుష దేవాలయంలో ఉన్న పెద్ద కళాశాలలో 27 వసతి గృహాలున్నట్లు అక్కడ జైన బౌద్ధ మతాలు తమ మత విద్యను బోధించినట్లు తెలు స్తుంది?
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర
సి) తెలంగాణ డి) తమిళనాడు
5. రాష్ట్ర కూటరాజులు పోషించిన భాష?
ఎ) సంస్కృతం బి) కన్నడ
సి) తెలుగు డి) ఎ, బి
6. రాష్ట్రకూటుల కాలంలో ఏ వ్యాకరణం సమస్త శాస్ర్తాలకు అమూల కందమని ధృవ మహారాజు ధూలియా శాసనంలో పేర్కొన్నాడు?
ఎ) ప్రాకృతం బి) కన్నడ
సి) సంస్కృతం డి) తెలుగు
7. రాష్ట్రకూటులు విద్యాభివృద్ధికి చేసిన కృషికి సంబంధించి సరైనది?
1. ధార్వాడ్ మండలంలోని భుజభేశ్వరాలయంలోని మఠానికి క్రీ.శ.975లో 50 కామత్తరుల భూమిని దానం చేశారు.
2) ధార్వాడ్ మండలంలోని కౌలాన్ అగ్రహారంలో గల సంస్కృత విద్యాపీఠంలో 200 బ్రాహ్మణ కుటుంబాలు వ్యాకరణ, సాహిత్య, పురాణ విద్యల్లో నిష్ణాతులు అయి ఉండేవారు.
సి) మఠంలో విద్యార్థులకు విద్య, ఆహారం ఉచితం. పతచ్ఛాయలనున్న విద్యాశాలలకు విద్యార్థులకు పుస్తకాలను కూడా దానాలు ఇచ్చేవారు. డి) పైవన్నీ
8. సంస్కృత ధాతువుల వివరణ కృష్ణ మహారాజా ప్రశస్థి గల కవి రహస్యంను మూడో కృష్ణరాజు కాలంలో రచించిన వారు?
ఎ) శకటాయనుడు బి) మీరాచార్యుడు
సి) హలాయుధుడు డి) పొన్న
9. జిన సేనుడి చివరి పరమ గురువు?
ఎ) ధృవరాజు బి) అమోఘవర్షుడు
సి) మూడో కృష్ణుడు డి) రెండో కృష్ణుడు
10. జినసేనుడి ఆది పురాణాన్ని అతని శిష్యుడు గుణ చంద్రుడు పూరించాడు అయితే ఆదిపురాణం అనేది?
ఎ) బౌద్ధ తీర్థంకరుల జీవిత చరిత్ర
బి) జైన తీర్థంకరుల జీవిత చరిత్ర
సి) హిందూ దేవతల పురాణ గాథ
డి) పురాణ పురుషుల జీవిత చరిత్ర
11. కన్నడ కవిత్రయంలో రెండో వాడైన పొన్న ఎవరి ఆస్థాన కవి?
ఎ) మొదటి కృష్ణుడు బి) రెండో కృష్ణుడు
సి) మూడో కృష్ణుడు డి) అమోఘవర్షుడు
12. శాంతి పురాణం ఎవరు రచించారు?
ఎ) పొన్న బి) రన్న
సి) పంపడు డి) వీరాచార్యుడు
13. రాష్ట్రకూట సామంతులైన వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో ఉన్న పంపకవి రచన కానిది ఏది?
ఎ) ఆది పురాణం
బి) విక్రమార్జున విజయం
సి) నీతి కావ్యం డి) ఏదీకాదు
14. నాడు తమిళనాడు, కేరళ ప్రాంతాలను దిగువ ద్రావిడ దేశమని ఉదహరించేవారు. మరి ఎగువ ద్రావిడ దేశమనగా?
ఎ) ఆంధ్ర, మహారాష్ట్ర
బి) మహారాష్ట్ర, ఒరిస్సా
సి) ఆంధ్ర, కర్ణాటక
డి) కర్ణాటక, మహారాష్ట్ర
15. దిగువ ద్రావిడ దేశంలోని కట్టడాలకు ‘ద్రావిడ రీతి’ లేదా శైలి ప్రధాన భూమిక కాగా ఎగువ ద్రావిడ దేశంలోని దేవాలయ నిర్మాణాలు?
ఎ) నగర రీతి బి) ద్రావిడ రీతి
సి) నగర, ద్రావిడ రీతి డి) ఏదీకాదు
16. ఎల్లోరాలోని మొదటి గుహలో దశావతార దేవాలయాన్ని నిర్మించినవారు?
ఎ) దంతి దుర్గుడు
బి) మొదటి కృష్ణుడు
సి) ధృవరాజు డి) అమోఘవర్షుడు
17. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం రాష్ట్రకూట రాజు అయిన మొదటి కృష్ణుని కళాసృష్టి ఈ ఆలయం వీటిని కలిగి ఉంది?
ఎ) ఒక గర్భగుడి
బి) ఒక ముఖ మండపం
సి) ముంగిలిలో ఒక కప్పబడిన చావడి
డి) పైవన్నీ
18. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయానికి సంబంధించి సరైనది?
ఎ) ప్రధాన పూజా మందిరం చుట్టూ ఏడు చిన్న ఆలయాలు ఒక సంధి మండపం ఉన్నాయి.
బి) గోపురం రెండంతస్తులను కలిగి పై భాగం గుడిసె బండి ఆకారపు కప్పును కలిగి ఉంది
సి) ఈ ఆలయం, విగ్రహ శాస్త్రంలోని శివుని అన్ని రూపాలను హిందూ మత పురాణ గాథలను వివరించే అద్భుత శిల్ప కళా ఖండాలకు నిలయం
డి) పైవన్నీ
19. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన త్రిమూర్తుల ముఖాలతో చెక్కిన మహేశ్వరుని విగ్రహం ఎక్కడ ఉంది?
ఎ) ఎలిఫెంట దీవిలోని గుహాలయాల్లో
(బొంబాయి)
బి) కైలాసనాథ దేవాలయం (ఎల్లోరా)
సి) దశావతార దేవాలయంలో (ఎల్లోరా)
డి) సూర్య దేవాలయంలో (కోణార్క్)
20. ప్రసిద్ధికెక్కిన హిరణ్యకశిపుని వధించే నరసింహ విగ్రహం ఎక్కడ ఉంది?
ఎ) దశావతార దేవాలయంలో
బి) కైలాసనాథ దేవాలయంలో
సి) ఎలిఫెంటా గుహాలయంలో
డి) మాన్యఖేటంలో
21. దక్కన్లో రాష్ట్రకూటుల కాలంలో ప్రచారంలోకి వచ్చిన శైవమత శాఖ?
ఎ) కాలాముఖ బి) కాపాలిక
సి) పాశుపత డి) ఎ, బి
22. క్రీ.శ.9వ శతాబ్దపు శాసనాల వివరణ ప్రకారం రాష్ట్రకూటుల కాలంలో వెలుగులోకి వచ్చిన బ్రాహ్మణేతర భక్త బృందం?
ఎ) గురవ వర్గం బి) ఆరవ వర్గం
సి) హైందవ వర్గం డి) నిర్గుణ వర్గం
23. రాష్ట్రకూటుల కాలంలో శ్రీశైలం ఒక గొప్ప కేంద్రంగా పరిగణనలోకి వచ్చింది?
ఎ) పాశుపత బి) కాపాలిక
సి) కాలాముఖ డి) గురవ
24. రాష్ట్రకూటుల కాలంలో విష్ణువు ఏ రూపం ఉన్నత దశ అంటే ‘పర’తత్వానికి చిహ్నంగా భావించేవారు?
ఎ) ఆసీన రూపం బి) నిలుచున్న రూపం
సి) శయన రూపం డి) పైవన్నీ
25. క్రీ.శ.7వ శతాబ్దం నుంచి జనాదరణ పొందిన వజ్రయాన బౌద్ధమతంలో గల ఆగోచర ఆచారాలు?
ఎ) వజ్రయాన బి) సహజయాన
సి) కాలచక్రయాన డి) పైవన్నీ
26. వజ్రయాన బౌద్ధమతం లేదా తాంత్రిక బౌద్ధంలోని గురువులను సిద్ధులంటారు, వీరి మొత్తం సంఖ్య?
ఎ) 24 బి) 84 సి) 74 డి) 64
27. రాష్ట్ర కూటుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధమత కేంద్రం కానిది?
ఎ) గుంటుపల్లి, అమరావతి
బి) శ్రీపర్వతం, శాలిహుండం
సి) అహోబిలం, తిరుమల
డి) నాగపట్టణం, కంచి
28. ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందిన ప్రసిద్ధ జైన శాఖలు?
ఎ) మూలసంఘ బి) యావనీయ
సి) ద్రవిడ సంఘ డి) పైవన్నీ
29. రాష్ట్రకూటుల కాలంలో బౌద్ధమతాల ఆదరణ ఇలా ఉంది?
ఎ) జైనం కంటే బౌద్ధం ఎక్కువ
వ్యాప్తి చెందింది.
బి) బౌద్ధం కంటే జైనం ఎక్కువ
ఆదరించబడింది
సి) జైన, బౌద్ధ మతాలు సమానంగా
ఆదరించబడ్డాయి
డి) సరిగా అంచనా వేయలేం
30. అసంఖ్యాకంగా ఉన్న జైన మత కేంద్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆనాటి జైన మత కేంద్రం?
ఎ) హనుమకొండ బి) శ్రావణ బెలగోళ
సి) కొల్లిపర డి) వేములపాడు
31. ఆంధ్రదేశంలో జైన మతంతో సంబంధం గల ఆనాటి గొప్ప వ్యక్తులు?
ఎ) అకలంక బి) పంప
సి) పొన్న డి) పై అందరూ
32. ఆంధ్రదేశంలో రామతీర్థం, పటాన్చెరు, దానవులపాడులు రాష్ట్రకూటుల కాలంలో ప్రఖ్యాతి గాంచిన ఏ మత కేంద్రాలు?
ఎ) వైష్ణవమత కేంద్రాలు
బి) బౌద్ధమత కేంద్రాలు
సి) జైనమత కేంద్రాలు డి) ఎ, బి
33. రాష్ట్రకూట వంశ మూలపురుషుడు?
ఎ) ఇంద్రరాజు -I బి) ఇంద్రరాజు IV
సి) అమోఘవర్షుడు డి) దంతి దుర్గుడు
34. బాదామి చాళుక్యుల జన్మభూమి
ఎ) హిరణ్య రాష్ట్రం బి) చేజర్ల
సి) కోసల రాజ్యం డి) కుందల వనం
35. చివరి రాజైన 2వ కీర్తివర్మను ఓడించి బాదామి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజు ఎవరు?
ఎ) దంతి దుర్గుడు బి) అమోఘవర్షుడు
సి) హరిసేనుడు డి) ఎవరూకాదు
36. బాదామి చాళుక్యులు ఎవరికి సామంతులుగా పనిచేశారు?
ఎ) శాతవాహనులు బి) ఇక్షాకులు
సి) విష్ణుకుండినులు డి) రాష్ట్రకూటులు
37. చాళుక్యయుగంలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు?
ఎ) కుల సంఘం బి) సమయ సంఘం
సి) శ్రేణి సంఘం డి) సంఘం
38. చాళుక్య యుగంలో క్షీణదశలో ఉన్న మతం ఏది?
ఎ) బౌద్ధమతం బి జైన మతం
సి) వైష్ణవ మతం డి) పౌరాణిక మతం
39. చాళుక్యయుగంలో అభివృద్ధి చెందిన బౌద్ధశాఖ ఏది?
ఎ) మహాయానం బి) థెరవాదం
సి) వజ్రయానం డి) శైలవాదం
40. దుగ్గరాజు నిర్మించిన జైన దేవాలయం పేరు ఏమిటి?
ఎ) సుభాదామ జినాలయం
బి) కటికాభరణ జినాలయం
సి) సుహస్తి జినాలయం
డి) వర్ధమాన జినాలయం
41. చాళుక్యుల కాలంలో 500పైన మఠాలున్న ప్రదేశం ఏది?
ఎ) పటాన్చెరు బి) ఉజ్జలి
సి) కొలనుపాక డి) ఏలేశ్వరం
42. పరమత సహనానికి చిహ్నంగా చాళుక్య రాజులు ధరించిన బిరుదు?
ఎ) చతుస్సమయోద్ధారకులు
బి) పరమ మహేశ్వరుడు
సి) పరమ బ్రాహ్మణులు
డి) పరమ భాగవతులు
43. అలంపురం దేవాలయాలు ఎవరు నిర్మించారు?
ఎ) పశ్చిమ చాళుక్యులు
బి) కళ్యాణి చాళుక్యులు
సి) వేములవాడ చాళుక్యులు
డి) నిడుగళ్లు చాళుక్యులు
44. అలంపురంలో ఎవరి శాసనం ఉన్నది?
ఎ) రాజరాజ నరేంద్రుడు
బి) విజయాదిత్యుడు
సి) వినయాదిత్యుడు
డి) విక్రమాదిత్యుడు
45. చాళుక్య వంశానికి మూలపురుషుడు?
ఎ) జయసింహుడు బి) మొదటి పులికేశి
సి) కీర్తివర్మ డి) విష్ణువర్ధనుడు
46. బాదామి చాళుక్యుల్లో అగ్రగణ్యుడెవరు?
ఎ) గుణగ విజయాదిత్యుడు
బి) రెండో పులకేశి
సి) 6వ విక్రమాదిత్యుడు
డి) సోమేశ్వరుడు
47. రెండో పులకేశి కమ్మ రాష్ర్టాన్ని జయించాడని తెలిపే శాసనం ఏది?
ఎ) మార్టూరు శాసనం
బి) చందవరం శాసనం
సి) చీపురుపల్లి శాసనం
డి) బాదామి శాసనం
48. గ్రామంలో ఉండే అధికారిని గ్రామణి అని తెలిపే శాసనం ఏది?
ఎ) ప్రభువర్రు శాసనం
బి) ర్యాలీ శాసనం
సి) యనమదల శాసనం
డి) కొప్పరం శాసనం
49. అయ్యావళి వర్తక సంఘం ఏ ప్రాంతానికి చెందినది?
ఎ) రాయలసీమ బి) తెలంగాణ
సి) కర్ణాటక డి) తమిళనాడు
50. చాళుక్య శాసనాల్లో సగం తెలుగు సగం సంస్కృతంలో ఉన్న శాసనం ఏది?
ఎ) చేజర్ల బి) విప్పర్ల
సి) మాచర్ల డి) అత్తిలి
51. బర్మాలో దొరికిన చాళుక్య నాణేలు ఎవరివి?
ఎ) గుణగ విజయాదిత్యుడు
బి) శక్తివర్మ
సి) 7వ విజయాదిత్యుడు
డి) విమలాదిత్యుడు
52. తెలంగాణలో విష్ణుకుండినుల చరిత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలుగా నిలిచిన శాసనాలు లభ్యమైన ప్రదేశం ఏది?
ఎ) తుమ్మలగూడెం (నల్లగొండ జిల్లా)
బి) కీసర (రంగారెడ్డి జిల్లా)
సి) కోటి లింగాల (కరీంనగర్ జిల్లా)
డి) కొండాపురం (మెదక్ జిల్లా)
53. విష్ణుకుండినుల తొలి రాజధానిగా చరిత్రకారు లు భావిస్తున్న ప్రాంతం ఏది?
ఎ) ఇంద్రపురం బి) భట్టిప్రోలు
సి) విజయపురి డి) శ్రీ పర్వతం
54. విష్ణుకుండిన వంశ స్థాపకుడు?
ఎ) మొదటి ఇంద్రవర్మ
బి) దేవవర్మ
సి) మొదటి విక్రమేంద్ర వర్మ
డి) ఇంద్ర భట్టారక వర్మ
55. తుమ్మలగూడెం మొదటి శాసనం వేయించిన విష్ణుకుండిన రాజు ఎవరు?
ఎ) గోవింద వర్మ బి) ఇంద్ర వర్మ
సి) మొదటి మాధవ వర్మ
డి) మూడో మాధవ వర్మ
సమాధానాలు
1-ఎ 2-సి 3-బి 4-ఎ
5-డి 6-సి 7-డి 8-సి
9-బి 10-బి 11-సి 12-ఎ
13-సి 14-సి 15-ఎ 16-ఎ
17-డి 18-డి 19-ఎ 20-ఎ
21-డి 22-ఎ 23-బి 24-సి
25-డి 26-బి 27-సి 28-డి
29-బి 30-బి 31-డి 32-సి
33-ఎ 34-ఎ 35-ఎ 36-సి
37-బి 38-ఎ 39-సి 40-బి
41-ఎ 42-ఎ 43-ఎ 44-సి
45-ఎ 46-బి 47-ఎ 48-ఎ
49-సి 50-ఎ 51-బి 52-ఎ
53-ఎ 54-ఎ 55-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు