ఐఐటీల్లో పీజీ కోర్సులు !
జామ్-2023
దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదవాలనుకుంటున్న వారికి
అపూర్వ అవకాశం. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎస్సీల్లో పీజీ, పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ‘జామ్’-2023 ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా…
జామ్
– జాయింట్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్షను ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. 2004-05 నుంచి ఐఐటీలు జామ్‌ను నిర్వహిస్తున్నాయి.
– ఈ టెస్ట్ ద్వారా ఎమ్మెస్సీ (రెండేండ్లు), ఎమ్మెస్సీ (టెక్), ఎంఎస్ (రిసెర్చ్), ఎమ్మెస్సీ-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ ఇతర పోస్ట్-బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
– యూజీ లెవల్ సైన్స్ ఎడ్యుకేషన్‌కు జామ్ బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జమ్ము, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పట్నా, రూర్కీ, రోపర్, తిరుపతి, వారణాసి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.
నోట్: పై విద్యా సంస్థలతో పాటు నిట్, శివపూర్‌లోని ఐఐఈఎస్టీ, పంజాబ్‌లోని ఎస్‌ఎల్‌ఐఈటీ, ఐఐఎస్ఈఆర్ (ఐసర్)లు జామ్ స్కోర్ ఆధారంగా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్) ప్రవేశాలు కల్పిస్తాయి.
నోట్: జామ్ -2023ను ఐఐటీ గువాహటి నిర్వహిస్తుంది.
పరీక్ష విధానం
– ఏడు సబ్జెక్టుల్లో దీన్ని నిర్వహించనున్నారు. వీటిని టెస్ట్ పేపర్లుగా పిలుస్తారు. బయోటెక్నాలజీ (బీటీ), కెమిస్ట్రీ (సీవై), ఎకనామిక్స్ (ఈఎన్), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీహెచ్).
-జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు.
– పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ (ఎంఎస్క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
జామ్ ఎవరు రాయవచ్చు..?
-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం
-మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 11
పరీక్షతేదీ: 2023, ఫిబ్రవరి 12
ఫలితాల వెల్లడి: 2023, మార్చి 22
వెబ్సైట్: https://jam.iitg.ac.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- competitive exams
- IIT
- JAM
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు