ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు
1. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) వీటి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి.
2) వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉన్నది
3) ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉంటాయి.
4) వీటిని నిర్ధేశిక నియమాలు అని కూడా అంటారు
ఎ) 1, 2, 4 సరైనవి బి) 1, 2, 3 సరైనవి
సి) 1,3,4 సరైనవి డి) 1, 2, 3 సరైనవి
2. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వివరణ ఎక్కడ గలదు?
ఎ) 4వ భాగం, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు
బి) 4(A) భాగం ఆర్టికల్ 36 నుంచి 51 వరకు
సి) 5వ భాగం, ఆర్టికల్ 37 నుంచి 50 వరకు
డి) 5(A) భాగం ఆర్టికల్ 38 నుంచి 52 వరకు
3. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) సంక్షేమ రాజ్య స్థాపనకు తోడ్పడతాయి
2) క్రీ.శ.18వ శతాబ్దిలో స్కాండినేవియన్ దేశాల్లో వీటిని తొలిసారిగా అమలు చేశారు
3) 1937లో స్పెయిన్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ గ్రహించింది
4) ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ లేదు
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 3, 4 సరైనవి
సి) 1, 2, 3, 4 సరైనవి
డి) 2, 3, 4 సరైనవి
4. స్పెయిన్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను కింది విధంగా పేర్కొన్నారు?
ఎ) Instruments of Social Policy
బి) Directive Principles of Social Justice
సి) Instructions of Social welfare
డి) Policy of welfare Theory
5. రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనాన్ని ప్రసాదించడానికి ఏర్పడింది. అందుకోసమే అది కొనసాగుతుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) ఉడ్రోవిల్సన్ బి) రూస్కోపౌండ్
సి) జార్జి బెంథామ్ డి) అరిస్టాటిల్
6. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఆదేశిక సూత్రాలను కింది విధంగా పేర్కొన్నారు?
ఎ) Instructions of Welfare
బి) Instruments of Instructions
సి) Innovative Principles
డి) Directive Principles of welfare
7. ఆదేశిక సూత్రాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి – డా.బి.ఆర్ అంబేద్కర్
2) నూతన సంవత్సర తీర్మానాలు – నసీరుద్దీన్ మహ్మద్
3) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలు – ఎం.సి. సెతల్వాడ్
4) బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి ఇచ్చే చెక్కు వంటివి- కె.టి. షా
ఎ) 1, 2, 3,4 సరైనవి బి) 1, 2, 3 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి. 2, 3, 4 సరైనవి
8. ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఐర్లాండ్ నుంచి స్ఫూర్తి పొందిన రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు.
ఎ) సర్తేజ్ బహదూర్ సప్రూ
బి) ప్రొమధ్ రంజన్ ఠాగూర్
సి) అనంతశయనం అయ్యంగార్
డి) ఎం.సి. చాగ్లా
9. ఎం.పి. శర్మ వర్గీకరించిన ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) సామ్యవాద నియమాలు
– ఆర్టికల్స్ 38, 39, 41, 42, 43
2) గాంధేయవాద నియమాలు
– ఆర్టికల్స్ 40, 46, 47,48,49
3) ఆదర్శవాద నియమాలు
– ఆర్టికల్స్ 41, 43, 44, 47
4) ఉదారవాద నియమాలు
– ఆర్టికల్స్ 44, 45, 50, 51
ఎ) 1, 2, 3 సరైనవి
బి) 1, 2, 3, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి. 1, 2, 4 సరైనవి
10. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ‘ఉచిత న్యాయసహాయాన్ని’ అందించాలని ఆదేశిక సూత్రాలలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 38(A) బి) ఆర్టికల్ 39(A)
సి) ఆర్టికల్ 41(B) డి) ఆర్టికల్ 42(A)
11. ఆదేశిక సూత్రాలలోని వివిధ ఆర్టికల్స్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 37 – ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల రక్షణలేదు
బి) ఆర్టికల్ 38 – పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి
సి) ఆర్టికల్ 39 – జాతీయ సంపదను వికేంద్రీకరించాలి
డి) ఆర్టికల్ 40 – వన్యప్రాణులను సంరక్షించడానికి కృషిజరగాలి.
12. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39లో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లోని మౌలిక అంశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 39(a) i) దేశ సమగ్రాభివృద్ధి
కోసం వనరుల వినియోగం
బి) ఆర్టికల్ 39(b) ii) స్త్రీ, పురుషులకు
సమానపనికి సమానవేతనం చెల్లించాలి
సి) ఆర్టికల్ 39(c)
iii) దేశ ప్రజలందరికీ తగిన
జీవన సదుపాయాల కల్పన
డి) ఆర్టికల్ 39(d) iv) సంపద కేంద్రీ కరణను నియంత్రించాలి
ఎ) ఎ-iii, బి-i, సి-iv, డి-ii
బి) ఎ-ii, బి-i, సి-iv, డి-iii
సి) ఎ-i, బి-iii, సి-iv, డి-ii
డి) ఎ-iii, బి-i, సి-ii, డి-iv
13. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
బి) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
సి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
డి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
14. బాలలు స్వేచ్చాయుత, గౌరవ ప్రదమైన వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని, బాలబాలికలు ఎలాంటి పీడనానికి గురికాకుండా చర్యలు చేపట్టాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్ధేశిస్తుంది?
ఎ) ఆర్టికల్ 39(e) బి) ఆర్టికల్ 39(f)
సి) ఆర్టికల్ 39(g) డి) ఆర్టికల్ 39(h)
15. కింద పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 40 i) కార్మికులకు న్యాయమైన పనిగంటలు కల్పించాలి
బి) ఆర్టికల్ 41 ii) వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ సదుపాయాలు
సి) ఆర్టికల్ 42 iii) గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలి
డి) ఆర్టికల్ 43 iv) చిన్నతరహా, కుటీర పరిశ్రమలను నెలకొల్పాలి
ఎ) ఎ-iii, బి-iv, సి-i, డి-ii బి) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
సి) ఎ-iii, బి-ii, సి-i, డి-iv డి) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
16. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 44 i) మద్యపానం, మత్తుమందుల నిషేధం
బి) ఆర్టికల్ 46 ii) ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి
సి) ఆర్టికల్ 47 iii) గోవధను నిషేధించాలి
డి) ఆర్టికల్ 48 iv) విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలి.
ఎ) ఎ-ii, బి-iv, సి-i, డి-iii బి) ఎ-ii, బి-iv, సి-iii, డి-i
సి) ఎ-iii, బి-iv, సి-i, డి-ii డి) ఎ-iii, బి-i, సి-ii, డి-iv
17. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని పేర్కొంటున్న ఆర్టికల్ 43(A)ను ఏ రాజ్యంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978
బి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం -1976
సి) 52వ రాజ్యాంగ సవరణ చట్టం – 1985
డి) 60వ రాజ్యాంగ సవరణ చట్టం – 1988
18. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్‌కు సంబంధించి సరికాని జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 49 – పురాతన కట్టడాలు, శిల్పసంపద, సంస్కృతి, పరిరక్షణ
బి) ఆర్టికల్ 50 – కార్య నిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి
సి) ఆర్టికల్ 51 – ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి
డి) ఆర్టికల్ 52- భారతీయులందరూ సౌభ్రాతృత్వంతో వ్యవహరించాలి
19. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కాదని, అవి రెండూ భారత ప్రజాస్వామ్యం అనే బండికి రెండు రథచక్రాల వంటివి అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు
3) కేశవానందభారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
4) సజ్జన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
20. వివిధ చట్టాలు వాటిని రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) జాతీయ పురాతన కట్టడాల శిల్పసంపద పరిరక్షణ చట్టం i) 1957
బి) వృద్ధాప్య పెన్షన్ చట్టం ii) 1958
సి) సంపదపై పన్ను చట్టం iii) 1961
డి) ఆదాయపు పన్ను చట్టం iv) 1995
ఎ) ఎ-ii, బి-iv, సి-iii, డి-i
బి) ఎ-iii, బి-i, సి-ii, డి-iv
సి) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
డి) ఎ-iv, బి-ii, సి-i, డి-iii
21. వివిధ చట్టాలు అవి రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) బమతిపై పన్ను చట్టం i) 1978
బి) ప్రసూతి సెలవుల చట్టం ii) 1958
సి) జాతీయ ఆహార భద్రతా చట్టం
iii) 1961
డి) సమగ్ర గ్రామీణ అభివృద్ధి చట్టం
iv) 2009
ఎ) ఎ-iii, బి-i, సి-iv, డి-ii
బి) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
సి) ఎ-ii, బి-iii, సి-i, డి-iv
డి) ఎ-iii, బి-ii, సి-iv, డి-i
22. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి?
ఎ) 6సంవత్సరాల్లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య
బి) మహిళలకు కనీస వేతనం అమలు
సి) బలహీన వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాలు
డి) గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు
23. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి?
1) ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం -గోవా
2) 2010లో జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించినది- ఏనుగు
2) 2009లో జాతీయ జలచరంగా గుర్తించినది- డాల్ఫిన్
4) 2012లో ఆకాశ గంగగా గుర్తించినది – నర్మద
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 3, 4 సరైనవి
సి) 1, 2, 4 సరైనవి
డి) 1, 2, 3, 4 సరైనవి
24. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) వన్యప్రాణి సంరక్షణ చట్టం i) 1972
బి) రాజభరణాల రద్దు చట్టం ii) 1971
సి) అడవుల సంరక్షణ చట్టం iii) 1980
డి) బోనస్ చెల్లింపు చట్టం iv) 1965
ఎ) ఎ-ii, బి-iv, సి-i, డి-iii
బి) ఎ-i, బి-iii, సి-iv, డి-ii
సి) ఎ-iii, బి-i, సి-iv, డి-ii
డి) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
25. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి?
1) రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల వివాహం, విడాకుల హక్కుల చట్టాన్ని రూపొందించింది.
2) 1987లో మనదేశంలో ‘లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్’ను ఏర్పాటు చేశారు
3) 1969లో 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడినవి
4) 1982లో 6 ప్రైవేట్ వాణిజ్యబ్యాంకులు జాతీయం చేయబడినవి
ఎ) 1, 3, 4 సరైనవి బి) 1, 2, 3 సరైనవి
సి) 1, 2, 3, 4 సరైనవి
4) 1, 2, 4 సరైనవి
26. ఆదేశిక సూత్రాలను ‘రాజ్యాంగ లక్ష్యాల, ఆశయాల మ్యానిఫెస్టో’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
ఎ) అనంతశయనం అయ్యంగార్
బి) బెనగళ నరసింగరావు
సి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
డి) కె.సి.వేర్
27. ప్రాథమిక విధులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక విధులకు నేరుగా న్యాయస్థానాల సంరక్షణ ఉంది
2) ప్రారంభ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు
3) రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక విధులను సోవియట్ రష్యా నుంచి గ్రహించారు
4) ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు
ఎ) 1, 2, 3, 4 సరైనవి
బి) 1, 2, 3 సరైనవి
సి) 2, 3, 4 సరైనవి 4) 1, 2, 4 సరైనవి
28. హక్కులు విధులు ఒకే నాణానికి ఇరువైపుల వంటివని పేర్కొన్నవారు?
ఎ) హెచ్.జె. లాస్కి బి) గాన్ విల్ ఆస్టిన్
సి) కె.టి.షా డి) నసీరుద్దీన్ మహ్మద్
29. ఎవరి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) జె.ఎస్. వర్మకమిటీ
బి) సర్థార్ స్వరణ్ సింగ్ కమిటీ
సి) రంగనాథ్ మిశ్రా కమిటీ
డి) నాన్ పాల్కీవాలా కమిటీ
30. ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటి లో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రాథమిక విధుల దినోత్సవం – జనవరి 3
2) ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు
3) 1976లో ప్రాథమిక విధుల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్.ఆర్. గోఖలే
4) ప్రస్తుతం ప్రాథమిక విధులకు న్యాయస్థానాల రక్షణ ఉన్నది
1) 1, 2, 3 సరైనవి 2) 1, 2, 4 సరైనవి
3) 1, 3, 4 సరైనవి 4) 1,2,3,4 సరైనవి
సమాధానాలు
1-సి 2-ఎ 3-సి 4-బి 5-డి 6-బి 7-ఎ 8-ఎ 9-డి 10-బి 11-డి 12-ఎ 13-సి 14-బి 15-సి 16-ఎ
17-బి 18-డి 19-ఎ 20-సి 21-బి 22-ఎ 23-ఎ 24-డి 25-బి 26-డి 27-సి 28-ఎ
29-బి 30-ఎ
ఏఆర్కే స్టడీసర్కిల్
వికారాబాద్
9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు