పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
గత తరువాయి..
142. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. సీలెంటిరేటా జీవులు ద్విస్తరిత జీవులు
బి. ప్లాటీహెల్మెంథిస్ నుంచి కార్డేటా వర్గం
వరకు అన్ని జీవులు త్రిస్తరిత జీవులు
సి. ప్లాటీహెల్మెంథిస్ నుంచి కార్డేటా వర్గం
వరకు అన్ని జీవులు ద్విస్తరిత జీవులు
డి. సీలెంటిరేటా జీవులు త్రిస్తరిత జీవులు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి సరైనవి 2) సి, డి సరైనవి
3) బి, సి సరైనవి 4) ఎ, డి సరైనవి
143. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. లేయర్ కోళ్లు ఏడాదికి దాదాపు 280
గుడ్లు పెడుతాయి
బి. నాటుకోళ్లు ఏడాదికి దాదాపు 50-60
గుడ్లు పెడుతాయి
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ సరైనది 2) ఎ, బి రెండూ సరైనవి
3) బి సరైనది 4) ఎ, బి రెండూ సరికావు
144. హమ్మింగ్ బర్డ్‌కు సంబంధించి కింది వాక్యా లను పరిశీలించండి.
ఎ. ఇది అతిచిన్న పక్షి
బి. అతిచిన్న గుడ్లు పెడుతుంది
సి. ఇది ముందుకు, వెనుకకు ఎగురుతుంది
డి. ఇది క్యూబా దేశపు పక్షి
ఇ. దీని రెక్కల నీడ కనిపించదు
పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి, ఇ
145. ఆస్ట్రిచ్/నిప్పుకోడికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఇది అతిపెద్ద పక్షి
బి. దీని గుడ్డు జంతురాజ్యంలో అతిపెద్దది
సి. దీనిని ఒంటెపక్షి అంటారు
డి. ఇది అతివేగంగా పరిగెత్తే పక్షి
ఇ. ఇది నీటిని, పాలను వేరుచేస్తుంది
పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఎ, బి, సి, డి, ఇ 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
146. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చేపలను పట్టడానికి వాడే పడవలను ఫిషింగ్ గేర్లు అంటారు
బి. చేపలను పట్టడానికి వాడే వలలను ఫిషింగ్ క్రాఫ్ట్ లు అంటారు
సి. చేపలు మంచినీటి నుంచి సముద్ర నీటిలోకి వలస పోవడాన్ని కెటడ్రోమస్ వలస అంటారు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) బి సరైనది 4) సి సరైనది
147. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చేపలను కృత్రిమంగా ప్రజననం చెందించ డానికి పీయూషగ్రంథి నుంచి సంగ్రహిం చిన గొనడోట్రోపిన్ (FSH, LH) గల ద్రావణం, ఓవాప్రిమ్ను వాడుతారు
బి. భారతదేశపు అతిపెద్ద ఫిషరీ – కేరళ తీరం లోని ఆయిల్ సార్డెన్లు
సి. కట్లకట్ల (కట్ల), లేబియో రోహిటా (రోహూ)లు భారతదేశపు కార్ప్ చేపలు
డి. ఎక్సోసీటస్ (ఎగిరేచేప), హిప్పోకాంపస్ (సముద్ర గురం)లు మంచినీటి చేపలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి 4) సి, డి
148. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ముళ్లవంటి చర్మంగల జంతువులు మొలస్కాలు
బి. మెత్తటి శరీరాన్ని కలిగిన జంతువులు మొలస్కాలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఎ, బి రెండూ కావు
149. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. మొలస్కాలోని గ్యాస్ట్రోపొడా జీవుల్లో మెలిక (టార్షన్) కనబడుతుంది
బి. మొలస్కాలోని గ్యాస్ట్రోపొడా జీవుల నుంచే ముత్యాలు ఉత్పత్తి అవుతాయి
సి. ముత్యాలను ఉత్పత్తిచేసే జీవి – పింక్టాడా వల్గారిస్
డి. మొలస్కా జీవుల కర్పరాల గురించిన అధ్యయనాన్ని కార్సినాలజీ అంటారు
పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
150. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. యూజీ ఈగలు పట్టు పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తాయి
బి. చీమలు పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు
సి. ఒక కేజీ పట్టు ఉత్పత్తికి సుమారు 1000 పట్టుగూళ్లు అవసరం
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి సరైనవి 2) ఎ, సి సరైనవి
3) బి, సి సరైనవి 4) సి సరైనది
151. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. దేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం లో ఉన్న రాష్ట్రం – కర్ణాటక
బి. పట్టు కాయలను రీలింగ్ అంటారు
1) ఎ సరైనది 2) ఎ, బి సరైనవి
3) బి సరైనది 4) ఏదీ సరికాదు
152. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. కీటకాలలో మూడు జతల కాళ్లు, రెండు జతల రెక్కలు ఉంటాయి.
బి. జంతుశాస్త్రంలో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా (కీటకాలు)
సి. కీటకాల శ్వాస అవయవాలు – మాల్ఫీ జియన్ నాళికలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, సి సరైనవి 2) బి, సి సరైనవి
3) ఎ, బి సరైనవి 4) సి సరైనది
153. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం ఆర్థోపొడా
బి. వైద్యరంగంలో జలగలను ఉపయోగించి చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియను ప్లిబో టమీ అంటారు
సి. కీళ్లు/అతుకులుగల కాళ్లు కలిగిన జీవులను అనెలిడాలు అంటారు
డి. జలగ శాస్త్రీయనామం పెరిప్లానేటా
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) సి, డి సరైనవి 2) ఎ, డి సరైనవి
3) బి, సి సరైనవి 4) ఎ, బి సరైనవి
154. ఇన్సెక్టా విభాగానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఉరములో 3 ఖండితాలు ఉంటాయి
బి. వాయునాళాలు శ్వాస అవయవాలు
సి. మూడు జతల కాళ్లు ఉంటాయి
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) పైవన్నీ సరైనవే 2) ఎ సరైనది
3) బి సరైనది 4) సి సరైనది
155. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): సకశేరుకాల్లోని ఇతర జంతువుల మెదడు కంటే క్షీరదాల మెదడు పెద్దదిగా ఉంటుంది.
కారణం (R): క్షీరదాల్లో దృష్టి లంబికలు నాలుగు ఉంటాయి. మిగిలిన సకశేరుకాల్లో రెండు మాత్రమే ఉంటాయి.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు
(R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
156. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): ఉభయచరాలు నేలమీద నివసించిన మొట్టమొదటి వర్టిబ్రేట్లు అయినప్పటికీ వీటి అభివృద్ధి మాత్రం నీటి ఆవాసంలో జరుగుతుంది.
కారణం (R): ఉభయచరాలు ఉల్బరహిత, కర్పర రహిత గుడ్లను విడుదల చేస్తాయి. ఇవి నేలపై మనలేవు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు
(R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
157. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): సకశేరుకాలన్నీ కార్డేట్లు, కానీ అన్ని కార్డేట్లు వర్టిబ్రేట్లు కావు.
కారణం (R): ప్రాథమిక కార్డేట్లు అంటే యూరోకార్డేట్లు, సెఫలోకార్డేట్లలో వెన్నెముక, ద్వంద్వ ఉపాంగాలు ఉండవు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు
(R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
158. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): గ్యాస్ట్రోపొడా జీవులు సౌష్ఠవరహిత మొలస్కా జీవులు.
కారణం (R): ఇవి పిండాభివృద్ధిలో మెలికను ప్రదర్శిస్తాయి.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు
(R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
159. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): ఆర్థోపొడా జీవుల్లో అంతర ఫలదీకరణ జరుగుతుంది.
కారణం (R): అన్ని ఆర్థోపొడ్లు అండో
త్పాదకాలు.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు
(R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు
(R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
160. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.
నిశ్చితం (A): లిమ్యులస్ సజీవ శిలాజం.
కారణం (R): కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి లిమ్యులస్ ఏ విధమైన మార్పు లేకుండా ఉంది.
1) (A), (R) రెండూ సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి కానీ, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైనది కానీ, (R) సరైనది కాదు
4) (A) సరైనది కాదు కానీ, (R) సరైనది
161. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. చేపల గురించిన అధ్యయనం – ఇక్తియాలజీ
బి. పక్షుల గురించిన అధ్యయనం – ఆర్నిథాలజీ
సి. క్షీరదాల గురించిన అధ్యయనం – మమ్మాలజీ
డి. సరీసృపాల అధ్యయనం – హెర్పటాలజీ
1) ఎ, డి 2) సి, డి
3) డి 4) ఏదీకాదు
162. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఎపికల్చర్ 1. తేనెటీగల పెంపకం
బి. సెరికల్చర్ 2. చేపల పెంపకం
సి. పిసికల్చర్ 3. పట్టుపురుగుల పెంపకం
డి. ఆక్వాకల్చర్ 4. జలజీవుల పెంపకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-4, డి-3
163. కింది వాటిని జతపర్చండి.
ఎ. అరిస్టాటిల్ 1. ఫాదర్ ఆఫ్ పొలి టికల్ సైన్స్
బి. థియోఫ్రాస్టస్ 2. ఫాదర్ ఆఫ్ బోటనీ
సి. ధన్వంతరి 3. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద
డి. హిప్పోక్రాట్స్ 4. ఫాదర్ ఆఫ్ మెడిసిన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
164. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. స్థూల పోషకాలు – కార్బన్, హైడ్రోజన్,
ఆక్సిజన్, నైట్రోజన్, పాస్ఫరస్, పొటా
షియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్
బి. సూక్ష్మ పోషకాలు – ఇనుము, మాంగ
నీసు, బోరాన్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
165. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఆక్సాలోఫైట్లు
1. ఉప్పునీటిలో పెరిగే మొక్కలు
బి. హాలోఫైట్లు 2. నీటిలో పెరిగే మొక్కలు
సి. హైడ్రోఫైట్‌లు
3. ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు
డి. జీరోఫైట్‌లు
4. ఎడారుల్లో పెరిగే మొక్కలు
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
166. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. క్వినైన్ – సింకోనా అఫిసినాలిస్ అనే
మొక్క బెరడు నుంచి లభిస్తుంది
బి. నికోటిన్ – నికోటియానా టొబాకమ్
(పొగాకు) పత్రాల నుంచి లభిస్తుంది
సి. మార్ఫిన్ – నల్లమందు మొక్క కాయల
నుంచి లభిస్తుంది
డి. నింబిన్ – వేప చెట్టు వేర్ల నుంచి లభిస్తుంది
1) ఎ 2) బి 3) డి 4) డి
167. శ్వాసక్రియకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. శ్వాసక్రియ అన్ని సజీవుల్లో జరుగుతుంది
బి. కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
సి. జీవి బరువును తగ్గిస్తుంది
డి. ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది
1) ఎ 2) బి 3) సి 4) డి
168. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఎ. ఇది పత్రహరితం ఉన్న అన్ని మొక్కల్లో
జరుగుతుంది
బి. దీనిలో కాంతిశక్తి బంధించబడుతుంది
సి. ఇది పగటిపూట మాత్రమే జరిగే నిర్మాణ క్రియ
డి. హరితరేణువుల్లో జరుగుతుంది
1) బి 2) బి, సి
3) డి 4) ఏదీకాదు
169. కింది రసాయన పదార్థాలు, వాటి ఉపయోగాలను జతపర్చండి.
ఎ. టానిన్లు 1. రబ్బరు తయారీ
బి. రెసిన్లు 2. పుస్తకాల బైండింగ్
సి. జిగుర్లు 3. వార్నిష్‌ల తయారీ
డి. లేటెక్స్ 4. తోళ్ల శుద్ధి, ఔషధాల తయారీ
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
జవాబులు
142-1, 143-2, 144-4, 145-2, 146-4, 147-1, 148-3, 149-2, 150-1, 151-1, 152-3, 153-4, 154-1, 155-2, 156-1, 157-1, 158-1, 159-2, 160-1, 161-4, 162-2, 163-1, 164-3, 165-2, 166-4, 167-2, 168-4, 169-1.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు