ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేయాలని కోరుతూ వేసే పిటిషన్?
32. 1999లో 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కొలీజియం’కు సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాన్ని గుర్తించండి?
1. కొలీజియం అంటే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తితో పాటు మరో నలుగురు న్యాయమూర్తుల మండలి
2. రాష్ట్రపతి కొలీజియంను తప్పనిసరిగా సంప్రదించాలి
3. రాష్ట్రపతి కొలీజియం ఇచ్చిన సలహాను తప్పనిసరిగా పాటించాలి
4. కొలీజీయం అంటే 8 మంది న్యాయమూర్తులతో కూడిన మండలి
ఎ) ఎ, బి, సి బి) ఎ, బి, డి
సి) ఎ, సి, డి డి) బి, సి, డి
33. న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీని ఏర్పాటు చేసేందుకు మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది?
ఎ) 118వ రాజ్యాంగ సవరణ బిల్లు
బి) 119వ రాజ్యాంగ సవరణ బిల్లు
సి) 120వ రాజ్యాంగ సవరణ బిల్లు
డి) 115 వ రాజ్యాంగ సవరణ బిల్లు
34. మోదీ ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకం కోసం 121వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినది?
ఎ) జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్
బి) నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్
సి) జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్
డి) జడ్జెస్ నామినేషన్ కమిషన్
35. మోదీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారాNJAC ని ఏర్పాటు చేసింది?
ఎ) 99వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 119 రాజ్యాంగ సవరణ చట్టం
సి) 121 రాజ్యాంగ సవరణ చట్టం
డి) 122 రాజ్యాంగ సవరణ చట్టం
36. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో NJAC ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పును ఇచ్చింది?
ఎ) 2014 డిసెంబర్ 26
బి) 2015 ఏప్రిల్ 13
సి) 2015 అక్టోబర్ 16
డి) 2016 జనవరి 19
37. 1973లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు జేఎమ్ షేలట్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డేలను కాదని సీనియార్టిలో 4వ స్థానంలో ఉన్న ఎవరిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు?
ఎ) కేఎన్ సింగ్ బి) ఏఎన్రే
సి) పీసీ ఘోష్ డి) డీకే చటర్జీ
38.1977లో సీనియర్‌గా ఉన్న H.R ఖన్నాను కాదని జూనియర్ అయిన ఎవరిని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమించారు?
ఎ) ఎమ్హెచ్ బేగ్ బి) జేఎస్ వర్మ
సి) ఏఎస్ ఆనంద్ డి) ఎమ్ఎన్ మిశ్రా
39. కింది అంశాల్లో సరైనది గుర్తించండి?
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం వ్యవహరించినది- వైవీ చంద్రచూడ్
2. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా తక్కువ కాలం వ్యవహరించినది- కేఎన్ సింగ్
3. సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధానన్యాయమూర్తి-కేజీ బాలకృష్ణన్
4. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి- మీరాసాహెబ్ ఫాతిమా బీబీ
ఎ) ఎ, బి, డి బి) ఎ, బి, సి
సి) ఎ, బి, సి, డి డి) బి, సి, డి
40. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామాను ఎవరికి సమర్పించాలి?
ఎ) ప్రధాన న్యాయమూర్తి
బి) రాష్ట్రపతి
సి) అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా
డి) కేంద్రమంత్రి మండలి
41. ఆర్టికల్ 127 ప్రకారం సుప్రీంకోర్టులో నియమంచబడే న్యాయమూర్తుల పదవీకాలాన్ని గుర్తించండి?
ఎ) 6నెలలు బి) 12 నెలలు
సి) 2 సంవత్సరాలు డి) 3 సంవత్సరాలు
42. సుప్రీంకోర్టు ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’ కు సంబంధించి సరైన జవాబు గుర్తించండి?
1. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్డు గురించి వివరిస్తుంది
2. సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు
3. కోర్ట్ ఆఫ్ రికార్డ్ దేశంలోని అన్ని న్యాయస్థానాలకు శిరోధార్యం
4. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ధిక్కరణను కోర్టుధిక్కరణ నేరంగా పరిగణిస్తారు
ఎ) ఎ, బి, సి బి) ఎ, సి, డి
సి) ఎ, బి, సి, డి డి) ఎ, బి, డి
43. ‘కోర్ట్ ఆఫ్ రికార్డ్’ను ఏ విధంగా పేర్కొంటారు?
ఎ) అనుపూర్వికాలు బి) న్యాయసమీక్ష
సి) సంప్రదింపు అధికార పరిధి డి) రిట్స్
44. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను ఏ అంశంపై పొందవచ్చు?
ఎ. రాజ్యాంగ పరమైన ధర్మసందేహాలు ఎదురైనప్పుడు
బి. శాసన సంబంధమైన అంశాల విషయంలో
సి. పరిపాలన సంబంధమైన అంశాల విషయంలో
ఎ) ఎ, సి బి) ఎ, బి
సి) బి, సి డి) ఎ, బి, సి
45. 1951లో నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 143 ప్రకారం ఏ అంశంపై సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందారు?
ఎ) ఢిల్లీ పరిపాలక చట్టాలు
బి) పంజాబ్ నదీ జలాల ఒప్పందం
సి) అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు
డి) హిందూ కోడ్ బిల్లు
46. 1958లో నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 143 ప్రకారం ఏ అంశంపై సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందారు?
ఎ) ప్రత్యేక కోర్టుల చట్టం
బి) రాష్ట్రపతి ఎన్నికలు
సి) కేరళ విద్యాబిల్లు
డి) అంతరాష్ట్ర నదీజలాలు
47. సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1. ఆర్టికల్ 137- తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేయగలదు
2. ఆర్టికల్ 141- దిగువ న్యాయస్థానాలపై నియంత్రణ కలిగి ఉంటుంది
3. ఆర్టికల్ 138- సుప్రీంకోర్టు అధికార పరిధిని పార్లమెంటు విస్తరించవచ్చు
4. ఆర్టికల్ 147- భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది
ఎ) ఎ, బి, సి బి) ఎ, సి, డి
సి) ఎ, బి, డి డి) ఎ, బి, సి, డి
48. సుప్రీంకోర్టు ఏదైనా కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేయాలని కోరుతూ వేసే పిటిషన్‌ను ఏమంటారు?
ఎ) ప్లీ బార్గెయిన్ పిటిషన్
బి) క్యూరేటివ్ పిటిషన్
సి) ఇంట్రావర్స్ పిటిషన్
డి) అల్ట్రావర్స్ పిటిషన్
49. 1803వ సంవత్సరంలో అమెరికా సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా మొదటిసారిగా న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించింది?
ఎ) మార్చురిVs మాడిసన్ కేసు
బి) మార్షల్ Vs మాడిసన్ కేసు
సి) మార్చురి Vs మార్షల్ కేసు
డి) సెయింట్ జాన్ Vs మార్షల్ కేసు
50. వివిధ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ నేరాన్ని ఒప్పుకోవడం, న్యాయవిచారణకు సహకరించడం ద్వారా శిక్షను తగ్గించుకోవడానికి విచారణాధికారి కల్పించే అవకాశాన్ని ఏమంటారు?
ఎ) రెమిసన్ ఆఫ్ సెంటెన్స్
బి) ప్లీ బార్గెయిన్
సి) సివిటాస్ అమిస్
డి) రిడక్షన్ ఆఫ్ సెంటెన్స్
51. సుప్రీంకోర్టు 1951లో ఏ కేసు సందర్భంగా తొలిసారిగా ‘న్యాయ సమీక్షాధికారాన్ని’ వినియోగించింది?
ఎ) సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
బి) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) నీలం సాహ్ని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
52. న్యాయ సమీక్షాధికారం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పుచెప్పింది?
ఎ) బెరుబారి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) షంషేర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
సి) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) కామేశ్వరీ సింగ్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు
53. ఇందీరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల ‘న్యాయ సమీక్షాధికారం’ పై పరిమితులు విధించినది?
ఎ) 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1969
బి) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
డి) 49వ రాజ్యాంగ సవరణ చట్టం 1982
54. మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల న్యాయ సమీక్షాధికార్ని పునరుద్ధరించినది?
ఎ) 43 రాజ్యాంగ సవరణ చట్టం 1977
బి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
సి) 45వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
డి) 46వ రాజ్యాంగ సవరణ చట్టం 1979
55. సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు అవకాశం ఉన్న అంశాన్ని గుర్తించండి?
1. ఆర్టికల్ 13- ప్రాథమిక వ్యతిరేకంగా ఉండే శాసనాలు చెల్లవని ప్రకటించింది
2. ఆర్టికల్ 73- కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాలు
3. ఆర్టికల్ 162- రాష్ట్రప్రభుత్వ అధికార పరిధి విషయంలో తలెత్తే వివాదాలు
4. ఆర్టికల్ 132- రాజ్యాంగబద్ధమైన అప్పీళ్లను విచారించే అధికారం
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
56. సుప్రీంకోర్టుకు ‘న్యాయ సమీక్షకు’ అవకాశం గల అంశాన్ని గుర్తించండి?
1. ఆర్టికల్ 248- అవశిష్ట అధికారాలను నిర్ణయించడం
2. ఆర్టికల్ 254- ఉమ్మడి జాబితాలో గల అంశాలు
3. ఆర్టికల్ 368- రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు
4. ఆర్టికల్ 82- లోక్‌సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
57. సుప్రీంకోర్టు ‘న్యాయసమీక్షకు’ అవకాశం లేని అంశాన్ని గుర్తించండి?
1. ఆర్టికల్ 53- దేశపరిపాలనాధికారాలు మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం
2. ఆర్టికల్ 74 (1)- కేంద్రమంత్రి మండలి కి రాష్ట్రపతి అందించే సలహా
3. ఆర్టికల్ 356- రాష్ట్రాల్లో విధించబడే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
4. ఆర్టికల్ 77 (2)- రాష్ట్రపతి పేరుమీదుగా దేశపాలనను నిర్వహించడం
ఎ) 1, 2, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
58. OBC వర్గాల వారికి కేంద్రం కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమేనని, సంక్షేమ స్వభావం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పును వెలువరించినది?
ఎ) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) ఇందిరా సహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) I R కొల్హాయ్ Vs స్టేట్ బ్యాంక్ ఆఫ్ తమిళనాడు కేసు
డి) S R బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
59. 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించిన ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది?
ఎ) ఆర్సీ కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) ఏకే గోపాలన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) పీఎంకే మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సమాధానాలు
32-ఎ, 33-సి, 34-బి, 35-ఎ, 36-సి, 37-బి, 38-ఎ, 39-సి, 40-బి, 41-సి, 42-సి, 43-ఎ, 44-డి, 45-ఎ, 46-సి, 47-డి,
48-బి, 49-ఎ, 50-బి, 51-డి, 52-సి, 53-సి, 54-ఎ, 55-డి, 56-డి, 57-ఎ, 58-బి, 59-ఎ
సత్యనారాయణ
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు