అడ్డు వరుస పేక.. నిలువు వరుస పడుగు! రసాయన శాస్త్రం
దారాలు, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు
పత్తి, ఉన్ని, పట్టు, జనుము మొదలైన దారాలు మొక్కలు, జంతువుల నుంచి తయారవుతాయి. వీటిని సహజ దారాలు అంటారు.
– రసాయన పదార్థాలతో చేసిన దారాలను కృత్రిమ దారాలు అంటారు.
-ఆదిమానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలు, బెరళ్లను దుస్తులుగా ధరించేవారు.
-దుస్తుల నేతలో ఉపయోగించే దారాలు రెండు వరుసల్లో ఉంటాయి. నిలువు వరుసను ‘పడుగు’ అని అడ్డు వరుసను ‘పేక’ అని పిలుస్తారు.
– దారం చివర నలిపితే మరిన్ని సన్నని పీచులు కనిపిస్తాయి. వీటిని పీచు దారాలు లేదా దారపు పోగులు అంటారు.
– నూలు దారాలు పత్తి పీచు దారాలతో తయారవుతాయి.
– నీటిని పీల్చుకునే స్వభావం సహజదారాలకు ఎక్కువగాను, కృత్రిమ దారాలకు తక్కువగానూ ఉంటుంది.
-సాగే గుణం సహజ దారాలకు తక్కువ, కృత్రిమ దారాలకు ఎక్కువ.
– పట్టు వస్త్రాలు సహజ వస్త్రాలు వీటికి నునుపుగా జారే స్వభావం ఉంటుంది.
– నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి.
– కృత్రిమ వసా్త్రలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది.
సహజ దారాలు
పత్తి
-ఇది పత్తికాయల నుంచి లభిస్తుంది.
– పత్తిలోని సన్నని వెంట్రుకల వంటి వాటిని పత్తి పీచు దారాలు అంటారు.
-పత్తి దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని జిన్నింగ్ అంటారు.
-పత్తి దారాన్ని వడకడానికి తకిలి, చరఖా, రాట్నం ఉపయోగిస్తారు.
– దూది పీచు ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని స్పిన్నింగ్ అంటారు.
జనపనార
-జనుము దారాలను జనప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు.
– నానబెట్టడం ద్వారా కాండం మీద ఉన్న బెరడు చీకిపోతుంది. అలా మారిన దాన్ని వేరు చేస్తారు. దీన్నే జనపనార అంటారు.
– జనపనారను బంగారు దారం అని కూడా అంటారు.
-ఇది గట్టిగా గరుకుగా ఉంటుంది. గోనె సంచులు నేయడానికి ఉపయోగిస్తారు.
– గోంగూర, వెదురు మొక్కల నుంచి కూడా దారాలను నేస్తారు.
– విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మర మగ్గాలు అని, చేతితో నేయడానికి ఉపయోగపడే వాటిని చేనేత మగ్గాలు అంటారు.
– మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. చేనేత పరిశ్రమకు గద్వాల, సిరిసిల్ల, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి ప్రసిద్ధి చెందాయి.
-విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో జనపనార పరిశ్రమలు ఉన్నాయి.
– వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రసిద్ధి చెందాయి.
-కరగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలు తయారు చేస్తారు.
-పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు.
– ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు.
– మైక్రో ఫైబర్ (సూక్ష్మదారం)ను మొదట 1970లో మియోషి నొకయోటా తయారు చేశారు.
-ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీ వినైల్ క్లోరైడ్‌ను వాల్డ్ ఎల్. సీమన్ తయారు చేశారు.
-వర్షానికి తడవని బట్టలను తయారు చేసింది చార్లెస్ మెకింతోష్ (1823).
– ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వసా్త్రల తయారీకి గొరెల ఉన్ని ఉపయోగిస్తారు.
-వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ.
కృత్రిమ దారాలు
-ఇవి మానవ నిర్మిత దారాలు.
ఉదా: పాలిస్టర్, నైలాన్, ఆక్రలిత్ మొదలైనవి.
-వీటిని పెట్రోలియం ముడి పదార్థాల నుంచి తయారు చేస్తారు.
-కృత్రిమ దారాలను దుస్తుల తయారీకి, గృహోపకరణాల తయారీకి ఉపయోగిస్తారు.
-కృత్రిమ దారాల్లో చిన్న యూనిట్లను మోనోమర్లు అని, పెద్ద యూనిట్‌ను పాలిమర్ అని అంటారు.
-పాలీమర్ అంటే గ్రీకులో పాలి-ఎక్కువ, మెర్- భాగం అని అర్థం.
నైలాన్
-మొదట తయారు చేసిన కృత్రిమ దారం నైలాన్. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
-నేల బొగ్గు, నీరు, గాలి నుంచి తయారు చేశారు.
-ఈ మధ్యకాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులు నైలాన్ వాడుతున్నారు.
-నైలాన్ పాలిఎమైడ్‌లు అనే యూనిట్లతో తయారవుతుంది.
-పాలిఎమైడ్ అంటే హెక్సామిథిలిన్ మోనోమర్లు. ఇవి డయామిన్, అడిపిక్ యాసిడ్లతో తయారవుతాయి.
-నైలాన్ దారం బలంగా ఉండి, సాగే గుణాన్ని కలిగిన తేలికైన పదార్థం.
-నైలాన్‌తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగివుంటాయి.
-నైలాన్ నీటిని పీల్చుకోదు. స్థావర విద్యుత్‌ను నైలాన్ వస్త్రంపై సులభంగా సృష్టించవచ్చు.
-మంట అంటుకోగానే వెంటనే మండుతుంది.
-పళ్లు తోముకునే బ్రష్ కుంచె, తాళ్లు, చేపల వేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్లు, కాళ్లకు వేసుకునే చిన్న మేజోళ్లు (సాక్స్), సీట్ బెల్ట్‌లు, నిద్రకు ఉపకరించే సంచులు, తెరలు మొదలైనవి నైలాన్‌తో తయారు చేస్తారు.
– తివాచీల తయారీకి, పారాచూట్ల తయారీ, పర్వతారోహణకు ఉపయోగించే తాళ్ల తయారీకి, ఈత దుస్తులు, లోదుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే వస్త్రం, కారు టైర్లు మొదలైన వాటి తయారీకి నైలాన్‌ను ఉపయోగిస్తారు.
– నైలాన్ దారాన్ని అంతే మందం గల స్టీలు తీగతో పోల్చితే నైలాన్ కూడా అంతే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.
రేయాన్
– కాగితపు గుజ్జు రేయాన్ మొక్కల సెల్యూలోజ్ నుంచి తయారయ్యే ఒక కృత్రిమ దారం. దీన్ని సెల్యూలోజ్ దారం అని అంటారు.
-కృత్రిమ పట్టునే రేయాన్ అంటారు. 1911లో అమెరికాలో కృత్రిమ పట్టు ఉత్పత్తి మొదలైంది. దీనికి 1924లో రేయాన్ అని పేరుపెట్టారు.
-మన దేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీ 1946లో కేరళలో స్థాపించారు.
– రేయాన్ తయారీలో కర గుజ్జు నుంచి సెల్యూలోజ్ను మొదట సేకరించి NaOH, కార్బన్ డై సల్ఫైడ్ (CS2) కలుపుతారు. ఇది పానకంలా తయారవుతుంది. దీన్ని స్నిగ్ధస్థితి ద్రవం అంటారు.
-దీన్ని చిన్న రంధ్రాలు ఉండే జల్లెడ నుంచి H2SO4 ద్రావణంలోకి పంపి, వచ్చిన దారాలను సబ్బుతో కలుపుతారు.
-రేయాన్‌ను నూలుతో కలిపి దుప్పట్ల తయారీలో, ఉన్నితో కలిపి తివాచీ తయారీలో ఉపయోగిస్తారు.
– పిల్లల డైపర్లు, బ్యాండేజీ, గాయానికి కట్టుకట్టే నారపీచులో వాడుతారు.
-ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రమం (Blending) అంటారు.
అక్రలిక్
-దీన్ని కృత్రిమ ఉన్ని లేదా నకిలీ ఉన్ని అని పిలుస్తారు.
-ఇది వ్యాపారపరంగా 1941 నుంచి అందుబాటులోకి వచ్చింది.
-నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాళ్లను కలపడం ద్వారా తయారు చేస్తారు.
– దీన్ని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పురిపెడతారు.
-ఆక్రలిక్ను ఉన్నితో చేసే వస్తువులు, కాళ్లకు వేసుకునే మేజోళ్లు (సాక్స్), క్రీడా వస్తువులు, స్వెటర్లు, దారంతో అల్లే దుస్తులు, తివాచీలు, ప్రయాణ సామగ్రి, అల్లికలకు వాడే దారాలు, వాహనాల కవర్లలో వాడుతారు.
-కృత్రిమ దారాలకు తక్కువ నీటిని శోషించడం, వేగంగా పొడిబారే లక్షణాలు ఉంటాయి.
పాలిస్టర్లు
– పాలిస్టర్ అనేది సాధారణంగా వాడే కృత్రిమ దారం.
-టెర్లిన్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్. ఇది సహజ దారాలతో బాగా మిశ్రణం చెందుతుంది.
-టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందించి టెరికాట్, ఉన్నితో మిశ్రణం చెందించి టెలిఊల్ను తరచూ తయారు చేస్తారు.
-టెర్లిన్ నైలాన్లా సులభంగా మంటకు అంటుకుంటుంది.
– డై మిథైల్ ఈథర్, టెరిఫ్లారిక్తో ఆమ్లం చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని డై హైడ్రిక్ ఆల్కహాల్‌తో చర్య జరిపించి పాలిస్టర్‌ను తయారుచేస్తారు.
– పాలిస్టర్లను వసా్త్రల తయారీకే కాకుండా సోడా సీసాల నుంచి పడవల వరకు అనేక ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
– PET అనేది అందరికి తెలిసిన ఒక పాలిస్టర్. దీన్ని ఉపయోగించి సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్‌లు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను తయారుచేస్తారు.
1. PET: పాలి ఇథిలిన్ టెరిఫ్తాలేట్
2. HDPE: అధిక సాంద్రత గల పాలి ఇథిలిన్
3. PVC: పాలి వినైల్ క్లోరైడ్ (వినైల్)
4. LDPE: అల్పసాంద్రత గల పాలి ఇథిలిన్
5. PP : పాలిప్రొపిలిన్
6. PS: పాలిస్టెరిన్
PET సీసాల్లో శీతల పానియాలను ఉంచుతారు. కారణం సీతల పానియాలు కార్బనామ్లికృతం కాకుండా ఉండటానికి.
ప్లాస్టిక్
– కృత్రిమ దారాలలా ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్.
-ప్లాస్టిక్‌లలో మోనోమర్లు రేఖీయంగా పొడవాటి గొలుసులుగాను, అడ్డంగా అనుసంధానించి ఉంటాయి.
-అలెగ్జాండర్ పార్క్ పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్‌ను 1862లో లండన్‌లో సృష్టించాడు.
-పార్కెసిన్ తయారీకి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని HNO3తో వేడి చేశారు. దీనికి నూనె, కర్పూరాన్ని ఉపయోగించాడు.
– వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్‌ను థర్మోప్లాస్టిక్ అంటారు.
ఉదా: పాలిథిన్, పీవీసీ (పాలి వినైల్ క్లోరైడ్)
-ఒకసారి మలిచిన తర్వాత వేడిచేయడం ద్వారా మృదువుగా మార్చలేని ప్లాస్టిక్‌లను థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
ఉదా: బెకలైట్, మెలమైన్
ప్రాక్టీస్ బిట్స్
1. సంశ్లేషిత దారాలను ఏమని పిలుస్తారు? (3)
1) కృత్రిమ దారాలు 2) మానవ నిర్మితాలు
3) పై రెండూ 4) ఏదీ కాదు
2. కృత్రిమ దారాలను తయారుచేసే ముడి పదార్థాలు ఏవి? (4)
1) పెట్రోలియం 2) బొగ్గు
3) నీరు 4) పైవన్నీ
3. చెక్క గుజ్జును ఉపయోగించి తయారుచేసే దారం ఏది? (1)
1) రేయాన్ 2) నైలాన్
3) పాలిస్టర్ 4) ఆక్రలిక్
4. పారాచూట్ల తాళ్ల తయారీలో ఉపయోగించే దారాలు? (2)
1) రేయాన్ 2) నైలాన్
3) పాలిస్టర్ 4) ఆక్రలిక్
5. నాన్‌స్టిక్ వంట పాత్రలను దేనితో తయారుచేస్తారు? (3)
1) నైలాన్ 2) రేయాన్
3) టెప్లాన్ 4) ఆక్రలిక్
6. ఏ దారాలతో తయారుచేసిన వస్త్రాలు తొందరగా ముడతపడవు? (4)
1) నూలు 2) ఉన్ని
3) పట్టు 4) ఆక్రలిక్
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు